ఉరుకుల పరుగుల సైబరాబాదు నుండి
ప్రకృతి వరాల జల్లు ఓరుగల్లుకు
ఓ చిరుజల్లుల సూర్యోదయాన
అలా ఇండికా కాబులో…
కవితలు
ఎంతో చెప్పాలని ఉండే
కాని కొంచం కూడా చెప్పలేక పోయాను !
చాలా రాయాలని ఉండే
కాని ఏమీ రాయలేక పోయాను !
పూర్తిగా చదవండి »
- కన్నెగంటి చంద్ర
అడ్డంగా విరిచినా
నిలువుగా కోసినా తడన్నదే కనపడదు
ఏ మాట ఏరుకున్నా!
అట్లాగని అంటించినా
రాజుకోవు ఎంతకూ!
ఏం చేద్దామీవేళ?
పూర్తిగా చదవండి »
“అన్నపూర్ణ” యిప్పుడు
మధుశాలల నెలవయ్యింది
బార్లాతెరచుకున్న
బార్ రెస్టారెంట్లు
వీధివీధినా బారులు తీరుతున్నాయి
జీవితం మిధ్య అనడం అబద్ధం
ఎంగిలి మెతుకులేరుకుని ఎలక్ట్రిక్ తీగల మీదా
ఇళ్ళ కప్పుల మీదా జంతు కళేబరాల మీదా
‘అలగాజనం’ పుళ్ళ మీదా పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే
మిధ్య గూర్చి కావుకావుమంటూ ప్రవచించగలవు
పూర్తిగా చదవండి »
తప్పిన అడుగుల్లో
తలలు నాటుతున్నాం
కంటున్న కల పూర్తికాకుండానే
దబుక్కున మెలకువొస్తుంది
పూర్తిగా చదవండి »
నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ
నా టెలివిజన్ కన్నుల్లో విను
నా మనసు మీద చెవి పెట్టి చూడు
నేనే క్యాసెట్‌నై రికార్డ్ చేసుకొని వచ్చిన
సముద్రం సంభాషణను విను
పూర్తిగా చదవండి »
సముద్రం ఘోష నన్నుతాకి
కన్నీటితో కడిగింది
నా ముందు తాను నురుగై కరిగిపోయింది
కెరటమై విరిగిపోయింది
కెరలి కెరలి తిరిగిపోయింది
నాయిన
ఎద్దుల బండి పోయిందని కాదు,
నాయినే పోయిండని
ఈ బాధ.
పూర్తిగా చదవండి »
- శిఖామణి
రోజూ అవే అంకెల మీద
తిరిగిన అంకెల మీదే
తిరుగుతున్న
గడియారంలోని ముల్లులా
పూర్తిగా చదవండి »
- కాసుల ప్రతాపరెడ్డి
లోపలివీ, వెలుపలివీ
మనసు పొరల్లోకి ఇంకుతయి
చెట్టుకు పూసిన పుష్పం ఈ దేహం
వాడకుండానే రాలిపడాలె
పూర్తిగా చదవండి »
- కె.శివారెడ్డి
మాట్లాడే హక్కుని గూడా మనం అడుక్కోవద్దు –
గాలంత సహజంగా, స్వేచ్ఛగా నిర్భయంగా మనం
మాట్లాడదాం
గాలంత ప్రాణంగా అపరిమితంగానూ బలంగానూ
మనం మాట్లాడదాం
పూర్తిగా చదవండి »
- కౌముది
కుండపోతగా కురుస్తున్న వెన్నెల్లో
నేను అభ్యంగనస్నానం చేస్తున్నాను
ఎన్నితరాల మురికో
మనసంతా పేరుకుంది
పూర్తిగా చదవండి »
- వెంకటేష్
జీవితాన్ని కూల్చడం ఇప్పుడు మరింత సులువు
గ్లోబలైజేషన్ మనకు తెలియకుండా మనను
మార్చుతున్నంత సులువు!
ఆనాది నుండి నేటి ఆధునిక టెక్నాలజీ వరకు
పూర్తిగా చదవండి »
- జాన్ హైడ్ కనుమూరి
వినగల్గితే
ఖాళీ సమాధి మాట్లాడుతుంది
ఉరితాడు మాట్లాడుతుంది
పిచ్చుకగూళ్ళ అల్లికల
విశాలరోడ్లపై విస్తరిస్తున్న
అహంకార పాదముద్రల్ని
ప్రశ్నిస్తే
దేహం కొరడాలతో చీల్చబడుతుంది
తరాల వంతెన మీద
నడుస్తూ వచ్చిన
ఒక నాగరిక ప్రపంచపు
చరిత్ర పుటల్ని నిశితంగా స్పృశిద్దాం!
ఒంటరి నుండి గుంపులు….
గుంపుల నుండి సమూహాలు….
అచ్చంగా గోడలోని ఇటుకల వలె.
కానీ…,
పూర్తిగా చదవండి »
అక్షరాన్ని దిద్దాను
చూపుడు వేలుతో
మూడు వేళ్ళు చూస్తున్నై
నా వైపు శూలంలా!
పూర్తిగా చదవండి »