boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

వార్తలు

- ప్రశాంత్

‘అభివృద్ధి - విధ్వంసం - సాహిత్య ప్రతిఫలనం’ అంశంపై విరసం 15వ రాష్ట్రసాహిత్య పాఠశాల

అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, దాని వెనక ఉన్న రాజకీయ ఆర్థిక పునాదిని విశ్లేషిస్తూ కర్నూలులో జనవరి 13, 14 తేదీల్లో విరసం రాష్ట్ర సాహిత్య పాఠశాల నిర్వహించింది. 13వ తేదీ ఉదయం పతాకావిష్కరణ అనంతరం ప్రారంభ సమావేశంలో ఆహ్వాన సంఘం తరఫున వెంకటకృష్ణగారు ఉపన్యసించారు.

పూర్తిగా చదవండి »

‘అభివృద్ధి మాయాజాలం - రాజకీయార్థిక పరిచయం’ అంశంపై రెండవ సెషన్, చంద్రశేఖర్ అధ్యక్షోపన్యాసం:

రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో చేసే అభివృద్ధిలో 20 లక్షల మంది నిర్వాసితులవుతున్నారు. గిరిజనులే కాదు రైతులు కూడా అధిక సంఖ్యలో నిర్వాసితులవుతున్నారు. మరోప్రక్క ప్రత్యేక ఆర్థిక మండళ్ళు నెలకొల్పి పారిశ్రామికవేత్తలకు ఏది కావాలంటే అది ఇస్తామంటున్నారు. బెంగాల్‌లో టాటా కంపెనీ పరిశ్రమ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటోంది.

పూర్తిగా చదవండి »

‘రాయలసీమ రాజకీయార్థిక విశ్లేషణ’ అంశంపై 3వ సెషన్‌లో జి.యస్. రామ్మోహన్ అధ్యక్షోపన్యాసం:

పుట్టపర్తి నారాయణాచార్యులు ‘కపటపు నాయకుల గుంపు, సత్కవీంద్రుల కన్నీటి ముంపు చూడమ్మా,’ అంటాడు మేఘదూతంలో. రాయలసీమకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. 1907లో రాయలసీమ యువక సాంఘిక సభ జరిగింది. 1937లో శ్రీ భాగ్ ఒడంబడిక చేసుకొన్నారు. అప్పటి నుండి రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడుతున్నారు.

పూర్తిగా చదవండి »

14.1.2006 - అసమ అభివృద్ధి, రాయలసీమ సాహిత్యం అంశంపై మొదటి సెషన్

దీనికి రవి అధ్యక్షత వహించారు. భార్గవ రాయలసీమ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ మాట్లాడారు. అసమానమైన అభివృద్ధి ఈరోజుది కాకపోయినా, సాహిత్యంలో ఇప్పుడు ప్రతిఫలిస్తోందన్నారు. పీడితులు ఈరోజు సాహిత్య వస్తువును శాసిస్తున్నారు అని చెప్పారు. స్వామి, సింగమనేని నారాయణ వంటి వివిధ రచయితల కథలు, కథా వస్తువులను విశ్లేషించారు.

పూర్తిగా చదవండి »

‘అభివృద్ధి విధ్వంసం - సంస్కృతి రూపాలు’ అంశంపై చివరి సెషన్
రాఘవాచారి అధ్యక్షత వహించగా వేణుగోపాల్ ఉపన్యసించారు.

వేణుగోపాల్ ఉపన్యాసం

‘అభివృద్ధి’ నిర్వచనం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడానికి కైట్ ఫ్లయింగ్ చేయాలి. గాలిపటం ఎగరటంలో నియంత్రణ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. జాగ్రత్తగా లేకపోతే గాలిపటం ప్రాంతీయవాదంలో కొట్టుకుపోతుంది. అభివృద్ధిని కొన్ని ఉదాహరణలు తీసుకొని నిర్వచించడానికి ప్రయత్నిస్తే… 1956లో వ్యవసాయరంగంలో 1600 ట్రాక్టర్లు ఉండేవి. 2000 సంవత్సరం నాటికి రాష్ట్రంలో వినియోగించే ట్రాక్టర్ల సంఖ్య 90,000. సాగు యోగ్యమైన భూమి 1956 నుండి 2000 వరకు ఏమీ పెరగలేదు. మరి ఎంతమంది కూలీలను ఈ ట్రాక్టర్లు రీప్లేస్ చేశాయి. 1985లో కారంచేడు సంఘటన జరిగింది.

పూర్తిగా చదవండి »

వర్తమాన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ, నడుస్తున్న చరిత్రపైన వ్యాఖ్యానిస్తాడు కవి. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణలో నలిగిపోయిన లక్షలాది ఇరాకీ ప్రజల జీవితాలను వెలుగులోకి తెస్తాడు. ప్రపంచాన్ని కుదిపిన మూడు సన్నివేశాలను ఆధారంగా చేసుకొని రాసిన కవితలు. అప్పటి కాలమాన స్థితిగతులను ప్రతిబింబిస్తూ, వైవిధ్యంతో రాసిన కవితలు. ఒకప్పడు నియంత అయినా, ఇపుడు సామ్రాజ్యవాదానికి ఎదురునిలిచి పోరాడిన నాయకులలో ఒకడిగా సద్ధాంను చాలామంది గుర్తిస్తున్నారు. కొంతమంది నియంతగా జమకడుతున్నారు. అమెరికా పాలకవర్గాలు అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి, కుట్ర పన్ని సద్ధాంను ఉరితీసి చంపించారు. హెచ్చార్కె కవిత్వం ఈ తరానికి ఒక చరిత్రపాఠం చెబుతుంది.

గమనిక
గత ఐదు సంచికలుగా ప్రజాకళ సంపాదకవర్గంలో ఉన్న మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజాకళ నుండి వైదొలగుతున్నాం. ఇంతకాలం మాకు సహకరించిన, ఆదరించిన ప్రజాకళ పాఠకులకి మా ధన్యవాదాలు.- హిమబిందు, చైతన్య

ప్రతి సంవత్సరంలాగానే ఈసారికూడా కథానిలయం వార్షికోత్సవా లు ఫిబ్రవరి రెండవ శని, ఆదివారాల్లో జరుపుకుంటున్నది. 10వతేదీ శనివారం అతిథులతో ఇష్టాగోష్ఠి, పుస్తకావిష్కరణలు ఉంటాయి. 11వ తేదీ ఆదివారం కథానిలయం వార్షికోత్సవ సభ, రాచకొండ రచనా పురస్కారం ఉంటాయి. అనివార్యకారణాలవల్ల ఆహ్వానం అందడం బహు శా ఆలస్యం కావచ్చును. ఈ ప్రకటననే ఆహ్వానంగా భావించి అం దరూ రావలసిందిగా మనవి. మీరాకను ముందుగా తెలపగలిగితే వసతి సౌకర్యంలాంటి ఏర్పాటు చేయడానికి వీలుంటుంది.

- కాళీపట్నం రామారావు
- బివిఎ రామారావునాయుడు
విశాఖపట్టణం

- ప్రశాంత్

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ డి. జయకాంతన్ నవల ‘కల్యాణి’
దేవులపల్లి కృష్ణశాస్త్రి 2వ సంపుటం
బదరిక, పల్లకీ
వై.ఎమ్.సి.ఎ. హాలు, నారాయణగూడ, హైదరాబాదు.
9 నవంబర్ 2006 సాయంత్రం 5 గంటలకు
పూర్తిగా చదవండి »

- ప్రశాంత్

తేదీలు: నవంబర్ 11-12, 2006 - సిద్ధిపేట
ప్రారంభ సభ
అధ్యక్షత : పప్పుల రాజిరెడ్డి, మరసం
ప్రారంభోపన్యాసం : కె. రామచంద్రమూర్తి, సంపాదకులు, ఆంధ్రజ్యోతి
పూర్తిగా చదవండి »

 - ప్రశాంత్

ప్రెస్ క్లబ్, సోమాజిగూడ
29 అక్టోబర్ 2006 సాయంత్రం 6 గంటలకు
అధ్యక్షత : దాసరి శ్రీనివాసులు, కమీషనర్, మార్కెటింగ్ శాఖ
ఆవిష్కర్త : డా॥ ఎన్. గోపి
ఆత్మీయ అతిథి : శ్రీ కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయాణ, కవి
అతిథి : వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్, ఏకలవ్య ఫౌండేషన్
సమీక్షకులు : సీతారాం, కవి

పూర్తిగా చదవండి »

- ప్రశాంత్

కె. గీత ‘శీతసుమాలు’
కవితా సంపుటి ఆవిష్కరణ
నిర్వహణ: సాహితీ స్రవంతి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీహాలు, 31 అక్టోబర్ 2006 సాయంత్రం 6 గంటలకు 

పూర్తిగా చదవండి »

ఈ సంవత్సరం బుకర్ బహుమతి కిరణ్ దేశాయి రాసిన నవల  ‘ ఇన్ హెరిటెన్స్ ఆఫ్ లాస్’  కు ప్రదానం చేసారు. ము ప్పయిదేళ్ళ  కిరణ్ దేశాయి ఇప్పటిదాకా బుకర్ బహుమతి వచ్చిన రచయితల్లో కెల్లా పిన్న వయస్కురాలు. కిరణ్ దేశాయి ప్రఖ్యాత నవలా రచయిత అనిత దేశాయి కూతురు. ” కిరణ్ తల్లి అనితా దేశాయి కి మూడు సార్లు తప్పిపోయిన బహుమతి అతి చిన్న వయసులోనే కిరణ్ కు రావడం గొప్ప విషయం” అని పలువురు వ్యాఖ్యానించారు.

పూర్తిగా చదవండి »

కవితలు

బతకమ్మా! బ్రతుకు - కాళోజి

చమ్కీ - షాజహానా

సదా మీ సేవలో - డా. ఎం. హరికిషన్

మూడు కవితలు - తమ్మినేని యదుకుల భూషణ్

స్వగతం - కాళోజి

పూర్తిగా చదవండి »

2006 సంవత్సరానికి గాను సాహిత్యం లో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ని ప్రఖ్యాత టర్కీ నవలా రచయిత ఒర్హాన్ పాముక్‌కి ప్రదానం చేస్తూ స్వీడిష్ అకాడెమి ‘తను పుట్టి పెరిగిన నగరం విషాద ఆత్మను ఆవిష్కరించేందుకు పాముక్ విభిన్న సంస్కృతుల సంఘర్షణలకూ, సమ్మేళనాలకూ సాహిత్యంలో కొత్త చిహ్నాలు కనుక్కున్నాడు’ అంటూ ప్రశంసించింది.

పూర్తిగా చదవండి »

« Prev -