ఇంకెంత మూల్యం చెల్లిస్తాం?
- కె.బాలగోపాల్
జమ్మూలో భారతీయ జనతా పార్టీ నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని చాలా మంది విమర్శిస్తున్నారు. మంటలు మండాలని కోరుకునే వాళ్లు నిప్పుతోనే చెలగాటం ఆడుతారు, నీళ్లతో కాదు. 1953లో షేక్ అబ్దుల్లా అక్రమ బర్తరఫ్‌కు, అక్రమ అరెస్ట్‌కు దారితీసిన ఆనాటి జనసంఘ్ నినాదాన్ని ఎల్.కె. అద్వానీ ఇవ్వాళ జ్ఞాప కం చేసుకుంటున్నాడంటే అన్నీ తెలిసే ఆ పని చేస్తున్నాడు. తన చంచల స్వభావాన్ని రాజకీయ ప్రతిష్ఠ చాటున దాచి యోగ్యుడయిన పాలకుడిగా, ప్రజాతంత్రవాదిగా చలామణి అయిన జవహర్‌లాల్ నెహ్రూ ఆనాడు ఆ ఒత్తిడికి తలఒగ్గి అబ్దుల్లాను నిర్బంధించి నిప్పు రాజేసాడు!
ఇవ్వాళ ఆయన వారసులే కదా దేశాన్ని పరిపాలిస్తున్నది! జమ్మూలో మార్కెట్లు బంద్ పెడితే ‘మా ఆపిల్ పండ్లను ముజఫరాబాద్‌కు తీసుకుపోయి అమ్ముకుంటాం’ అని కాశ్మీరీ రైతులు వర్తకులు అనడం, హురియత్ నాయకులే కాక ఇతర రాజకీయ నాయకులు కూడ వారికి మద్దతు ఇవ్వడం చాలామందికి ఆగ్రహం కలిగించి ఉంటుంది. చూశావా, ఇండియాలో అమ్ముకోనీయకపోతే పాకిస్థాన్‌కు పోయి అమ్ముకుంటాం అంటున్నారు అనుకొని ఉంటారు. కానీ అదే అనదలచుకున్నా, సౌలభ్యాన్నే ప్రమాణంగా పెట్టుకున్నా, ముజఫరాబాద్ కాదు రావల్పిండికి పోతాం అందురు.
కాశ్మీర్ లోయలో ఎక్కడి నుండయినా, ఏ సీజన్‌లోనయినా రావల్పిండికి పోయి నంత సులభంగా ముజఫరాబాద్‌కు పోలేరు. జమ్మూకు అసలే పోలేరు. అయినప్పటికీ ముజఫరాబాద్‌కు పోయి అమ్ముకుంటాం అన్నారంటే కారణం శ్రీనగర్-ముజఫరాబాద్ రోడ్డు ఈ మధ్య పునరుద్ధరించారన్న దొక్కటే కాదు. రోడ్డు పునరుద్ధరించారు గానీ అనుమతిపత్రాలూ వీసాలూ రద్దు చేయలేదు. రావల్పిండి రోడ్డు అధికారికంగా పునరుద్ధరించలేదు గానీ పోదలచుకుంటే అసాధ్యమేం కాదు. కానీ ముజఫరాబాద్ అవిభక్త కాశ్మీర్‌లోని పట్టణం. శ్రీనగర్ తరువాత రెండవ పెద్ద పట్టణం.
కాశ్మీరీలు చెప్పదలచుకుంది, మీరు జమ్మూలో అమ్ముకోనీయకపోతే మా కాశ్మీర్‌లోనే మరో పెద్ద మార్కెట్ ఉంది, అక్కడికి పోయి అమ్మకుంటాం అని. ఈ తేడా ఇండియాలో ఎంతమందికి అర్థం అవుతుంది? ఈ తేడాయే కాదు, కాశ్మీరీలకు సంబంధించిన ఏ వాస్తవాన్నయినా అర్థం చేసుకోవడానికి బయటి రాష్ట్రాలలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్నది అనుమానమే. కులం, ప్రాంతం, భాష, జాతి ప్రాతిపదికల పైన నడుస్తున్న ‘గుర్తింపు’ ఉద్యమాలు లేక ‘అస్తిత్వ’ ఉద్యమాలు ఇప్పుడనేకం ఉన్నాయి. వాటి ఆకాంక్షలలోనూ ఆరాటంలోనూ న్యాయం ఉందని గుర్తించినా కూడా వాటిలోని పరద్వేషం తరచుగా ఇబ్బంది పెడుతుంది.
వాటిపట్ల సానుభూతిగల వాళ్లను కూడ దూరం ఉంచుతుంది. ఈ అస్తిత్వ ఉద్యమాలు లేక ఆరాటాలన్నిటిలోకి కాశ్మీరీల పోరాటంలో పరద్వేషం తక్కు వ అంటే ఎంతమంది నమ్ముతారో! కానీ ఇది నిజం. భయోత్పాతం కల్గించడం, ద్వేషాల్ని రెచ్చగొట్టడం లక్ష్యంగా గల మిలిటెంట్లు పర్యాటకులపైన కాల్పులు జరిపి చంపిన ఉదంతాలూ, బీహార్ నుంచి పోయి కూలిచేసుకుంటున్నవారిని చంపిన ఘటనలూ జరిగిన మాట వాస్తవమేగానీ, సాధారణ కాశ్మీరీలలో కాశ్మీరీ జాతీయ భావం ఎంత ప్రబలమైనదో పర ద్వేషం అంత బలహీనమైన లక్షణం.
లేకపోతే మిలిటెన్సీ కొంత వెనుకడుగు వేయగానే ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు కాశ్మీర్‌కు పోయిరావడం జరిగేది కాదు. మిలిటెన్సీ మొదలయిన తొలినాళ్లలోనే కాశ్మీర్‌లో హిందూ దేవాలయాల ను కూల్చేశారన్న వదంతి బలంగా వ్యాపించింది. అదృష్టవశాత్తు భారత మీడియా దీని నిజానిజాలు తేల్చే బాధ్యత మీద వేసుకొని పరిశోధన జరపబట్టి అది పూర్తిగా అవాస్తవం అని తేలిందిగానీ లేకుంటే ఆ మచ్చ నిలిచిపోయేదే. గండర్‌బల్ తాలూకాలో తుల్ముల్లా అనే గ్రామం ఉంది. అక్కడ భవానీ గుడి ఉంది. ఆమెను క్షీర్ భవాని అంటారు. సంవత్సరానికొక రోజు ఆమెకు పాలతో అభిషేకం చేస్తారు.
1997 ఫిబ్రవరి 16వ తేదీన ఆ గ్రామానికి చెందిన ఒక టీచర్‌నూ, టైలర్‌నూ భారత సైన్యం కొట్టి చంపింది. ఆ ఊరి ప్రజలు మరుసటిరోజు పెద్ద ప్రదర్శన జరిపారు. ఆందోళన చేశారు. ఆ ఆగ్రహంలో భాగంగా భవాని గుడిపైన దాడి చేస్తారని లేక చేస్తారన్న భయంతో ప్రభుత్వం ఆ గుడికి భద్ర త బాగా పెంచుతుందని బయటివారు అనుకొనడం సహ జం. కానీ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత తుల్ముల్లాకు వెళ్లిన మానవహక్కుల బృందానికి కనిపించిన దృశ్యమేమిటంటే గుడి బయట చేత లాఠీ పట్టుకున్న ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉన్నాడు.
సైన్యం కొట్టి చంపిన వారి విషయం గ్రామస్తులతో మాట్లాడిన తరువాత గుడి ఎక్కడుందో చూపించమంటే స్నేహ పూర్వకంగా వెంట వచ్చి ఆ గుడి ప్రాచీనత గురించి, ప్రశస్తి గురించి చెప్తూ చూపించారే తప్ప గుడి చూస్తామని అడిగినందుకు నిరసన గానీ వ్యతిరేకత గానీ లేశమంత కూడ వ్యక్తం చేయలేదు. ఆ తరువాత జమ్మూలో తలదాచుకున్న పండిట్లు చెప్పిన విషయమేమిటంటే ప్రతి సంవత్సరం భవానీకి క్షీరాభిషేకం జరిగే పర్వదినాన వారు పెద్ద సంఖ్యలో తుల్ముల్లాకు వెళ్తూనే ఉన్నారని, ప్రభుత్వం నుంచి సహాయమే కాక గ్రామస్తుల నుంచి ఆదరణా వారి కెప్పుడూ దండిగా లభిస్తూనే ఉన్నదని.
హిందువుల పూజల పట్ల, హైందవ మతం పట్ల ద్వేషంతోనే కాశ్మీరీలు అమర్‌నాథ్ యాత్రను నిర్వహించే సమితికి భూమిని లీజుకివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఈ ఉదంతాన్ని ఉటంకించవలసి వచ్చింది. మరయితే 100 ఎకరాల అటవీ భూమి గురించి ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు. వీళ్లయినా 100 ఎకరాల కోసం అంత మొండిగా ఎందుకు గొడవ పడాలని ఎదురు ప్రశ్న వేయవచ్చునుగానీ కాశ్మీరీల కోపాన్ని అర్థం చేసుకోవడానికి మరి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం.
అమర్‌నాథ్ యాత్ర కాజీ గుండ్ వద్ద కాశ్మీర్‌లోయలోకి ప్రవేశించిన తరువాత దాదా పు రెండున్నర లేక మూడు గంటల సేపు ప్రయాణించి పహల్గాం చేరుకుంటుంది. అక్కడి నుంచి యాత్రికులు కాలినడకన లేక పశువుల పైన దర్శన స్థలానికి పోతారు. కాశ్మీరీల తిరుగుబాటు అత్యం త తీవ్ర స్థాయిలో ఉన్న రోజులలో కూడ ఈ యాత్ర ఆగలేదు. దానిని భారత సైన్యం తన ప్రతిష్ఠకు సవాలుగా తీసుకొని నిర్విఘ్నంగా సాగించటమొక్కటే అందుకు కారణం కాదు. కాశ్మీరీలలో ఎక్కడా దానిపట్ల వ్యతరేకత, నిరసన లేక పోవడం కూడ కారణమే. ఆ యాత్రలో భక్తులే కాక సంఘ్ పరివార్ కార్యకర్తలు కూడ పాల్గొంటారు.
వారు శివ భక్తి స్తోత్రాలే కాక కాశ్మీరీలను ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొడుతూ నినాదాలు కూడ చేస్తారు. ‘కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇండియా ఒకటే ‘ అనేది ఒక మచ్చుతునక. దర్శన స్థలానికి సమీపంలోని అడవి ప్రాంతంలో మిలిటెంట్లు యాత్రికుల పైన కాల్పులు జరిపిన ఉదంతాలు ఉన్నాయి గానీ దారిలో ఎక్కడా స్థానిక ప్రజలు నిరసన గానీ వ్యతిరేకత గానీ తెలిపిన ఉదంతాలు లేవు. పహల్గామయితే యాత్ర జరిగే దినాలలో సగటు హైందవ జాతర స్థలంలాగే ఉంటుంది. బొట్లు, మాలలు, కాషాయ వస్త్రాలు వేసుకున్న భక్తులు వేల సంఖ్యలో దిగుతారు, తమ వంతు వచ్చే వరకు బస చేస్తారు, ఆ తరువాత పోయి దర్శ నం చేసుకొస్తారు.
మళ్లీ నినాదాలిచ్చుకుంటూ తిరుగు ప్రయాణం అవుతారు. పహల్గాంలోనూ ఆ తరువాతా వారికి కేవలం ప్రభుత్వం నుంచే కాక స్థానిక ప్రజలనుంచి కూడ చాలా సహకారం లభిస్తుంది. ఆదరణ లభిస్తుంది. ఇవ్వాళ లీజుకు ఇస్తామన్న 100 ఎకరాలు కొత్తగా ఇస్తున్నది కాదు, యాత్రికులు వాడుకొంటున్నదే మరి కొంత పెద్ద పరిమాణం లో, బహుశా శాశ్వత ధర్మ సత్రాల నిర్మాణం కోసం ఇస్తున్నది. శాశ్వత వసతుల ప్రస్తావన లేకుండ, లీజు గురించి మాట్లాడకుండ ఎప్పటిలాగే యాత్రికుల తాత్కాలిక అవసరాల కోసం ఆ పరిసరాలలోని అటవీ భూమిని వాడుకుంటే ఏ గొడవా జరిగేది కాదు.
అవసరాన్ని బట్టి ఎప్పటికన్నా కొంచెం ఎక్కువ వాడుకున్నా గొడవ జరిగేది కాదు. ఈ గొడవంతా ముగిసి ఆవేశాలు చల్లారిన తరువాత జరగబోయేది అదే. ఇంకొన్ని రోజులలో మొదలు కాబోయే అమర్‌నాథ్ యాత్రను అద్వానీ గారూ, వారి సోదరులూ తమ సంకుచిత ప్రయోజనాల కోసం వాడుకోకుండ ఎప్పటిలాగ సాగనిస్తే మనం అదే చూడబోతాం గూడ. అయినప్పటికీ 100 ఎకరాల లీజును కాశ్మీరీలు ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసిందేనంటే, తమ ఉనికి పట్ల , తమ నేల పట్ల, తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది.
ఆ ఉద్విగ్నత తెలియని వారికది ఒక వెర్రిగా కనిపించవచ్చు. దానిని రెచ్చగొట్టి వాడుకోవడం రాజకీయ వేత్తలకు సులభం కావచ్చు. అయితే అందులో తమ జాతి గుర్తింపులో భాగమైన భౌతిక, సాంస్కృతిక అంశాల పట్ల తీవ్రమైన తాదాత్మ్య భావనే తప్ప పర ద్వేషం ఒకింత కూడ లేదు. అంతేకాక ఈ భావన ఎంత తీవ్రమైనదో వారి స్నేహశీలం అంతే బలీయమైనది. ఈ విషయాన్ని గుర్తించి రెండిటి నీ గౌరవించడం నేర్చుకుంటే వారితో వ్యవహరించడం కష్టం కాదు.
దీనికి అద్వానీ ఒప్పుకోడు. భారతీయత అనేదొక అఖండమైన భావన అనీ, దానిలోపల వేరే గుర్తింపులకూ భావోద్వేగాలకూ తావులేదనీ, ఆ భారతీయతతో మాకేమి సంబంధం అన్న ప్రశ్న లేవదీయడానికి వీలేలేదనీ ఆయన ప్రాపంచిక దృక్పథం చెప్తుంది. ఆ దృక్పథం అధికారానికి చేరువయిన క్రమంలో ఈ దేశం నుంచి చాలా మూల్యమే తీసుకుంది. అధికారం చలాయించిన కాలంలో మరింత తీసుకుంది. ఇంకా ఎంత తీసుకోనిస్తామనేది మనమంతా నిర్ణయించుకోవలసిన విషయం.
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: ఆగష్టు 13, 2008
ఈ విధంగా గుడ్డిగా సమర్ధించె వాళ్ళూ ఉండబట్టే మన దేశం లొ ఈ విధమైన వివాధాలు.కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇండియా ఒకటే.
ఇది ముష్లిం మతోన్మాదులకు ఫక్తు లెఫ్టిస్టు తరహా సిగ్గులేని సమర్థన. వీళ్ళ దృష్టిలో ముస్లిములది అస్తిత్వవాదం, హిందువులది కాదు - ఎన్నివేలమంది హిందువుల్ని ఉగ్రవాదులు చంపినా సరే, ఇంకెన్ని లక్షల మంది హిందువుల్ని కాశ్మీరు నుంచి వెళ్ళగొట్టినా సరే ! ఇంకెన్ని కోట్లమంది హిందువుల్ని బలవంతంగా మతం మార్చినా సరే ! పాపం ! సంస్కృతీ, సెంటిమెంట్లూ ముస్లిములకే ఉన్నాయి. ఉండాలి. హిందువులకు లేవు, ఉండకూడదు. ఒకవేళ ఉంటే, ఎర్రజెండాలు వాళ్ళ మతాన్ని, దేవుళ్ళనీ గబ్బుపట్టిస్తూ పుస్తకాలు రాస్తారు - ముప్పాళ్ళ రంగనాయకమ్మలాగా !
“కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా ఇండియా అంతా ఒకటే” అని అమరనాథ భక్తులు నినాదాలిస్తే అది కాశ్మీరీ ముస్లిముల్ని రెచ్చగొట్టడమట. అంటే వాళ్ళు దేశద్రోఃహులని ఒప్పుకున్నట్లే కదా ! అయినా వాళ్ళ దేశద్రోహాన్ని ఎర్రజెండాల కామ్రేళ్ళు సమర్థిస్తున్నట్లే కదా !
“తమ ఉనికి పట్ల ,తమ నేల పట్ల,తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని ..” - ఇవన్నీ కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డ హిందువులకు లేవా? అప్పుడేమయ్యారు వీళ్ళంతా.
మన పాలకులు ఒక వర్గం వారికి కోట్లకు కోట్లు సబ్సిడిగా అందించి/భరించి పర దేశంలో ఉన్న పవిత్ర స్థలానికి పంపిస్తారు..అదే ఇంకో వర్గం వారికి సొంత దేశంలో ఉన్న ప్రార్థనా ప్రదేశానికి వెళ్లడానికి కనీస వసతులు కల్పించడానికి కూడా చేత కాదు! జోహార్ సెక్యులర్ పాలకులారా! జోహర్! మన ఎర్ర దండుకి లాల్ సలాం!
కాశ్మీరు ఉద్యమం ఒక జాతీయ పోరాటం. కాశ్మీరు జాతీయవాదానికి, భారత ఆక్రమణ మధ్య జరుగుతున్న సంఘర్షణ. వాస్తవానికి కాశ్మీరీలు పాకిస్తాన్ లో కలవాలను కోవటం లేదు, భారతదేశం లో వుండాలనుకోవటం లేదు. వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు. గతంలో Outlook magazine (అక్టోబరు 1995) జరిపిన సర్వే లో 72% కాశ్మీరీలు స్వతంత్రాన్ని కోరుకున్నారు. మనం నిజంగా కాశ్మీరు భారతదేశంలో భాగంగా వుండాలని కోరుకుంటే, అక్కడి ప్రజలతో స్నేహపూర్వంగా ఉండాలి. అక్కడ ప్రజాస్వామిక పాలన అందించాలి. అంతే కాని వాళ్ళ గొంతు మీద తుపాకీ పెట్టి స్నేహం చేస్తే ఎవరు అంగీకరిస్తారు. ఈ రోజున కాశ్మీరులో భారత సైనిక పరిపాలన నడుస్తుంది. అక్కడ ఎప్పుడూ ప్రజాస్వామిక పాలన లేదు. కనీసం వాళ్ళకి నిరసన తెలిపే హక్కు, ఊరేగింపు తీసుకున్నే హక్కులు గూడాలేవు. అక్కడ ఇండియా మిలటరీ పాలన సాగుతున్నది.
1) మానవహక్కుల సంఘాల ప్రకారం 1990-1998 కాలంలో 2477 అమాయకులను భారత సైన్యం కాల్చి చంపింది. వందలాది కాశ్మీరీ స్త్రీలు మానభంగానికి గురయ్యారు. ఛత్తీసింగపోరలో 35 మంది సిక్కులను చంపటం లో భారత సైన్యం, పాలకవర్గాల పాత్రవున్నదని చాలా ఆరోపణలున్నాయి.
ఇది రెండు మతాలకు సంబంధించిన సమస్య కాదు. బిజేపీ ,ఆర్.ఎస్.ఎస్ లు అమరనాథ్ సంఘటనను అడ్డుపెట్టుకొని జనం మధ్య మతం చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రయోజనాల కోసమే యీ నాటకమంతా. ప్రజాస్వామ్యంలో మనకి నమ్మకం వుంటే, కాశ్మీరులో భారత సైనిక పరిపాలనను, వారి దుర్మార్గాలను వ్యతిరేకించాలి. కాశ్మీరీలకు మానవహక్కులను డిమాండ్ చేయాలి.
టివి లొ అలా వూగిపొ తు వాళ్ళూ నిరసన్లు తెలుపు తుంటె కశీమిరి లకు నిరసనలు తెలిపె హక్కులు లెవంటె ఎవరు నమ్ముతారు ?
సుడో సెక్యులరిస్ట్ లు అంటే ఎవరు? ఎలా అలోచిస్తారు అని ఎవరికయినా అనుమానాలు వుంటే, దానిని విజయవంతంగా పటాపంచలు చేయటానికి మీరు వ్రాసిన ఈ నాలుగు ముక్కలు చాలు.
మరి మీరన్నట్లు, కాశ్మీర్ ముస్లిం లు అంత మంచి వాళ్లయితే, ఎందుకు లక్షల మంది హిందువులు వందల ఏళ్లుగా వుంటున్న ఇళ్లు వాకిళ్లు వదిలి పెట్టి, డిల్లీ వీధులలొ అడుకొంటున్నరో చెప్పి మా కళ్లు తెరిపిస్తారా. మరిచి పొయాను, వాళ్లకు కొవ్వెక్కి, తమ సోదరులాంటి ముస్లిం లను అపార్ధం చేసుకొని, కొంపా గోడు వదిలి పెట్టి తమ దేశం లోనే, కాందీశుకులుగా బ్రతుకుతున్నరంటారు కదా మీ లాంటి మేథావులు .. మర్చి పోయి అడిగా, క్షమించండి.
——————————-
గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ
——————————-
రవికిరణం,
నువ్వు గత ఇరవై ఏళ్ళలో ఎప్పుడూ న్యూస్ పేపర్ గానీ, టీవి గానీ చూసినట్లు లేదమ్మా…కొద్దిగా నువ్వు ఇంప్రూవ్ కావాలి. మిడి మిడి జ్ఞానంతో మన తెలుగు జర్నలిష్టుల్లా రాయకు. నువ్వు ఆంధ్రజ్యోతి దీపానివైతే అక్కడే రాసుకో.
ఖాన్ బాలగోపాల్ సాయిబు గారు, అతిపవిత్రమయిన కాశ్మీర్ లో స్థిరపడి అక్కడి అమాయక ముస్లిం ప్రజలకోసం, హిందూ టెర్రరిస్ట్ లనుండి కాపాడే ఉద్యమం చేయక ఇక్కడ తమ గొప్ప తెలివితేటలను దిక్కుమాలిన వ్యాసాలు వ్రాస్తూ వృధాగా గడుపుతున్నందుకు చాలా బాధగావుంది.
అవును “కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత దేశం వొక్కటే” అనే హిందూ తీవ్రవాదులని మీరు తాలిబాన్,హెజ్బొల్లా మొజహీదీన్ లాంటి ఉన్నతమయిన గొప్ప ఉద్యమాలు చేసే ముస్లిం మత ప్రవక్తలతో కలిసి ఈ హిందూ ప్రజలని దేశం నుండి వేల్లగోట్టండి లేదా కనీసం అందరిని ముస్లిం మతములోనికి మార్చే ప్రయత్నాలు ఇక మొదలు పెట్టవలసిన సమయం వచ్చింది. కాశ్మీర్ పండితులకి మానవ హక్కులు తరువాత ముందు అఫ్జల్ (హిందూ తీవ్రవాదులు ఈయనని తీవ్రవాది అంటుంటారు మీరు దీనిగురించికూడా పోరాడాలి)మానవ హక్కుల గురించి మన మాన్య హోం మంత్రి శ్రీ శ్రీ శ్రీ శివరాజ్ పాటిల్ మహారాజ్ గారు మీకు మంచి సహకారం అందిస్తారు. మీకు మంచి మిత్రులు కాంగ్రెస్స్,కమ్యూనిస్ట్ లు వున్నారు కావున మీరు అర్జెంటుగా కాశ్మీర్ బయలు దేరవలసిన ఆవశ్యకత వుంది.
………….
——————————-
గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ
——————————-
అమాయక ప్రజలను ఊచకోత కోసే వాళ్ళ హక్కులకోసం ,దొంగచాటుగా ప్రజలను చంపే వాళ్ళ హక్కులకోసం పోరాడేవాళ్ళు ఇంతకన్నా ఏమి వ్రాస్తారు.
బాలగోపాలా, నువ్వొకసారి ఈ మదరస్సాల గురించి రాయాలమ్మా…జనాలు అపార్ధం చేసుకుంటున్నారు ఇండియా మిలటరీ పాలనలో. వాటి అద్భుతమైన లక్ష్యాలు, అందించే అందమైన బాల్యం ఇవన్నీ మేము తెలుసుకోవాలను కుంటున్నాం. ………..
“…100 ఎకరాల లీజును కాశ్మీరీలు ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసిందేనంటే, తమ ఉనికి పట్ల , తమ నేల పట్ల, తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది.”
- ఇది రాయాలంటే మనలో ఎంతో తెలివి తక్కువ తనం ఉండాలి!
అయ్యా బాలగోపాల్ గారూ.. 100 కోట్ల హిందూ జనాభా వున్న దేశంలో, వారికోసం 100 ఎకరాలు భూమి కూడా ఇవ్వలేరా. ముస్లింలు ఏమి చేసినా సమర్ధించడం మీరు ఆదర్శవాదమనుకుంటున్నారా. కాశ్మీరులో వున్న మిలిటెంట్లు అంతా ఎక్కడ తలదాచుకుంటున్నారో చెప్పగలరా. భారతీయత అంటె మీకు మతోన్మాదంలా కనిపిస్తోందా నిప్పుతో చెలగాటమాడుతున్నది భారతీయ జనతా పార్టీనా లేక కుహనా లౌకికవాదులా. ముస్లిం ఓటుబాంకు కోసం తీవ్రవాదాన్ని నిర్లక్ష్యం చేసింది ఎవరు. దీనిపై మీరెందుకు వ్రాయరు..
ప్రజాస్వామిక వ్యవస్థలో విమర్శించే హక్కు అందరికీ వుంటుంది. కొన్ని ఆధారాలతో, ఉదాహరణలతో వాదన సాగిస్తే బాగుంటుంది. కానీ వెకిలిగా, ఎక్కిరింతలతో, విద్వేషంతో మూర్ఖత్వంతో సాగించే వాదనల వల్ల ప్రయోజనం లేదు. దేశభక్తి అంటే జెండాలు ఎగరేయటం కాదు, జాతీయగీతాలు ఆలపించటం కాదు, చెక్క భజనలు చేయటం కాదు. దేశప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటటం.
.
ప్రపంచ చరిత్రలో జాతీయవాదం చాలా సార్లు దుర్వినియోగమైంది. ఇటలీలో ముసోలిని, జర్మనీ లో హిట్లరు, స్పెయిన్ లో ఫ్రాంకో ‘జాతీయవాదం’ పేరుతో ఫాసిస్టు నియంతపాలన సాగించి, లక్షలాది అమాయకులను చంపారు. ప్రస్తుతం భారతదేశంలో ఆర్.ఎస్.ఎస్ – బిజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నాయకుడు గోళ్వాల్కర్ గూరుజీ రాసిన (We. Our Nationhood Defined) పుస్తకంలో హిట్లర్ నాజీలనుండి స్ఫూర్తి పొందారు. ఇప్పుడు బిజేపీ ఒక ఫాసిస్టు ప్రయోగం చేస్తుంది. మతోన్మాదాన్ని రగలించి గద్దె కెక్కాలని ప్రయత్నిస్తుంది. కాశ్మీరు సమస్యను మత సమస్య చిత్రీకరించాలని ప్రయత్నం.
.
కాశ్మీరులో భారత సైన్యం దుర్మార్గాలకు చాలామంది అమాయక కాశ్మీరీయులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మిలిటెంట్ల చేతిలో కొంతమంది కాశ్మీర్ పండితులు మరణించారు. ప్రభుత్వం, మిలిటెంట్లు ఇద్దరూ హింసకు పాల్పడారు. అన్ని వర్గాలనుండి హింస ఆగాలని, రాజకీయంగా కాశ్మీరు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం.
రవికిరణ్, నువ్వు చరిత్ర గురించి ఎవరికి ఇక్కడ చెప్పనక్కరలేదు. ఇది ఇండియా, అమెరికా కాదు చరిత్ర గురించి అస్సలు తెలియక పోవటానికి. నువ్వు కంపేర్ చేస్తూ ఇక్కడ సాధించినది ఏమిటో అర్ధం కావటం లేదు. ఒక్కటి గుర్తుంచుకో..భారతీయులెవ్వరికీ ఇది ఏదో మత పరమయిన దేశమన్న భావన అసలు వుంటే, ఈ దేశం ప్రపంచంలో అతి ఎక్కువ ముస్లిం జనాభా వున్న దేశం అయ్యేది కాదు. ఖచ్చితంగా ఈ దేశం ముస్లింలకు అతి సురక్షితమైన దేశం ……
——————————-
గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ
——————————-
షేకు అబ్దుల్లా ఒక రెండు నాలుకల పాము.
ఒక వైపు కాశ్మీరు భారత దేశానిదే అంటూ, రెండో వైపు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించిన అబద్ధాల కోరు.
ఆయనిది ఒక అధర్మ బర్తరఫు! ఈ కమ్యూనిస్టులు రాసేవి గొప్ప విశ్లేషణలు!
పిల్లికి ఎలుక సాక్ష్యములా…
-మురళి
నాకు అర్దం కానిది ఒకటుంది పాకిస్తాన్ వీరు అందరు ఎందుకంత అబిమానిస్తారు ? ఒక్క సారి హైదరాబాదులో ఎదన్నా మదర్సాలకు వెళ్ళిచూడండి మోన్న ఆగస్టు 15 న వెళ్ళిచూశా ఎక్కడ కూడా త్రివర్ణపతాకం లేదు దురదుస్టవసాత్తు పాకిస్తాన్ పతాకాలు అప్పుడప్పుడూ రెప రెప లాడతాయి.
నేను ఈ వ్యాసకర్త మరియు రవికిరణ్ అభిప్రాయాలని గౌరవిస్తాను అయితే నాక్కూడా చాలా సార్లు అర్థం కానిదేమంటే మైనారిటీలు ఎదైనా తప్పు చేస్తే దాన్ని తప్పు అని ముందు అంగీకరించి ఆ తర్వాత దానికి కారణం వెతికే బదులు చిన్న కొడుకు తప్పుచేస్తే వెనుకేసుకొచ్చే తల్లిలా ఆ బాధ్యతను ఈ వామపక్షాలు ఎందుకు మీద వేసుకుంటాయో అర్థం కాదు. ముస్లింలు గానీ మరే ఇతర మైనారిటీలు గానీ తప్పు చేయకుండా వుండటానికి వాళ్ళేమీ మానవాతీతులు కాదు వాళ్ళు తప్పులు చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా బాలగోపాల్ లాంటివాళ్ళు ఇదే స్వరంతో వాటిని తిరస్కరిస్తే అప్పుడు మీ స్వరం మీద అధిక శాతం మందికి గురి వుంటుంది. అలాగాక నీవు తప్పు చేస్తే అది నీ తప్పు, మా వాడు తప్పు చేస్తే నీవు ముందు గిల్లావు గనుక అదీ నీ తప్పే అంటు ఎటు తిరిగి ఎదుటివాడిదే తప్పు అంటూ కారణాలు వెతుకుతూ పోతే ఇదిగో ఇక్కడిలాగే ఎదురుతన్నుతుంది.
అంత పెద్ద విశాల రాష్ట్రంలో వంద ఎకరాలు ఇవ్వడానికి సగటు కాశ్మీరీకి ఖచ్చితంగా వ్యతిరేకత వుండదు అని నా నమ్మిక. ఇటువైపు నుంచీ అగ్గి రాజేయడానికి హిందూ ఛాందసులు ఎలా కాచుకొని వున్నారో అటువైపు ఓట్లనీ, భావావేశాన్నీ సొమ్ము చేసుకోవడానికి కూడా నక్కలు కాచుకొని వున్నాయి. ఇలా రెండువైపులా కొమ్ముకాసిన దగుళ్భాజీ నాయకుల తోనే ఈ సమస్య అని నా నమ్మకం. అలాగాక తమ సంస్కృతి పట్ల వారికి వున్న ఉద్వేగభరితమైన భందమే కారణమైతే ఇన్నేళ్ళలోనూ అమరనాధుడు వాళ్ళ సంస్కృతిలో భాగం కాలేదంటే ఆ సంస్కృతినీ, ఆ భంధాన్నీ ఏమనాలి? ఒకవేళ అమరనాధుడూ వాళ్ళ సంస్కృతిలో భాగమయితే ఆయన పేరుతో జరిగే ఈ జాతరకు (ఆర్థికంగా ఇది కాశ్మీరీలకు మేలు చేసేదే) వంద ఎకరాలు ఇవ్వడానికి అడ్డుపడే ఏ సంస్కృతి ఇది?
–ప్రసాద్
http://blog.charasala.com
అయ్యా బాలగోపాల్ గారు,
విజయవాడలో క్లాసు రూములో ఒక అమ్మాయిని నరికి చంపటానికిగల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసినదేమిటంటే, మగాడు అయిన తన ఉనికి పట్ల, అమ్మాయి అయిన ఆమె నిస్సహాయత పట్ల, అమ్మయి పైన తన ప్రేమ వల్ల, వ్యామోహం వల్ల, పిచ్చి అభిమానం వల్ల వానికి వున్న ఉద్వేగభరితమైన భందాన్ని కారణంగా చూపించవలసి వుంటుంది.
మిత్రమా హరి దేవన్న,
కాశ్మీర్ సమస్య పైన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు, అలాగే వ్యాసకర్త ను విమర్శించే హక్కూ మీకు వున్నాయి. కాని ఇంత వెకిలిగా, వెక్కిరింతగా మూర్ఖపు వాదనను చేయడం సమంజసంగా లేదు. మీ మనస్సులో వున్న మూర్ఖపు ఆలోచనలు రచయితకు ఆపాదిస్తూ మానసికానందం పొందాలను కోవటం చాలా విచారకరమైన అంశం.కాశ్మీర్ సమస్యకి విజయవాడ సైకో-కిల్లర్ కి ఏమైనా సంబంధం వున్నదా. ఒక్కసారి ఆలోచించండి.ఏదైనా రాసేముందు కాస్త అధ్యయనం చేసి రాస్తే బాగుంటుంది. లేదంటే మీవాదన వినిపించటంలో కూడా విఫలమైతారు.దయచేసి ఇప్పటి నుండైనా చదవటం మొదలు పెట్టండి.
రవికిరణ్
రవి కిరణ్ సార్,
నేను జమ్మూ కి రెండువేల అయిదు లో రెండు పర్యాయాలు వెళ్ళాను. అక్కడ అమర్నాథ్ గుహను కనుగొన్నది ఒక ముస్లిం అని తెలుసు, అక్కడ యాత్రికులకి అడుగడుగునా సహాయం చేసేది ముస్లిములని తెలుసు. భూమి కేటాయింపు నిరాకరణ వేర్పాటువాదుల పనే అని తెలుసు. మరి నాలుగు లక్షల పై చిలికు కాశ్మీరి పండిట్ల ను తరిమేసిన దానిని, వారి పై జరిగిన అక్రుత్యాలని ‘’ తమ ఉనికి పట్ల ,తమ నేల పట్ల,తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది” అని అంటే అది సరైన భావమా? అక్కడి ముస్లిములు కోరుకోవడం లేదు విడిపోదామని. కేవలం కొద్ది మంది వేర్పాటువాద నాయకుల విచ్చిన్న ఆలోచనకి ఇక్కడ వారు జాతీయ భావమని ఇంకోటని లేని పోనీ వాదాన్ని జోడించడమే అన్యాయం. మీరే ఆలోచించండి.
రవి కిరణ్ గారు,
జెండాలు ఎగిరేస్తేనే దేశభక్తి కాదు అన్నారు కదా మరి దేశభక్తిని ఎలా చూపిస్తారో తమరు చెబితే బావుంటుంది. మీరు ఒలంపిక్స్ చూసినప్పుడు పతక విజేతలకు, ప్రారంభ,ముగింపు వేడుకలో ఎవరి దేశపు జెండాలతో వారు గర్వంగా అభిమానముతో ఉండటము మీరు చూసేవుంటారు.చంద్రునిమీద అమెరికా వాళ్లు జెండానే పాతి వచ్చారు కాని గొప్ప సెక్యులర్ మేధావి, మానవ హక్కుల పరిరక్షకుడు బాలగోపాల్ గారి ఫోటోని కాదు. చాల తెలివైన వాడినని ఏదో గొప్పగా రాస్తున్నానని(భహుశా తమరు జర్నలిస్టు అనుకుంటా!!!) గర్వంగా ఇతరులని చులకనగా భావిస్తూ రాస్తున్నారు.
హరి దేవన్న గారి అభిప్రాయం అయన వ్రాసారు.స్పందించాల్సిన బాలగోపాల్ గమ్మున వుంటే తమరికెందుకు ……. మీరు పరితపించే ముస్లిం సమాజము నుండి మీకు ఎంత వరకు ప్రశంశలు వచ్చాయో తెలుపగలరా. భారత దేశాన్ని ప్రేమించే,కాశ్మీర్ నుండి కన్యాకుమారి నుండి దేశమంతా ఒక్కటే,అనే ఒక హిందువుగా (తీవ్రవాదిగా మీదృష్టిలో)అడుగుతున్నాను. తమరు నిజంగా జర్నలిస్ట్ అయివుంటే ప్రపంచ చరిత్ర,మత, రాజకీయ విశ్లేషణలతో ఉన్న పుస్తకాలని చదివి, వికీపీడియా లేదా ఇతర సమాచారములనుండి దేశాలవారీగా ఎక్కడ ముస్లిం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు,హిందువుల వలన సమస్యలు ఎక్కడ వున్నాయి, అసలు ఏ మతంలో తీవ్రవాదులు ఉన్నారో సశాశ్రీయంగా ఒక మంచి వ్యాసము వ్రాయండి. నాకు కొంత తెలిసినా మీ అంత గొప్పగా వ్రాయలేను కావున తమరిని అబ్యర్ధిస్తున్నాము.
——————————
గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ
——————————
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
……..
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
- గురజాడ అప్పారావు
.
దేశభక్తి అంటే జెండాలు ఎగరేయటం కాదు, జాతీయగీతాలు ఆలపించటం కాదు, చెక్క భజనలు చేయటం కాదు. దేశప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటటం.
.
“అసలు ఏ మతంలో తీవ్రవాదులు ఉన్నారో?”
.
ప్రపంచంలో అన్నీ మతాలలో కొంతమంది తీవ్రవాదులు లేదంటే టెర్రరిస్టులు వున్నారు.
ఒక్లహోమా సిటీలో బాంబులు పేల్చి 168 మంది అమాయకులను చంపినవాళ్ళు క్రైస్తవ టెర్రరిస్టులే,
హిరోషిమా, నాగసాకి అణుబాంబులు వేసి వేలాదిమందిని చంపిన అమెరికను పాలకులు టెర్రరిస్టులే,
ఇరాక్ లో లక్షలాది అమాయకులను చంపిన బుష్, బ్లెయర్ లు టెర్రరిస్టులే,
సెప్టెంబరు 11 న వేలాదిమందిని చంపిన వాళ్ళు బిన్ లాడెన్ అండ్ కంపెనీ ఇస్లామిక్ టెర్రరిస్టులే,
గుజరాత్ లో రెండువేలమంది ముస్లింలను చంపిన బిజేపీ-ఆర్.ఎస్.ఎస్-వి.హెచ్.పీ లు హిందూ టెర్రరిస్టులే,
లెబెనాన్ లో షబిలా, షటిలా లలో వేలాది పాలస్తీనీయులను చంపిన వాళ్ళు యూద్రు టెర్రరిస్టులే.
ప్రపంచంలో “సూసైడ్ బాంబింగ్” అత్యంత శక్తివంతంగా వుపయోగించిన ఎల్.టీ.టీ.ఇ మతపరంగా చూస్తే హిందూ టెర్రరిస్టులే.
వీటికి తోడు రాజ్యహింసకు పాల్పడే “టెర్రరిస్టు స్టేట్స్” కూడా చాలా వున్నాయి. మనకి ప్రజాస్వామిక వ్యవస్థ, మానవ హక్కులు మీద నమ్మకం వుంటే అన్ని రకాల హింసను మనం వ్యతిరేకించాలి. టెర్రరిస్టు అనే పదం రాయటం ఇష్టం లేకపోయినా, మన నెత్తిన రుద్దిన యీ పదం రావలసి వచ్చినందుకు చింతిస్తున్నా.
అయ్యా రవికిరణం ఆవేశమొద్దు, తమరుగాని బాలగోపాల్ సాయిబుగారి పక్క ఇంట్లో లేరుగదా, అయన ప్రభావం తమరిమీద చాల ఎక్కువగా వున్నట్టుంది. అమెరికా, జపాను మీద అతోం బాంబు వేసింది మతపరమయిన కారణముతో కాదని కొంచెము శ్రద్ధగా చరిత్ర చదివేతే తెలుస్తుంది(పెరల్ హార్బర్ మీద జపాన్ విమాన దాడులకి, జపాన్ దుందుడుకు విధానాలమీద దాడి అది- కాని ఆ దాడిని నేను సమర్ధించటం లేదు). తమిళ తీవ్రవాద ఎల్.టి.టి.ఈ మతపరమయిన విధానాలమీద పోరాడటం లేదు అని తమరికి తెలుసా? అది వారి అస్తిత్వం గురించి పోరాటం అని తెలుసుకోనండి.ఉత్త పుణ్యానికి తమరు తయారు చేసిన జాబితాలో హిందూ తీవ్ర వాదులు కూడా ప్రభలంగా కనిపించాలనే దుగ్ద వద్దు, మీకు నిష్పక్షపాతంగా వ్యాసం వ్రాయాలనే ఆలోచనే వుంటే “రెండు వేలమంది అమాయక ముస్లిం ప్రజల వూచకోత” వెనుక వున్న భారతీయ హిందూ తీవ్రవాదులగురించి ప్రస్తావించే ముందు 4౦౦ మంది ముస్లిం తీవ్ర వాదులు,”56 మంది అమాయక హిందువుల వూచకోతని” ప్రస్తావించేవాళ్ళు.
నిన్న హెడ్ లైన్స్ టుడే లో సిమి నాయకుడి ఉపన్యాసం వివరాలు, ఎలా దాడులకి పాల్పడింది, చక్కగా చెప్పాడు, అది పూర్తిగా చూసి విని అప్పుడు మాట్లాడండి. సమాజ్వాది పార్టీ నాయకులలాగా,లాలూ ప్రసాద్ వేదావ్ లాగ సిమి అమాయక మత సంస్థ దానిని నిషేధించటం అన్యాయం అని దిక్కుమాలిన నీచ వోట్ల రాజకీయా నాయకుడిలాగా సమర్ధించవద్దు.
భారత దేశములో ఉన్న గొప్ప సుగుణమేమంటే స్వంత దేశాన్ని,మెజారిటీ ప్రజలని వారి మతాన్ని కించ పరుస్తూ శత్రువుల పక్షాన వకాల్తా పుచ్చుకుని కుహనా లౌకికవాదాన్ని బోధిస్తున్న నీచ రాజకీయ నాయకులని,సూడో మేధావులని భరించటం. ఈ అతిసహనం వలననే ఎంతోమంది ఇతర మతాల వారు,దేశాలవారు ఎన్నో దురాక్రమణలు చేసి దేశాన్ని,ఇక్కడి సంస్కృతిని నాశనం చేసినా ఇంకా భరిస్తూనే వుండటం.
అందరికి “హిందూ సంస్థలని, వారి రాజకీయ పార్టీలని విమర్షించటం గొప్ప ఫ్యాషన్” అయిపొయింది. కాని సిమి డౌన్ డౌన్ అనగలిగె దమ్ము మాత్రం రాదు. అప్పుడు చరిత్ర,మానవ హక్కులు,సమాజం, మయినారిటీ వారి హక్కులు, వారి మత,ప్రాంత అనుభందాలు అన్నీ గుర్తుకు తెచ్హుకుని ముస్లిం సమాజానికి వత్తాసు పలుకుతారు.
ఇదంత వ్రాయటానికి కారణం నేను బీజెపీ వాడిని కాదు. హిందూ తీవ్రవాదిని కాదు.దేశమంత ఒక్కటే, ఇక్కడ అందరూ సమానమే,అన్ని మతాలు ఎవరికి ఇస్టమయినవి వారికి గొప్ప అనుకునే సామాన్య మానవుడిని.
మేధావిగా నిరూపించుకోవాలంటే స్వంత మత,జాతి,సమాజాన్ని వ్యతిరేకిన్చనవసరం లేదు అనే కనీస ఇంగిత జ్ఞానం కొంతమందికి ఆ భగవంతుడు కలిగించాలని ప్రార్ధించటం తప్ప వేరే మార్గం కనిపించటం లేదు.
రవికిరణ గారూ,
రెండో కోణం లో ఆలోచించరేమిటి,బాలగోపాల గారి లా