ఫాక్షన్లకు అంతం ఎప్పుడు?
వై ఎస్ మాటలను కేవలం మొదటి విడత పోలింగ్‌లో కోల్పోయిన వోట్లను రెండవ విడతలో పొందడం కోసం వేసిన ఎత్తుగడగా అర్థం చేసుకుంటే సరిపోదు. గడచిన అయిదు సంవత్సరాలలో అతను రాష్ట్ర రాజకీయాలకు అలవాటు చేసిన ఫాక్షనిస్ట్ సంస్కృతికి పరాకాష్ఠగా అర్థం చేసుకోవడం అవసరం. ఆయనపైన ఎట్టకేలకు కోపగించిన ఇతర కాంగ్రెస్ నాయకులు, రేపు తమ పార్టీయే రాష్ట్రంలో అధికారానికొచ్చినా ఫాక్షన్ సంస్కృతిని కొనసాగనీయమని ఒట్టు బెట్టి చెప్తారా?
ఒక వారం దినాలుగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి ‘మహాకూటమి’ గెలిస్తే రాయలసీమకూ కోస్తాంధ్రకూ నీళ్లిచ్చే ప్రాజెక్టులు నిలిచిపోతాయనీ ఆ ప్రాంతాలవారు హైదరాబాద్‌లో మనుగడ సాగించలేరనీ ఇప్పటికే వారినక్కడ పరాయివారిగా ఎంచి దాడులు చేస్తున్నారనీ రెండవ విడత ఎన్నికలు జరగవలసి ఉన్న ప్రాంతాలలో ఉపన్యసిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం చాలా న్యాయంగానే వ్యతిరేకతకూ విమర్శకూ దారి తీసింది.ద్వేషం రెచ్చగొట్టడంలోని అనౌచిత్యాన్ని అటుంచి ఈ వ్యాఖ్యలు అబద్ధాలు కూడ.
హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణ మారుమూల ప్రాంతాలలో సహితం బయటివారు క్షేమంగా వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు. 1969 మాటేమోగానీ ప్రస్తుత తెలంగాణ ఉద్యమమంతటి సౌమ్యమయిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని దేశం ఇప్పటిదాకా చూసి ఉండదు. ఆ సౌమ్యత వల్లనే నష్టపోయామన్న భావన తెలంగాణ వాదులను ఒక పక్క బాధపెడుతుండగా అది లేదని అనడం పుండుమీద కారం జల్లడమే.
రాజశేఖరరెడ్డి అధికారానికి రాకముందు తెలంగాణలో కాంట్రాక్టులూ వ్యాపారాలూ చేసుకుంటున్న బయటివారు ఎక్కువగా కోస్తా జిల్లాలవారే కాగా గత అయిదేళ్ళలో రాయలసీమకు, ప్రత్యేకించి కడప జిల్లాకు చెందిన రెడ్లు పెద్ద సంఖ్యలో ప్రవేశించారు. హైదరాబాద్ సమీపంలోని రోడ్డు పనులే కాదు, ఆదిలాబాద్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ కాం ట్రాక్టులు సహితం వారి చేతులలోకి పోయాయి. మామూలు గా బయటినుంచి వచ్చిన కాంట్రాక్టరు ఏ జిల్లా వాడు అని తెలుసుకునే అవసరంగానీ సందర్భంగానీ ఉండదుగానీ, దేనినీ ఖాతరు చేయని కొత్త కాంట్రాక్టర్ల నడవడిక స్థానికుల లో ఆ కుతూహలాన్ని కలుగజేసింది.
సివిల్ కాంట్రాక్టర్లూ వ్యాపారస్తులూ చట్టాన్ని గౌరవించకపోవడం మామూలు విషయమే కావచ్చును గానీ సాధారణంగా చట్టాన్ని కాకుం టే కార్మిక సంఘాలనో అదికాకుంటే మీడియానో అది కాకుం టే ప్రజాసంఘాలనో అదీకాకుంటే నిజాయితీ గల అధికారులనో ఎవరినో ఒకరిని కొంతయినా గౌరవిస్తారు. ఎవరినీ దేని నీ ఖాతరు చేయని ఈ కొత్త జాతిని రాయలసీమ కాంట్రాక్ట ర్లు వచ్చిన తరువాతే తెలంగాణ వాసులు చూశారు. ఒక ప్రాంతం మీదే ఇటువంటి విమర్శ పెట్టడం అన్యాయం అని రాయలసీమకు చెందిన మిత్రులు అనేటట్టయితే దీనికీ చారిత్రక కారణాలున్నాయనడం తప్ప ప్రస్తుతానికి అంతకంటే ఎక్కువ వివరణ అనవసరం. ఇక ప్రాజెక్టుల మాటకొస్తే, పోలవరాన్ని గానీ పులిచింతల ను గానీ తెలుగుదేశం పార్టీ ఏ రోజూ వ్యతిరేకించలేదు.
సిపిఎం పోలవరం ఎత్తును తగ్గించాలని కొంతకాలం అనింది గానీ ఎంత తగ్గించాలో ఏ రోజూ చెప్పలేదు. కాబట్టి వారి డిమాండ్ వల్ల ఫలానా వారికి నష్టం అని చెప్పజాలము. అయినా ఆ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగిపోతున్నప్పటికీ సిపిఎం ఖమ్మం జిల్లాలో తనకున్న ప్రజాబలాన్ని వినియోగించి అడ్డుకునే ప్రయత్నం ఏ రోజూ చేయలేదు. అలాగే పులిచింతలను సిపిఎం తెలుగుదేశం పార్టీలాగే ఎన్నడూ వ్యతిరేకించలేదు. పులిచింతల కేవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని దానిని సమర్థించేవారు దబాయిస్తున్నప్పటికీ దానికి 9 టిఎంసిల నికర జలాల కేటాయింపు ఉంది. అప్పుడెప్పుడో కాలవల ఆధునీకరణ వల్ల ఆదా అయిన నీళ్లంటూ మూడు ప్రాంతాలకూ మూడు కేటాయింపులు (భీమాకు 20, శ్రీశైలం కుడిగట్టు కాలవకు 19, పులిచింతలకు 9 టిఎంసిలు) చేశా రు.
అప్పుడు ఏ కారణంగా చేసినా, ప్రాధాన్యతల దృష్ట్యా ఆ 9 టిఎంసిలను ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు బదలాయిస్తే మునుగోడు, నారాయణపురం, చౌటుప్పల్ మండలాల ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు ఆ మేరకయి నా నికర జలాలు లభించేవన్న న్యాయమైన వాదన సహితం ఈ రెండు పార్టీలకూ రుచించలేదు. ఇప్పుడు రాజశేఖరరెడ్డి వారికి అనవసరమైన ప్రతిష్ఠ తెచ్చిపెట్టాడు. తెరాస మాటకొస్తే, ఆ పార్టీ పోలవరాన్నీ పులిచింతలనూ వ్యతిరేకించిన మాట వాస్తవమే గానీ పుణ్యకాలం గడిచిపో యే దాకా కాంగ్రెస్‌తో స్నేహ సంబంధాలున్న కారణంగానో ఏమో ఈ వ్యతిరేకత కాగితాలకే పరిమితం అయింది. ఆ తరువాత కూడ వోట్ల సోదరులను వెతుక్కోవడంలో వారి కాలం గడిచిపోయింది. తనకున్న బలాన్ని వాడుకుని ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునే ప్రజాందోళనేదీ తెరాస నిర్మించే ప్రయత్నం చేయలేదు. ఆ రెండు ప్రాజెక్టులను అడ్డుకోవడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని తెరాస ముఖ్యులు నాలుగేళ్ళ కిందటే వ్యక్తం చేశారు.
పోలవరం కింద భారీగా ముంపుకు గురయ్యేవి ఆదివాసీ గ్రామాలు కాక మైదాన ప్రాంత గ్రామాలయి ఉంటే తెరాస ఇంతే ఉదాసీనంగా వ్యవహరించి ఉండేదా అని ఖమ్మం జిల్లా ఆదివాసులు ఏ రోజయి నా ప్రశ్నిస్తే చంద్రశేఖరరావు ఏం జవాబు చెప్తారో? అయితే రాజశేఖరరెడ్డి మాటలను కేవలం మొదటి విడత పోలింగ్‌లో కోల్పోయిన వోట్లను రెండవ విడతలో పొందడం కోసం వేసిన ఎత్తుగడగా అర్థం చేసుకుంటే సరిపోదు. గడచిన అయిదు సంవత్సరాలలో అతను రాష్ట్ర రాజకీయాలకు అలవాటు చేసిన ఫాక్షనిస్ట్ సంస్కృతికి పరాకాష్ఠగా అర్థం చేసుకోవడం అవసరం. అప్పుడు రాబోయే అయిదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం ముందు ఉన్న ఒక ముఖ్య కర్తవ్యం అవగతం అవుతుంది. రాష్ట్ర రాజకీయ వ్యవస్థకూ పాలనా వ్యవస్థకూ అంటుకున్న ముఠా సంస్కృతిని కడిగేయడం అవసరం. ఇది కాంగ్రెస్ ఓడిపోయినా కూడ దానంతటది జరిగిపోదు.
తెలుగుదేశం పార్టీలో ఫాక్షనిస్టులకు ఏ రోజూ కొదువ లేదు. కాగా, కొత్తగా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ కర్నూలు జిల్లాలో తనను తాను భూమా నాగిరెడ్డికి తాకట్టు పెట్టుకున్న సంగతి ఆ జిల్లాలో అందరూ ఎరుగుదురు. ఫాక్షనిజం అంటే బాంబులు, హత్యలు మాత్రమే కాదు. అందులో అంతకంటే నష్టకరమైన గుణాలున్నాయి. స్వప్రయోజనం, తన గుంపు ప్రయోజనం తప్ప వేరే ఏ నీతీ ఏ నియమ మూ ఏ విలువలూ లేకపోవడం ఒకటి. భయాన్ని ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికే కాదు, తన ముఠాను తనతోనే ఉండేలాగా కట్టడి చేసుకోవడానికి కూడ వాడుకోవడం మరొకటి. ‘నా నుండి దూరమయితే వాడు నిన్ను చంపేస్తాడు, నాతోనే ఉండు’ అంటూ ఫాక్షనిస్టు తనవారిని హెచ్చరిస్తుంటాడు. కృష్ణానది మిగులు జలాల విషయంలో రాజశేఖర రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఈ అయిదేళ్ళలో రాష్ట్రంలో నెలకొన్న ఫాక్షన్ రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.
ఆ మిగులు జలాల పైన ఎనిమిది ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్‌కు రెండు (కల్వకుర్తి, నెట్టెంపాడు), నల్లగొండకు రెండు (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, ఎస్ఎల్‌బిసి), కర్నూలుకు కడప కూ నెల్లూరుకూ కలిపి ఒకటి (తెలుగు గంగ), కడపకు (బహుశా చిత్తూరుకు కూడ) ఒకటి (గండికోట లేక గాలేరు-నగరి), కర్నూలుకు, అనంతపురానికి (బహుశా చిత్తూరుకు కూడ) కలిపి ఒకటి (హంద్రీ-నీవా), ప్రకాశం జిల్లా గిద్దలూ రు ప్రాంతానికి ఒకటి (వెలుగొండ). కృష్ణానది మిగులు జలా లు మొత్తం తెలంగాణకే చెందుతాయనీ రాయలసీమకూ ప్రకాశం జిల్లాకూ ఇవ్వడానికి వీలులేదనీ తెలంగాణవాదుల వాదన. తెరాసయేకాదు, ప్రజాతంత్ర తెలంగాణ కోరుకునే వారి అభిప్రాయం కూడ ఇదే. అయితే ఇవన్నీ వర్షాభావ ప్రాంతాలే కాబట్టి పెన్నా బేసిన్‌లో నీళ్ళు మృగ్యం కాబట్టి, అందరూ పంచుకోవడమే ఉచితం అనే సమంజసమైన వాదన అవతలి వైపు నుంచి చేయవచ్చు.
ఒప్పించే ప్రయత్నమూ చేయవచ్చు. కృష్ణా డెల్టాకు ఇచ్చిన నికర జలాల కేటాయింపులో 80 టిఎంసిలు తగ్గించి, మొత్తంగా కృష్ణానదీ ప్రాజెక్టుల డిపెండబిలిటీని 75 నుంచి 60కి తగ్గిస్తే ఈ 8 ప్రాజెక్టులకూ నికర జలాలు కేటాయింపు చేయవచ్చు (గోదా వరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించడం చాలా రకాలుగా సమస్యాత్మకం). కానీ రాజశేఖరరెడ్డికి అది రుచించదు. న్యాయబద్ధమైన ఏర్పాట్లు ఫాక్షనిస్టు బలాన్ని పెంచవు. ‘నేను అధికారంలో ఉన్నాను కాబట్టి రాయలసీమకు కృష్ణాజలాలు ఇచ్చి తీరుతాను’ అంటాడు. దీనితో ఎదుటివారు కూడ మరింత మొండిగా తయారవుతారు. ఇప్పుడు రాష్ట్రంలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు రాయలసీమకు ఫాక్షన్ కొట్లాట మొదలయింది.
దానివల్ల రాజశేఖరరెడ్డికి వచ్చిన ఒక ప్రయోజనం, రెండవ కృష్ణా ట్రిబ్యునల్ ముందుకుపోయి ఈ 8 ప్రాజెక్టులకూ నీటి హక్కులు అడగము అని చెప్పి వెనక్కి ధైర్యంగా రాగలిగాడు. ప్రజలను చీల్చితే ఉమ్మ డి ప్రయోజనాల గురించి అడగరు అనేది ఫాక్షనిజంలో మొదటి పాఠం. రెండవ ప్రయోజనం, ‘రాయలసీమకు నీళ్ళిస్తున్నాను’ అనే పేరు మీద అతను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుదల ద్వారా చేసుకున్న అదనపు ఏర్పాటు పులివెందులకూ దాని పరిసరాలకూ నీళ్ళిచ్చే గండికోట ప్రాజెక్టుకూ మాత్రమే ఉపయోగపడుతుందని రాయలసీమలోని ఇతర ప్రాంతాల ప్రజలు సహితం అనకపోవడం. మన ముఠా నాయకుడిని మనమే ప్రశ్నిస్తే ఎదుటి ముఠా బలపడుతుందన్న భయంతో ప్రజలు దేనినీ ప్రశ్నించరనేది రెండవ పాఠం. రాజశేఖర రెడ్డి పైన ఎట్టకేలకు కోపగించిన ఇతర కాంగ్రెస్ నాయకులు, రేపు తమ పార్టీయే రాష్ట్రంలో అధికారానికొచ్చి నా ఫాక్షన్ సంస్కృతిని కొనసాగనీయమని ఒట్టు బెట్టి చెప్తారా?
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 23 ఏఫ్రిలు 2009

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
బూటకపు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటే ఫాక్షన్లు అంతం కావు. రష్యాలో ప్రోలెటేరియన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ఏడాదిలో వందల మంది భూస్వాముల్ని ఉరి తీశారని చదివాను. ఇక్కడ కూడా కార్మిక విప్లవం వస్తే భూస్వామ్య మూలాలు కలిగిన ఫాక్షనిజం నామరూపాలు లేకుండా పోతుంది.
ఇటివలి తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పటినుండి రాయలసీమ ఉద్యమకారులు పదే పదే ఒక విషయం చెప్తూ వచ్చారు/ఒక డిమాండ్ చేస్తూ వచ్చారు.తెలంగాణను వేరుచేస్తే (రాష్ట్రంగా ఇచ్చేస్తే) మాది /రాయలసీమ కూడా రాష్ట్రంగా చెయ్యాల్సిందే , అని ఒకసారి, తెలంగాణవాళ్ళతో ఒక రాష్ట్రంగా ఉండడానికి మాకు అంగీకారమే అని మరోసారి చెప్తూవచ్చారు.వీటి ఆంతర్యమేమంటే తెలంగాణా వాళ్లు అమాయకులు మేం ఏంచేసినా ఎదిరించరు,ప్రశ్నించరు,అడ్డుకోరు ,కనుక తమ ఈరెంటిని కలిపి రాష్ట్రంగా ఏర్పరచినా తమ అధికారానికి ,దోపిడికి ,అడ్డుండదు అని .
కాని ఈ ఐదేళ్ళలో తెలంగాణా వాళ్ల అనుభవం ఏంచెప్తున్నదంటే ఈ సీమ పాలకుల పాలనే మళ్ళీ ఏకారణంగా వచ్చినా తెలంగాణ కరి మింగిన వెలగ పండే ఔతుందని.కనుక సీమ-ఆంధ్రల ప్రాంతాలను ఏదో రకంగా ముందు వదిలించుకొని ఒక రాష్ట్రంగా ఏర్పాటైతే పోయినవి పోంగ మిగిలినవన్నా దక్కించుకోవచ్చని. అందుకే ముందు భౌగోళిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనీస రక్షణ తెలంగాణకు కలుగుతుందని అత్యధిక తెలంగాణవాదులు అనుకుంటున్నారు.దేన్నీ ఖాతరు చెయ్యని సీమ కాంట్రాక్టర్ల బలిమి పోవాలంటే కూడా తెలంగాణ ఏర్పడాల్సిందేనని కూడా అనుకుంటున్నారు, అందులో తెలంగాణ కాంట్రాక్టర్లు కూడా ఉండొచ్చు.