ప్రపంచ సాహిత్యం

- మమత

ఒక సాయంత్రం మా యునివర్సిటీ బస్టాపులో ఇద్దరి మధ్య సంభాషణ విన్నాను. ఒకాయన పోనీటెయిల్ వేసుకొని వున్నాడు. మెడలో ఒక చోకర్ ఉంది. అతను ఇంకొకతనితో “నాలో నేటివ్ అమెరికన్ రక్తం ఉందని మా అమ్మ చెప్పింది. అప్పటి నుండి నేటివ్ అమెరికన్ ఆచారాలను పాటిస్తున్నాను” అని అన్నాడు. అప్పటికే నేటివ్ అమెరికన్ల గురించి తెలుసుకోవాలన్న నా ఆసక్తి వల్ల వాళ్ల సంభాషణ విందామని, వీలయితే అతనితో మాట్లాడుదామని వారికి దగ్గరగా జరిగాను.

పూర్తిగా చదవండి »

-మమత

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎన్నో వందల నేటివ్ అమెరికనుల తెగలు వున్నాయి. ఏ తెగ గురించి మొదట మీకు చెప్పాలి అని ఆలోచించాను. నాకు వెంటనే తట్టిన పేరు లెన్ని-లెనాపె (Lenni-Lenape). కొన్నేళ్ళ క్రితం నేను ఉండిన ఊరికి దగ్గరలోనే లెన్ని -లెనాపెల పౌ-వవ్ (Pow-wow - నేటివ్ అమెరికన్లు జరుపుకునే జాతర) జరుగుతోందని తెలిసింది. అప్పటికి నాకు నేటివ్ అమెరికన్ల గురించి తెలియక వెళ్ళలేదు. అలా నేటివ్ అమెరికనులను ఎంతోమందిని ఒక్క చోట చూడగలిగిన మొట్టమొదటి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అందువల్ల నేటివ్ అమెరికన్లను తలచుకున్నప్పుడల్లా లెనాపెలే గుర్తుకు వస్తారు. పూర్తిగా చదవండి »

యిదిగో యిక్కడ
గత యిరవై యేండ్లుగా
నా నీడలోనే నేను బంధింపబడి …

పూర్తిగా చదవండి »

- గాబ్రియెల్ గార్సియా మార్కెజ్

తొలినాళ్ళలో నేను రాసిన కథల్లో బుద్ధి బులపాటం అధికం అనిపిస్తుంది. జీవితానికి పుస్తకానికి మధ్య ఎంతో ఎడం ఉండేది. తర్వాత్తర్వాత ఆ విషయం గ్రహించాను.నేను కథనం నేర్చింది మా అవ్వ దగ్గర! మహత్తర విషయాన్ని మామూలుగా చెప్పడంలో దిట్ట ఆమె.

పూర్తిగా చదవండి »

- మమత

“తెల్లవాడు మాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇచ్చిన మాట ఏదీ నిలబెట్టుకోలేదు, మా భూమిని ఆక్రమించుకుంటానన్నది తప్ప.” -మక్‌పియ లుత (Makhpyia–Luta: Red Cloud).

అమెరికాకు వచ్చిన కొత్తలో పబ్లిక్ లైబ్రరీలో ఒక పెద్దాయన నన్ను చూసి “నేను కూడా ఇండియన్నే “ అని అన్నాడు. అతని తెల్లటి ముఖంవైపు విచిత్రంగా చూశాను. అతను గట్టిగా నవ్వి “నువ్వు ఈస్ట్ ఇండియనువి, నేను వెస్ట్ ఇండియన్ని .. మీరనే రెడ్ ఇండియన్ని”. అమెరికన్ ఆదివాసుల గురించి పుస్తకాల్లో చదవడం తప్ప ఎప్పుడు ఇలా ఎదురుపడలేదు.

పూర్తిగా చదవండి »

 - ఏరియల్ డార్ఫ్‌మేన్

అతనెవరమ్మా ఆ ఫొటోలో
మామ తో?

అతనా బంగారూ – అతను నీ నాన్న

పూర్తిగా చదవండి »

 - ఏరియల్ డార్ఫ్‌మేన్

నా కొడుకు
పోయినేడాది
మే 8 నుండీ
కనబడుత లేడు.

యిదిగో
యిప్పుడే పంపిస్తం
యేవో రొటీన్ ప్రశ్నలడిగి …
అంటూ తీసుకపోయిన్రు

పూర్తిగా చదవండి »

 - బాబ్ డిలాన్

( మంగళ వారం నవంబర్ 7 2006, న జరిగిన మధ్యంతర యెన్నికల్లో అమెరికన్ ప్రజానీకం పెద్ద సంఖ్యలో డెమోక్రాట్లనెన్నుకుని యుద్ధోన్మాది బుష్ కు గుణపాఠం చెప్పారు. 12 యేండ్ల తర్వాత వుభయ సభల్లో డెమోక్రాట్లకు తిరిగి పట్టు దొరికింది,  అయితే   బాగ్దాద్ లోని ఒక సామాన్య పౌరుడు మాత్రం ‘ డెమోక్రాట్లైతేంటి, రిపబ్లికన్లైతేంటి అమెరికా సామ్రాజ్యవాద విధానం ఏమీ మారదు – అంతా వొకటే ‘ అంటూ యీసడించుకున్నాడు.

పూర్తిగా చదవండి »

- లెనార్డ్ పెల్టియర్

మనం ఒక్కొక్కరం
అమాయకత్వంతో మొదలవుతాం.
మనందరం
నేరస్తులవుతాం.

పూర్తిగా చదవండి »

- సాజీగోపాల్

taha_bookcover12.jpg   పాలస్తీనా కవి తాహ మహమ్మద్ అలీ అరబిక్ భాషలో నాలుగు కవిత సంకలనాలు రాసారు. ఇటీవల ఆ నాలుగు సంకలనాల్లోంచి యేరిన కవితలతో “అయితే ఏంటి?” అనే కవితా సంకలనం ఆంగ్లంలోకి అనువాదం చేసి కాపర్ కాన్యన్ ప్రెస్సు ప్రచురించింది. పాలస్తీనా ప్రజల దీనావస్ధలను, దశాబ్దాలుగా ఇజ్రాయిలీ దురాక్రణ లో జనం అగచాట్లను తాహ కొంత మృదువుగానూ , కొంత వినయ ధిక్కార స్వరంతోనూ తన కవితలలో చిత్రీకరించాడు.

పూర్తిగా చదవండి »