- ఐరా గొలోబిన్
రెండో అధ్యాయం (తరువాయి భాగం)
గతితార్కిక భౌతికవాదం అంటే తత్వశాస్త్రానికి శాస్త్రీయసూత్రీకరణవంటిది; అంటే వైజ్ఞానిక తత్వశాస్త్రం. హెగెల్ ముందుచూపుతో వ్యాఖ్యానించినట్టుగా “సత్యానికి యదార్థరూపంలో ఉనికినిచ్చేది దాని వైజ్ఞానికవ్యవస్థ ఒక్కటే. తత్వశాస్త్రాన్ని విజ్ఞానశాస్త్రం స్థాయికి తీసుకెళ్ళాల్సిన సమయం వచ్చిందని నిరూపించాలి; ఇందుకు తోడ్పడే ప్రయత్నం చెయ్యాలని నేను నిశ్చయించుకున్నాను…తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రంలా రూపొందాలి. తత్వశాస్త్రంఅంటే కేవలం జ్ఞానాన్ని ప్రేమించడం కాదు; అది నిజంగా జ్ఞానమే”. 16
పూర్తిగా చదవండి »
- ఐరా గొలోబిన్
రెండో అధ్యాయం
తాత్విక వికాసంలోని ముఖ్యదశలు
పూర్వవైజ్ఞానిక తత్వశాస్త్రం
తత్వశాస్త్రం అనేది ” వివిధ విషయాలను గురించిన ఆలోచనాత్మక అధ్యయనం” అన్నాడు తత్వ్తవేత్త హెగెల్; అది వివిధ విషయాల అంతర్గతస్వభావాలను విశదపరిచే ఆలోచనాత్మక పరిజ్ఞానం.1 ఈ “ఆలోచనాత్మక అధ్యయనం”లో రెండు అంశాలుంటాయి; (భావనల రూపంలో) మేధస్సు యొక్క నిర్మాణాత్మక ప్రక్రియలూ, (ప్రభావవంతంగా ఉండే) భావావేశపరమైనవీను. మేధస్సు అంతకంతకూ సమగ్రమయే తార్కికశక్తిని సంతరించుకుంటుంది; భావావేశాలు వ్యవస్థీకృతమైన విలువలకేసి దారితీస్తాయి.
పూర్తిగా చదవండి »
కృతజ్ఞత:
ఎన్నో ఏళ్ళబట్టీ సాగిన ఈ గ్రంథరచన ఇప్పటికి పూర్తయింది. అప్పట్లో ఇదొక పరిమిత లక్ష్యంతో మొదలయింది. 1930ల ప్రారంభంలో లెనిన్‌గ్రాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ సంస్థ వెలువరించిన మార్క్సిస్ట్ తత్వశాస్త్రం అనే గ్రంథం ఆధారంగా ప్రాథమిక రచన చెయ్యడానికి ఒక ప్రచురణకర్తతో 1950లో నాకు అంగీకారం కుదిరింది.
పూర్తిగా చదవండి »
- అనువాదం: అసూర్యంపస్య
మొంటూ కొన్నాళ్ళుగా తన తల్లిదండ్రులు ఒక తాతగారి రాక గురించి చర్చించుకుంటూ ఉండటం వింటూ ఉన్నాడు. చిన్న తాత అట. ఆయన అమ్మ వాళ్ళ చిన్న మామయ్య అట. అతని వద్ద నుండి ఉత్తరం వచ్చినప్పుడు మొంటూ ఇంట్లోనే ఉన్నాడు. అతని అమ్మ ఆ ఉత్తరాన్ని ఓ సారి చదివి కాస్త సున్నితంగా ఆశ్చర్యపడ్డది - “ఊహించనేలేదు!” అంటూ.
పూర్తిగా చదవండి »
పదకొండేళ్ళ తరువాత అరూప్ బాబు అనబడు అరూప్ రతన్ సర్కార్ మళ్ళీ పూరీ నగరాన్ని సందర్శిస్తున్నాడు. నగరం లో ఈ పదకొండేళ్ళలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగినట్లు గమనించాడు - కొన్ని కొత్త ఇళ్ళు, కొత్త రోడ్లు, కొత్త హోటెళ్ళు - చిన్నవీ, పెద్దవీనూ. కానీ, బీచ్ లోకి అడుగుపెట్టిన మరుక్షణం అతనికి అర్థమైంది ఈ నగరం లో ఎప్పటికీ మారనిది ఒకటుందని. పూర్తిగా చదవండి »
1931 మార్చి23 వ తేదిన లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీయబడ్డ భగత్ సింగ్ శతజయంతిని ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ నేపధ్యంలో భగత్ సింగ్ రాజకీయ భావజాలాన్నీ, ఆచరణనూ విశ్లేషిస్తూ ఆయన మిలింటెంటు జాతీయవాద పంధాను అనుసరించడానికి గల కారణాలను చరిత్రకారుడు వి. ఎన్. దత్తా అన్వేషిస్తాడు.
పూర్తిగా చదవండి »
- ఉషా ఆరి
అమెరికా లో నివసిస్తున్న తెలుగు సమాజంలో గృహహింస ఉంటుందా ! అని చాలామంది నన్ను ప్రశ్నించారు. దానికి సమాధానం అవుననే చెప్పుకోవాలి. వాస్తవానికి గృహహింసకు గురైన స్త్రీల గురించి వినడమో, చూడడమో జరిగిందని మనలో చాలా మంది అంగీకరిస్తారు. కానీ దానిని కుటుంబ అంతర్గత వ్యవహారమని జమకడతారు. 2002 సంవత్సరంలో రాజ్ , సిల్వర్ మెన్ లు బోస్టన్ నగరంలో నివసించే 160 దక్షిణాసియా మహిళలతో గృహహింస పైన ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనములో తేలిందేమంటే; 40.8% శాతం మహిళలు జీవితకాలంలో తమ భర్తల చేతిలో భౌతికంగా, లైంగికంగా హింసలకు గురి అవుతున్నారు.
పూర్తిగా చదవండి »
- సినాన్ అంటూన్
యుద్ధంలో చిధ్రమైనప్పుడు
మరణాన్ని తలుచుకుంటూ నేను కుంచె పట్టాను
యుద్ధం గోడ మీద కిటికీ బొమ్మ గీసాను
ఆ కిటికీ తెరిచి అంతా వెతికాను
మళ్ళీ మరొక యుద్ధం కనిపించింది
గర్భాశయంలో వుండగానే మరణించిన బిడ్డపై
ఖఫన్ కప్పుతున్న తల్లి కనిపించింది
- హెరాల్డ్ పింటర్

మళ్ళీ వస్తున్నారు యాంకీలు
ఆయుధాలతో సైనికకవాతు చేస్తూ
ఆనందంతో సైనికగీతాలు పాడుతూ
అమెరికా దేవుడిని పొగుడుతూ
ప్రపంచమంతా దూసుకొస్తున్నారు
పూర్తిగా చదవండి »
యిదిగో యిక్కడ
గత యిరవై యేండ్లుగా
నా నీడలోనే నేను బంధింపబడి …
పూర్తిగా చదవండి »
- ఏరియల్ డార్ఫ్‌మేన్
అతనెవరమ్మా ఆ ఫొటోలో
మామ తో?
అతనా బంగారూ – అతను నీ నాన్న
పూర్తిగా చదవండి »
- ఏరియల్ డార్ఫ్‌మేన్
నా కొడుకు
పోయినేడాది
మే 8 నుండీ
కనబడుత లేడు.
యిదిగో
యిప్పుడే పంపిస్తం
యేవో రొటీన్ ప్రశ్నలడిగి …
అంటూ తీసుకపోయిన్రు
పూర్తిగా చదవండి »
- బాబ్ డిలాన్
( మంగళ వారం నవంబర్ 7 2006, న జరిగిన మధ్యంతర యెన్నికల్లో అమెరికన్ ప్రజానీకం పెద్ద సంఖ్యలో డెమోక్రాట్లనెన్నుకుని యుద్ధోన్మాది బుష్ కు గుణపాఠం చెప్పారు. 12 యేండ్ల తర్వాత వుభయ సభల్లో డెమోక్రాట్లకు తిరిగి పట్టు దొరికింది, అయితే బాగ్దాద్ లోని ఒక సామాన్య పౌరుడు మాత్రం ‘ డెమోక్రాట్లైతేంటి, రిపబ్లికన్లైతేంటి అమెరికా సామ్రాజ్యవాద విధానం ఏమీ మారదు – అంతా వొకటే ‘ అంటూ యీసడించుకున్నాడు.
పూర్తిగా చదవండి »
- లెనార్డ్ పెల్టియర్
మనం ఒక్కొక్కరం
అమాయకత్వంతో మొదలవుతాం.
మనందరం
నేరస్తులవుతాం.
పూర్తిగా చదవండి »