- చలసాని ప్రసాద్
మనసు మూగబోయింది…
సహవాసి అస్తమించాడు. మనసు మూగబోయింది. అంతరంగం అంధకార బంధురమైంది. గుండెల్లో సుడిగుండాలు చెలరేగాయి. “O! death! death to a dove ” అన్నాడో ఇంగ్లీషు కవి. ‘ఏ నాటికైనా మానవజాతి మరణాన్ని జయిస్తుంది’ అన్నాడు మన మహాకవి. అందాకా ఈ వేదన మనని వీడదు.
పూర్తిగా చదవండి »
- ఎ.గాంధి
రాత ఆయన శ్వాస:
సహవాసి అనే జంపాల ఉమామహేశ్వరరావు ఇకలేరు. తెలుగులో అత్యుత్తమ అనువాదకుడు సహవాసి. ఆయన అనువాదమయినా, సంపాదకీయమై నా, పత్రికావ్యాసమయినా సహజంగా ప్రౌఢంగా ఒక జీవనదీ ప్రవాహంలా సాగిపోతుంది.
పూర్తిగా చదవండి »
- వరవరరావు
( చెరబండరాజు కూతురు ఉదయిని కి నివాళిగా రాసిన వ్యాసం )
‘నేను చెప్పలేదా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇంక మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు’ అన్నాడు. ‘తల్లీ, పిల్లను దవాఖానానుంచి తీసుకొస్తారు కదా. ఇంటికి వస్తాం లెండి’ అన్నారు పోలీసులు. చెరబండరాజును అక్టోబరు 11న మీసా కింద అరెస్టు చేశారు. అంటే ఉదయిని అప్పటికి మూడు రోజులపాప.
పూర్తిగా చదవండి »
ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య 02 జనవరి 2007, సాయంత్రం మదనపల్లిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించిన వెంకటసుబ్బయ్య తెలుగు సాహిత్యానికీ, సాహిత్య విమర్శకూ అందించిన సేవలు అసాధారణమైనవి. పూర్తిగా చదవండి »
- అఫ్సర్
‘ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి. తిన్నగా వెళ్లండి సూర్యుడి కిరణంలాగా’
గత కొన్ని దశాబ్దాలుగా ఇదే వాక్యాన్ని పదేపదే వేరేవేరే సందర్భాల్లో చెబ్తూవచ్చిన తీవ్ర స్వరం హీరాలాల్ మోరియాది. నాకు సాహిత్య ఊహలు తెలుస్తూ, అర్థమవుతూ వచ్చిన పదేళ్ల ప్రాయంనుంచీ ఇప్పటివరకూ మోరియాని అనేక సందర్భాల్లో చూశాను, విన్నాను. మేం అప్పుడు పల్లెనుంచి పట్నానికి వచ్చిన రోజులు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తెల్లఖద్దరు బట్టల్లో మంచి మల్లెపువ్వులా ఆయన నడిచివచ్చారు. ఆ సాయంత్రం ఆయనా, నాన్నగారు(కౌముది) ప్రపంచ సాహిత్యాన్నంతా ఆగమేఘాల మీద సందర్శించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు… భాషల అడ్డుగోడల్లేని సాహిత్య సంభాషణ. ఆ రోజు రాత్రి ఆయన వెళ్లిపోతూ ‘అఫ్సర్ బేటా’ అని నావైపు తిరిగి పైన చెప్పిన ఒకే ఒక్క పంక్తి చెప్పారు. అదేమాట ఆయన రెండేళ్ల క్రితం నేను మాడిసన్ నుంచి వచ్చినపుడు (2004) మరోసారి మళ్లీ చెప్పారు. అది ఆయన్నించి నేను విన్న మొదటి, చివరి మాట కూడా!
పూర్తిగా చదవండి »