Order Phoslo (Calcium Acetate) improvement. Basic components of an action research cycle are: planning, action, workshop to create a new activity using the online template, under the guidance of the Method Where Can I Buy Skelaxin (Metaxalone)

మే, 2012 సంచిక

శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలును
గొడ్డలితో నరుకుతున్నాడు
బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి
పాతాళానికి తొక్కేస్తున్నాడు.

ఓహో..!
ఇప్పుడు నడుస్తున్న చరిత్ర
పరమ ఛండాల చరిత్ర
(నడుస్తున్న చరిత్ర, 1984)

- శివసాగర్

george

నలభై ఏళ్ల తర్వాత జార్జిడ్డి జ్ఞాపకాలు ఇంత సజీవంగా ఉండడమంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల, తెలంగాణ ఉద్యమ చైతన్యానికి జోహార్లు చెప్పవలసిందే. నేను ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు జార్జిడ్డి విద్యార్థిగా ఉండే కాలంలోనే ఉన్నాను. కానీ ఆయనను కలుసుకోలేదు. హైదరాబాద్ నుంచి నేను వరంగల్ పీజీ సెంటర్‌కు 1970లోనే వెళ్లడం వల్ల, జార్జిడ్డి పాత్రను వినడమే తప్ప చూడలేదు.

పూర్తిగా చదవండి »

పత్రికా ప్రకటన: తేదీ: మే 17, 2012

“శివసాగర్ కవిత్వం” పైన డల్లాస్ నగరంలో, మే 12 వ తేదీన చైతన్య వేదిక చర్చను నిర్వహించింది. యీ కార్యక్రమంలో “అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు” అనే శివసాగర్ రాసిన పాటను నసీమ్, అనంత్ పాడారు. తానా చైర్మన్ జంపాల చౌదరీ సభను ప్రారంభిస్తూ “శివసాగర్ అనే పేరు నాకు తెలియక ముందే, ఆయన రచనలు దేశమంతా కూడా బాగా ప్రసిద్ధి చెందాయి.
పూర్తిగా చదవండి »

అంబేద్కర్

చైతన్య వేదిక “సామాజిక న్యాయం లో డా.అంబేద్కర్ పాత్ర” అనే అంశం పైన చర్చ కార్యక్రమాన్ని, డల్లాస్ నగరంలో జల్సా రెస్టారెంటు లో మే 12 వ తేదీన నిర్వహించింది. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం, నేటి సమాజంలో కుల, వర్గ ప్రశ్నలు, కులనిర్మూలన అంశాలపైన చర్చ సాగింది.

పూర్తిగా చదవండి »

varavararao.JPG

ఈ ఆఖరి చరణమే వరంగల్‌నుంచి పెండ్యాలకిషన్‌రావు సంపాదకత్వంలో వెలువడిన ‘విప్లవకవులు’ కవితాసంకలనం ‘మార్చ్‌’కు మకుటం. ఈ కవిత్వంలో మనకు కనిపించే కొంచెం దిగంబరకవుల వాసన, స్పష్టమైన విప్లవ అవగాహన, కవితా ‘ప్రభంజనం’, తిరుగబడు కవులు కలిసి జులై 4, 1970న ఏర్పడిందే విప్లవ రచయితల సంఘం. ఆనాటినుంచి ఈనాటి వరకు సాహిత్య, సాంస్కృతికరంగాల్లో విరసం ఆశయం, లక్ష్యాలకు ఇదే మార్గనిర్దేశం.
పూర్తిగా చదవండి »

వీక్షణం ఏప్రిల్ 2012 సంచికకోసం
jan_mrydal2.JPG

యాన్ (ఇంగ్లిష్ లో జె ఎ ఎన్ అని రాస్తారు గాని స్వీడిష్ లో యాన్ అని ఉచ్చరిస్తారు) మిర్డాల్ భారత ప్రజలకు చిరకాల మిత్రుడు. స్వీడన్ లోని స్టాక్ హోం లో 1927లో పుట్టిన యాన్ మిర్డాల్ యువకుడిగా నాజీ వ్యతిరేక యువజన సంఘాల సభ్యుడిగా, మార్క్సిస్టుగా మారి అరవై సంవత్సరాలకు పైగా రచయితగా, పత్రికారచయితగా ఉన్నారు. భారతదేశం, చైనా, అఫ్ఘనిస్తాన్, ఇరాన్, క్యూబా, అమెరికా వంటి అనేక దేశాలు పర్యటించారు, చాల పుస్తకాలు రాశారు. చైనా గ్రామాన్ని అధ్యయనం చేసి 1962లో రిపోర్ట్ ఫ్రమ్ ఎ చైనీస్ విలేజ్, 1982లో ఆ గ్రామానికే వెళ్లి రిటర్న్ టు ఎ చైనీస్ విలేజ్ రాశారు.కన్ఫెషన్స్ ఆఫ్ ఎ డిస్ లాయల్ యూరపియన్ అనే నవల రాశారు.

పూర్తిగా చదవండి »

అమ్మా! నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు!

పొలాలలో పరిగె గింజ
ఏరుకునే వేళలందు
అమ్మా! నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు!
పూర్తిగా చదవండి »

ఉరితీయబడ్డ పాట నుండి
చెరపడ్డ జలపాతం నుండి
గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువు నుండి,
వాయులీనం నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను.
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
పూర్తిగా చదవండి »

ఆంధ్రదేశాన్ని ఈ అర్ధశతాబ్దిలో మలుపు తిప్పిన కవుల్లో, ఉద్యమకారుల్లో, పోరాట వీరుల్లో అగ్రగామిగా నిలబడినవారు కె.జి.సత్యమూర్తి. ఆయన పోరాట యోధుడు. కవిగా శివసాగర్‌. కవి అంటే సామాన్య మైన కవి కాదు ఆకాశాన్ని భూమికి దించగలిగిన కవి. పదాల్ని ఈటెలుగా, ఆయుధాలుగా మార్చగలిగిన కవి. సూర్యుణ్ని రాత్రులు ఉదయింపచేయగలిగిన కవి. విప్లవ కవిత్వం అంటే ఏమిటో తెలుగు ప్రజలకు చెప్పిన కవి. సత్యమూర్తి సమాజపు అట్టడుగు లోయల్లో జన్మించారు. సమాజాన్ని తాత్వికంగా అర్ధం చేసుకున్నారు. ఆయనది నిశితమైన దృష్టి, తీక్షణమైన అధ్యయనం. ఆయనది యుద్ధ ప్రయాణం. ఆయన గీతం సమరగీతం. ఆయన శత్రువుని గుర్తించిన యోధుడు. ఏ సందర్భంలోను శత్రువుతో రాజీపడని నాయకుడు. అంతర్గత శత్రువుని కూడా గుర్తించిన మేధావి.

పూర్తిగా చదవండి »

సౌజన్యం: దళిత కెమెరా మిత్రులు
kadhirnilavan

sridhar

పూర్తిగా చదవండి »

జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సిటిసి) ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చేస్తున్న ప్రయత్నాల పట్ల కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసినా ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. కేవలం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సమన్వయంకోసం మాత్రమే ఈ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రధానమంత్రి డా.మన్‌మోహన్‌సింగ్ ఎంతగా చెబుతున్నా విశ్వాసం కలిగించలేకపోతున్నారు.
పూర్తిగా చదవండి »

సినిమా: కాల్ బేలా ( 2009)
భాష: బెంగాలీ ( ఇంగ్లీషు సబ్ టైటిల్స్ )
దర్శకత్వం: గౌతం ఘోష్
కథ, నవల: సమరేష్ ముజుందార్

కాపీరైటు హక్కులతో ప్రజాకళకు సంబంధం లేదు. కేవలం య్యూటూబ్ లింక్ ఇవ్వబడింది.

వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడుల్పన తలపులూ బోడులా
విశ్వదాభిరామ వినుర వేమ !

వేమన కవితా చంద్రికలతో - డాలస్ లో “నెల నెలా తెలుగు వెన్నెల”, మే 19, 2012 శనివారం,సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగినది. డాలస్ ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రంగరాజు రమ ఉపన్యాసం:

మొదటి భాగం:

పూర్తిగా చదవండి »

ko_ku_img2.JPG

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్యల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్, చరిత్ర, , సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషణాత్మక రచనలు చేసారు. మొత్తం సంకలనం కావాలంటే కాస్త ఓపిక పట్టాలి. కేవలం రెండు నుండి ఎనిమిది సంకలనం దొరుకుతున్నాయి.

http://prajakala.org/books/ko_ku.pdf

( sample of five pages )

contact: prajakala@gmail.com

sri_sri_img2.JPG

యువతరం విసిగింది బాపూ
నవతరం విరిసింది బాబూ
వెతుకుతున్నది కొత్తరోజులు
దులుపుతున్నది పాత బూజులు

http://prajakala.org/books/sri_sri.pdf

- Next »