“ప్రజాకళ” పత్రిక తిరిగి మీ ముందుకు వచ్చింది. కష్టనష్టాలు ఎన్ని ఉన్నా, ముందుగా ఈ పత్రిక నిరంతరాయంగా కొనసాగాలని కాంక్షించి, అనివార్యామైపోయిన అవాంతరాలతో పాఠకుల ముందుకు రాలేక పోయినప్పుడు,పత్రిక ఆగమనాన్ని మాకన్నా మరింత గాఢంగా కోరుకున్న మిత్రులకూ ,సాహితీ పాఠకులకూ, రచయితలకూ ఈ అవాంతరానికై క్షమాపణలను తెలియజేస్తున్నాం.
2006 అక్టోబరులో “ప్రజాకళ” మొదలైనప్పటినుండి ఇది రెండవ అవాంతరం.ఈ రెండు సార్లూ మాకు ఎంతో శక్తినీ,పత్రిక అవసరాన్నిగురించి ప్రోత్సాహాన్నీ మీరు మాకు అందివ్వక పోయినట్లయితే పత్రిక తిరిగి మీ ముందుకు రాగలిగేదికాదు.
ప్రపంచమంతా వ్యాపితమై ఉన్న తెలుగు పాఠకులకు, తెలుగు సమాజపు గతిశీలతనూ,దానిలో ప్రగతిశీల శక్తుల ప్రమేయాన్నీ ఎత్తి పట్టే సాహిత్యాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో “ప్రజాకళ” ముందుకు వచ్చింది. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా,తమ సమాజం పట్ల తమ కనీస బాధ్యతను నిర్వర్తించేందుకూ,తమ గుండె గొంతుకను తమ మూలాలతో లయం చేసేందుకు తన వంతుగా “ప్రజాకళ” ఒక వేదికగా పనిచేసేందుకూ ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్నిమేము నిరంతరాయంగా కొనసాగించలేకపోయాం. నిర్వహణాపరంగా ఎదురైన ఇబ్బందులను అధిగమించలేకపోయాం.
పత్రికా నిర్వహణ కొంత మంది వ్యక్తులో,లేకుంటే ఒక సంస్థో తనంత తానుగా నిర్వహించడమనేది దాదాపుగా అసాధ్యమన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. నూరుపూలు వికసించకపోతే, వేయి ఆలోచనలు సంఘర్షించకపోతే, అనేకానేక మంది అనేక రూపాలుగా భాగస్వాములు కాకపోతే పత్రిక ఎలా మనుగడ సాగించగలుగుతుంది. సృజన ఎలా పరిమళభరితమవుతుంది….దీనిలో ఏ ఒక్కటి కొరత పడినా ఆ లోటు మరి పూరించలేనిదిగానే మిగిలిపోతుంది.
ఆయా లోటులన్నింటిని పూరించుకునే ప్రయత్నపు సమాహారంగా “ప్రజాకళ” తిరిగి మీ చేతుల్లోకి వచ్చింది.మునుపటిలాగానే పత్రికను ఆదరించాలని పాఠకమిత్రులనూ, రచయితలనూ,సాహిత్యాభిమానులనూ కోరుతున్నాం.
- ప్రజాకళ సంపాదకవర్గం
Prajakala@gmail.com
ప్రజాకల మల్లి మొదలు పెటినదుకు నందుకు ధన్యవాదాలు
దీని కొనసాగింపుకు కవులు సహకరించాలని
పత్రికను బ్రతికించు కొవాలని
సాహిత్యాభిమానులను కొరుతూ
ఈ పత్రిక గురించి మొదటిసారి నా మెయిల్ బాక్సులో వచ్చిన ఉత్తరాన్ని బట్టి గ్రహించాను. వెంటనే ఈ వెబ్ సైటుకి వచ్చి చూసాను. చాలాకాలం నుండి నడుస్తున్నా తెలుసుకోలేకపోయినందుకు సిగ్గేసింది. మీ ఆదర్శమ చాలా బాగుంది. దీనికి నాప్రయత్నంగా సహకరించడమేకాకుండా నాకుతెలిసిన మిత్రులకు కూడా పరిచఅమ చేస్తాను.
మీ పునః ప్రయత్నం నిరాటంకంగా కొనసాగాలని మనఃస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
పదాల మధ్య విరామం, కామాలు మిస్సయ్యాయి.కొంచెం చూడండి
కొనసాగించండి. అట్టడుగు వర్గాల సాహిత్యానికే ప్రాదాన్యత ఇవ్వండి.