పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఒక పంచాయతీ సమితి కేంద్రం లాల్ ఘడ్ లో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మామూలుగానే మన ప్రచార సాధనాలకు సుదీర్ఘకాలంలో, మెల్లమెల్లగా సాగే ప్రజాజీవనక్రమాలను గుర్తించే అలవాటు ఉండదు. నాటకీయమైన, తక్షణ, సంచలనాత్మక సంఘటనలను మాత్రమే గుర్తించే అలవాటు ఉంటుంది. పూర్తిగా చదవండి »
జులై, 2009 సంచిక
కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ ల శతజయంతుల సందర్భంగా DTLC తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుల గురించి ఇంతకు ముందు ప్రకటనలో తెలియజేశాం. ఈ ప్రత్యేక సాహితీ సదస్సులకు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పూర్తిగా చదవండి »
కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు-ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులు
ఏ భాషలోనైనా తమ తమ రచనలతో తమకొక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. తెలుగు భాష చేసుకున్న అదృష్టమేమోగాని తెలుగు సాహిత్యంలో విశేషంగా కొనియాడదగ్గ అసమాన ప్రతిభావంతులు ముగ్గురు కొద్ది నెలల తేడాలో వంద సంవత్సరాల క్రితం పుట్టారు. వారే కొడవటిగంటి కుటుంబరావు (కొకు), శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), త్రిపురనేని గోపీచంద్.
‘ బెంగాల్‌కు తగినన్ని కేంద్ర పోలీసు బలగాలను పంపించాం, వాళ్లను నిర్దిష్టమైన పనులలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ‘ అని కేంద్ర హోంమంత్రి చిదంబరం చిద్విలాసంగా సామంతుల కోర్టులోకి బంతిని తోసాడు.
పూర్తిగా చదవండి »
స్వాత్రంత్యానంతరం ఏర్పడిన అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ దీనిని అభివర్ణించడం గమనార్హం. ఇటువంటి సవాలుకు బల ప్రయోగంతో కాకుండా, హింసకు హింసతో సమాధానం చెప్పడం ద్వారా కాకుండా సరైన విధానాలతో అక్కడి ప్రజలను వారి పట్టు నుంచి బయటకు తేవడానికి గట్టి ప్రయత్నం చేయాలి.
పూర్తిగా చదవండి »
నేటి వరంగల్ జిల్లా కడివెండి గ్రామం లో 1946 జులై 4న దేశ్‌ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వం పొంది నేటికి 63 సంవత్సరాలు గడిచింది. ఈ కాల్పుల్లో గాయపడ్డ కొమురయ్య తమ్ముడు మల్లయ్యతోపాటు, తెలుగు ప్రజల గుండెలన్నీ భగ్గునమండాయి. పూర్తిగా చదవండి »