అక్షరాల్ని లోకానికిచ్చి
హఠాత్తుగాఎక్కడికో పయనమయ్యావు
నిరంతర సాహిత్య శ్రామికుడా!
పయనమేదైనా
పచ్చటి బతుకుల కోసమే కదా
నువ్ జీవించింది
ఎర్రపొద్దు కోసం
ఎన్ని రాత్రులు ఎదురుచూశావో
ఎన్ని దీపాల్ని సిద్ధం చేశావో
నువ్ లేని శూన్యం
నిండా ఆక్రమించిన వేళ ఇది
ఎన్ని హదయాలు
ద్రవిస్తాయో తెలుసు నీకు
అందుకేనేమో..నువ్
ప్రేమించిన ఈ క్షేత్రం నిండ
విత్తనాలేవో ముందుగానే నాటావు
విత్తనం పగిలిన చప్పుడు
స్పష్టంగా వినిపిస్తుంది
భూమిని చీల్చుకొని
రెక్కలు తొడుక్కోడానికి
నీ విత్తనాలన్ని
తహతహలాడుతున్నాయి
నీ కోసం కార్చే కన్నీళ్లే
ఇక వాన చినుకులు…!
(ఇటీవల కనుమూసిన విమర్శకులు హరి పురుషోత్తమరావు కోసం)
-పసునూరి రవీందర్
అన్నా[కామ్రేడ్] కవిత చాలా బాగుంది చదివాక నెనూ ఒక విత్తనాన్ని అవ్వాలి అని పించిది
అన్నా[కామ్రేడ్] కవిత చాలా బాగుంది చదివాక నెనూ ఒక విత్తనాన్ని అవ్వాలి అని పించిది
రవీంద్ర గారు చాలా బాగుంది. మీ కవిత.