భూమికోసం
ఈ భూమి కోసమే చరిత్ర నెత్తురోడింది. ఈ భూమి కోసమే మహా యుద్ధాలు జరిగాయి. ఈ భూమి కోసమే భారత రైతాంగం విముక్తి పోరాటాలు నడుపు తున్నది. భూమి చుట్టూ బతుకున్నది. పోరాటమున్నది. చరిత్ర మరిచిపోతే ఇప్పటి ఏలికలనూ ఈ భూమి చుట్టుకునే అవకాశమూ ఉన్నది.
పూర్తిగా చదవండి »
తమ రాజకీయ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఆదివాసులు పనికొచ్చినప్పుడు వారి సహజమైన మిలిటెన్సీని హిందుత్వవాదులు చాలా క్రూరంగా వాడుకుంటున్నారు. గుజరాత్ మారణ కాండలో ఆదివాసీ ప్రాంతాలలో ఇది చూశాం. ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం రూపంలో చూశాం. ఇప్పుడు కంధమాల్‌లో చూస్తున్నాం.
పూర్తిగా చదవండి »
విమోచన అంటే చరిత్ర నవ్వదా?
- ఎన్. వేణుగోపాల్
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందని ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చ గొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం , భారతీయ జనతా పార్టీ ఈ కట్టు కథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ‘మా వైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టే’ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ‘దీన్ని విమోచనం అనక పోతే రజా కార్ల వైపు ఉన్నట్టే’ అని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చిన సంఘ పరివారం ఇప్పటికి చాలామందిని లొంగదీసింది. అలా లొంగిపోయిన వారి జాబితా ఇంకా పెరిగిపో తోంది.
పూర్తిగా చదవండి »
పీయూసీఎల్ ( పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్ట్సీ) జాతీయ అధ్యక్షుడు కన్నబీరన్ తో ఒక చిన్న ఇంటర్వూ:
ప్రశ్న: ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో పౌరహక్కుల పరిరక్షణ ఎలా ఉంది?
కన్నబీరన్: పౌరహక్కుల ఉల్లంఘనలో అన్ని దేశాల ప్రభుత్వాలు ఒకటే. కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య దేశాలన్న భేదం లేదు. అందరిదీ ఒకేరకమైన హింస. రాజ్యహింస ద్వారా తప్పు చేసి తప్పించు కోవడంలో పాలకులందరిదీ ఒకటే విధానం. దీన్నే ఆంగ్లంలో ‘ఇంప్యునిటి’ అంటారు. తెలుగులో ఖచ్చితమైన పదం లేదు. కాకుంటే అమెరికా వంటి అగ్రరాజ్య అకృత్యాలతో పోలిస్తే కమ్యూనిస్టు దేశాలు కాస్త మేలు.
పూర్తిగా చదవండి »