- బెల్లంకొండ రవికాంత్
మైసూర్ వెన్నెల
వెన్నెల ఎక్కడైనా వెన్నెలే…..!
ఈ మైసూర్ వెన్నెలే
నీడలా వెంబడిస్తూ
అర్థంకాని భాషలో అందంగా నవ్వుతుంది
ఈ వెన్నెల పాదాల కింద నలిగిన మట్టి
పున్నాయిపూల పరిమళాలై
తనని కవిత్వీకరించమంటే
ఈ భాషాశాస్త్ర భవనపు మెట్లమీద
పదాలకోసం వెతుక్కుంటున్నాను
ప్రక్కనే ముక్కుపోగు తెలుగువెన్నెల
శీతల మంచై హృదయాన్ని తడుపుతున్నా
కవిత్వం కాలేని భావం
కంప్యూటర్ ముందు జీవితాన్ని యంత్రానువాదం చేస్తుంది
* * *
నువ్వు వెళ్లిపోయిన రాత్రి
దిగులు దీపాన్నై మెట్ల మీద వెలుగుతుంటే
ఆగి ఆగి వీచేగాలి నీ జ్ఞాపకసుగంధమై
దేహాన్ని కప్పుకుంటున్న సమయాన
ఏకాంతంగా ఈ రాత్రిని
వెన్నెలీకరించడమంటే మాటలా……..??
* * *
ఎన్నిమార్లు ఆరుబయటకు రాను…….??
ఎన్నిసార్లు ఈ వెన్నెల్లో తడవను….???
మైసూర్ ప్యాలెస్ బురఖాలో దాగిన
ఓ నా మైసూర్ వెన్నెలా……..!!
నిన్ను అక్షరాలను చేయడానికి
ఎన్ని భాషాశాస్త్ర పరిశోధనలు జరగాలో కదా…….!!!
* * *
పోనీలే…..
ఇలా వెన్నెల్లో తడుస్తూ
కవిత్వానికి మల్లే జీవితాన్నీ పొడిగిస్తూ
వెన్నెలను అనుభూతిస్తూ
వెళుతూ..వెళుతూ
ఈ వెన్నెల రాల్చిన కొన్ని జ్ఞాపకాలను
గుండెనిండా నింపుకెళతాను
ఇప్పుడెవరైనా మైసూర్ లో ఏంచూసావంటే
మెరుస్తున్న కళ్లతో
హృదయాన్ని కాగితంలా పరిచి
వెన్నెల్లో తడిచి ముద్దయిన నన్నూ ఈ అక్షరాలనూ చూపిస్తాను
(మంజిష్టకి, బిందూకి, మైసూర్ వెన్నెలకీ……)
చాలా బగుందందీ
మీ కవిత చాలా బాగుంది…మైసూర్ వెన్నెల్లో తడిచినట్టే వుంది.
మీ కవిత అద్భుతంగా వుంది.
మైసూర్ వెన్నెల కవిత చాలా బాగుంది. ముక్కుపోగు తెలుగు వెన్నెల పదప్రయోగం కొత్తగా వుంది.
వెన్నెల అనుభూతిని పరచినట్టు సాగిన అక్షరాలు ఏరుకుని హారంగా దాచుకుంటాను.
ఎప్పుడైనా వెన్నెల పలుకరిస్తే
తప్పక వీటితో సరిపఓల్చుకుంటాను.
అభినందనలు రవికాంత్
జబర్దస్తి కైత రాసిన కవికి మా తెలంగాణ పబ్బతులు.
గిట్ల మీరు గిసొంటి కైతలు ముందు, ముందు మస్తుగ రాయాలని
దిల్ ఖుష్ గ కోరుకుంటున్నాను.
మీ అభిమాని
పసునూరి రవీందర్.
ద్స్జ్ఫక్జ్స్దఫక్ల
ఈ థిన్క థెరె ఇస సొమె ప్రొబ్లెమ వఇథ థిస సితె
తొ త్య్పె ఇన ఉనిచొదె తెలుగు
మీరు మైసూరు వచ్చినప్పుడు నన్నుకలవలేదే ? :)
((అన్నట్టు అచ్చ తెలుగులో టైపు చేస్తుంటే (ఆంగ్ల అక్షరాలు వాడకుండా..) మీ సైటు స్వీకరించట్లేదు. అలానే ఆంగ్లములో కమెంటు పెడదామన్నా మంటనక్కలో వీలు కావట్లేదు…
ఐయ్యిలో కాపీ పేస్టు చేసి ప్రయత్నిస్తున్నాను. ))
చాలా బాగుంది
వెన్నెలీకరించడ మనే మాట వెన్నెలంత హాయిగా ఉంది.
మీ కవిత చాలా బావుంది