సాహిత్యాభిమానులందరీ ఆహ్వానం!
కవిత్వం
కవితలు - కన్నెగంటి చంద్ర
తిలక్ కవిత్వం - చంద్రహాస్
పాలస్తీనా గాయం: మహ్మద్ దార్విష్ – సాజీగోపాల్
కవిత్వం చిరునామా - ఉదయభాస్కర్
ముఖ్య ప్రసంగం:
తెలుగు భాష ప్రాచీనత -ఆచార్య పర్వతనేని సుబ్బారావు
( ఆంధ్ర విశ్వవిద్యాలయం - ఆచార్యులు )
సాహితీ మిత్రుల చర్చ-ప్రశ్నలు
పూర్తిగా చదవండి »
శ్రీకాకుళం, ఆగస్టు 15 (ఆన్‌లైన్): సామాజిక చైతన్యానికి సాహితీ స్ఫూర్తి నిచ్చిన మహోన్నత రచయిత కొడవటిగంటి కుటుంబరావు అని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎఎస్ ఇళంగోవన్ అన్నారు. శ్రీకాకుళంలో శనివారం సాహిత్య అకాడమీ, కథానిలయం, శ్రీకాకుళ సాహితీ సంయుక్త నిర్వహణలో కొడవటిగంటి కుటుంబరావు నూరేళ్ల సాహితీ సంబరాలు ప్రారంభమయ్యాయి.
పూర్తిగా చదవండి »
పోలేపల్లి సెజ్ పేరిట పేదల నుంచి ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి వారికి అప్పగించే వరకు తాము పోరాటాన్ని కొనసాగి స్తామని ప్రజాగాయకుడు గద్ధర్ ప్రకటించారు. తాము చనిపోయినా తమ వారసులకు ఈపోరాటాన్ని అప్పగిస్తామని, ముఖ్యమంత్రి వై.ఎస్ స్వయంగా వచ్చి పేదలకు తిరిగి భూములను అప్పగిస్తున్నట్లు ప్రకటించే వరకు ఎవరు అడొడచ్చినా తమ పోరాటాన్ని మాత్రం ఆపలేరని ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి »
యువకవి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డా.దార్ల్ల వెంకటేశ్వరరావుని భారతీయ దళితసాహిత్య అకాడమీ వారు ఈ ఏడాది (2007) డా.అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డుతో సత్కరించారు.
పూర్తిగా చదవండి »
ప్రజాస్వామ్య దేశంలో కలాలకు సంకెళ్ళు వేసి నిజాలను దాచాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాలకు పునాదులు ఉండవని మూసి టివి ఎడిటర్ పిట్టల శ్రీశైలం తెలిపారు. మావోయిస్టుల కొరియర్‌గా ముద్రవేసి ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
పూర్తిగా చదవండి »
అణగారిన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ సామాజిక, సాహిత్య రంగాలలో కృషి చేసే వారికి జాతీయస్థాయిలో భారతీయ దళితసాహిత్య అకాడమీ(ఢిల్లీ) వారిచ్చే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫెలోషిప్ (2007)ను ప్రముఖకవి, విమర్శకుడు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడు డా.దార్ల వెంకటేశ్వరరావుకి ప్రకటించారు.
పూర్తిగా చదవండి »
దేశచరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం అనేక ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమై రక్తాక్షరాలతో లిఖించబడిందని విప్లవకవి నిఖిలేశ్వర్ కొనియాడారు. ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో జనసాహితి జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో 60 ఏళ్ళ స్ఫూర్తి వీర తెలంగాణ విప్లవపోరాట జీవితం సంఘర్షణ నవలా సాహిత్యంపై సభ జరిగింది.
పూర్తిగా చదవండి »
అన్నల దళిత దండోరా!
మావోయిస్టు పంథా మారుతోంది. జనంతో పూర్తిగా మమేకమయ్యే దిశగా అడుగులేస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులను పూర్తిస్థాయిలో పార్టీకి పట్టుకొమ్మలుగా చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అన్నిటినీ మించి దళిత బాట పట్టడం ద్వారా పునరుత్థానం కోసం ప్రయత్నిస్తోంది.
పూర్తిగా చదవండి »
ప్రజాస్వామిక విలువలతో జీవించే హక్కుకోసం ఉద్యమించండి!
ఆగష్టు 20వ తారీకు ఉదయం, విశాఖపట్టణం వాకపల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ పోలీసులు దాడిచేసి ఇళ్ళలోకి జొరబడి పదకొండు మంది ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలకు పాల్పడారు. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం పాంగి శ్రీదేవి (22), పాంగి బరసు (30), పాంగి సిత్తాయి (28), కొర్ర చిలకమ్మ (38), వంతాల చిట్టమ్మ (45),…
పూర్తిగా చదవండి »
మొన్న మక్కా మసీదు, నేడు లుంబినీపార్క్ గోకుల్ ఛాట్ లలో బాంబుదాడులు
మానవత్వంపై దాడి – మనుష్యులపై మారణకాండను ఖండిద్దాం!
మనోనిబ్బరాన్ని ప్రదర్శించి, టెర్రరిజం ఓడిపోతుందని చాటిన ప్రజలకు బాసటగా నిలుద్దాం !
పూర్తిగా చదవండి »
తస్లీమా నస్రీన్, జర్నలిస్టులపైన భౌతిక దాడిని ఖండించండి!
హైదరాబాదు లో 9-8-2007 వ తేదీన ప్రెస్ క్లబ్బు లో పుస్తక ఆవిష్కరణ సభకు వెళ్ళిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పైన మజ్లిస్ కార్యకర్తలు, ఎమ్మెలేలు భౌతికంగా దాడి చేశారు. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన జర్నలిస్టులు, ఫోటోగ్రాపర్లను గాయపరిచారు. ముస్లిం మత ఛాందసత్వం తలకెక్కిన మజ్లిస్ కార్యకర్తలు ఇలాంటి హేయమైన దాడికి పాల్పడటం సభ్యసమాజం తలవంచుకోవలసిన విషయం.
పూర్తిగా చదవండి »
- జాన్ హైడ్ కనుమూరి
సృజనలోకం, వరంగల్ ప్రచురించిన “కవితా వార్షిక -2006” ను 18 మార్చి 2007 తేదిన, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్, హనుమకొండ లో ఆవిష్కారించారు.
అధ్యక్షులు: డాక్టర్ అంపశయ్య నవీన్
ముఖ్య అతిథి, ఆవిష్కర్త: డాక్టర్ పి. వరవరరావు
ప్రధాన సంపాదకుడు: రామా చంద్రమౌళి
పూర్తిగా చదవండి »
నందిగ్రామ్ రైతులుపై సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాల మారణకాండను ఖండించండి!
మానవ హక్కులు, ప్రజాస్వామిక విలువలను కాపాడండి!
పశ్చిమబెంగాల్ రాష్ట్రం నందిగ్రామ్ గ్రామంలో సిపిఎం సర్కారు పేద రైతులనుండి వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొని ఇండోనేషియాకు చెందిన ‘సలీం గ్రూప్’ అనే ప్రెవేటుకంపెనీకి ఉచితంగా ఇస్తోంది. రైతుల, రైతుకూలీల జీవనోపాధి పైన దాడిచేస్తోంది. పచ్చని పచ్చని పొలాల మధ్య కాలుష్యాన్ని విరజిమ్మే కెమికల్ ప్యాక్టరీని ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. జీవనోపాధిని కొల్లగొట్టే ప్రభుత్వవిధానాలను నిరసిస్తూ నందిగ్రామ్ రైతులు ఉద్యమిస్తున్నారు.
పూర్తిగా చదవండి »
రైతు జీవితాల్ని ప్రతిబింబించే సాహిత్యం అసంఖ్యాకం గా వస్తున్నది. గతంలో రైతు జీవితాల్ని వ్యక్తీకరించిన కవితల్ని ఏర్చి కూర్చి “రైతు కవిత” సంకలనాన్ని వెలువరించాము. సాహిత్యాభిమానులు ఈ సంపుటిని ఎంతగానో ఆదరించారు. ఆ స్ఫూర్తి తో ఇప్పుడు “రైతు కథ” ను సంకలించదలిచాం.
పూర్తిగా చదవండి »
- డా. దార్ల వెంకటేశ్వరరావు

మానవుడు ఉన్నతత్వం సాధించే పరిణామాన్ని వర్ణించిన నవల మాక్సిమ్ గోర్కీ ‘అమ్మ’ నవల అని ప్రజా సాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అన్నారు . 09 - 03 - 2007 సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు లో జరిగిన సమావేశంలో ‘అమ్మ’ నవలపై ప్రత్యేక సంచికను ఆవిష్కరించి ముఖ్య వక్తగా ఆయన మాట్లాడారు . వ్యష్టి నుండి సమష్టికి పయనించటమే ‘అమ్మ’ నవల ధ్యేయం అని చెప్పారు.
పూర్తిగా చదవండి »