అడవి తల్లి బిడ్డలుగ పుట్టుడే మా పాపమా
కొండ కోనల్లో మేము వుండుడే మా నేరమా
మా …. ఆడోల్ల చెరచబట్టిరో ….. పోలీసులు
మొగోల్ల చంపబట్టిరో … పోలీసులు
|| అడవి ||
అన్నలకు అన్నంపెట్టి ఆశ్రయం ఇచ్చారని
కూంబింగ్ పేరుచెప్పి గూడేలు చుట్టుముట్టి
నిన్న మొన్నకన్న పచ్చి బాలెంతల బట్టి
చెరబట్టి చెరచబట్టిరో ….. పోలీసులు
మానాలు దోయబట్టిరో ….పోలీసులు
|| అడవి ||
అర్ధరాత్రి ఇండ్ల మీద దాడిచేసి పట్టుకెల్లి
చిత్రహింసలు పెట్టి కాళ్ళు చేతులు కట్టి
తుపాకులు ఎక్కుపెట్టిరో …. పోలీసులు
మా ప్రాణాలు తీయబట్టిరో … పోలీసులు
|| అడవి ||
సోదాల పేరుచెప్పి ఇండ్లల్లో దూరగొచ్చి
చిందర వందర చేసి డబ్బులన్ని దొబ్బుకెల్లి
ఆగమాగం చేస్తున్నరురో …. పోలీసులు
దొంగలుగ మారిపోయిరో ….. పోలీసులు
|| అడవి ||
ఎన్నాళ్ళీ నేరాలు చూస్తు వూరుకుందాము
ఎంతకని ఈ ఘోరాలు బరించి బత్కుదాము
ఏకమై ఎదురు తిరగరో … ఈ పాలకుల
ఆగడాలకు గోరి కడుదాము ….. ఈ పోలీసుల
ఆగడాలకు గోరి కడుదాం
సౌజన్యం:
ప్రజాసాహితి
నవంబర్ 2007
చాలా బాగుంది
నాకు చాలా బాగ నచింది