పాఠకులకూ, సాహిత్యాభిమానులకూ, నమస్సులు !
ఇవాళ తెలుగులో అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచంలో యితరయే భాషలో వస్తున్న సాహిత్యానికీ తీసిపోని విధంగా అద్భుతమైన సాహిత్యం సృష్టింపబడుతోంది. అన్నిరకాల సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ప్రజాస్వామిక ఆకాంక్షలు ప్రతిఫలిస్తూ గొప్ప సాహిత్యం తెలుగులో వస్తున్నది. అయితే వైవిధ్యభరితమైన ప్రజల ఆకాంక్షలను యింత అద్భుతంగా ప్రతిధ్వనిస్తున్న తెలుగు సాహిత్యం అంతర్జాతీయంగా వినబడటం లేదు. యితర భాషల వాళ్ళకోసం తెలుగు సాహిత్యాన్ని అనువదించటం వొక అంశమైతే, యితర ప్రాంతాలలో, యితర దేశాలలో విస్తారంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు నేడు తెలుగులో వస్తున్న యీ ప్రత్యామ్నాయ, సమకాలీన, ప్రజాసాహిత్యాన్ని అందించడం కూడ అంతే ముఖ్యమైనది. ఇవాళ ఇంటర్నెట్ మీద చాలా పత్రికలు ఉన్నా వాటిలో సాహిత్యానికి కేటాయించబడుతున్న జాగా కొంచెమేనని చెప్పుకోవాలి.
అంతర్జాతీయంగా వున్న తెలుగు సాహిత్యాభిమానులకు, ప్రజాస్వామిక వాదులకు తెలుగు లోని సమకాలీన సాహిత్యంతో పాటు కనుమరుగవుతున్న గత సాహిత్యాన్ని కూడా అందజేయడం వలన యెంతో కొంత మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాము. అందువలన తెలుగు సాహిత్యానికి వొక అంతర్జాతీయ వేదిక యేర్పడాలనీ, ఆ వేదికలో అనేక ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తం చేసే సాహిత్యం వెల్లివిరియాలనీ మేము భావిస్తున్నాం. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళకు (ముఖ్యంగా విదేశాలలో వున్న వాళ్ళకు) అతి తేలికగా అందుబాటులో నున్న మాధ్యమం ఇంటర్నెట్. ఇవాళ వరల్డ్ వైడ్ వెబ్ ఆధారంగా అనేక భాషలలో సాహిత్యం విస్తారంగా ప్రాచుర్యంలో వుంది. తెలుగు సాహిత్యాన్ని కూడా వెబ్ లో వుంచడం వలన ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి అది అతి తొందరగా చేరే అవకాశం ఉంది. అట్లా సమకాలీన తెలుగు సాహిత్యాన్ని వెంటవెంటనే దేశదేశాలలో వున్న తెలుగు ప్రజలు చదవడం వీలవుతుంది.
అందుచేత తెలుగులో ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆసక్తీ, ప్రేమా వున్న కొంతమందిమి మేము ఈ వెబ్ సైటు ప్రారంభిద్దాం అని అనుకున్నాము. దీని ద్వారా వున్నత ప్రజాస్వామిక విలువలుగల తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ తెలుగు ప్రజలకు అందిద్దామని మా లక్ష్యం.
అంతేగాక దేశదేశాల్లో, అనేక భాషల్లో విరివిగా వస్తున్న ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేయాలని కూడ మా కోర్కె . అట్లా మీ దృష్టికి వచ్చిన సాహిత్యాన్ని మాకు తెలియచేస్తే మేము మా శాయశక్తులా దాన్ని వెబ్ సైట్ లో వుంచుతాము. దీన్ని వొక మాస పత్రికగా తీసుకురావాలని మా ప్రయత్నం. అయితే ప్రతి వారం యెదో ఒక కొత్త రచనతో సైటుని అప్ డేట్ చేస్తూ తాజాగా వుంచాలనీ మా కోర్కె. కవిత్వం, కథ, నవల, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర రచనలను ప్రజాకళ ద్వారా పరిచయం చేస్తాం.
వొకమాట. మేం ప్రజాకళ లో తెలుగు నేలమీదనున్న అన్ని ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిఫలించే సాహిత్యానికి జాగా కల్పించాలనుకుంటున్నాము. విభిన్న ప్రాంతాల, విభిన్న సమూహాల, విభిన్న అస్తిత్వాల – యేదైనా అసమానతకు గురవుతున్న ప్రజల కష్టాలనీ కలలనీ ప్రతిబింబించే సాహిత్యం తీసుకు రావలని ఆశిస్తున్నాం. అయితే మేము వీలైనంతగా సాహితీ వివాదాలకు దూరంగా ఉండదలచుకున్నాము. ప్రజాకళ సృజనాత్మక ప్రజాసాహిత్యానికి అంతర్జాతీయ వేదిక కావాలని మాగట్టి కోరిక.
మీ అభిప్రాయాలు, స్పందనలు, సలహాలు మాకు తెలియ జేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం ! మీ అభిప్రాయాలను ప్రతీ పేజీలో కిందనున్న కామెంట్స్ ద్వారా గాని లేదా editor@prajakala.org కు ఈ-మెయిల్ ద్వారా గాని పంపవచ్చు.
మీకు మేము ఎలా తెలియజేయాలి?
ఇలా కామెంట్ల ద్వారానే నా? ఇంకేమన్నా మార్గం ఉందా??
మంచి ప్రయత్నం :)
మీ ప్రయత్నం సఫలీకృతం అవగలదనే నమ్మకము కలిగించింది నేను చదివిన ఈ సంచిక.తెలుగు సాహిత్యానికి ఒక అంతర్జాతీయ వేదిక యేర్పరచి,ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తం చేసే సహిత్యాన్ని అందరికి అందుబాటులో వుంచే మీ ప్రయత్నం నెరవేరగలదని భావిస్తున్నాను.
జాబాలిముని
చాలా బాగుంది.
మంచి ప్రయత్నం.
మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
1st issue of Prajakala was worthreading.Wish the net magazine will have a wonderful future n it enlightens telugu readers world wide.try to be different frm routine magazines.
Hi,
No offence but your “Prajakala” web site is not so good. Check the errors(links as wells as lots of spelling mistakes)before you launch a website and try to write in a normal(telugu)language, so that normal(telugu)people can understand. Everyone is not a poet like you to understand a typical telugu language.
friend…
సౌమ్య గారూ,
మీరు మీ సలహాలను గానీ, రచనలను గానీ, editor@prajakala.org కి ఈ-మెయిల్ చెయ్యగలరు.
శ్రీనివాసరాజు గారూ, జాబాలిముని గారూ, చంద్రశేఖర్ గారూ, ఎస్.రఘు గారూ, ఝాన్సి గారూ, సుధాకర్ గారూ, చరసాల గారూ, చావకిరణ్ గారూ,మీ అందరికీ ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలూ, ప్రోత్సాహకర సలహాలూ, సూచనలూ మాకు ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ముందు ముందు కూడా మీరు ఇలాగే నిర్మాణాత్మక సలహాలని, సూచనలని యివ్వాల్సిందని మా మనవి.
మిత్రమా!
మా వెబ్ సైటు ను చూసినందుకు చాలా సంతోషం. మేము మీ సూచనలని చాలా ఆనందంగా స్వీకరిస్తాం. మమ్మల్ని మేము సరిదిద్దుకోడానికి ఎప్పుడూ వెనుకాడం. ‘ప్రజాకళ’ లో అచ్చుతప్పులు గాని, సాంకేతికమైన తప్పులు గాని లేకుండా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అయినా మేము గమనించని తప్పులు ఎక్కడన్నా ఉండి ఉండవచ్చు. దయచేసి ఎక్కడెక్కడ అచ్చు తప్పులున్నాయో తెలిపితే మేము తప్పక సరిదిద్దుతాం. అట్లే ఎక్కడెక్కడ భాష సాధారణ తెలుగు ప్రజలకు అర్థం కాకుండా వుందో తెలియజేస్తే అక్కడక్కడ మార్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఆయా రచయితలు వారి వారి రచనల్లో వుపయోగించిన భాషకు మేము బాధ్యులం కాదు అన్న విషయం దయచేసి గుర్తించండి. ముందు ముందు కూడా మీరు ఇలాగే నిర్మాణాత్మక సలహాలని సూచనలని యివ్వాల్సిందని మా మనవి.
- ప్రజాకళ మిత్రులు
When I was in school - I used to go to the library and read the Sovit Land - and later I used to get that magazine and it was stopped after some time. The contents of this blog brought back my menories!
If you don’t think other wise, talking about foreign revolutionery people - who died long time back is not going to bring any thing.
Prajakala - need to represent the people’s mind - who can speak some thing out of their head. They can speak so that their agony will be reduced, they can speak so that some body is listening, they are ready to speak - but there is no platform - You have created one. Kinldy do not give any colors - but then ask the people to speak. Any thing past - glory or gory - is always interesting to listen, interesting to speak and interesting to discuss. Varthamaanam emayindi anEdi ledu, Bhootakaalam lo Emchesaamo anadaroo cheputaaru - Bhavishyattu ante andariki Bhayam - That fear has to be thrown out, removed, operated and then we should cultivate an attitude by which we will be able to see inot the future - and discuss and try to CHANGE it!
Subrahmanyam
priyamina prajakala,
mee prayathaniki chala santhosam.
ivvalla meeru cheppinattu telugulo chalamanchi sahityam vasthunnadi.
anni rakala prajaswamika poratalu telugu nelapina jaruguthunnayi.
mee prayathananiki chala danyavadalu.
mee
allam rajaiah
Where is the option to type comments in Telugu?
సుబ్రహ్మణ్యం గారూ,
మీ అభిప్రాయం చదివాము. మీరు మా వెబ్ సైటు చదివి మీ విలువైన వ్యాఖ్యలు చేసినందుకు మా కృతజ్ఞతలు. అయితే మీరు చిన్నప్పుడు చదివిన సోవియట్ ల్యాండు ని మా వెబ్ సైటు ఎలా గుర్తుకు తెచ్చిందా అని ఆశ్చర్యానికి గురయ్యాము. ఆ పాత పత్రిక తాలూకు ఏది ఈ వెబ్ సైటు లో ఉందో తెలియ జేస్తే సంతోషిస్తాము. శ్రీ శ్రీ ఫోటొ గాని, కవిత గానీ, లేదా ఆయన కథ గానీ మీకా అభిప్రాయం కలిగించాయా? కానీ శ్రీ శ్రీ విదేశీయుడు కాదే? మన తెలుగు వాడే కదా ? ప్రజల పక్షం వహించిన కవియే కదా? మరి ఇంక ఏది మీకు ఆ అభిప్రాయం కలుగ చేసిందో తెలియచేస్తే, మేము వెబ్ సైటులో ఉంచిన ఏ అంశం మీకట్లా అనిపించిందో తెలియచేస్తే, అట్లాంటిదేదయినా ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం. మాకు మన ప్రజల కన్నా, మన ప్రజల వర్తమాన స్థితిగతులని ప్రతిఫలించే సాహిత్యం కన్నా మరే ‘మరణించిన విదేశీ విప్లవకారుడెవరూ’ ఆసక్తి కలిగించరు. మేము మన ప్రజల వర్తమానాన్ని ప్రతిఫలించే సాహిత్యానికే ప్రాధాన్యత నిస్తాము. మా వెబ్ సైటులో దానికే అగ్ర స్థానము. అయితే గతము లేకుండా వర్తమానమూ భవిష్యత్తూ లేదు కాబట్టి మేము కాలక్రమేణా మనము మర్చి పోతున్న మన గత ఉత్తమ సాహిత్యాన్ని కూడా మా వెబ్ సైటులో ఉంచదల్చుకున్నాము. మేము గతాన్ని పొగుడుతూనో లేదా తెగనాడుతూనో ఉండడం కాక దాని లోంచి నేర్చుకోవలసింది ఏమయినా ఉన్నదా అని నిశిత దృష్టితో విమర్శనాత్మకంగా పరిశీలించాలనుకుంటాము. అట్లే వర్తమానంలో ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరిచే సాహిత్యానికి, ఎవరో కాక వాళ్ళే - ఆయా సమూహాల ప్రజలే - తమ కలలను, కన్నీళ్ళను, జీవితాలను ప్రకటించిన సాహిత్యానికి మేము మా వెబ్ సైటులో ప్రాధాన్యతనివ్వాలనుకుంటున్నాము.
మీరన్నది అక్షరాలా నిజం. తమ బాధలనూ, తమకు జరుగుతున్న అన్యాయాలనూ చెప్పుకోవడానికి తమకంటూ ఒక జాగా లేని ప్రజలు, తమ ప్రజాస్వామిక అభిప్రాయాలు ప్రకటించుకోవడానికి తమకంటూ ఒక వాహిక లేని ప్రజలు, ఎంతో తీవ్రమైన వాళ్ల కంఠస్వరాలని వినిపించడానికి ఎటువంటి అవకాశాలు లేని ప్రజలు – సాహిత్యంలో కథానాయకులు కావాలి – వాళ్ళ సాహిత్యాన్ని వీలయినంత ఎక్కువ మంది చదవాలి. అట్లా వారి జీవన స్థితిగతులూ , వారు ఏమనుకుంటున్నారూ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. అందుకు వారికొక జాగా కావాలి. అట్లే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల సాహిత్యము కూడా తెలుగు ప్రజలకు తెలియాలి. సరిగ్గా ఆ ప్రయోజనం నెరవేర్చడం కోసమే మా వెబ్ సైటు ప్రారంభించాము. మా వెబ్ సైటు కు ఎటువంటి రంగు పట్లా ఆసక్తి గానీ ప్రేమ గానీ లేవు. ప్రజల జీవితాన్ని చెప్పే సాహిత్యమే మాకు తలమానికం, గీటు రాయి కూడా. ఇప్పుడున్న పరిస్థితి మారి బాగు పడాలని కోరుకునే ప్రజల రంగే మాది. అది ఎవరైనా కావచ్చు. వారు కోరుకునేది ప్రజాస్వామికమైనంతవరకు మేము వారి సాహిత్యాన్ని గౌరవిస్తాము, మా వెబ్ సైటు లో ప్రకటిస్తాము. ఇదీ మా ఆశయము. అట్లా ప్రకటించడము శక్తివంతంగా చేయాలని మా లక్ష్యము.. మా ఆశలను, ఆశయాలను మా ముందు ముందు సంచికలు మరింత ప్రస్ఫుటం చేయాలనీ , చేసే విధంగా మేము శాయ శక్తులా ప్రయత్నం చేయాలనీ మేము అనుకుంటున్నాము. మాకు మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలెంతో అవసరం. మీరు తప్పక సహాయ పడతారు కదూ!
మీ
ప్రజాకళ
Still waiting for your response about writing comments in Telugu here.
రోహిణీ ప్రసాద్ గారూ,
ఇక్కడ తెలుగు లో వ్యాఖ్యానించటం ఎలా అని అడిగారు. గౌతమి యూనికోడ్ , కీబోర్డు మీ కంప్యూటర్ పైన ఇన్ స్టాల్ చేసి వుంటే MS Word లేదా notepad లో టైప్ చేసి comments box లో copy-paste చేయండి. లేదా మీరు comments రాయదల్చుకున్న పేజీకి వెళ్ళి గౌతమి (యూనీకోడ్) కీబోర్డు enable చేసుకొని MS Word లేదా notepad లో టైప్ చేసినట్టే comments box లో టైప్ చేయగలరు. ‘ ఈమాట ‘ లో తెలుగులో రాసే సౌకర్యం లాంటిది ప్రజాకళలో ఇప్పటిదాకా లేదు. త్వరలోనే అలాంటి సౌకర్యానికి ప్రయత్నిస్తాం. జవాబు ఇవ్వడంలో జరిగిన ఆలస్యానికి క్షమించగలరు.
ప్రజాకళ,
ఎంత చక్కని పేరు,పేరుకు తగ్గట్టు గా చక్కటి కూర్పు .నవీన తెలుగు సాహిత్యానికి ఒక అంతర్జాతీయ వేదిక కాగలదు.
వీటి కోసము ఎదురు చూసే మా వంటి వారికి దివిటీ కాగలదు . కుల-మత-వర్గ-ప్రాతీయ దూషణల కు తావు లేని సమర్గ ప్రామాణిక సాహిత్యం అందించవలసినది గా ఆకాంక్ష !
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
ప్రజా కళ చాలా తక్కువ సమయంలోనే అందరినీ ఆకట్టుకుంటుంది . ప్రతీ సంచికలో ఒక కవిని పరిచయం చేసేలా ప్రయత్నిస్తున్నట్లు ఉంది. సంతోషం. దళిత సాహిత్యం పై ఒక సంచిక వేసినందుకు అభినందించ వలసిందే. కానీ, కొత్త కవితలు, కొత్త వ్యాసాలను ప్రయత్నిస్తే ఇంకా బాగుంటుంది.
ఫ్రజా కళ నిజంగానే ప్రజల కవితలను, ప్రజలకోసం వ్రాసే సాహిత్యాన్ని అందిస్తుంది.మిమ్మల్ని అభినందిస్తున్నాను.మీకు వీలయితే చెరబండరాజు గారి, పాట
” కొండలు పగలేసినాం, బండలనే పిండినాం” ప్రచురించగలరు. లేదా email పంపగలరు.
జయదేవ్
ఈ ప్రజాలళ వెనక ఉన్న పెద్దలు (ప్రకాశకులు) ఎవరండీ? ఇది ఏ దేశం నుండి వస్తోంది?
రైతు కథ కు ఆహ్వానం
రైతు జీవితాల్ని ప్రతిబింబించే సాహిత్యం అసంఖ్యాకం గా వస్తున్నది. గతంలో రైతు జీవితాల్ని వ్యక్తీకరించిన కవితల్ని ఏర్చి కూర్చి “రైతు కవిత” సంకలనాన్ని వెలువరించాము. సాహిత్యాభిమానులు ఈ సంపుటిని ఎంతగానో ఆదరించారు. ఆ స్ఫూర్తి తో ఇప్పుడు “రైతు కథ” ను సంకలించదలిచాం. తొలినాటి నుండి రైతుల జీవితాల్ని స్పర్శించిన కథల్ని పంపిచవలసింది గా కథకుల్ని, సాహిత్యాభిమానుల్ని అభ్యర్ధిస్తున్నాం. వివిధ పత్రికల్లొ, కథా సంపుటుల్లో ప్రచురితమైన కథల ఫొటొస్టాట్ కాపీలను కాని లేదా ఒరిజనల్స్ కాని పంపించాలి. ఈ సంపుటి కోసం ప్రత్యేకించి రాసిన కథలు అంగీకరించబడవు. గతంలో ప్రచురితమైన కథలు మాత్రమే పంపగలరు. డా.పాపినేని శివశంకర్, బండ్ల మాధవ రావు, ఎం.వి.రామిరెడ్డి లు సంపాదకులుగా ఉన్న ఏ సంకలనానికి కథలు పంపవలసిని చిరునామా డా. పాపినేని శివసంకర్, 3వ లైన్, విద్యానగర్, గుంటూరు - 522 006. లేదా బండ్ల మాధవ రావు,306,రాచకొంద టవర్స్,అల్వాల్, సికింద్రాబాద్ - 500 010. లేదా ఎం.వి రామిరెడ్డి,కోట రెసిడెన్సి, పోలీస్ స్టేషన్ దగ్గర, మియాపూర్, హైదరాబాద్.
దయచేసి http://andhrapradeshprimaryeducation.blogspot.com/ సందర్శించండి
ప్రజా కళ చాలా బాగుంది. ఇది సాహిత్య చరిత్రలొ ఓ మైలు రాయి. ముందు ముందు మంచి వ్యాసాలతొ మరిన్ని సంచికలు రావాలని మనస్పూర్తిగా ఆషిస్థున్నాను.
ఆర్యా! ప్రచురితమైన రైతు కథ పంపేటందుకు ఇంకా టైముందా?
తమ విథేయుడు,
“రాంరళి”,రచయిత.
డా/పెయ్యేటి మురళీ మోహన రావు,రచయిత,
4-కె,వేల్ మాత్రే ప్లాజా,తిరుచానూరు రోడ్డు,
పద్మావతీ పురం,తిరుపతి- 517 503.
ఫోను:-0877/2284944; సెల్ :- 9885254670.
ఈ రోజే నేను అనుకోకుండా మీ ప్రజాకళ సైట్ చూశాను. బాగుంది. మేము కథలు మీకు ఈ మెయిల్ చేసి పంపిస్తే ప్రచురిస్తారా?తెలుపండి.చాలా చక్కని పద్ధతిలో తెలుగు వెలుగులు దశ దిశలకూ వ్యాపింప చేస్తున్నారు.మీ కృషి అభఇనందనీయం.
భవదీయుడు,
ఉభయ కవి మిత్ర-డా/పెయ్యేటి మురళీ మోహన రావు,బి.వి.యస.సి&ఎ.హెచ్.,
రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్,ఎ.హెచ్.,రచయిత,కవి,నటుడు,తిరుపతి.517 503.
నేను మీరనుకున్నట్టు రాయల సీమ మాండలికంలో కథలు రాసే వాడినికాను.నేను నిజానికి ఉభయగోదావరీ-కృష్ణాజిల్లాల వాడిని.నేను అవటానికి నా రచనా వ్యాసంగం చాలా పిన్న వయసులోనే ప్రారంభించాను.ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో 1957లో ‘అజగరన్యాయం’ అనే కథ చోటు చేసుకుంది.ఈ కథ నాదగ్గర లేదు. అంతకు ముందు కథలు నర్సాపురం లోని అత్తిలి వెంకట్రామయ్య గారి ‘దేశబంధు ‘ వారపత్రికలో ప్రచురణయ్యాయి. అవేవీ ఇప్పుడు నాదగ్గరలేవు.అన్నీ నష్టపోయాను.ఆంధ్రప్రభలో నేను హిందీ నించి అనువదించిన కొన్ని కథలూ గేయాలూ ప్రచురింపబడ్డాయి. అవీ లేవు. నేను తదుపరి నాటికలు రాశి పోటీలకు తీసికెళ్లే ప్రక్రియలో ఉండి కథలను దూరం చేసుకున్నాను.1987 మార్చి లో నాకథ “నాన్నా నువ్వు చచ్చిపో!”ఆంధ్ర సచిత్రవార పత్రికలో ప్రచురించారు.నేను ఉద్యోగరీత్యా శ్రీకాకుళం,విశాఖ,విజయనగరం జిల్లాలలో పని చేశాను.విజయనగరం రచయితల సంఘం సభ్యుడిని.విజయనగరం రచయితలు మరల నన్ను ప్రోత్సహించి కలం పట్టేలాచేశారు.అప్పుడు-చాలాకథలు రాశాను.ప్రచురితమయ్యాయి.నాగపూరు కథలపోటీలో నా కథ “అయినవాళ్లు” ప్రథమ బహుమతినందుకుంది.మరో సంవత్సరం నేను రాసిన “మృగతృష్ణ” కథ ద్వితీయ బహుమతినందుకుంది.ఈ రెండు కథలూ నాదగ్గర లేవు.ప్రచురిత బహుమతి కథల రికార్డు మైన్ టైన్ చెయ్యడం విజయనగరం రచయితలు నాకు నేర్పారు.నా నాటిక “ప్రేమించి పెళ్లి చేసుకో” శ్రీకాకుళం తిరుమల నాటాక కళా పరిషత్ లో ఉత్తమ రచన బహూకృతినీ -నా నటనకు స్పెషల్ ప్రైజునూ అందుకుంది.ఈ నాటిక సంక్షిప్తీకరించి ఆల్ ఇండియా రేడియో వారు ప్రసారం చేశాౠ.తరవాత-”తమసోమాజ్యోతిర్గమయ”,”ప్రేమదొంగలున్నారు జాగ్రత్త!”,”ఊసరవిల్లి”,”నారీనాదం”(స్క్రిప్ట్ నష్టపోయాను),”భారతం లో అగమ్య పర్వం’(స్క్రిప్ట్ నష్టపోయాను)ఇత్యాది నాటికలూ-కథలు-విశాఖ గురజాడ జయంతి సందర్భంగా నిర్వహించిన సహృదయ సాహితీ సమాఖ్య కథల పోటీలో నా కథ-”తులసివనంలో”-ద్వితీయబహుమతినందుకుంది.విజయనగరం జిల్లా కవితలపోటీలో నా కవిత “అంతర్మథనం”-ప్రథమ బహుమతినందుకుంది.ఇక-నా ప్రచురిత కథలు-”స్వర్గం”-ఈ వారంకథ.,”బుడిగిగాడి డిస్కవరీ”,”అహం బ్రహ్మాస్మి”,చతురలో చాలాకథలూ-ఇలా ఉన్నాయి.ప్రస్తుతం రాసే ప్రయత్నంలో ఏదో గిలుకుతున్నాను.
భవదీయుడు,
డా/పెయ్యేటి మురళీ మోహన రావు.(రాంరళి)
ప్రస్తుతం నేను నా రచనలను నా స్వంత బ్లాగ్- ramrali blog.co.uk లో
వేస్తున్నాను.దయగలిగిన వారు చూడచ్చు.
భవదీయ,
రాంరళి.
ఇది ప్రతివారూ చదవవలిసిన వ్యాసం:
http://www.apweekly.com/sahitya/sahiitems.asp?ID=AWU20070924032309&Title=Literature+%2D+Columns&lTitle=NS%CC%C1%AA%B1sV%3D&Topic=1707&Author_Id=0&spart=0&dName=&Dist=
ఆ లిన్క ఇవ్వడంలో మీ భావమేంటో అర్ధం కాలేదు రోహిణీ ప్రసాదు గారు?
“భావ”మేమీ లేదు. అది చదవదగిన వ్యాసం అని పాఠకులకు తెలియజెయ్యడమే. ఆసక్తి లేనివారు ఉపేక్షించవచ్చు. ఇందులో అర్థం కానిదేముంది?