పీయూసీఎల్ ( పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్ట్సీ) జాతీయ అధ్యక్షుడు కన్నబీరన్ తో ఒక చిన్న ఇంటర్వూ:

ప్రశ్న: ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో పౌరహక్కుల పరిరక్షణ ఎలా ఉంది?
కన్నబీరన్: పౌరహక్కుల ఉల్లంఘనలో అన్ని దేశాల ప్రభుత్వాలు ఒకటే. కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య దేశాలన్న భేదం లేదు. అందరిదీ ఒకేరకమైన హింస. రాజ్యహింస ద్వారా తప్పు చేసి తప్పించు కోవడంలో పాలకులందరిదీ ఒకటే విధానం. దీన్నే ఆంగ్లంలో ‘ఇంప్యునిటి’ అంటారు. తెలుగులో ఖచ్చితమైన పదం లేదు. కాకుంటే అమెరికా వంటి అగ్రరాజ్య అకృత్యాలతో పోలిస్తే కమ్యూనిస్టు దేశాలు కాస్త మేలు.

ప్రశ్న: కొత్త రాజకీయ పార్టీల రాకతో సమాజంలో మార్పు వస్తుందంటారా?
కన్నబీరన్: 56 ఏళ్ల ఉద్యమ అనుభవంతో చెబుతున్నాను. ఎవరొచ్చినా సమాజం మారదు. చివరకు కొత్తగా చిరంజీవి అధికారంలోకి వచ్చినా పేదల బతుకు మారదు.

ప్రశ్న: చిరంజీవి ప్రజారాజ్యంపై మీ అభిప్రాయం?
కన్నబీరన్: ముస్సోలిని బ్రౌన్ షర్ట్ వాలంటీర్లకు, చిరంజీవి అభిమానులకు పెద్ద తేడాలేదు. ఆయనకు రాజకీయ నేపథ్యంలేదు. తెలుగు సినిమాలో ఒక్కడే 20 మందితో ఫైటింగ్ చేసిన నేపథ్యం. అలాంటి వ్యక్తికి వాస్తవ జీవితంలో సామూహికంగా ఒక సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఎలా ఉంటుంది? ప్రజారాజ్యం పార్టీలో పోలీసులే ఎక్కువగా చేరుతున్నారు. ఇప్పటికే వీరనారాయణరెడ్డి, ఆంజనేయరెడ్డి లాంటి పోలీసు అధికారులు చేరారు. రేపు మరికొంత మంది చేరవచ్చు. వీరిదంతా ప్రజా ఉద్యమాలను అణిచివేసి, మానవ హక్కులను ఉల్లంఘించిన చరిత్రే. ప్రజాసేవ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. వీరంతా అధికారంలోకి వచ్చి పేదలను ఉద్దరిస్తారనుకోవటం అత్యాశే.

ప్రశ్న: ఎన్టీఆర్ తనకు ఆదర్శమంటున్న చిరంజీవిని ప్రజలు ఆయన లాగే ఆదరించే అవకాశం ఉందా?
కన్నబీరన్: రామారావు తెలుగు పౌరాణిక చిత్రాలలో రాముడు, కృష్ణుడు తదితర దేవుళ్ల పాత్ర పోషించారు. ఈ పాత్రలు సామాన్య జనం గుండె లోతుల్లోకి వెళ్లాయి. ఫలితంగా ప్రజలు ఆయనను దేవునిగా చూశారు. చిరంజీవి పోషించిన పాత్రలు వేరు … ఇవి సామాన్య జనం మనసును చూరగొనలేదు.

ప్రశ్న: ఐపీఎస్ లపై మీకు సదభిప్రాయం లేదా?
కన్నబీరన్: నా అభిప్రాయం కాదు. చరిత్రను చూడండి. అన్ని పార్టీలలో వీరు చేరిపోతున్నారు. తెలుగుదేశంలో విజయరామారావు, పేర్వారం రాములు, కాంగెసులో రంగయ్యనాయుడు, టీ.ఆర్.ఎస్ లో పోరెడ్డి చంద్రశేఖరెడ్డి. వీళ్ళ జీవితాల్లోకి చూడండి. ప్రజా ఉద్యమాల అణచివేత చరిత్ర మినహా ఏ ప్రజాసేవ చేసి రాజకీయంలోకి వచ్చారు?

సౌజన్యం: సిటీ బ్యూరో న్యూస్ లైన్
తేదీ: సెప్టెంబరు 1,2008

11 అభిప్రాయాలు

  1. sankar 10 సెప్టెంబర్ 2008 , 5:48 am

    అయ్యా
    మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ సర్వీసులో ఏమి చేయగలిగారు.
    మనదేశంలో ఆర్థిక సంస్కరణలుంటాయిగాని రాజకీయ సంస్కరణలు ఉండవు. మనకు ముందు రాజకీయ మార్పులు అవసరం. ఆయన సినిమాల్లో ఇరవైమందినికొట్టి మన మొరటు రాజకీయాల్లో ఒక్కడూ తట్టుకోలేకపోవచ్చు. ఆయన చేయగలిగిన కొంతైనా మంచిని (రక్తదానం, నేత్రదానం వంటివి) మీరు చేయగలిగారా. రాజకీయాల్లోకి ఇంకెవరూ రాకూడదన్నట్లుగా ఉన్నది మీ వాదన. ఉన్న పనికిమాలిన పార్టీలనే చూపెట్టి ఈ వ్యవస్థ వ్యర్థం అనిచెప్పబూనడం మీ ఉద్దేశ్యం కావచ్చు. రాజకీయ బూతులకు, పనికి మాలిన ముసలితొత్తులకు (రోశయ్య, మారెప్ప)అతీతంగా మనకి కొత్తగాలి కావాలి. ఎవరైనా కావచ్చు. లోక్ సత్తా కావచ్చు..లేక ప్రజారాజ్యం కావచ్చు.. ఈవ్యవస్థని ఎటుతిరిగి మార్చలేం…కానీ ఉన్నంతలో కాస్త సభ్యతగల నాయకులు వస్తే తప్పేమిటి?

  2. pullayana 10 సెప్టెంబర్ 2008 , 11:00 am

    నేను శంకర్ గారితో పూర్తిగా ఏకీభవిస్తాను.

  3. satya 10 సెప్టెంబర్ 2008 , 1:07 pm

    నొ , నేను శంకర్ గారితో ఏకీభవించ ము.(ఆయన చేయగలిగిన కొంతైనా మంచిని (రక్తదానం, నేత్రదానం వంటివి) మీరు చేయగలిగారా).నెను ఇప్పుడు చెస్తానని చెప్పడం లెదు. నా దగ్గర అంత డబ్బు లెదు. ఉన్నా నెను బడి, హొస్పితల,కొందరి కి ఇల్లు ల్లాంటి వి చెశుందె వాడిన్ణి.

  4. నవీన్ గార్ల 11 సెప్టెంబర్ 2008 , 11:12 am

    >>వీరంతా అధికారంలోకి వచ్చి పేదలను ఉద్దరిస్తారనుకోవటం అత్యాశే.>ఈ పాత్రలు సామాన్య జనం గుండె లోతుల్లోకి వెళ్లాయి. ఫలితంగా ప్రజలు ఆయనను దేవునిగా చూశారు.

  5. Praveen 13 సెప్టెంబర్ 2008 , 11:59 am

    “56 ఏళ్ల ఉద్యమ అనుభవంతో చెబుతున్నాను. ఎవరొచ్చినా సమాజం మారదు. ”
    ఎందుకు సారు ఈ నిరాశావాదాన్ని ఇంకా ప్రచారం చేస్తారు?మార్పు మానవ సహజం కదా! మార్పు కోరటం తప్పెట్లయితది?

  6. praja chithanyam 22 సెప్టెంబర్ 2008 , 2:03 pm

    అయ్య ప్రవిణ్ గారు మార్పు అంటె ఒక పార్టీ పొఇ ఇంకొ పార్టీ రావాడం కాదు రెడ్డి పొయీ కపు రావాడం అస్సలు కాదు అధి చాలా పెద్ద పదము. మార్పు ప్రజలా నుండి రావలి.

  7. manoj 24 సెప్టెంబర్ 2008 , 5:21 am

    మార్పు అంటే బ్రాహ్మణ మేథావులు చెప్పేదా.. ప్రజలు ఎప్పుడూ మార్పు ఆశిస్తూనే ఉన్నారు. ఒకసారి రెడ్ల కాంగ్రెసు లేక కమ్మ తెలుగుదేశం. ప్రతి ఎన్నికలకూ ప్రభుత్వాలు మారుతున్నాయి. కాకుంటే ఆరెండు పార్టీలు తప్ప మరొక మార్గంలేదు పాపం ప్రజలకు. వాళ్ళ అసంతౄప్తిని ఎలా వ్యక్తం చేస్తారు.. ఒక్క అధికారపార్టీని తప్పించడం తప్ప.

  8. Dr.P.M.Rao 24 సెప్టెంబర్ 2008 , 12:30 pm

    ఉభయకుశలోపరి!-నేను బీదవానిగా పుట్టా!!కష్టజీవిగా బతికా!!స్వయంకృషితో అభివృద్ధిలోకొచ్చాను! నా వాళ్ల నందరినీ పైకి తీసుకొచ్చాను.నాకలలు పండాయి..నా (మా)కడుపులు నిండాయి!యిక మీ కడుపులు నింపాలనుకుంటున్నాను.ఎవరికీ పుట్టుకతో రాజకీయాలు తెలీవు-ఏమీ చెయ్యలేని వారికే రాజకీయాలు-ఏవీ తెలీకుంటే గొప్ప నాయకుడు!!మీరందరూ-నా అభిమానులు లేరా నన్ను ఎదరకు నడపటానికి?నేను మీ సేవకుడిని?!?మీలో ఒకడిని-దరిద్రంలో పుట్టినందువల్ల దరిద్రమంటే ఏమిటో తెలుసును.కాలే కడుపంటే ఏమిటో తెలుసును-మీకు శాయశక్తులా సాయం చేస్తా!రాజ్యాంగ రచన చేసిన అంబేత్కరు గారు నాకు ఆదర్శం!మదరు థెరీసా అంటే నాకు ప్రేమ-ఆవిడ చల్లని చూపులు నాపై వున్నాయి.మీ అభిమానం -మాజీ రాష్ట్రపతి ఆశీశ్సులూ నాకున్నాయి-యింతకన్నా వేరే క్వాలిఫికేషన్సు నాకేలా?నాకు తోడుగా మాయింటిల్ల పాదీ మీకు సేవ చేసుకుంటారు ఇతోధికంగా!నాకూ ఓ అవకాశం ఇవ్వండి.అబ్బే! నేను డబ్బు గడించటానికి రావటల్లా-రాజకీయాల్లోకి.నాకు డబ్బు మీద ఆశలేదు-పదవీకాంక్ష లేదు-ఎవడో కథ రాశాడు.వేరెవడో డైలాగులు రాశాడు-మరొకడెవడో నాఖు డూబుగా నటించాడు ఫైట్సులో! ఫేసు నాది-ఇమేజి నాది-ఆ డైలాగులన్నీ చెప్పింది నేనే!నటనలో తప్పుంటే-డైరెక్టర్లు దిద్దుతారు.మేకప్ మాన్ మేకప్
    చేస్తాడు-ఫేసు నాదే!అమ్మాయిల పక్కన చేసే డాన్సులు చేసేది నేనే!డూపులని రానివ్వనక్కడ.ఏమండీ యింకా డౌటా?నేను మీకు సేవ చేయలేననుకుంటే..ఇక్కడ నాకింద నా చెప్పు చేతలల్లో పని చేసే అధికార్లుంటారు.వారికి చెప్పి అవినీతిపరులను శిక్షించి పనులు చేయిస్తాను.This is not one man Army!This is one family army-including you all-as my co-brothers and sisters.My fans requested me to handle the power and to ride them!So,I’m coming will ride the chariot.Certainly all will get food-cloth-house;what not? every thing you need!There will be no caste system-racism-no poor all will become like me crorepathis.Sure!!My doops might not have become rich-But,U will all become rich and will get education free and go to foreign countries-U can have helicopters and fly in the air!Be ready!(Clapse!!)

  9. praja chaithanyam 24 సెప్టెంబర్ 2008 , 2:47 pm

    manoj గారు మిరె చెప్పు తున్నది నిజమె కాకుంటే ఇప్పుదు 2 పొయీ 3 అవుథై
    .

  10. rao 26 సెప్టెంబర్ 2008 , 5:35 am

    …….. ఏదేదో మూసవిమర్శ చేస్తున్నారు. బహుశా ఈయనకూడా ద్విపార్టీల కార్యకర్త అయి ఉంటారు. ……….

    ——————————
    గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
    - ప్రజాకళ
    ——————————

  11. Praveen 27 సెప్టెంబర్ 2008 , 2:21 pm

    ప్రజా చైతన్యం గారు, అవును మార్పు ప్రజల నుండే రావాలె!ఆ ప్రజలకు నిస్వార్థపరుడు అయిన నాయకుడు కావాలె! ఇప్పుడు లేరా? అంటె, ఉన్నరు,గంజాయి వనంలో తులసి మొక్కలు. మనకు కావలిసింది మరిన్ని తులసి మొక్కలు! అంతే నా ఉద్ద్దేష్యం….వాడు చిరంజివో..రాజశేఖరో..అన్నది కాదు!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)