మీకేం మీరేమైనా తీర్పులు చెప్పగలరు
మీరు గెలిచిన రాజపక్షే
నేను చంపినా లొంగని ఈలం పక్షం
అయినా నేను తీర్పులు చెప్పడానికి రాలేదు
ఓడిపోలేదని చెప్పడానికి వచ్చాను
రాజపక్షాలు యుద్ధాలు గెలవొచ్చు
ప్రజల్ని గెలవలేవు
గాయపడిన ప్రజా హృదయాల్ని
ససేమిరా గెలవలేవు
ప్రభాకరన్ చచ్చిపోవచ్చు
అతని కొడుకూ చచ్చిపోవచ్చు
ఎన్నికల ప్రజాస్వామ్యానికి కదా
కుటుంబ పాలన అవసరం
ఈలం ఏర్పడడానికి
జాతి బతికి ఉంటే చాలు
జాఫ్నా బతికి ఉంటే చాలు
అక్కడి గాలీ నేలా నీళ్లూ
బతికుంటే చాలు
నెత్తురోడుతూ
గాయాలు తడుముకుంటూ
కన్నీళ్లు తుడుచుకుంటూ
కలలు కంటూ
తమ దేశంలోనే
నిర్వాసితులుగానైనా సరే
ప్రవాసంలోనైనా సరే
ప్రజలు బతికుంటే చాలు
జాతి ఆకాంక్ష బతికున్నా చాలు
- వరవరరావు
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 30 మే 2009
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
అతడు లేడు
——–
రాత్రి
రాజుకునే భావాలను కప్పుకుంటూ
తోడు కోల్ఫోయిన
ఓంటరితనం నై టీ ధరించి
నిద్ర నన్వేషిస్తుందామె
అలవాటుగా
పాకే చేతి స్పర్శ
పొరపాటుగా నైనా
ఆమె గుండెలపై చలించదు
పిరుదుల్ని స్ప్రుశించదు
ఇప్పుడిక
కన్నీటి కయ్యలు
ఆ గదిలొ
నిశ్సబ్దంగా
వూయల లూగుతాయి
జరిగిన దారుణానికి
విలపిస్తూ
వుత్తరాలు
నిరాసక్తత వల్లనో
వొంటరి పేదరికం వల్లనో
జాలి లేని జవాబుగా
పడి వుంటాయి
జారిపోయిన
గత జీవితపు
స్వాప్నిక శకలాల్ని
క్రింది పెదవితో కొరుకుతూ
తానే ముక్కలై పోతుందామె
- కమలా దాస్ “న్యూ విడోస్” కు స్వెశ్చానువాదం
టి.వి.ఎస్. రామానుజ రావు.