తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పుట్టుకొస్తూనే ఉంటాయి. సమస్యలకు పరిష్కారాలు ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతాయని చరిత్ర చెబుతున్నది. అయితే తమ సమస్యల పరిష్కారానికి గళం విప్పడం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ పాలకులకూ లేదు. నల్గొండ జిల్లాలో ఇటీవల కొన్ని సంఘటనలలో పోలీసుల అఘాయిత్యాలు కళ్లారా చూశాను. పూర్తిగా చదవండి »
అంబేద్కర్ ప్రకారం జరిగే విప్లవంగా, వెంకటేశ్వర్లు, తర్వాత జరిగేది కూడా చెపుతున్నారు. ఆ చివరి దశ ఏమిటంటే : ‘భూమిలో అగ్ర కులాల ఆధిపత్యాన్ని తొలిగించి, భూమిని జాతీయం చేయడం. ఉద్యోగాల్లో, ఇతర అవకాశాల్లో, అగ్ర కులాలకు రిజర్వేషన్లు కల్పించడం.’ అగ్ర కులాలకు రిజర్వేషన్లు! ఇంత విప్లవాన్ని అంబేద్కర్ కూడా కలగనలేదు! అగ్రకులాలకు రిజర్వేషన్లు ఎప్పుడు? పూర్తిగా చదవండి »
2002 జూలై 18న అమరుల బంధుమివూతుల సంఘం ఆవిర్భవించింది. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ రోజును అమరుల సంస్మరణలో రాజ్యహింస వ్యతిరేక దినంగా నిర్వహిస్తున్నాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా విప్లవోద్యమంలో అమరులైనవారందరినీ స్మరించుకునే సంప్రదాయం ప్రారంభమైంది. 2008 జూలై 17, 18 తేదీల్లో మొదటి మహాసభలు జరిగాయి. ఇప్పుడు అపరేషన్ గ్రీన్‌హంట్ వ్యతిరేక చైతన్యంతో అమరులను స్మరించుకుందామని దశాబ్ది మహాసభలను తలపెట్టాం. ఆంధ్రవూపదేశ్‌లో విప్లవోద్యమం మొదలైనప్పటినుంచి వేలాది మంది విప్లవకారులను, సానుభూతిపరులను రాజ్యం హత్యచేసింది.
1970 జులై 4న విరసం ఏర్పడి, నిర్వహించిన చారిత్రక పాత్ర నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ విరసం ముందుకు వచ్చింది. శ్రీకాకుళ పోరాటం తాత్కాలిక ఓటమి గురైనప్పుడు, ఆరిపోతున్న ఆ నిప్పురవ్వకు తన సాహిత్య కళా ఆచరణతో ఊపిరిపోసి రాష్ట్రమంతా విరసం ప్రచారం చేసింది. కా.కిషన్ జీ లాంటి అనేకమంది భూమిపుత్రుల కృషి ఫలితంగా తిరిగి జగిత్యాల జైత్రయాత్ర నాటికి విప్లవోద్యమం ఊపందుకుంది. ఈ నలభైఏళ్ళకు పైగా విరసం ఒక సాంస్కృతిక శక్తిగా విప్లవోద్యంతో, తెలుగు ప్రజల పోరాటాలతో కలిసి నడుస్తోంది.
జూలై 15, ఆదివారం ఉదయం 10:00 గంటలనుండి సాయంత్రం 5;00 గంటల వరకు. మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ.నాంపల్లి, హైదరాబాద్
లక్షింపేట … లక్షింపేట
నిన్నేమని పిలువాలి తల్లీ
కళ్ళు తెరిచినా మూసినా దృశ్యం చెదిరిపోవటం లేదు
కలత నిద్రలోంచి – చావు వాసన వస్తుంది
కనుగుడ్లు చిమ్మిన రక్తంతో
నీ మట్టి గడ్డ కట్టింది
మునివేళ్ళతో మట్టిని తాకుదామంటే
మానవ కంకాళాలు కన్పిస్తున్నాయి
నీతో సంభాషించాలంటే
కత్తుల భాషను చూసి భయమేస్తుంది
నీ గర్భంలో పాతిపెట్టుకున్న నమ్మకాన్ని
వేకువజాము కోయిల పాట సాక్షిగా నరికివేసారు
‘పాలేరుతనం చేసే వాడికి భూమెందుకురా! పాలేరు పనో కూలిపనో చెయ్యాలిగాని… అంతే ‘ - గత ఏడాదిన్నర నుంచి లక్షింపేట కాపులు అదే పేటకు చెందిన మాలలకు చేస్తున్న హెచ్చరిక అది. దానిని వినకుండా ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటామని ముందుకు వచ్చిన మాలపేటను కాపులు మసిచేసేశారు.
సాహిత్యంలో ఔచిత్యం వుండాలని ఆవుల గోపాల కృష్ణమూర్తి నినదించారు. తెలుగు సాహిత్యం లో అటువంటి పోకడలు ఎలా సాగినయో వివరిస్తూ ధూళిపూడి ఆంజనేయులు గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ గ్రంధంలో వివరించారు. ప్రజా కవులు గా పోతన వేమన పేరు తెచ్చుకొనగా, అప్రజాస్వామ్య రచయితలుగా విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు కీర్తి పొందారు. పూర్తిగా చదవండి »
సాయంత్రం ఆరు గంటలు….
బ్రెయిలీ క్లాసుకి ఆట విడుపు గంట మోగింది
చైతన్యపురి చౌరాస్తా నుంచి ముగ్గురబ్బాయిలు
దూసుకొచ్చిన బస్సుకింద పడబోయి నిలదొక్కుకున్నారు
“కళ్ళు నెత్తికెక్కాయా ” డ్రైవరు అడిగాడు
వాళ్ళు మాట్లాడలేదు
ఒకరి చేతులొకరు పట్టుకుని
జాగ్రత్తగా రోడ్డు దాటారు
బిజెపి, కాంగ్రెసు ప్రభుత్వాలు చేస్తున్న చట్టవ్యతిరేక హత్యలు, ఎన్ కౌంటర్లు వెంటనే ఆపాలని విజ్ఞప్తి!
మూక స్వామ్యం లో హతమార్చడం ఆనవాయితీ యా?
ఆదివాసుల పైన మారణకాండ, మానవహక్కుల ఉల్లంఘనను వ్యతిరేకించండి!
గౌరవనీయులైన జస్టిస్ శ్రీ ఎస్.హెచ్. కపాడియా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
గౌరవనీయులైన జస్టిస్ అల్తామాస్ కబీర్
గౌరవనీయులైన జస్టిస్ డి..కె. జైన్
గౌరవనీయులైన జస్టిస్ పి. సదాశివం
గౌరవనీయులైన జస్టిస్ అఫ్తాబ్ ఆలం
గౌరవనీయులైన చైర్మన్ జస్టిస్ మార్కండేయ ఖట్జూ సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జి – ప్రెస్ కౌన్సిల్ చైర్మన్
ఛత్తీస్-గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో బాసగూడ, సార్కగూడ వద్ద 23 ఆదివాసులను పోలీసు, సి.ఆర్.పి.ఎఫ్ సాయుధబలగాలు కాల్చిచంపాయి.
“ఈ దేశంలోని మధ్యతరగతి మనసు ఎంత కరుడుగట్టినా, పసిపిల్లలు అంటే ఎక్కడో కొంచెం మానవ స్పందన మిగిలిందేమోనన్న అనుమానంతో మీడియా మావోయిస్టులు పిల్లలను అడ్డుపెట్టుకోవడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నను సంధించడం మొదలుపెట్టారు.”
రెండు నెలల కిందట బస్తర్‌లో జరిగిన కలెక్టర్ అపహరణ సందర్భంలో ఆ ప్రాంతం, అక్కడి ఉద్యమాల గురించి దేశ వ్యాప్తంగా, అలాగే మీడియాలో కూడా చర్చ జరిగింది. కలెక్టర్‌ను కిడ్నాప్ చెయ్యడం ఎంతవరకు సమర్థనీయమని దేశంలోని చాలామంది మధ్యతరగతి విద్యావంతులు ప్రశ్నించారు. మీడియా, హిందూ లాంటి వార్తా పత్రికతో సహా రాజ్యం ఏ పరిస్థితుల్లో రాజీపడకూడదని ‘ఢీలా రాజ్యం’గా (Soft State) ప్రవర్తించకూడదని, ఇది ‘కఠినమైన రాజ్య’మనే సందేశం మావోయిస్టు పార్టీకి, ఇతర ప్రజలకు అర్థమయ్యేలా ప్రవర్తించాలని సలహాలు వచ్చాయి. పూర్తిగా చదవండి »
కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఎంత దయనీయం!
ఇలాంటి విషాద ఘడియ ఒకటి వచ్చి పడుతుందని ఊహించనే లేదు .
భ్రాంతి దిగ్ భ్రాంతి గా మారిన దురదృష్టపు క్షణాలివి. పూర్తిగా చదవండి »