కొండపల్లి కోటేశ్వరమ్మ ఇంటర్వూ
నిర్జనవారధి రచయిత్రి
సౌజన్యం: HMTV News
ఇంటర్‌వ్యూలు
|
|
నర్రిశెట్టి ఇన్నయ్య మానవతావాది, సీనియర్ జర్నలిస్టు, రచయిత మరియు హేతువాద ఉద్యమ నాయకులు తో ప్రజాకళ ఇంటర్వూ.తెలుగు మరియు ఇంగ్లీషులో అనేక పుస్తకాలు రాసారు. మొదటి భాగం: |
పురాణం: మీరు సినిమాల్లోనే ఎందుకు సెటిలయ్యారు
ఉద్యోగం కోసం. నేను గోల్డ్ స్మిత్ ‘వికార్ ఆఫ్ నేక్ ఫీల్డ్’ లో ప్రిమ్ రోజ్ లాగా ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటన చేసాను. ఆఖరికి మద్రాసు సినిమాలో సెటిలయాను. అది కేవలం యాక్సిడెంటల్.
పురాణం: అయితే పెద్ద కారణం లేదంటారా?
కారణం ఎందుకులేదు ? ఆర్థికమే. ‘ఆంధ్ర ప్రభ’ ఫస్ట్ బాచ్ (1938) లో నేను, నార్ల, కప్పగంతుల సత్యనారాయణ ,మల్లవరపు విశ్వేశ్వరరావు ,ఆర్టిస్టు సుబ్రహ్మణ్యం ఉన్నాం. నార్ల కొంత డీఫాక్టో .”కుర్రవాడు , ఇతడేమిటి అని, న్యాపతి నారాయణమూర్తిగారిని తీసుకొచ్చారు.అక్కణ్ణించి వారిద్దరికీ యుద్ధమే .ప్రతిరోజు నార్ల మాతో చెప్తుండేవాడు.I am carrying my resignation letter in my packet “అలాగే నెలలూ, సంవత్సరాలూ గడిచాయి.
పూర్తిగా చదవండి »
|
|
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ నాయకుడు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు, ఒకప్పటి మానవహక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసరు. కోదండరాం తో ప్రజాకళ సామాజిక ఇంటర్వూ: |
- గుర్రం సీతారాములు
మొదటి భాగం:
రెండవ భాగం:
|
|
ప్రముఖ సాహితీ విమర్శకులు, రచయిత, ఈమాట పత్రికా సంపాదకులు వేలూరి వేంకటేశ్వర రావు గారితో ప్రజాకళ సాహిత్య పత్రిక ఇంటర్వూ. |
మొదటి భాగం:
ఒకటి:
రెండు:
మూడు:
యతి రాజులు గారు అవిశ్రాంత శ్రామికుడు. ప్రజల మనిషి. 50 సంవత్సరాలుగా ప్రజల సాహిత్యాన్ని అనువదిస్తూ పైసా ఆశించని సాంస్కృతిక కార్మికుడు. పిల్లలన్నా, మరీ ముఖ్యంగా పల్లెలన్నా, పల్లెల్లో పిల్లలన్నా ఎంతో ఇష్టం, విశ్రాంత ఉపాధ్యాయుడైనా పిల్లల ప్రేమకు పాత్రుడయిన ఉత్తమ ఉపాధ్యాయుడు నిరాండంబరుడుతో ఇంటర్వూ ఈ మాసం ప్రజాకళ పాఠకులకోసం.- రత్నాల విజయలక్ష్మి
పూర్తిగా చదవండి »
జ్వాలాముఖి పేరులోనే రౌద్రం ఉంది. రచనల్లో తిరుగుబాటు, పోరాటం, విప్లవం ఉంది. ఉపన్యాసంలో ఒక వీరుడి పౌరుషం ఉంది. ద్వంద్వనాలుకల పన్నాగాల్ని బాగా పసిగట్టగలరు. జీవకారుణ్య గుణం అలవడిన మానవీయుడు.
http://prajakala.org/PDF/jwalamuki_interview.pdf
(Low resolution)
http://prajakala.org/PDF/Jwalamuki_Interview_Final.pdf
( High resolution)
యీ ఇంటర్వూ పి.డి.ఎఫ్ రూపంలో వున్నది. పేజీలు రావటానికి కొంత సమయం పడుతుంది.
సౌజన్యం: ప్రజాసాహితి
తేదీ: జనవరి 2009 సంచిక
పీయూసీఎల్ ( పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్ట్సీ) జాతీయ అధ్యక్షుడు కన్నబీరన్ తో ఒక చిన్న ఇంటర్వూ:
ప్రశ్న: ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో పౌరహక్కుల పరిరక్షణ ఎలా ఉంది?
కన్నబీరన్: పౌరహక్కుల ఉల్లంఘనలో అన్ని దేశాల ప్రభుత్వాలు ఒకటే. కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య దేశాలన్న భేదం లేదు. అందరిదీ ఒకేరకమైన హింస. రాజ్యహింస ద్వారా తప్పు చేసి తప్పించు కోవడంలో పాలకులందరిదీ ఒకటే విధానం. దీన్నే ఆంగ్లంలో ‘ఇంప్యునిటి’ అంటారు. తెలుగులో ఖచ్చితమైన పదం లేదు. కాకుంటే అమెరికా వంటి అగ్రరాజ్య అకృత్యాలతో పోలిస్తే కమ్యూనిస్టు దేశాలు కాస్త మేలు.
పూర్తిగా చదవండి »
కొండేపూడి నిర్మల ప్రముఖ స్త్రీవాద కవయిత్రి,రచయిత్రి. 1980 దశకంలో తెలుగు సాహిత్యంలోకి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చి చేరిన స్త్రీవాదం ఎంతోమందిని ప్రభావితం చేసింది. అప్పటివరకూ అంటరానివిగా మిగిలిపోయిన ఎన్నో కొత్త వస్తువులను స్వీకరించి,స్త్రీవాద స్పృహ తో, స్త్రీల దృష్టి కోణంతో కవిత్వం రాసిన వారిలో కొండేపూడి నిర్మలను ప్రముఖంగా పేర్కొనాలి. ముఖ్యంగా నిర్మల రాసిన “లేబర్రూం” కవిత పురుష విమర్శకులకు దిమ్మ తిరిగేలా చేసింది. ప్రసవసమయంలో స్త్రీ పడే వేదనని “రైలు పట్టాలమీద నాణెం విస్తరించిననంత బాధ” అంటుంది. నిర్మల తెలుగు సాహిత్యంలో స్త్రీవాద గొంతును బలంగా,తీవ్రంగా,సూటిగా వినిపించడంలో అగ్రభాగాన ఉన్నదనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు.

![]()
ఇటీవల సాహిత్యవిమర్శకులు కడియాల రామోహనరాయ్ గారిని ఇంటర్వూ చేయడం జరిగింది. దీనిలోనుండి కొన్ని ఎంపిక చేసిన భాగాలను ఆడియో రూపంలో అందిస్తున్నాం.
- కేతు విశ్వనాధరెడ్డి
కాళీపట్నం రామారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ కథా రచయిత. ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో చేరదగిన సాహిత్యకారుడు ఆయన. కారాగా, మాష్టారుగా, కథల మాష్టారుగా తెలుగు సాహిత్యలోకంలో ప్రసిద్ధులు. కథారచయితలకు “దీపధరుడు”- ఆయన.
http://www.prajakala.org/PDF/kara_interview.pdf
సౌజన్యం: ఈ-తెలుగు పత్రిక
కవితా వార్షిక-2006 ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన సంపాదకుడు రామా చంద్రమౌళితో ముఖాముఖి
‘సృజనలోకం వరంగల్’ ప్రచురణగా అంతర్జాతీయ ప్రమాణాలతో గత మూడు సంవత్సరాల నుండి వెలువడుతూ తెలుగు వచన కవితను ప్రపంచవ్యాప్తం చేస్తున్న నేపథ్యంలో, కవితా వార్షిక-2006ను ప్రముఖ విప్లవకవి డాక్టర్ పెండ్యాల వరవరరావు 18 మార్చి 2007, ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో ఆవిష్కరించారు.
![]() |
విలక్షణమైన వస్తువుని అత్యంత స్పష్టతతో కథగా మలచగలిగిన శక్తిగల అతి కొద్దిమంది రచయితలలో సత్యవతి ఒకరు. సత్యవతి కథలు, ఇల్లలకగానే, మంత్రనగరి - మూడు కథా సంపుటాలు, మర్రినీడ, గొడుగు అనే రెండు నవలలు ప్రచురించారు. ఇవికాక అనేక వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. ఇల్లలకగానే, సూపర్‌మామ్ సిండ్రోమ్ కథలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. |
* సారా ఉద్యమం గురించి…..
సారా ఉద్యమ వైఫల్యం స్త్రీలకొక నమ్మకద్రోహం… ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం మాత్రమే జరిగింది. ఇవ్వాళ సారా సర్వాంతర్యామి. కళాశాలల్లోకి, గ్రామాల్లోకి, మురికివాడల్లోకి విపరీతంగా విస్తరించి మహిళా సాధికారత అని మనం బాకా ఊదుకొనే అంశాన్ని చావుదెబ్బ కొట్టింది. గృహహింస పెరిగింది. నేరాలు పెరిగాయి. స్త్రీల మీద అధిక భారం పడింది. మనిషిని ఆలోచనకి, వివేకానికి దూరం చేసింది. ప్రస్తుతం జలయజ్ఞం సంగతేమో కాని సారా యజ్ఞం మాత్రం జయప్రదంగా జరుగుతోంది.

ప్రఖ్యాత జర్నలిస్ట్ అయిన ముమియా అబు-జమాల్ (Mumia Abu Jamal) 1954, ఏప్రిల్ 24న ఫిలడెల్ఫియాలో జన్మించాడు. ఫిలడెల్ఫియాలో డేవిడ్ ఫాల్క్‌నర్ (David Faulkner) అనే పోలీస్ అధికారిని కాల్చి చంపాడన్న నేరారోపణపై ఆయన 1981 నుండి జైలులో, 1983 నుండి డెత్-రో పై (Death Row అంటే మరణ శిక్ష విధించబడి అది అమలయేందుకు ఎదిరి చూస్తూ జైలులో గడపడం) ఉన్నాడు. పూర్తిగా చదవండి »
- Next »

