కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ ల శతజయంతుల సందర్భంగా DTLC తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుల గురించి ఇంతకు ముందు ప్రకటనలో తెలియజేశాం. ఈ ప్రత్యేక సాహితీ సదస్సులకు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పూర్తిగా చదవండి »
ప్రకటనలు
కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు-ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులు
ఏ భాషలోనైనా తమ తమ రచనలతో తమకొక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. తెలుగు భాష చేసుకున్న అదృష్టమేమోగాని తెలుగు సాహిత్యంలో విశేషంగా కొనియాడదగ్గ అసమాన ప్రతిభావంతులు ముగ్గురు కొద్ది నెలల తేడాలో వంద సంవత్సరాల క్రితం పుట్టారు. వారే కొడవటిగంటి కుటుంబరావు (కొకు), శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), త్రిపురనేని గోపీచంద్.
కొడవటిగంటి కుటుంబరావు: శతజయంతి సంవత్సర కానుక
ప్రతి ఇంటా ఉండవలసిన కొకు రచనా ప్రపంచం
విరసం ప్రచురణగా కొకు రచనా ప్రపంచం 16 సంపుటాలు
కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి సందర్భంగా 2009లో ఆయన రచనా సర్వస్వాన్ని ప్రచురించాలని విప్లవ రచయితల సంఘం నిర్ణయించుకున్నది. తెలుగునాట నిజమైన విప్లవ, ప్రజాసాహిత్యోద్యమాన్ని నిర్మించి విస్తరిస్తున్న విరసం గతంలో శ్రీశ్రీ, చెరబండరాజు సమగ్ర రచనలను, కుటుంబరావు వ్యాసప్రపంచాన్ని ప్రచురించింది.
పూర్తిగా చదవండి »
జర్నలిస్టు పిట్లల శ్రీశైలం విడుదల డిమాండు చేయండి!!
తన వృత్తిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకుడ్ని ఒకర్ని ఇంటర్వూ చేద్దామని వెళ్ళిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలం(33)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకాశం జిల్లా కందుకూరు లో అరెస్టు చేశారు. శ్రీశైలం మావోయిస్టులకు కొరియర్ గా పనిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి »
ప్రజాకళ సాహిత్య పత్రికను విస్తరించే క్రమంలో భాగంగా పల్లెలు, పట్టణాలు, జిల్లాలు, నగరాలు విశ్వవిద్యాలయాల వారిగా వాలంటీర్ కరస్పాండెంట్ లు, సాహిత్య వాలంటీరులను ఆహ్వానిస్తున్నాం.
• కవిత్వం, కథ, వచనాల స్వేచ్ఛానుసరణ, అనువాదం చేయటం
• సాహిత్య సభలకు హాజరై రిపోర్టులు, సాహిత్యకారుల ప్రసంగాలు రాయటం, ఆడియో రికార్డు చేయటం
పూర్తిగా చదవండి »
సాహిత్య అధ్యయనంలో భాగంగా ప్రజాకళ కొన్ని కొత్త శీర్షికలను మొదలుపెడుతుంది.
* మీకు నచ్చిన కథ కానీ, మిమ్మల్ని కదిలించిన కవిత కానీ అధ్యయనం చేసి, దానిపైన ఒక నిర్మాణాత్మక విశ్లేషణ రాయవలసినదిగా పాఠకులనూ, రచయితలనూ ఆహ్వానిస్తున్నాం.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ, ప్రవాస ప్రజల నుండి వచ్చే అన్నిరకాల ప్రజాసాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావలని ప్రజాకళ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా రచయితలు, సాహిత్యాభిమానులు ప్రజాకళకు తమ రచనలను పంపించి సహకారం అందించవలసినది విజ్ఞప్తి చేస్తున్నాం.
| “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” సందర్భంగా ప్రజాకళ ప్రత్యేక సంచిక తీసుకురావలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఫెమినిజం, స్త్రీ సాహిత్యం, ప్రవాసంలో మహిళలు అనే అంశాలపైన రచనలు సేకరిస్తున్నాం. మీ రచనలద్వారా ప్రజాకళ కు సహకారం అందించవలసినది గా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీకు తెలిసిన ప్రముఖ సాహిత్య రచనలు సేకరించి పంపించగలరు. |
| - ప్రజాకళ |
| ఈమేల్ ఐడి: Editor@Prajakala.org |