| పౌరహక్కుల నేత పురుషోత్తం సంస్మరణసభ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) సెప్టెంబర్ 23న 2009 హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, ప్రముఖ రచయిత్రి. సామాజిక కార్యకర్త, బుకర్ ప్రైజ్ విన్నర్ అయిన అరుంధతీ రాయ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసగించారు. |
మార్చ్, 2010 సంచిక
యతి రాజులు గారు అవిశ్రాంత శ్రామికుడు. ప్రజల మనిషి. 50 సంవత్సరాలుగా ప్రజల సాహిత్యాన్ని అనువదిస్తూ పైసా ఆశించని సాంస్కృతిక కార్మికుడు. పిల్లలన్నా, మరీ ముఖ్యంగా పల్లెలన్నా, పల్లెల్లో పిల్లలన్నా ఎంతో ఇష్టం, విశ్రాంత ఉపాధ్యాయుడైనా పిల్లల ప్రేమకు పాత్రుడయిన ఉత్తమ ఉపాధ్యాయుడు నిరాండంబరుడుతో ఇంటర్వూ ఈ మాసం ప్రజాకళ పాఠకులకోసం.- రత్నాల విజయలక్ష్మి
పూర్తిగా చదవండి »
సారంగ బుక్స్
ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థ:
మంచి సాహిత్యాన్ని అచ్చులోకి, అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పానికి రూపం “సారంగ బుక్స్”. మా మొదటి ప్రచురణ 2000 నుంచి 2009 వరకీ వచ్చిన మంచి కవితల సంకలనం. ఈ సంకలనం జూలై మొదటి వారంలో వెలువడుతుంది.
పూర్తిగా చదవండి »
| డాక్టరు డి.యం.ప్రేమావతి , పద్మావతి ఉమెన్స్ కాలేజీ లో తెలుగు శాఖలో లెక్చరర్ గా పనిచేసారు. తెలుగు శాఖ అధిపతిగా రిటైర్ అయ్యారు . ఆమె స్త్రీలకు సంబంధించిన వివిధ సమస్యలపై స్త్రీ చైతన్యంతో పలు ఉపన్యాసాలు ఇచ్చారు. వివిధ సాహిత్య వ్యాసాలు స్త్రీవాద దృక్పధంతో రాసి ప్రచురించారు. సాహిత్యాభిలాషి సంస్కరణాభిలాషి. |
|
“ప్రజాకళ” పత్రిక తిరిగి మీ ముందుకు వచ్చింది. కష్టనష్టాలు ఎన్ని ఉన్నా, ముందుగా ఈ పత్రిక నిరంతరాయంగా కొనసాగాలని కాంక్షించి, అనివార్యామైపోయిన అవాంతరాలతో పాఠకుల ముందుకు రాలేక పోయినప్పుడు,పత్రిక ఆగమనాన్ని మాకన్నా మరింత గాఢంగా కోరుకున్న మిత్రులకూ ,సాహితీ పాఠకులకూ, రచయితలకూ ఈ అవాంతరానికై క్షమాపణలను తెలియజేస్తున్నాం.
పూర్తిగా చదవండి »
| ‘సినిమాలు చూడ్డం మానేశాను’ అనే వాళ్ళు సైతం చూసి తీరాల్సిన సినిమా ‘హజార్ చౌరాసీ కీ మాఁ’. బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి రచించిన నవల ‘హజార్ చౌరాసీ కీ మాఁ’ (తెలుగు లో ఒక తల్లి) నవలకు దృశ్యరూపమే ఈ చిత్రం. కొడుకు ఎలాంటివాడైనా అతనికేమైనా అయితే కన్న తల్లి ఎలా తపించిపోతుందో అనేది ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చెప్పింది. |
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నేడు ఒక నిర్ధాయక దశకు చేరుకున్న నేపథ్యంలో ఇటీవల ఫిబ్రవరి 7 వ తేదీన జరిగిన విద్యార్ధి పొలికేకలో, పొలిటికల్ జే ఏ సి లో వివిధ కుల సంఘాల జే ఏ సి లు నేడు ఉద్యమంలో కీలకమయిన పాత్ర పోషించడానికి అనిర్వచనీయమయిన స్పూర్తిని అందించిన మాదిగ దండోరా నాయకుడు, పొలిటికాల్ జే ఏ సి లో నిర్ణాయక పాత్ర పోషిస్తున్న కృష్ణ మాదిగపై జరిగిన దాడి అత్యంత హేయమయిన చర్య.
పూర్తిగా చదవండి »
గతితార్కిక భౌతికవాదం: రెండో అధ్యాయం (తరువాయి భాగం)
విపత్తు తలెత్తుతున్నప్పుడు ఏం చెయ్యాలి? దాని పెట్టుబడిదారీ నిర్మాతలను ప్రతిఘటించాలా? పెట్టుబడిదారీ వ్యవస్థనే అంతం చెయ్యాలా? అదేం కాదు. దాని పాలకులకు బలం చేకూర్చి, అలగా జనాన్ని బలహీనపరచాలి. కీర్కిగార్ద్ అస్తిత్వవాదపు మూలవిశ్వాసాన్ని ఇలా సూత్రీకరిస్తాడు.
పుట్టిందీ, పెరిగిందీ సనాతన సంప్రదాయ యఙ్ఞ యాగాదులు చేసుకునే కుటుంబంలోనే అయినా, అభ్యుదయ భావాలతో జీవించి అనేక ఉద్యమాల్లో పాల్గొని, ఆ జీవిత సారాంశాన్ని అందిస్తున్నట్లుగా అనేక నవలలు రాసిన రచయిత మహీధర రామ మోహనరావు.
పూర్తిగా చదవండి »
గుప్పెడు మట్టిని కలగంటున్నాను
పెద్దగా కలలుకనే వాడిని కాకపోయినా
పెద్ద పెద్ద కలలు నా దరికి చేరకపోయినా
బంగారంలాంటి గుప్పెడు మట్టిని కలగంటున్నాను
పూర్తిగా చదవండి »
అదిష్టాన దేవత అమ్మా పోలేరమ్మా
ఇకనైనా చెప్పవమ్మా అమాయకులు బలినీకా
ఇంకెందరు కావలెనో విడమరిచి చెప్పుతల్లి
కారెనుక కారు బెట్టి ఏ కారులున్నవు బిడ్డో
పూర్తిగా చదవండి »
చెక్కిలి మీది కన్నీటి చుక్క
సముద్రమంత లోతు
అగాధాన్ని కొలవాలంటే
గుండెలోతుల్లోకి మునకెయ్యాల్సిందే
పూర్తిగా చదవండి »
మునిమబ్బులలేసే
తొలి కోడి లెక్క
అడివిల తిరుగాడే
మినుగురు లెక్క
పూర్తిగా చదవండి »
సరిహద్దులు దాటిన ప్రాణానికి
ఇక ఏ గ్యారెంటీ లేదు.
అకాల మరణాల వసంతంలో
ఆయువొక సుడిగాలి దీపం.
పూర్తిగా చదవండి »
రాత్రి
రాజుకునే భావాలను కప్పుకుంటూ
తోడు కోల్పోయిన ఒంటరితనం నైటీ ధరించి
నిద్రను అన్వేషిస్తుందామె
పూర్తిగా చదవండి »
మమ్మీ … ఆ కీచుబోయిన గొంతుకు ఎప్పుడూ ఉలిక్కి పడుతూనే వుంటాను. వాషింగ మిషన్ లో వేస్తున్న బట్టలను ఆపి వెనక్కి తిరిగి చూశాను. పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళను చటుక్కన వాటేసుకుంది మా ఐదేళ్ళ సాహితి ….. దానిని మేము ముద్దుగా స్వీటీ అంటాం.
పూర్తిగా చదవండి »
కురుడా, హెస్సాది గ్రామాలకి వుత్తరాన వున్న భూమంతా ఎత్తు పల్లాలతో, ఎండినెరియలు పడివున్న మెరక భూమి. వర్షం కురిసినా కూడా ఆ నేలమీద గడ్డి మొలవదు. అక్కడక్కడ గుబురుగా పెరిగిన బ్రహ్మజెముడు మెక్కలు పొడవడానికి సిద్ధంగా వున్నట్టు కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి »
- Next »