ఏప్రిల్, 2009 సంచిక

వై.ఎస్ ‘మనవాళ్లు’ ఎవరు                - వరవరరావు  .
పూర్తిగా చదవండి »

హక్కులు అందరికీ సమానమే!

జంతువులు, పక్షుల సంఖ్య వేగంగా తరిగి పోవడం తీవ్ర విషయంగా పరిగణిస్తున్నాం. కొన్ని జంతుజాతులు విలుప్తమయ్యాయి. కొన్ని కాబోతున్నాయి. మనం క్రూర జంతువులుగా భావించే పులులు, సింహాలు వగైరా మాంసాహార జంతుజాతులు వృద్ధాప్యంలో వేటాడలేక నరమాంస భక్షణ చేస్తాయి. పూర్తిగా చదవండి »

ప్రజా భాగస్వామ్యమే సామాజిక న్యాయం

-ప్రొ. జి.హరగోపాల్

సామాజిక న్యాయంలో మూడు అంశాలు కీలకమైనవి. ఒకటి, ప్రజలకు న్యాయాన్ని పొందే హక్కు ఉండాలి దాన్ని సాధించడానికి పోరాడే స్వేచ్ఛ ఉండాలి; రెండు, సంపద అందరికీ చెందే దిశలో మార్పులు రావాలి; మూడు, ఈ లక్ష్యాలు ప్రపంచీకరణ చట్రంలో సాధ్యం కావు. పూర్తిగా చదవండి »

ఫాక్షన్లకు అంతం ఎప్పుడు?

-కె. బాలగోపాల్

వై ఎస్ మాటలను కేవలం మొదటి విడత పోలింగ్‌లో కోల్పోయిన వోట్లను రెండవ విడతలో పొందడం కోసం వేసిన ఎత్తుగడగా అర్థం చేసుకుంటే సరిపోదు. గడచిన అయిదు సంవత్సరాలలో అతను రాష్ట్ర రాజకీయాలకు అలవాటు చేసిన ఫాక్షనిస్ట్ సంస్క­ృతికి పరాకాష్ఠగా అర్థం చేసుకోవడం అవసరం. ఆయనపైన ఎట్టకేలకు కోపగించిన ఇతర కాంగ్రెస్ నాయకులు, రేపు తమ పార్టీయే రాష్ట్రంలో అధికారానికొచ్చినా ఫాక్షన్ సంస్క­ృతిని కొనసాగనీయమని ఒట్టు బెట్టి చెప్తారా?
పూర్తిగా చదవండి »

ఓటమెవరిది?

-అల్లం నారాయణ

ఏం చేయగలరు వీళ్లు.. వెంటనే రెండువేల నగదు, వంద వంటసరుకు, ఇంటికి కలర్ టీవీ, పెన్షన్లు వచ్చేస్తాయనుకున్నా మీ అంత అమాయకులుండబోరు. అధవా వచ్చినా.. జలయజ్ఞంలో ధనయజ్ఞం ఆగేనా? భూముల అమ్మకం ఆగేనా? విద్య అందేనా? వైద్యం అందేనా? మీ కాళ్ల కింద నేల కదలకుండా నిలిచేనా?
పూర్తిగా చదవండి »

- సాంబయ్య గుండిమెడ

మాదిగ దండోరా భారతీయ సామాజిక ఉద్యమాల్లో ఒక మార్పు.  సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సైద్ధాంతిక విషయాల్లో అది తెచ్చిన మార్పు గణనీయం. కొందరి ద్వారా తిట్టు పదంగా వాడబడే మాదిగ అనే పదాన్ని వాళ్ళు రావు, రెడ్డి, శాస్త్రి, శర్మ లాగా గౌరవ వాచకంగా మార్చారు, విలువలు మార్చబడ్డాయి, మాదిగ భాష మానవీయమైంది. మాదిగ సాహిత్యం ఉధృతమై పాట, ప్రసంగం, వ్యాసం, కథ, నవల ప్రక్రియలన్నిటిలో విస్తరించింది. మాదిగ దండోరా శ్రామిక కుల సంఘాలలో కొత్త చైతన్యాన్ని తెచ్చింది.
—  బి. యస్. రాములు

పూర్తిగా చదవండి »

పాటను వేటాడిన పాలకులు

ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి కాగల ప్రజల పాటలపై ఎన్నో కుట్రలు జరిగాయి. కళాకారులను విడదీయడం, వాళ్ళ అర్థిక పరిస్థితులను వాడుకోవడం, ప్రజల పాట-మాట-ఆట, యాస, జాస, డప్పు, దరువు, వాళ్ళ వేషం అన్నింటిని దొంగిలించారు. గద్దర్ పాటను అరెస్టు చేసే మహాకుట్ర జరిగింది. ఎన్నికల కోడ్ అనే బూచిని చూపి భావ ప్రకటన స్వేచ్ఛకు ఘోరీ కట్టడానికి ఐదేండ్లుగా కుట్ర కేసులను దాచిపెట్టి తుపాకులు, బేడీలతో గద్దర్ ఇంటిని చుట్టుముట్టారు. పూర్తిగా చదవండి »