వ్యాసాలు

ప్రతివాదం జూలై 19, 2008

కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అమెరికాకు బానిసలా ప్రవర్తిస్తున్నదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అక్షర సత్యమే గాని ఆయన నోట రావడమే కొంచెం ఎబ్బెట్టుగానూ ఆశ్చర్యంగానూ ఉన్నది. రాష్ట్రప్రభుత్వ రాజకీయార్థిక విధానాలు ఎట్లా నడవాలో ప్రపంచబ్యాంకు రాసి ఇచ్చిన పత్రాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసిన చరిత్ర ఆయనది.
పూర్తిగా చదవండి »

పార్లమెంటులో మెజార్టీ కోల్పోయిన కాంగ్రెసు ప్రభుత్వం, జార్జ్ బుష్ తో “అణుఒప్పందం” చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పైకి న్యూక్లియర్ రియాక్టర్లకు అవసరమయ్యే యురేనియం ఇంధనం సమకూర్చుకోవటం యీ ఒప్పంద లక్ష్యమైనా, దీనివెనక ఎంతో రహస్య ఎజెండా వుంది. అంతర్జాతీయ మార్కెట్టులో యురేనియం, ప్లూటోనియం ఖరీదు చేయాలంటే, అమ్మడానికి సిద్ధంగా ఎన్నో దేశాలున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా కొనటానికి అవకాశమున్నది. మరి అమెరికా నిబంధనలకు తలవగ్గాలిసిన అవసరమున్నదా?
పూర్తిగా చదవండి »

ఒక ఆటోవాలా… నేనూ… చిరంజీవి

- అల్లం నారాయణ

‘ఈనె అడ్డగోలుగున్నడు సార్. మా బతుకులు నాశ్నం చేస్తండు. డిజిటల్ మీటర్లని పెట్టిచ్చిండు.కంపెనీల కాడ దొ… మా ఆటోవాళ్ల బత్కు లు బండలు చేసిండు సార్. ఈనె జూడు. ఎట్ల కట్టుకున్నడో బంగ్ల’ ఉరుము లేని పిడుగు. ఒక ఆటోవాలాకు అంత ఆగ్రహం ఉన్నట్టుగానీ, అది ఒక అపరిచితునితో, ఆటో లో కూచున్న కస్టమర్‌తో అంత ఉద్రేకంగా పంచుకుంటాడనిగానీ ఊహించి ఉండలేదు. ‘ద హిందూ’ దగ్గర ఎక్కా ను ఆటో. మోతీనగర్ అంటే అప్పటికే ఆరుగురు ఆటో వాలాలు నిరాకరించి ముఖంమీదే చీదరగా చూసి వెళ్లా రు. నాకు ఆటోవాలాల మీద పీకలదాకా కోపంగా ఉంది.
పూర్తిగా చదవండి »

- ఐరా గొలోబిన్‌
రెండో అధ్యాయం (తరువాయి భాగం)

గతితార్కిక భౌతికవాదం అంటే తత్వశాస్త్రానికి శాస్త్రీయసూత్రీకరణవంటిది; అంటే వైజ్ఞానిక తత్వశాస్త్రం. హెగెల్ ముందుచూపుతో వ్యాఖ్యానించినట్టుగా “సత్యానికి యదార్థరూపంలో ఉనికినిచ్చేది దాని వైజ్ఞానికవ్యవస్థ ఒక్కటే. తత్వశాస్త్రాన్ని విజ్ఞానశాస్త్రం స్థాయికి తీసుకెళ్ళాల్సిన సమయం వచ్చిందని నిరూపించాలి; ఇందుకు తోడ్పడే ప్రయత్నం చెయ్యాలని నేను నిశ్చయించుకున్నాను…తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రంలా రూపొందాలి. తత్వశాస్త్రంఅంటే కేవలం జ్ఞానాన్ని ప్రేమించడం కాదు; అది నిజంగా జ్ఞానమే”. 16
పూర్తిగా చదవండి »

- డా//దార్ల వెంకటేశ్వరరావు

1.0. ప్రస్తావన :
తెలుగు సాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్రమహాభారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ ఆంధ్రమహాభారతాన్నివర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్ర మహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆ వర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలను అనుసరించి రూపొందినవి.
పూర్తిగా చదవండి »

- ఐరా గొలోబిన్‌

రెండో అధ్యాయం
తాత్విక వికాసంలోని ముఖ్యదశలు
పూర్వవైజ్ఞానిక తత్వశాస్త్రం

తత్వశాస్త్రం అనేది ” వివిధ విషయాలను గురించిన ఆలోచనాత్మక అధ్యయనం” అన్నాడు తత్వ్తవేత్త హెగెల్‌; అది వివిధ విషయాల అంతర్గతస్వభావాలను విశదపరిచే ఆలోచనాత్మక పరిజ్ఞానం.1 ఈ “ఆలోచనాత్మక అధ్యయనం”లో రెండు అంశాలుంటాయి; (భావనల రూపంలో) మేధస్సు యొక్క నిర్మాణాత్మక ప్రక్రియలూ, (ప్రభావవంతంగా ఉండే) భావావేశపరమైనవీను. మేధస్సు అంతకంతకూ సమగ్రమయే తార్కికశక్తిని సంతరించుకుంటుంది; భావావేశాలు వ్యవస్థీకృతమైన విలువలకేసి దారితీస్తాయి.
పూర్తిగా చదవండి »

మనకూ ఉన్నారు రాజ్‌బీర్‌లు!

- కె.బాలగోపాల్

ఢిల్లీ పోలీసుల ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్‌బీర్ సింగ్‌ను పౌరుడెవరో ‘ఎన్‌కౌంటర్’ చేశాడని విని ‘చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత’ అనుకున్నాం. అయితే ఘటన పూర్వా పరాలు బయటకొచ్చే కొద్దీ అతను చేసుకున్నది ఇంకా చాలా ఉందని అర్థం అవుతున్నది. అతగాడిని చంపిన విజయ్ భర ద్వాజ్ అనే పౌరుడు వ్యాపారవేత్త అట.
పూర్తిగా చదవండి »

- వావిలాల గోపాలకృష్ణయ్య

“తేటల్‌ దేరెడు కాంతిపూరముల నుద్దీపించు ముత్యాల ము
ప్పేటల్‌ వోలె త్వదీయ కంఠమున శోభింపుల్‌ నిగారించు, చే
నాటన్‌ జీవన శోషణన్‌ గనని కృష్ణా గౌతమీ పెన్నలన్‌
గాటంపుం దమి త్రావువార మిదె కాంక్షాక్షీర మాంధ్రావనీ”

పరపాలననుండి బయటపడి ఇన్ని సంవత్సరములు గడచినందుకు ఉత్సవాలు జరుపు కుంటున్నాము. భారతీయ రాజకీయరంగంలో స్వాతంత్య్ర ప్రజ్వలన లార్డు క్లైవు ఏనాడు బెంగాలు ప్రజలను చీల్చి భాషా ప్రాతిపదిక కాకుండా హిందూ ముస్లిం మత ప్రాతిపదికగా రాష్ట్రాలు నిర్మించాడో, ఆ నాడే ప్రజానీకం జాగరితమై, పరపాలన అంతమొందించవలెనను ఆవేశం కలిగింది.
పూర్తిగా చదవండి »

- ఐరా గొలోబిన్‌

(ఒక్క అమెరికా సంయుక్త రాష్ర్టాల తత్వశాస్త్రపు చరిత్రనే మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ పద్ధతిలో విశ్లేషించడం అవసరమనీ, తక్కిన దేశాలకది వర్తించదనీ కాదు; అటువంటి ప్రయత్నం ఇతర దేశాల విషయంలో జరగలేదు)
అణగారిన వర్గాలూ, అణచబడిన దేశాలూ ప్రాథమిక సామాజిక సత్యాలను అన్వేషించడం మానవు. స్వాతంత్య్రం కోసం ఎన్ని కష్టాలు పడినా, జరుగుతున్న సంఘటనల తెర వెనక ఏమవుతోందో గమనిస్తూ, అనవసర, ప్రత్యేక విషయాలను లక్ష్యపెట్టకుండా, లోతైన సామాన్య సత్యాలను కనిపెట్టే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ వర్గాల స్వాతంత్య్ర పోరాటాలని బలపరిచి, మార్గదర్శనం చెయ్యగలిగిన తాత్వికసత్యాలు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే. పాలకవర్గాల చరిత్రలో మాత్రం ఇటువంటి ఆలోచనలూ, చర్యలూ అన్నిటినీ అణిచెయ్యడం మామూలే; ఒకవేళ వాటిని ప్రస్తావించినా, వాటికి వక్రభాష్యాలూ, నిందలూ తప్పవు. ఇన్ని పరిమితులున్నప్పటికీ, ఈ ప్రయత్నాల గురించి మనకు తెలిసి నమ్మదగ్గ ఆధారాల్లో, ఆకరాల్లో అనేకచోట్ల కొన్ని వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. వీటిద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజల పోరాట చరిత్రను పునర్నిర్మించడం వీలవుతుంది.
పూర్తిగా చదవండి »

- డా.కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

జీవపరిణామం గురించిన సరైన అవగాహన భౌతికవాద దృక్పథానికి తోడ్పడుతుంది. అందుచేత అదేదో జీవశాస్త్రం గురించి ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. అందులోని తాత్విక అంశాలు అందరూ తెలుసుకోదగ్గవే. ఇది పంతొమ్మిదో శతాబ్దంలో మొదలైన సిద్ధాంతం.

1835లో డార్విన్‌ దక్షిణ అమెరికాలోని ఈక్వడార్‌ దేశానికి వెయ్యి కిలోమీటర్లు పశ్చిమాన పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న గలాపగోస్‌ ద్వీపాలకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు కొన్ని జాతులకు చెందిన జంతువులు కనబడ్డాయి. ఒకే ద్వీపసమూహంలో ఉన్నవే అయినా ఒక్కొక్క ద్వీపంలోనూ తక్కిన ద్వీపాలతో సంబంధం లేకుండా ఎదిగిన వాటి లక్షణాల్లో తేడాలు కనిపించాయి. ఒకే కుదుటి నుంచి మొదలైన ప్రాణుల్లో స్థానిక పరిస్థితులను బట్టి క్రమంగా శరీరాకృతిలోనూ, అలవాట్లలోనూ కాస్త కాస్తగా తేడాలు ఏర్పడ్డాయని అర్థమైంది. జీవపరిణామ సిద్ధాంతం ప్రతిపాదనకు ఈ పరిశోధనలు తోడ్పడ్డాయి.
పూర్తిగా చదవండి »

- ఐరా గొలోబిన్‌

తొలి రోజుల్లో అమెరికాకు వలసవచ్చి స్థిరపడినవారికి చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చకతప్పలేదు; కొంతమంది తత్వవేత్తల్లాగా కేవలం వాటిని అర్థం చేసుకోవడంతో వారికి సరిపోలేదు. ఏదో చేసెయ్యాలనేదే తప్ప శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథం లేకపోవడంతో వీరందరికీ సిద్ధాంతాలంటే ఏవగింపు ఉండేది. అయినప్పటికీ వీరందరూ తమ మాతృదేశాల్లో అమలులో ఉండిన రకరకాల తత్వధోరణులని కలగాపులగమైన పద్ధతిలో గుడ్డిగా ఆచరించడం మాత్రం చేసేవారు. తత్వశాస్త్రాలని గట్టిగా నమ్మినవారి సంఖ్య అప్పట్లో తక్కువే అయినప్పటికీ వలసదేశమైన అమెరికాలో తాత్విక వైఖరి శూన్యంగా మాత్రం ఉండేది కాదు.
పూర్తిగా చదవండి »

బతికున్న మనుషులకు గల ముఖ్యలక్షణం చైతన్యం (consciousness). తల్లి కడుపులో పిండ దశలో ఉండగానే ఇది ప్రాథమిక స్థాయిలో మొదలవుతుంది. మనిషి పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇది ఎక్కువై, మానసిక చైతన్యమే యథార్థమనీ, మనకు కనబడే లోకమంతా మిథ్య అనీ అనిపించేదాకా ఎదుగుతుంది. వస్తుపరమైన యథార్థత (objective reality) అనేది మన చైతన్యానికి సంబంధం లేనిదని లెనిన్‌ అన్నాడు. మార్క్సిస్టులు కాని ఐన్‌ష్టయిన్‌ వంటి మేధావులుకూడా యథార్థానికీ మన చైతన్యానికీ సంబంధమేదీ లేదని అంగీకరించారు.
పూర్తిగా చదవండి »

సిద్ధాంతాలను ప్రతిపాదించగలిగిన శక్తి సామాన్యంగా ప్రతివారికీ ఉన్నప్పటికీ పుట్టుకతోనే ఎవరూ సిద్ధాంతకర్తలుగా అవతరించరు. “…మనోభావనల ఆధారంగా ప్రతిపాదనలు చెయ్యడమనేది జన్మతః వచ్చే విద్యకాదు; అందుకు రోజువారీ జీవితపు చైతన్యం ఉంటే చాలదు. దానికై నిజంగా ఆలోచించాలి …”.21
పూర్తిగా చదవండి »

ఎవ్రీబడీ క్రైస్…

- అల్లం నారాయణ

తలుపు తోసుకుని మృత్యువు అనాగరికంగా, అమెరికాలాగా వస్తుందని ఊహించి ఉండమేమో కదా! కిరణ్ దుఃఖం మా కుటుంబాన్ని వదలడం సాధ్యమా! పనిలో సరే! పదిమందిలో సరే! భ్రాంతిలో ఏకాంతంలో జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా, శకలాలు శకలాలుగా అంతూ దరీలేని శోకం వెన్నాడి ఉండడం మేమెప్పుడూ ఎరగం. సాదాసీదా మనుషులం.
పూర్తిగా చదవండి »

భౌతికవాదాన్ని నమ్మేవారికి మనిషి దైవాంశసంభూతుడు కాడని చెప్పవలసిన అవసరం లేదు. కాని మనిషికి ఉండే మెదడు ప్రత్యేకమైనది. దానివల్ల బుద్ధిని గురించిన వాదనలెన్నో తలెత్తుతాయి. విజ్ఞానపరంగా చెప్పాలంటే వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ మనిషి అనుభవించే కష్టసుఖా లన్నిటికీ మెదడే కారణం.
పూర్తిగా చదవండి »

- ఐరా గొలోబిన్‌

మొదటి అధ్యాయం
కార్మికులూ, వైజ్ఞానిక తత్వశాస్త్రం
వైజ్ఞానిక తత్వశాస్త్రం గురించి కార్మికులెందుకు తెలుసుకోవాలి?

(ప్రారంభంలోనే కార్మికులను ప్రస్తావించడంలోని ఉద్దేశం కార్మికులు కానివారెవరికీ వైజ్ఞానిక తత్వశాస్త్రంతో ప్రమేయం ఉండరాదని కాదు. ఇలాంటి సందర్భాల్లో కార్మికుల ప్రస్తావన సామాన్యంగా అంతగా ఉండదు కనకనే వారి ప్రాముఖ్యతనూ, ప్రమేయాన్నీ గుర్తించడం అవసరం)
పూర్తిగా చదవండి »

« Prev - Next »