boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

ఆగస్టు, 2008 సంచిక

మాయమైపోతున్నాడు మనిషి!

- ప్రొ॥ జి. హరగోపాల్

ఒక సంవత్సరం క్రితం (25 ఆగస్టు 2007) లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌లో జరిగిన అమానుష మైన బాంబు పేలుళ్ళలో దాదాపు నలభై మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ అమానవీయ ఘటన మీద ఒక తెలుగు టి.వి. చానెల్ ఘటనా స్థలం లోనే నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బాధితుల అనుభవము, ఆక్రందన చూస్తే మనం ఎంత దిగజారిన సామాజిక వ్యవస్థలో బతుకుతున్నామో అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. బాధితులు అన్ని రకాల వ్యక్తుల, వ్యవస్థల, సంస్థ ల పట్ల ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
పూర్తిగా చదవండి »

అక్షరాల్ని లోకానికిచ్చి
హఠాత్తుగాఎక్కడికో పయనమయ్యావు
నిరంతర సాహిత్య శ్రామికుడా!
పయనమేదైనా
పచ్చటి బతుకుల కోసమే కదా
పూర్తిగా చదవండి »

-డా//దార్ల వెంకటేశ్వరరావు

ప్రజాసాహితి సాహిత్య, సాంస్కృతికోద్యమ మాసపత్రిక. ఆగస్టు 1977 నుండి నేటి వరకూ నిరంతరాయంగా వెలువడుతున్న పత్రిక. అదీ పీడితుల పక్షాన నిలబడుతున్న పత్రిక. సమాజంలో జరిగే అనేక సంఘటనలకు తనదైన దృక్పథంతో కొనసాగుతున్న పత్రిక. కొన్నిసార్లు రెండు, మూడు నెలలకు కలిపి ప్రచురించినా మూడు వందల సంచికకు చేరువయ్యింది. అలాంటి పత్రిక ఇప్పుడు మూడు వందలవ సంచికకు చేరింది.
పూర్తిగా చదవండి »

వెలుగు బాటలైన వలస జీవులు

- వరవరరావు

ముంబాయి.. దుబాయి.. బొగ్గుబాయిల పోలికలు, తేడాల గురించి పిట్టల రవీందర్ చేసిన పరిశీల న, విశ్లేషణ (ఆంధ్రజ్యోతి 12 ఆగస్ట్ 2008) చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మరిన్ని ఆలోచనలను రేకేత్తించేదిగా ఉన్నది. వ్యవసాయ జీవితంలోకి వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు వచ్చినపుడు కొత్త ఉత్పత్తి శక్తుల వికాసం, కార్మిక వర్గం ఏర్పడడం, కార్మిక చైతన్యం, ఆ చైతన్యం తిరిగి గ్రామీణ రైతాంగ జీవితంపై చూపే ప్రభావం - ఇవన్నీ బొగ్గుబాయి, ముంబాయిలకు వలస పోయిన తెలంగాణ పల్లె ప్రజల జీవితాల నుంచి వివరించవచ్చు.
పూర్తిగా చదవండి »

“మెజారిటీ ప్రజల స్వాతంత్య్ర కాంక్ష మైనారిటీ వర్గ ప్రజలలో అభద్రతను పెంచి వారి వలసకు దారితీసింది.”

కాశ్మీర్‌లో మన కర్తవ్యం

- కె.బాలగోపాల్

అవి దేశ విభజన రోజులు. ఉపఖండమంతటా -ముఖ్యంగా ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాల లో నరమేధం జరుగుతున్నది. హిందూ, సిక్కు మూకలు ముస్లింలను, ముస్లిం మూకలు హిందువులనూ సిక్కులనూ నరుకుతున్నారు, సజీవంగా కాల్చి చంపుతున్నారు. ఇళ్ళు తగుల బెడుతున్నారు. స్త్రీలను రేప్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి »

- మహమూద్ దార్వీష్
పాలస్తీనా జాతీయ కవి

(ఫద్వా తుఖాన్ స్మృతిలో)

1.

ఉహు! మాకు గుర్తు చేయనక్కరలేదు
మాలోనే వుంది, మౌంట్-కేరమెల్ పర్వతం
మా కనురెప్పల పైన కదులుతున్నాయి, గెలీలీ లోని గడ్డిపోచలు
మా నేలలోని పర్వతానికీ, భూభాగానికీ, మాకూ మధ్య భేదం ఉందనుకోకండి
దానిని మేం చేరగలమా అని అడగకండి
మేమూ మా దేశమూ ఒకే దేహం ఒకే ప్రాణం .
పూర్తిగా చదవండి »

వెన్నెల మైదానాన్ని కప్పుకొని బస్సెక్కుతాను
వందనోటు చిల్లర వెంపర్లాటలో
దాన్ని ఎటో కుక్కిపెడతాను
ఈ సీటో ఆ సీటో వూగుతూ ప్రయాణంసాగి
పూర్తిగా చదవండి »

మా… తుఝే సలామ్

- అల్లం నారాయణ

ఇక ఇక్కడితో స్వేచ్ఛ అంతమవుతుంది. కనీసం మరో ఏడాది దాకా. అడపాదడపా ఇంటి స్థలం కోసం కూడా తుపాకి తూటాలు స్వీకరించిన వారి స్వేచ్ఛ గురించి మాట్లాడే ఒక సందర్భం రావొచ్చు కానీ, మరో ఏడాది దాకా స్వాతంత్య్రం గురించి మాట్లాడాల్సిందేమీ లేకపోవచ్చు. పొద్దున్నే మెలకువతో ప్రారంభమయింది స్వేచ్ఛ. ‘మా తుఝే సలామ్’ అంటున్నడు రహమాన్. వందేమాతరం అని ఒత్తి పలికి విరిచి, బహుశా అది బంకింబాబు వందేమాతరం కాకపోవచ్చు.
పూర్తిగా చదవండి »

ఇంకెంత మూల్యం చెల్లిస్తాం?

- కె.బాలగోపాల్

జమ్మూలో భారతీయ జనతా పార్టీ నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని చాలా మంది విమర్శిస్తున్నారు. మంటలు మండాలని కోరుకునే వాళ్లు నిప్పుతోనే చెలగాటం ఆడుతారు, నీళ్లతో కాదు. 1953లో షేక్ అబ్దుల్లా అక్రమ బర్తరఫ్‌కు, అక్రమ అరెస్ట్‌కు దారితీసిన ఆనాటి జనసంఘ్ నినాదాన్ని ఎల్.కె. అద్వానీ ఇవ్వాళ జ్ఞాప కం చేసుకుంటున్నాడంటే అన్నీ తెలిసే ఆ పని చేస్తున్నాడు. తన చంచల స్వభావాన్ని రాజకీయ ప్రతిష్ఠ చాటున దాచి యోగ్యుడయిన పాలకుడిగా, ప్రజాతంత్రవాదిగా చలామణి అయిన జవహర్‌లాల్ నెహ్రూ ఆనాడు ఆ ఒత్తిడికి తలఒగ్గి అబ్దుల్లాను నిర్బంధించి నిప్పు రాజేసాడు!
పూర్తిగా చదవండి »