- వట్టికోట ఆళ్వార్‌స్వామి
(గత సంచిక తరువాయి)
8
కంఠీరవానికి కొమరయ్య తన ధోతి, కండువ, ఒక రూపాయి ఇచ్చి తెల్లవారు జామున సాగనంపాడు. కంఠీరవం నిజామాబాదు దోవపట్టాడు. కొంతదూరం బండ్లబాట నడిచి వెళ్ళాడు. మధ్యన రైలు దారి అడ్డువచ్చింది. రైలు దారి వెంట నడవసాగాడు. పక్క చేలలో కనిపించిన కంకులు, కాయలు తినుకుంటూ బావుల్లో నీళ్ళు తాగుతూ పొద్దుతిరిగే వరకు డిచ్పెల్లికి చేరుకున్నాడు. గడిచినరోజు సరిగా తిండిలేదు; పైగా ఈ రోజు చాలా నడిచాడు కూడా. అలసిపోయి రైలుస్టేషన్‌లో కొంతసేపు పడుకున్నాడు. ఇంతలో హైద్రాబాద్‌కు వెళ్ళే రైలు వచ్చి ఆగింది.
పూర్తిగా చదవండి »
- వట్టికోట ఆళ్వార్‌స్వామి
6
‘పాపం మీనాయనగారు పెద్దమనిషి. ఆయన గతించినప్పటి నుండి అన్నీ చిక్కులేనని విన్నాను'’ రామభూపాల్‌రావు మాట్లాడటానికి పిలిపించిన వెంకటాచారితో పరామర్శగా అన్నాడు.
రామభూపాల్‌రావు ఆవిధంగా శాంతంగా, చనువుగా మాట్లాడటం వెంకటాచారికి ఆశ్చర్యం వేసింది. రామభూపాల్‌రావు ఎల్లప్పుడు అధికార ధ్వనిలో మాట్లాడటం అతనికి తెలిసన సంగతి. రామభూపాల్‌రావు అంటే వెంకటాచారికి భయం కూడాను.
పూర్తిగా చదవండి »
-వట్టికోట ఆళ్వార్‌స్వామి
కొన్నాళ్ళకు గొట్టం కోటయ్య మరణించాడు. కోటయ్య జీవించి ఉన్నప్పుడే కొమరయ్యకు పెండ్లి చేశాడు. తల్లి అన్నమ్మ అనుభవాన్ని ఊతగా తీసుకొని కొమరయ్య వ్యవసాయం పొదుపుగా సాగిస్తున్నాడు. కొమరయ్యకు ఒక కొడుకు కూడా పుట్టాడు. తండ్రి పేరే పెట్టుకున్నాడు కొడుకుకు. ఒకసారి కంఠీరవం కోటయ్యను యెత్తుకొని ముద్దులాడ్తు, “కొమరయ్యా! కోటయ్య పేరేమీ బాగులేదు. ‘ముద్దులకోట’ అని పెట్టు” అన్నాడు. అన్నమ్మ సంతోషంతో ఉప్పొంగిపోయింది. కోడలు కనకమ్మ క్షణంపాటు కొడుకును చూచి, ఒక చిరునవ్వు విసిరింది.
పూర్తిగా చదవండి »
- వట్టికోట ఆళ్వార్‌స్వామి
రామభూపాలరావు దొర బంకుల్లో అల్లుడు కొండలరావుతో కాలమాన పరిస్థితులను గురించి మాట్లాడుతూ కూర్చున్నాడు. పెద్ద గుమాస్తా హైదరలీ పత్రికను శ్రద్ధగా చూస్తున్నాడు. హైదరలీ ఆశ్చర్యంతో లేచి, “చూచారా దొరవారు! ఒక పిల్లకు రెండు తలలట, అదేదో ఊళ్ళో ఒక హరిజన స్త్రీకి పుట్టిందట. ఈ హరిజనులనే వాండ్లు ఏ దేశంలో ఉంటారు దొరవారు?'’ పత్రికను రామభూపాల్ రావుకు అందిస్తూ అన్నాడు.
“ఏ దేశమేందయ్యా! అగాధం మనిషివి. మాలమాదిగలకు గాంధీ ఆ పేరు పెట్టాడు,'’ కొండల్‌రావు హేళనగా నవ్వుతూ అన్నాడు.
పూర్తిగా చదవండి »
- వట్టికోట ఆళ్వార్‌స్వామి
తెల్లవారుజామున మొదలై అప్పుడే వర్షం వెలిసింది. ప్రజలు ఇండ్లలో నుండి బయటికి వచ్చి తమ దైనందిన కార్యకలాపాల్లో లీనమయ్యారు. రైతులు తమ పశువులను దొడ్లో నుండి బయటికి వదిలి ఎత్తయిన ప్రదేశంలో నీరు నిలువని చోట ఎండుగడ్డి వేశారు. బాటనబోయే ఒక ఆవు గడ్డిలో మూతి పెట్టబోయింది. తన హక్కును హరించబోతున్నదనే కోపంతో గడ్డి తింటున్న ఎద్దు ఆవును కుమ్మపోయింది.
పూర్తిగా చదవండి »
వట్టికోట ఆళ్వారుస్వామి (1915 -1961) తెలంగాణ వైతాళికులలో ఒకరు, విభిన్న జీవనరంగాలలో అపారమైన కృషిచేసి నలభై ఆరు సంవత్సరాల జీవితకాలంలోనే అసాధారణ విజయాలు సాధించిన మేధావి, ప్రజల మనిషి. పూర్తిగా చదవండి »