|
|
కవిత్వంలో శ్రీశ్రీ చేసినన్ని ప్రయోగాలు బహుశా ఇంకెవరూ చేసి వుండరు. ఒక వేళ చేసినా, ప్రయోజన దృష్టితో చేసుండకపోవచ్చు. ‘ప్రభవ’ పద్యాలతో మొదలైన శ్రీశ్రీ, ‘మహాప్రస్థానం ‘ గీతాలతో మహాకవై, , అభ్యుదయ కవిత్యోద్యమానికి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత ప్రాస క్రీడలు,లిమఋక్కులతో రన్నింగ్ కామెంటరీలు రాసి, ఒక వైపు ‘ఖడ్గసృష్టి’తో బాటు మరోవైపు అధివాస్తవిక కవితల్నీ సృష్టించాడు. |
వ్యాసాలు
-వనం జ్వాలా నరసింహారావు
తెలుగు కవిత్వాన్ని స్వయంగా నడిపించిన ఒక శతాబ్దపు యుగ కవిగాను, మహాకవి గాను, తెలుగు సాహితీ-సాంస్కృతిక రంగాలపై అనూహ్యమైన ప్రభావం చూపిన అరుదైన వ్యక్తి గాను, అరసం-విరసం అధ్యక్షుడి గాను, అహర్నిశలు కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్ట సామ్యవాదిగాను, “తెలుగు కవిత్వాన్ని ఖండించి-దీవించి-ఊగించి-శాసించి-రక్షించి” న మహా ప్రస్థానం సృష్టికర్త గాను,
పూర్తిగా చదవండి »
గతితార్కిక భౌతికవాదం
రెండో అధ్యాయం (తరువాయి భాగం)
విశ్లేషణాత్మక తత్వశాస్త్రం
విశ్లేషణాత్మకతత్వశాస్త్రం అనేది మేధావుల ఆదరణకై అస్తిత్వవాదంతో పోటీపడుతుంది. (ఇదొక రకమైన రూఢివాదం). దీన్ని ‘తత్వశాస్త్రాలకే ముగింపు పలకగల తత్వశాస్త్ర’మంటారు. తత్వశాస్త్రంగా చెప్పబడే ఈ ధోరణి కొత్తగా అలవాటుపడేవారిని ఎవరికీ అందని ఒక ఏకాంతసౌధానికి చేరవేస్తుంది.
పూర్తిగా చదవండి »
1980.
అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్రహాన్ని చల్లార్చుకోలేక పక్కనే వున్న కాప్రి హోటెల్లో ఇరాని చాయ్ పంచుకొని “మన సోషలిజం ఇంతవరకేనా? ప్చ్…” అని ఆ పూటకి చప్పరించేసుకొని, రంగు డబ్బాలు తీసుకుని ఖమ్మం గోడల్ని ఎరుపెక్కించిన రాత్రులు.
పూర్తిగా చదవండి »
-గన్నవరపు వరాహ నరసింహముర్తి
ఉప్పుకి పద్యముఁ జెప్పుచు
నొప్పుగఁ శతకంబు వ్రాసె నొక మన ఘనుడున్
గప్పుర పరిమళ మివ్వగఁ
జెప్పెనుగా లోక రీతి చెవులకు నింపున్
పూర్తిగా చదవండి »
ఎప్పుడైతే బ్రిటన్ లో ఆవిరి యంత్రం కనిపెట్టబడి, అది పారిశ్రామిక విప్లవానికి దారి తీసిందో, అప్పుడే కార్మిక వర్గం పురుడుపోసుకుంది భూస్వామ్యంలో కార్మికులు లేరు. వ్యవసాయానికి అనుబంధంగా వృత్తి. పనివారలు ఉండేవారు అంతే! కాని పెద్దపెద్ద పరిశ్రమలు స్థాపించబడి, నిరంతరాయంగా ఉత్పత్తి జరిగిన క్రమంలో కార్మికులు అదే స్థాయిలో పెరిగారు కాని విపరీతమైన పనిగంటలు , దుర్భరమైన పరిస్థితులు మళ్ళీ వారిలో స్పార్టకస్ ని మేల్కొలిపాయి.
పూర్తిగా చదవండి »
ఫిబ్రవరి 11 వ తేదీన ముంబాయిలో 32 ఏళ్ళ యువ న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (ఐఎపిఎల్) సభ్యుడు, కమిటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమెక్రటిక్ రైట్స్ (సిపిడిఆర్) కార్యకర్త. షాహీద్ అజ్మీని ఆయన ఆఫీసులోనే సర్కారీ హంతక ముఠా హత్య చేసింది.
పూర్తిగా చదవండి »
గతితార్కిక భౌతికవాదం
- ఐరా గొలోబిన్
రెండో అధ్యాయం (తరువాయి భాగం)
సామ్రాజ్యవాదపు విలువలకి వత్తాసు పలుకుతూ, చెడుతో ఉత్తుత్తి పోరాటాలు జరిపే అస్తిత్వవాదపు సామాజికధోరణికి తాత్వికమైన అంశంకూడా ఉంటుంది. జాస్పర్స్ లెక్కన తత్వధోరణి అంటే బూర్జువా తత్వమే. అందుకే అతను తత్వశాస్త్రానికీ, విజ్ఞానానికీ పొసగదని తేల్చేశాడు. ‘తత్వశాస్త్రం విజ్ఞానం కాదు…నాదే కనక కేవలం వస్తుగతధోరణి అయినట్టయితే నా తత్వశాస్త్రం ఏ మాత్రమూ తత్వశాస్త్రం అనిపించుకోదు’.65 ‘శాస్త్రీయవిజ్ఞానంగా నలుగురూ ఆమోదించే ప్రావీణ్యం తత్వశాస్త్రం కాజాలదు…’.66 ‘అన్వేషించేందుకు గమ్యమేదీ ఉండదు కనక తత్వశాస్త్రపద్ధతులకీ, వైజ్ఞానికపద్ధతులకీ తేడా ఉంటుంది…తత్వశాస్త్రపద్ధతులు అలాంటి గమ్యాలకు అతీతమైనవి’.67
ఆదీవాసీ సమస్య పట్ల కవిత్వం రాసిన వాళ్ళు గిరిజనలా గిరిజనేతరులా అనే విషయం పక్కన పెడితే, తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్ర వేయగలిగారు. ‘లిపిలేని దుఃఖం ‘అనే కవితను చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.
పూర్తిగా చదవండి »
(1931 మార్చి 23 న తేదిన భగత్ సింగ్ సగర్వంగా ఉరికంబం ఎక్కారు. ఆయన తన సహచరులనుద్దేశించి రూపొందించిన విప్లవ కార్యక్రమాల ప్రతి కలకత్తాలో శ్రీమతి విమలా ప్రతిభాదేవి (డిటెన్యూ) పరిశోధనా గృహంలో 1931 అక్టోబర్ 3వ తేదీన లభించింది. ఈ కార్యక్రమం ప్రతిని చదివితే విప్లవసాధన పట్ల భగత్ సింగ్ కు ఎలాంటి అవగాహన వున్నదో మనకు తెలుస్తుంది )
పూర్తిగా చదవండి »
జననం 1907సెప్టెంబరు 28 , తల్లి విద్యావతి, తండ్రి కిషన్ సింగ్
1911 పాఠశాలలో ప్రవేశం
1917 భగత్ సింగ్ ఉపనయనం , మనుమణ్ని దేశానికి అంకితం చేస్తానని తాత అర్జున్ సింగ్ ప్రకటన
పూర్తిగా చదవండి »
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ జరిగి అయిదు దశాబ్దాలు దొర్లి పోయాయి. ఒకే భాష అనే సాకుతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రజల మధ్య తేడాతో దినదినం అనుమానాలు పెరిగిపోతూ వచ్చాయి.1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం , 1969 నాటి అఖిలపక్ష ఒప్పందం, అష్టసూత్ర, పంచసూత్ర పధకాలు 1973 నాటి ఆరుసూత్రల పధకం.
పూర్తిగా చదవండి »
ఆరు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ఆకట్టుకుంటూ వారిని అద్బుతమైన ఊహాలోకపు మంత్రజగత్తులో విహరింప జేస్తున్న కథల పత్రిక “చందమామ”.
పూర్తిగా చదవండి »
| పౌరహక్కుల నేత పురుషోత్తం సంస్మరణసభ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) సెప్టెంబర్ 23న 2009 హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, ప్రముఖ రచయిత్రి. సామాజిక కార్యకర్త, బుకర్ ప్రైజ్ విన్నర్ అయిన అరుంధతీ రాయ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసగించారు. |
| డాక్టరు డి.యం.ప్రేమావతి , పద్మావతి ఉమెన్స్ కాలేజీ లో తెలుగు శాఖలో లెక్చరర్ గా పనిచేసారు. తెలుగు శాఖ అధిపతిగా రిటైర్ అయ్యారు . ఆమె స్త్రీలకు సంబంధించిన వివిధ సమస్యలపై స్త్రీ చైతన్యంతో పలు ఉపన్యాసాలు ఇచ్చారు. వివిధ సాహిత్య వ్యాసాలు స్త్రీవాద దృక్పధంతో రాసి ప్రచురించారు. సాహిత్యాభిలాషి సంస్కరణాభిలాషి. |
|
| ‘సినిమాలు చూడ్డం మానేశాను’ అనే వాళ్ళు సైతం చూసి తీరాల్సిన సినిమా ‘హజార్ చౌరాసీ కీ మాఁ’. బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి రచించిన నవల ‘హజార్ చౌరాసీ కీ మాఁ’ (తెలుగు లో ఒక తల్లి) నవలకు దృశ్యరూపమే ఈ చిత్రం. కొడుకు ఎలాంటివాడైనా అతనికేమైనా అయితే కన్న తల్లి ఎలా తపించిపోతుందో అనేది ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చెప్పింది. |
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నేడు ఒక నిర్ధాయక దశకు చేరుకున్న నేపథ్యంలో ఇటీవల ఫిబ్రవరి 7 వ తేదీన జరిగిన విద్యార్ధి పొలికేకలో, పొలిటికల్ జే ఏ సి లో వివిధ కుల సంఘాల జే ఏ సి లు నేడు ఉద్యమంలో కీలకమయిన పాత్ర పోషించడానికి అనిర్వచనీయమయిన స్పూర్తిని అందించిన మాదిగ దండోరా నాయకుడు, పొలిటికాల్ జే ఏ సి లో నిర్ణాయక పాత్ర పోషిస్తున్న కృష్ణ మాదిగపై జరిగిన దాడి అత్యంత హేయమయిన చర్య.
పూర్తిగా చదవండి »
- Next »