నిజాంను ఎత్తుకోవడం జనాన్ని అవమానించడమే!
- నందిని సిధారెడ్డి
మరోసారి కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్య చేశారు. ఈ సారి వ్యాఖ్య వరకే ఆగకుండా సాగదీసి నిర్భయంగా సహజ అతివాదానికి పూనుకోవటం మరింత చర్చకు దారితీసింది. నిజాం రాజులు మంచివారని, వాళ్ల పాలన భేషుగ్గాఉందని సమాధి దగ్గర ప్రస్తుతించటంతో పాటు తర్వాత అదేమాట వెయ్యి సార్లు అంటానని ప్రకటించుకున్నారు.
తెరాస ప్రతినిధి ప్రకాశ్ అయితే గ్రామ గ్రామాన నిజాం విగ్రహాలు నెలకొల్పుతాని కూడా పొడిగించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లకోసం కెసిఆర్ అట్లా మాట్లాడి ఉంటారని అనుకొన్నప్పటికీ ఆ అభిప్రాయం యొక్క ఉచితానుచితాలు గణించవలసిఉన్నది. వర్తమాన తెలంగాణ అస్తిత్వ నిర్మాణ సందర్భంలో సైతం నిజాం ప్రస్తుతికి ఏరకంగానూ అర్హులు కారు. చంద్రశేఖర్‌రావు మరికొందరు ఏకరువు పెడుతున్న అసుపత్రుల నిర్మాణమో, రైలుమార్గాలో, చెరువులో, పట్టువస్త్రాల సమర్పణో నిజాంలకు స్తుతియోగ్యతను సంపాదించి పెట్టలేవు. ఏరాజు పాలనైనా బాగుందో లేదో నిర్ణయించవలసింది దానిని అనుభవించిన ప్రజలు. నాయకులో చరిత్రకారులో ఎంతమాత్రమూ కాదు. రాజు ప్రజల పట్ల అవలంబించిన విధానాన్ని బట్టి ఆ పాలన మంచి చెడులు ప్రజలే నిర్ధారిస్తారు.
అభివృద్ధి పనులే నిర్ణయ సూత్రాలయితే భారతదేశానికి అప్పటి బ్రిటిషు వాళ్లు, తెలంగాణకు ఇప్పటి వలసాంధ్రపాలకులు ఎంతో కొంత అభివృద్ధిని చూపి ఉన్నారు గనుక మంచి పాలనని అనగలమా? ఇప్పటికే తెలంగాణ ఉద్యమం అనేక సార్లు ప్రకటించినట్లు అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు. కెసిఆర్ కూడా గతంలో ఈ అభిప్రాయం ప్రకటించి ఉన్నారు. నిజాం రాజులు తెలంగాణ విషయంలో చేసిన అభివృద్ధి కంటే ప్రయోగించిన అణిచివేత ఎక్కువ. దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీల ను రప్పించి నియమించారు. స్థానికులు అందోళనకు దిగిన తర్వాతే ముల్కీ నిబంధనలు రూపొందించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ‘అరబ్బీ-అమృతం, పారశీ-తేనె ఉర్దూ-కండశర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలికింది దుమ్ము’ అని ఈసడించుకున్నారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు. ఏ కాలంలోనయినా రాజులకు కితాబులు ఇవ్వాలంటే ఆనాటి ప్రజలజీవితం పరిశీలించాలి. సాధారణంగా పాలకుల గుణ నిర్ణయం చేయదల్చుకున్నప్పుడు నాలుగు అంశాలు ప్రధానంగా దృష్టి లో ఉంచుకోవాల్సిఉంటుంది.
ఆర్థిక పరిస్థితులు, పన్నుల విధానం, సామాజిక జీవనం, సాంస్కృతిక వికాసం. ఏ కోణంలోంచి చూసినా నిజాంల పాలన యోగ్యమైంది కాదనటానికి అనేక ఆ«ధారాలున్నా యి. నిజాం కాలంలో నిజాం స్వంత ఆర్థికవ్యవస్థ, జాగీర్దార్ల ఆర్థిక జీవితం స్థితిమంతంగా ఉన్నమాట నిజం. కానీ - ప్రజల ఆర్థిక పరిస్థితి పరమదయనీయంగా ఉన్నది. ‘ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగని’ అర్థికస్థితి ఆనాటి ప్రజలది. గడియపుర్సతులేదు, గవ్వ అందాని (ఆదాయం) లేదు. పన్నుల విధానం మరీ భయంకరం. బ్రిటిష్‌వాళ్లు, నిజాం ప్రభువు, జాగీర్దార్లు, అధికార్లు-నాలుగంచెల స్థాయి వాళ్లు తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108మందిని కాల్చి చంపారు. నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా ‘బాంచె’లు. సామాజికంగా వెట్టి అనే దారుణదురాచారం అమల్లో ఉండింది.
కులాల వారీ గా, వృత్తుల వారీగా దొరలకు, జాగీర్దార్లకు, రాజులదాకా వెట్టి పని చేయాలి. ఎన్నిరోజూలయినా కూలి ఉండదు. కాల పరిమితి ఉండదు. స్త్రీలు ఎన్ని రకాలుగా పీడించబడ్డారో చెప్పలేం. తిరిగి తల్చుకోలేని సామాజిక హింస ఆ నాటి నిరంకుశ పాలనకు గుర్తు. సాంస్కృతిక అణచివేత మరింత అధికం. అక్షరాస్యత మూడు నుంచి ఆరుశాతం మాత్రమే. పక్క ప్రాంతం లో బ్రిటిష్ పాలకులు విద్యా సంస్థ లు నెలకొల్పుతూ ఉంటే ఇక్కడ విద్యాసంస్థ నెలకొల్పుకోవటాని కి వీల్లేదు. ఉన్న నిజాం కళాశాల లో అడ్మిషన్ కోసం సురవరం ప్రతాపరెడ్డి ప్రయత్నిస్తే జాగీర్దార్ల పిల్లలకు తప్ప సీటివ్వవీల్లేదని తిరస్కరించారంటే పరిస్థితి తీవ్ర త బోధపడుతుంది. ఇదీ నిజాం రాజుల పరిపాలనా చిత్రం. కాగా- మహబూబ్ అలీ కాలంలో కొంత అభివృద్ధి జరిగిందనీ, మిగతా ప్రభువుల కంటే మంచివాడనీ కొందరు భావిస్తారు. అదీ అర్థసత్యమే.1890ల్లో కాంగ్రెస్ శాఖ ప్రారంభించిన తర్వాత 1901 శ్రీకృష్ణదేవభాషానిలయం స్థాపన తర్వాత చైతన్య ప్రకియ ప్రారంభం కావటం వల్ల కొన్ని అభివృద్ధి పనులు చేపట్టవలసి వచ్చింది.
మహబూబ్ అలీ కాలం నాటి రెండు వృత్తాంతాలు పరిశీలిస్తే పాలన స్థాయి, నైజం అవగతమవుతాయి. ఖమ్మంజిల్లా వైరా ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మహబూబ్అలీ పన్నులు విపరీతంగా పెంచేశాడు. దిక్కుతోచని రైతులు గుంపు కూడి వచ్చి రాజుతో మొరపెట్టుకున్నారు. ‘కష్టమైనా పన్నులు కట్టాల్సిందే. మీరు కాదంటే అవతల (కోస్తా) ప్రాంతం నుంచి రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పిలిపించి వ్యవసాయం చేయించుకుంటాను, భూములు ఖాళీ చేయండి’ అంటూ భయపెట్టాడు. సురవరం ప్రతాపరెడ్డి ఈ ఘటనను ‘గోలకొండ’లో రిపోర్ట్ చేశారు. అట్లాంటిదే - అదేకాలంలో జరిగిన మరో వృత్తాతం వెలుగులోకి తేవలసి వున్నది. నిజామాబాద్ జిల్లాలో షాదుల్లా హుస్సేన్ అనే ముస్లిం ఒక తాలుకా రెవెన్యూ అధికారిగా పని చేసేవాడు. కంచెర్ల గోపన్న (రామదాసు) కంటే గొప్పవాడు. భయకరమైన కరువు బారిన పడ్డ ప్రజల అవస్థలు చూసి కరిగిపోయాడు. ప్రభువుకు పంపవలసిన సొమ్మును ప్రజలకు పంచిపెట్టాడు. మహబూబ్అలీ రెవెన్యూ కోసం ఒత్తిడి తెచ్చాడు. ప్రజల స్థితిని వివరిస్తూ, శిస్తు, ఆదాయం తిరిగి పంచిపెట్టిన విషయాన్ని తెలియచెబుతూ షాదుల్లా లేఖ రాసి పంపాడు. ధనం కట్టాల్సిందే, కట్టకపోతే శిక్ష తప్పదని హెచ్చరించి అధికారిని బంధించటానికి నిజాం సైన్యాన్ని పంపాడు. షాదుల్లాహుస్సేన్ అడవిలోకి పారిపోయి తలదాచుకున్నాడు.
సైనికులు అన్నం తీసుకెళ్ళే గొల్లస్త్రీని పట్టుకొని హింసించి షాదుల్లా ఉనికి తెలుసుకుని అతడిని బం«ధించబోతే తప్పించుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రజలను బతికించటానికి షాదుల్లా ప్రాణాలు ఇచ్చాడు. అప్పటి నుండి హిందువులు, ముస్లింలు ఉమ్మడిగా ప్రేమించే షాదుల్లా జ్ఞాపకంగా పెద్ద జాతర జరుపుకుంటారు. అదే పెద్దగుట్ట జాతర. అంతకు మించి మతసామరస్యంలేదు. తమ కోసం జీవించిన వాళ్లను ప్రజలు అట్లా గౌరవిస్తారు. ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా దౌర్జన్యంగా పాలించిన నిజాం నెట్లా గౌరవిస్తారు? ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ దుష్కృత్యాలన్నీ పుస్తకాలనిండా లిఖించబడి వెక్కిరిస్తుంటే కీర్తించటానికి మనసెట్లా ఒప్పుతుంది ? నిజాం పోలి న రాజు ఎన్నడూ చరిత్రలో కానరాడనీ, జన్మజన్మాల బూజు అనీ దాశరధి ఊరకనే వర్ణించలేదుగదా ముస్లిం అయినా మగ్దుం మొహియుద్దీన్ కవిత్వంలో, షోయబుల్లాఖాన్ పత్రికా రచనలో నిజాం దౌర్జన్యాన్ని ఖండించిన చరిత్ర సరదా కాదుగదా!
తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని ఉద్వేగ పర్చే మహత్తర స్ఫూర్తి నిజాం వ్యతిరేకోద్యమానికి ఉన్నది. ఆ ఉద్యమం కేవలం రాజాకార్లనో జాగీర్దార్లనో వ్యతిరేకించేది మాత్రమే కాదు. వీళ్లందరికి బారాఖూన్ మాఫ్ అధికారాలిచ్చి పెంచిపోషించిన నిజాం రాచరిక వ్యవస్థను రూపు మాపేందుకు ఉద్దేశించింది. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల,రచయితల, ప్రజల సంఘటిత క్రమ- పరిణామపోరాటమది. నిజాంను ఎత్తుకొని పోరాటాన్ని కుదించడం తెలంగాణను ప్రజలను అవమానించటమే. బతికుండి అప్పుడూ, మరణించి ఇప్పటికీ ఉద్యమాల్ని ఉడుకెత్తిస్తున్న రచయితలను, యోధులను అవమానించటమే. కాల్పనికంగానైనా తెలంగాణ ప్రజలు నిజాంలను మోయదల్చుకోలేదు. నిజాం రాజులు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో కెసిఆర్ తేల్చుకోవాలి. రాజకీయాల కొరకైనా, ఉద్యమాల కొరకైనా ప్రజల్ని ప్రేమించటం అలవాటు చేసుకోవాలి.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
డిసెంబరు 4, 2007
——————————————————————————–
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
కె సి ఆర్ స్పష్తంగా వున్నాదు, మీలొ అంథా స్పష్తాథ లెధు
ఎల్చన్ల నాలుగు ఓట్లకోసం, రెండు సీట్ల కోసం కెసిఆర్ ఏమైనా చేస్తడు. కాంగ్రెసోని తో దోస్తనీ, బిజెపోనితో బాత్కానీ, మతోన్మాద శక్తుల సోపతి పడ్తాడు. తెలంగాణ తెచ్చుడు కన్నా గద్దె మీద ఎక్కువ నజర్ వున్నది. అవకాశ వాద రాజకీయలలో చెన్నెరెడ్డి తొవ్వలో పోతున్నడు తమ్మి.
ఈ వ్యాసం బాగుంది. రచయితకు రాజకీయాలుండవు - ఆశయాలు మాత్రమే ఉంటాయని ఋజువు చేస్తుందీ వ్యాసం. ఓట్లకోసం చరిత్రను వక్రీకరించడం రాజకీయనాయకులకు మాత్రమే చేతనవును. అది రచయితలకు రానిపని. సిధారెడ్డికి అభినంధనలతో..
అగ్రకుల తెలంగాణ వాదులకు నిజాం షత్రువు. కానీ దళితులకు , ముస్లిములకు నిజాం గొప్ప ప్రభువు కాకపోయినా షత్రువు కాదు. ఈ నాటి ముఖ్యమంత్రులకన్నా నిజామ నికృష్టుడు కాడు. రజాకర్లను నిజాంకన్నా ఎక్కువ ప్రయోగించిన వారు నాటి అగ్రకుల (రెడ్డి, దేశ్ముఖ్) భూసవఆములే. వారి వారసుల్లో చాలామంది ఈ నాడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా గడీల్లో వున్న వారు ఇవాళ నిజాంను దుమ్మెత్తి పోస్తున్నరు. నిన్నటిదాక పెత్తనాలు చేసిన కుటుంబాల వారసులు
ఇనాడు తెలంగాణ వాదులవుడు ఎట్ల , నిజాం షత్రువులాగ కనిపించుడెట్ల ….?
ఇందిర గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. హైదరాబాదును పరిపాలించింది ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఒక్కడేనా అతన్ని అడ్డాంపెట్టి, రజాకార్ను అడ్డం పెట్టి మొత్తం చరిత్రలో ముస్లింపాలకులు దుర్మార్గులని రంగులద్దడం భావ్యం కాదు. నిజాం దుర్మార్గుడైతే ఈ నాడు ఇంతమంది వెలమ, రెడ్డి,బ్రాహ్మణ(కరణం) ఇతర అగ్రకులాల భూస్వాముల దగ్గర ఇన్ని వేల వేల ఎకరాల భూములు ఎందుకున్నట్టు.
పోరాటాలను కీర్తించడాం కోసం నిజాంను రోజు రోజుకు మరింత దుర్మార్గుణ్ని చేయడాం కుట్ర తప్ప మరేమీ కాదు.రాజులుగా నిజాంల పాలనలో క్రూరత్వం వుండి వుంటుంది. (ఈనాటీ పాలకులతో సహా రాజులు దుర్మార్గులె) కానీ నిజాంని హైలైట్ చేయడాంలో ఆనాటి హిందూ అగ్రవర్ణ చరిత్రకారులు రచయితలు సఫలం అయారు. ఇవాళ వారి వారసులు ఆ చరిత్రను చర్చ జరగకుండా నిలబెడుతున్నారు.
It is painful to know certain people are still lingering in the medieval periods and its psychological trends. Writer’s wellbalanced,
propeople article is good and is adressing the woes of the downtrodden only. As writer says the politicians for elections and power should atleast try to love people. But they are creating and
enacting sham dramas to lure people. Mm. Indira and Mr. Rahamatulla should not live in the world of psychology of Robinhood to whom king is benevolent and his officers are bad. It is in reality, outlook of compromise and conservative convenience. It is people who create history , not the whims and fancies of any single person
either Nizam or Rayalu. Present menace whatever that may be, can be repulsed by popular consent and wellsteered movements. And stamping the yesterera a wonderful period for the toiling masses with the sanctions of any king is a futile exercise in darkness.
ఉమా సార్ తెలుగులో రాస్తే బాగుండేది.
సైకాలజి అన్నడు, రాబిన్ హుడ్ అన్నడు.ఇంకేందో అన్నడు. మొత్తం మీద మమ్ములను మధ్యయుగాల్లో తిరుగులాడుతున్నమని మా మైండు గిట్ల మధ్య యుగాలదేనని చెప్పినట్టు అనిపించింది. సారూ నీలెక్క నాకు ఇంగ్లీసు తెలవదు. నీ అంత సదువు గిట్ల సదువలెదు. గానీ చరిత్ర రాసినోడు ఎవరైతే వానికి నచ్చినోడు అన్ల హీరో అని నచ్చనోడు జీరో అని నాకనిపిస్తది. రాసినోనిది ఏ కులం, ఏ ప్రాంతం, ఏ సిధ్ధంతం, ఏ భావజాలం గియన్ని పనిజేస్తయి. కాదా సారూ…
తెలంగాణల అగ్రకులాలకు, జాగీర్దార్లకు, కమీనిస్టులకు నిజాం నచ్చడు. తెలంగాణ చరిత్ర రాసినోల్లంత వీల్లేగద. దాషరధితో సహ ఈనాటికి విమర్షించేటోల్ల దాక.
సరెగాని, జర తెలుగుల జెప్పరాదు సారూ.. నాకు గిట్ల అర్ధమైతది .. నీకు జరంత పున్యముంటది.మొత్తం అర్ధమైతె నీకు జర గట్టిగ జవాబిస్త..
రహమతుల్లా గారూ ఇలా తెలుగులో
టైప్ చేయడం నాకు అలవాటు కావడం లేదు.క్షమించండి.రాజులు రాజులే.వారు ఇనాములిచ్హినా బిరుథులిచ్చినా తమ స్థ్హాయివారికే,అగ్రకులాలవారికే.బడుగు జనం మీద వారికి ప్రేమ పూర్తిగా వుండకూడథు.వుంటే వారికి ఆసింహాసనం ఉండథు.ఓక్కమనిషి పరిపాలన వుంటుంథా? తమబతుకుల్ని లాగలేక బదుగువారు పాత కాలాన్ని మెచ్హు కున్నంత మాత్రాన అది స్వర్ణ యుగం కాభోదు.అలా మె చ్హుకునే ఆవసరం మత వాదులకి వదిలే ద్దాం.ఆర్ ఎస్ ఎస్ వారు పాపం చరిత్రను తిరగరాయటానికి ఎన్నితిప్పలు పడ్ద్దుతున్నారో.చరిత్ర నిజంగారాసేది జనమే అది కష్టపడేవారే
ఇంకో విషయం మీరు చెప్పినట్లు చరిత్రను రాసేవారేకాదు చరిత్రనుఅధ్యయనం చేసేవారుకూడావారివారి అనుభవాలు, మత సాంఘిక రాజకీయ అనుబంధాలతో చరిత్రను చూస్తారు.అందుకే మనకు అవైయక్తిక జనపరమైన పూర్తివిషయజ్ఞానంతో కూడిన అవగాహన అవసరం.
సిద్ధారెడ్డి రాస్తే అది అగ్రకులం సృష్టించిన చరిత్ర. ఇందిరగారు చెప్పింది దళితులు రాయని చరిత్ర. మరి ముస్లిములు నిజాం మంచివాడని రాస్తే ఎలా, ఎందుకు నమ్మాలి. మా రాజు శాన మంచోడు - ఆయన మందీమార్బలమే చెడ్డది అనుకుంటే బానిసత్వం కాదా. మన రాజకీయ అవగాహనలకు , అపవిత్ర సాహిత్య సమీకరణలకు అతీతంగా ప్రజల దృష్టినుంచి చరిత్రను తెలుసుకోలేమా. అర్థం చేసుకోలేమా…
ఉమా సార్ చరిత్ర రాసినవారు ముందుతరాల్లో సదువుకున్న పెద్దకులపోల్లు, కిందికులాలు, ఎనకబడ్డజాతులు ఇప్పుడిప్పుడే సదువుకుంటున్నరు. తమగురించి తమ ఎనకటి మనుశుల గురించి చరిత్రల రాసిన తప్పుల గురించి ప్రష్నలేస్తున్నరు. అందుకె గద దళిత సాహిత్యం వచ్చినంక షంభూకుని జంపిన రామునితప్పు చర్చ కొచ్చింది, ఏకలవ్యుని బొటనేలు గురించి దళితులు నిలదీసింది. జరిగిన తప్పులను సవరించుకోవచ్చుగద. పోనీ అని వదిలేస్తె పెద్దోళ్ల తప్పులన్ని వదిలెయ్యాల, చిన్నోల్లు ఇదేందని అడిగినందుకు నేరస్తులు గావాల.. ఇదెక్కడి న్యాయం?
“అవైయక్తిక జనపరమైన పూర్తివిషయజ్ఞానంతో ” అన్నరు గదా..(ఇంత బరువైన తెలుగు కూడ కశ్టమే సారూ) అసలు వైయక్తికం కానిది ఈ దేషంలో ఏంఉంది? ఏ జనపరమైన పూర్తి విషయగ్నానం గురించి మీరు మాట్లాడు తున్నారు..ఈ దేషంలో జనం అంతా ఒకటికాదుకదాలోభారతీయులంతా సహోదరులు కాదుకదా! అయితే ఇన్ని విభజన రేఖలేమిటి?ఎవరు గీసారు..
…………..
సిద్దార్థ సార్ గిట్ల చానాగట్టిగ ప్రష్నలేసిండు .. మంచిగుంది.. సార్ ఏమంటడంటే ..
“”మా రాజు శాన మంచోడు - ఆయన మందీమార్బలమే చెడ్డది అనుకుంటే బానిసత్వం కాదా. మన రాజకీయ అవగాహనలకు , అపవిత్ర సాహిత్య సమీకరణలకు అతీతంగా ప్రజల దృష్టినుంచి చరిత్రను తెలుసుకోలేమా.”"
సారూ సాయిబు గాబట్టి మారాజని చెప్తలేను. పాలకుడు ఎవడైన దుర్మార్గుదే అని చెప్పిన .. జర సదివి రాయరాదు సారూ .. మరీ తెలివి తక్కువోడు వీడు రాసింది సదువుడేందని అనుకోకు సారూ…
బలే చెప్పినవ్ సారు .. ఏప్రజల ద్రుస్టినించి చరిత్రను తెలుసుకోవాల్నో గూడ జర చెప్పరాదు. ప్రజలంతే ఆంధ్రా ప్రజలా? తెలంగాణా ప్రజలా? రాయలసీమ ప్రజలా? బ్రామ్మలా? రెడ్లా? కమ్మలా? వెలమలా? మాలలా? మాదిగలా? 93 బహుజనులా? లంబాడాలా? కోయలా? కొండరెడ్లా? ముస్లిములా? దూదేకులా? పురుషప్రజలా? స్త్రీప్రజలా? పాలకులా? పాలితులా? ఏప్రజల ద్రుష్టినుష్టినువ్వు చూస్తున్నావో చెబితే నేను ఆప్రజల ద్రుష్టినించి చూడగలనో లేదో చెప్తాను. ప్రస్తుతానికి నేను తెలంగాణా, గ్రామేణ, పేద, ముస్లిం ద్రుష్టినించి చూస్తున్నాను.
నువ్వు చెప్పినట్టు బానిసలమే సారూ లేకుంటే మేం ఇక్కడా కంపెనీల్లో కాంట్రాక్టు పనోళుగా, రోజు కూలీలుగా, వలస కార్మికులుగా, రెండొతరగతి మనుషులుగా, తెలివి తక్కువవాళ్లుగా చూడబడుతున్నా ఎదురుతిరగనందుకు, న్యాయం గురించి, హాక్కుల గురించి నోటితో అడుగుతున్నందుకు మేం బానిసలమే సారూ.. కానీ బానిసలకూ ఓపిక నషిస్తుంది… బానిసలకూ ఓ రోజొస్తుంది…
రహమతుల్లాగారూ మీరు చెప్పింది నిజమే- చదువుకు అవకాశమున్నవాళ్ళే రాత చరిత్రను మనకి అందించారు.ఆర్దికకారణాలు, సాంఘిక విప్లవాలు, జనం వారిలో భావపరిణతిని తెచ్చి వాళ్ళే చరిత్రను బహుళ జనపక్షంగా చెప్పాలని చెప్పారు, చేసారు.మీలోవున్న భావచైతన్యం వెర్రితలలు వేస్తున్న అస్తిత్వవాథంలో దాక్కోకూడదు.ఆ చైతన్యం వ్యక్తిగతమైన నిరాశలో మిగిలిపోకూడదు. ఫీడనకు గురిఅయ్యేవారంథరికి మాట, చేత కావాలి.మొత్తం సాంఘికవిప్లవంలో భాగస్వాములు కావాలి.పుట్టుక అందరికి వరం కావాలి.తేడాలస్వామ్యం లో బతుకు వుండకూడదు.ప్రజాపక్షంగా చరిత్రచెప్పటం ఏమిటో ఇర్ఫాన్ హబీబ్ గారు చెప్పారుగా.
అన్నా నువ్వు తెలివితక్కువోడని నేననుకోలేదన్నా. అలా రాస్తే మన్నించు. అగ్రకులపోడు చెప్పినందుకే అది తప్పు అనటం తప్పుగదన్నా. నేను బానిసలు అని చెప్పిన సందర్భము వేరుగదనే. అది జూడకుండ బానిసలకూ ఓపిక నసిస్తది, బానిసలకూ ఒకరోజస్తది అని చెప్పడమేందన్నా.. అచ్చం మన తెలుగు సిన్మల చెప్పినట్టు. సదువుడేగాదు సందర్భమూ సూడాల గద. సందర్భం లేక మనసదువులు ఇలా సట్టుబండలవుతున్నయిగదనే.
తెలంగాణ గ్రామేణ పేద ముస్లిం (?) నుంచి నువ్వు నిజంగజూస్తే నిజాం రాజు మంచిగెట్ల కనపడ్తడు. నువ్వు కళ్ళుమూసుకుని చెప్పినోడు అగ్రకులపోడు గనక అది తప్పంటావు. ఇట్ల చేసుడు మంచిదేనా. ఇట్టపోవుడులో చివరికెవరి కొంపలు మునుగతయి. ఎవరి కొంపలు పైకి తేలుతయి. ఇది ఆధిపత్యభావజాలాన్ని తిరస్కరిస్తూనే మళ్లీ దాన్నే తిరగ తొడుగుడుగాదా…
సిధ్ధార్థ సార్!
నువు రాసిన రెండు మాటలు సూడు
“మా రాజు శాన మంచోడు - ఆయన మందీమార్బలమే చెడ్డది అనుకుంటే బానిసత్వం కాదా” అన్నవ్.. బానిసలు ఎప్పటికి బానిసలుగా వుండరు .. వాల్లకీ ఒక రోజొస్తదని నేను చెప్పిన. చెపితె నువ్వేమన్నవ్..
“నేను బానిసలు అని చెప్పిన సందర్భము వేరుగదనే. అది జూడకుండ బానిసలకూ ఓపిక నసిస్తది, బానిసలకూ ఒకరోజస్తది అని చెప్పడమేందన్నా.. అచ్చం మన తెలుగు సిన్మల చెప్పినట్టు. సదువుడేగాదు సందర్భమూ సూడాల గద. సందర్భం లేక మనసదువులు ఇలా సట్టుబండలవుతున్నయిగదనే.” ఇన్ల ఏం సందర్భం వుందో కొంచెమ చెప్తె తెల్సుకుంట జర చెప్పరాదు తమ్మీ…టైపు చేస్తున్నగద ఏం రాస్తె ఏమున్నదిలె అనుకోవద్దు తమ్మీ జర ఆలోచనచేసి, చర్చకు పనికొచ్చేటిది రాయాలె.”తెలుగు సిన్మల జెప్పినట్టు, సదువులు సట్టు బండలు” అని నువు రాస్తే అవి నీ విశయాన్ని జెప్పవు తమ్మీ నువు చర్చని దాటవేసి, తప్పించుకోజూస్తున్నవని చెప్తయి. నువు బుకాయిస్తున్నట్టు చదివేవాళకు అర్థమైతది. నీ గౌరవం, విలువ తగ్గి పోతయి. చర్చలో అది మంచిది కాదు.
ఇక “తెలంగాణ గ్రామేణ పేద ముస్లిం (?) నుంచి నువ్వు నిజంగజూస్తే నిజాం రాజు మంచిగెట్ల కనపడ్తడు” అన్నవ్ గదా మల్లీ చెప్తున్న. నేను నిజాం చర్చను ప్రస్తుతానికి తెలంగాణా, గ్రామేణ, పేద, ముస్లిం ద్రుష్టినించి చూస్తున్నాను.నిజాం రాజు మంచివాడని నేను చెప్పలేదని కూడా ముందే చెప్పాను. నిజానికి నిజాం రాజు “ఒక్కడు” కాదని కూడా చెప్పి వున్న. హైదరాబాదును పాలించిన ఏ నిజాం రాజు చెడ్డవాడాని దుర్మార్గుడని చెబుతున్న మీరు చెప్పాలి ఎన్నో నిజాం చెడ్డవాడో.
నేను కళ్ళు మూసుకొని చెప్పానని భూస్వాముల భాశలో చెప్తున్నవ్..నేను చరిత్రకు సంబంధించిన ప్రష్నలు లేవనెత్తా…ప్రజల దృష్టి అంటే ఏప్రజల దృష్టి అని అడిగా.. నువ్వు వాట్కి సమధానం చెప్పకుండా నన్ను కామెంట్లు చేస్తున్నవ్ తమ్మీ..నేను ఏదృష్టితో చరిత్రను చూస్తున్ననో గూడ చెప్పిన. నీకు అర్థం గాలె.
మల్లీ అడుగుతున్న-
1. నిజాం రాజుల్లో ఏనిజాం చరిత్రను మీరు చదివి మాట్లాడుతున్నార? (నువ్వు గాని సిధ్ధారెడ్డిగాని, మరొకరుగాని)
2. ఆ చరిత్ర రాసిన వారు ఎవరు ? (ప్రాంతం, కులం, మతం, వర్గం, సిధ్ధాంతం)ఎవరి కోణం నించి రాసారు?
3. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో బలమైన,ఆధిపత్య,ధనిక కులాలు ఏవి? ఎందుకు?
4. తెలంగాణలో ముస్లింలకు,దళిత కులాలకు వున్న ఆస్థులు ఏంటి?
5. కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో పేద, గ్రామీణ ముస్లిములను ఎలా అర్థం చేసుకున్నాయి?
6. మీరు “అపవిత్ర సామాజిక సమీకరణలు” అన్న మాట ఏ సమీకరణలను, ఏ వర్గాలను, ఏ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు?
7. మీరు చెబుతున్న “ప్రజలు” “జనందృష్టి” “అవైయక్తిక జనం” వంటి మాటల్లో జనం ఎవరు? (వారిది ఏ ప్రాంతం,ఏకులం, ఏమతం,ఏవర్గం,ఏసిధ్ధాంతం: లేదా అందరూ మీ దృష్టిలో ఒకటేనా ?)
8. తెలంగాణ వుద్యమం పేరిట తలెత్తే వుద్యమాలకు ప్రతిసారీ ఎందుకని ఒకటి రెండు వర్గాల వారే నాయకత్వం వహిస్తున్నారు? ఇది యాధృచ్చికమేనా?
9. సిధారెడ్డి చెప్పినట్టు “కులాల వారీ గా, వృత్తుల వారీగా దొరలకు, జాగీర్దార్లకు, రాజులదాకా వెట్టి పని చేయాలి. ఎన్నిరోజూలయినా కూలి ఉండదు…” ఈ అణిచివేత లో గ్రామీణ తెలంగాణలో ఏ కులాలు ఏ పాత్ర పోషించాయి..పోషిస్తున్నాయి..ఈ చరిత్ర ఎక్కడ రికార్డయింది..అన్నాళ్లూ చరిత్ర రాసిన చరిత్ర కారుల కళ్లకు ఆ చరిత్ర ఎందుకు కనపడలేదు? ఈ నాటికైనా ఏ అగ్ర కుల చరిత్ర కారుడు/అగ్ర కులసామాజిక కార్య్కర్త/అగ్ర కులవిప్లవ వాది/అగ్ర కులతెలంగాణ వాది ఎందుకు వాటిని రికార్డు చేయలేదు? నిజాం కాలపు /లేదా ప్రస్తుత గ్రామీణ జాగీర్దారులు ఏ కులాల వారు,ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు? ఇవాల్టికీ కొనసాగుతున్న వెట్టి చాకిరీ, జోగిని, అంటరానితనం ఎవరి చరిత్ర, ఎవరి వారసత్వం ఇదంతా ఎందుకని ఆనాటి చరిత్ర కారుల దృష్టికి రాకుండా పోయింది? ఆ చరిత్ర కారులు నిజాయెతీ పరులే కానీ చరిత్రలో నేరస్తులంతా తప్పించుకుపోయిన వైనం ఏమిటి? కమ్యూనిస్టు చరిత్ర కారులు సైతం ఇవన్నీ ఎలా విస్మరించ గలిగారు? వీరిలోని ఏ కోణం/భావజాలం వీరికి ఇవన్నీ కనబడకుండా చేసింది. ఈ చరిత్రంతా అసలు ఏమైనట్టు?
10. ఈ చరిత్ర ప్రభావం, నిజాం దుర్మార్గుడని దుష్టుడని చేసే ప్రచారం, చరిత్రని కప్పిపుచ్చి జరిగే అష్టావక్ర చరిత్ర నిర్మాణం ఎవరి మీద ప్రభావం చూపుతుంది?
ఈ విషయాలను విస్మరించి జనరల్ స్టేట్మెంట్లు ఇవ్వడం వలన ప్రయోజనం లేదు. కాలం మారిదింది. చరిత్ర రాసే వాడు మాత్రమే కాదు చరిత్ర చదివేవాడు కూడా సమాజాన్ని పరిశేలిస్తున్నాడు. చదువుకోని వారు కూడా తమ ఆత్మగౌరవానికి, తమ అస్థిత్వానికి సంబంధించిన ఆలోచనలో మునిగి వున్నారు.
సిధారెడ్డి కెసిఆర్ కు సమాధానం చెపాననుకుంటున్నాడు కానీ చరిత్రను ఒంటి కంటితో, పాత అద్దాలతో, బూర్జువా మేధావివర్గ దృష్టికోణంతో విష్లేషించిన విషయం మరచినట్టున్నాడు. కనీసం దాన్ని సమర్ధించే వారైనా ఆ కళ్లద్దాలను వదలలేరా….?
అన్నా నమస్తే.
నీవు రాసింది సదివిన. నాకు సమజైందేమిటంటే అస్థిత్వవాద సమస్యల్లో ఎవరి దృక్పథాలు వారివి. తెలంగాణా- గ్రామీణ -పేద -ముస్లిం అన్న విభాగంలో ఎన్ని అస్థిత్వాలు దాగున్నాయి. దేని తరవాత ఏది వచ్చింది. పేద తరవాతే ముస్లిం వచ్చింది కదా - నీకు తెలియకుండానే..కాబట్టి మొదట మనం పేదవాళ్ళం - తరవాతనే మన కులమైనా, మతమైనా..
చరిత్ర రాసేవారిపైన లేక రాస్తున్నవారిపైన వారివారి మతప్రభావం ఉందేమోనని నీ అనుమానం కావచ్చు. కొన్ని సార్లు జరిగింది కూడా. అది అందరికీ వర్తించదు లేక అందరినీ ఒకే గాటున కట్టకూడదు. వాళ్ళంతా అగ్రకులాలవారని వాళ్ళది బూర్జువా మేధావి వర్గమని తీసి పక్కనపెడదామా - అసలు విషయాన్ని వదిలేసి.
1. ఒక్క నిజామునేకాదు - అసలు రాచరిక వ్యవస్థను వ్యతిరేకించడం మనిషి అన్నవాడు చెయాల్సిన పని. నేను చెప్పిన బానిసత్వం ఈసందర్భంలోకే వస్తుంది. మళ్ళీ జనరలైజు చెయ్యడం కాదు. ఏ నిజాము చెడ్డవాడో ఎవరు మంచివారో ప్రత్యేకించి చెప్పడం కాదు.
2.చరిత్రని నిరంతరం వ్యాఖ్యానించడమే ఉంటుంది. ఎవరికి వారు వ్యాఖ్యానుంచుకుంటే అది చరిత్రకాలేదు. చరిత్రని చదివేముందు చరిత్రకారుడిని చదవాలి. అతడు తన వ్యాఖ్యానానికి ఎంచుకున్న ఉపకరణాలని పరిశీలించాలి. అతడు ఎంచుకున్న అంశాలు ఎంతవరకు చరిత్రగతిని నిర్దేశించాయో, చారిత్రక గమనానికి , దానిని నిర్దేశించిన అంశాలకు మధ్య సంబంధాన్ని చరిత్రకారుడు ఎత్తి చూపగలగాలి.
3&4:- అంతిమంగా నువ్వు కులదౄష్టితోనో మత దౄష్టితోనో చరిత్రను చూడమంటున్నావు.నిజానికి అది లేకుండా మనదేశ చరిత్రని చూడలేం. ఇక్కడ మనది దౄక్పథానికి చెందిన సమస్య. చరిత్ర రచనకు భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలు కావాలా..ఎవరో చేసిన తప్పునే మళ్ళీ నేను చేస్తానని చెప్పడమే ఇది. - రాజకీయ ఉద్దేశం ఏమైనా.
5. నా దౄష్టిలో కమ్యూనిస్టులంటే ఎన్నికలలో పాల్గొనే మన చవకబారు మరియు ముదిగొండ ఖూనీఖోరు కమ్యూనిస్టులు కారు. కమ్యూనిస్టులంటే నీ దౄష్టిలో ఎవరో.?
6.అపవిత్ర సమీకరణలు - అగ్రకులస్థులు ఎన్నికలకోసం ముస్లిములను వలలో వేసుకోవడమ గురించి.
7. నా దౄష్టిలో పౌరులందరూ ప్రజలే - వీడు అగ్రకులస్థుడు, వీడు ముస్లిము కాడు, వీడు దళితుడు అనుకునే సంకుచిత మనస్కులు తప్ప.
8. తెలంగాణా కావాలని అగ్రకుల రాజకీయ నిరుద్యోగులు చెప్పేంతవరకు మిగిలినవారంతా ఎంచేస్తున్నారు. తెలంగణ సమస్యని ఇన్నాళ్ళు (ముప్పై ఏళ్ళుగా) ఎందుకు లేవనెత్తలేదు.
9. జవాబు నెం.3&4
10. ఒక ప్రశ్నలోనే అనేక ప్రశ్నలున్నాయి. చదువుకున్న వారు, చదువుకోనివారు కూడా తమ ఆత్మగౌరవం గురించి, అస్థిత్వం గురించిన ఆలోచనలో ఉన్నారు. అందరూ కోరుకునేది ఇదే. పేద దళితులు , ముస్లిములు చరిత్రలో మొదటినుంచి తమకొమ్ముకాసిందెవరో తెలుసుకోవాలని అంతిమంగా నా మనవి.
సరె తమ్మీ .. నువె జెప్పినట్టే పేద వాడినన్న దృశ్టిలోనించే చరిత్రెని జూస్త. కానీ నువ్వే మల్లీ ఏ మంటున్నవో సూడు…
” అంతిమంగా నువ్వు కులదౄష్టితోనో మత దౄష్టితోనో చరిత్రను చూడమంటున్నావు.నిజానికి అది లేకుండా మనదేశ చరిత్రని చూడలేం. ”
“చరిత్ర రాసేవారిపైన లేక రాస్తున్నవారిపైన వారివారి మతప్రభావం ఉందేమోనని నీ అనుమానం కావచ్చు. కొన్ని సార్లు జరిగింది కూడా”
“.చరిత్రని నిరంతరం వ్యాఖ్యానించడమే ఉంటుంది. ఎవరికి వారు వ్యాఖ్యానుంచుకుంటే అది చరిత్రకాలేదు.”
నువు రాసిన పై వాక్యాలలో నీకు నీకె పొంతన లేదు.నెవ్వే కాదంటున్నవ్..మల్లీ నువ్వే ఔనంటున్నవ్..మల్లొక సారి సదువు తమ్మీ…..
మల్లి ఏమంటున్నవ్ ” ఎవరో చేసిన తప్పునే మళ్ళీ నేను చేస్తానని చెప్పడమే ఇది.”
నేను చెప్పీంది చరిత్రలో జరిగిన తప్పుల్నీ, రాసిన తప్పుడు రాతల్నీ పదే పదే తిరిగి చేయవద్దని… చరిత్ర రచనలో లోపాలున్నాయని.. వాటిని బ్రాహ్మణీయ అగ్ర కుల దృస్టితో రాసారని..
” 6.అపవిత్ర సమీకరణలు - అగ్రకులస్థులు ఎన్నికలకోసం ముస్లిములను వలలో వేసుకోవడమ గురించి.
7. నా దౄష్టిలో పౌరులందరూ ప్రజలే - వీడు అగ్రకులస్థుడు, వీడు ముస్లిము కాడు, వీడు దళితుడు అనుకునే సంకుచిత మనస్కులు తప్ప.”
ఈ రెండు పర్స్పర విరుధ్ధమైన స్టేట్మెంట్లు. అందరూ ప్రజలే అని నమ్మే మీరు అగ్రకుల్లాలు ముస్లిములను వలలో వేసుకుంటున్నారని ఎలా వాపోతారు..అది అపవిత్ర సమీకరణ అని ఎలా అంటారు.. అసలు వారిని అగ్ర కులాలు /ముస్లిములనేవేర్వేరు దృశ్టితో ఎలా చూస్తారు? కింద వేర్వేరు కాదన్నారు.. పైన వేర్వేరని ఒకరిని మరొకరు వలలో వేసుకోవాలని చూస్తున్నారని అన్నారు.. ఇంత వైరుధ్యమా…..
అందరు ప్రజలూ ఒకటేనని నమ్మే సిద్ధార్ధా ..సంకుచితత్వం ఎవరిదో ఒక్కసారి ఆలోచించు…
చరిత్రను తప్పుగా కొందరికి అనుకూలంగా కొందరికి పూర్తి వ్యతిరేకంగా రాసిన వాడిది సంకుచితత్వమా/ చరిత్రను తమకు అనుకూలంగా ఇతరులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిది సంకుచితత్వమా / చరిత్ర రాసిన వాడు తప్పుగా రాసి వుండవచ్చు, వ్య్ఖానించిన వాడు తప్పుగా వ్యాఖ్యానించ వచ్చు కానీ చదివేవారు మాత్రం దాన్ని ముట్టుకోవద్దు అనే వారు సంకుచితులా?..?
ఇంత కన్ఫ్యూశన్ వాక్యానికి వాక్యానికి కాంట్రవర్సితో మాట్లాడ్డం ఏం బాగుంటుంది చెప్పండి సిధ్ధర్థ గారూ….
అన్నా నమస్తే..నీవు రాసింది సదివిన. మనం వాదించడం కోసం వాదిస్తున్నట్లుంది. దేనికి ఏది ఆపాదించాలో, ఏ సందర్భానికి ఏది (కాంట్రవర్సి) అన్వయించాలో నిర్ణయించేది మన(పరస్పర విరుధ్ధ )అంతిమ తాత్విక దౄక్పథం ఐతే ఇది చాంతాడు చర్చ అవుతుంది. అది పక్కన ఉంచి ఇంతవరకు నీతో వాదించినందుకు మన్నించు.
నమస్తే.
నేను వాదించడాం కోరకు మాట్లాడతలేను.. సిధారెడ్డి లాంటి వారు చేస్తున్న నిజాం వ్యతిరేక రాతలకు, పూర్వపు చరిత్రను ఏకపక్షంగా రాసిన అగ్రకుల,కమ్యూనిస్టు చరిత్ర కారులకు నిజాం ఒక్కడే ద్రోహిలా కనపడ్డాడని నా ప్రష్న. దానికి నువ్వు గాని ఇతర రాసిన వారు గాని సమాధానం చెప్పలే. చరిత్ర రచనలో జరిగిన ద్రోహాలను, వక్రీకరణలను హాయిగా ఆమోదించిన వాళ్లు, ఇవాల్టికి గూడ చరిత్రలో మంచివారుగా ప్రకటించబడ్డా అగ్రకుల భూస్వాములు, వారి వరసులు నిజాంను నిందిస్తూ, ముస్లింవ్యతిరేకత వచ్చే విధంగా ప్రచారం చేయడం గురించే నాప్రష్న. వీటికి సిధ్ధాంతాలు తెచ్చింది మీరు.నేను సాయుబుననై అన్నదిమీరు. నిజాంని వెనకేసుకొచ్చానని అన్నదిమీరు. మధ్యయొగాలలో తిరుగుతున్నానని అన్నదిమీరు.
చరిత్రను తప్పుగా రాసినవారిని, అగ్రకుల, బ్రాహ్మణ,వెలమ,రెడ్డి,దేశ్ ముఖ్ వంటి కులాలలొని భూస్వామ్య, దొరల వారసుల తప్పుడు చరిత్రను బటికి రాకుండ చేసిన అగకుల చరిత్ర కారులను మీరే వెనకేసుకొని వచ్చి చర్చను తప్పు దారి పట్టించారు.
సిధారెడి దగ్గర గానీ,నీదగ్గర గానీ, ఉమా సార్ దగ్గర గానీ మరే అగ్రకుల చారిత్రక విష్లేషకుడి దగ్గరగానీ వీటికి సమాధానాల్లేవు. మీరు వెతకరు. మీకు గత బ్రాహ్మణ చరిత్రకారుల చరిత్రే శిరోధార్యం.
మొత్తం చర్చను, నా ప్రశ్నలను తప్పు దారి పట్టించి, అసలు విశయాన్ని మరిగున పడేలా చేసి చర్చ ముగిద్దామని ప్రకటించావ్…హేట్సాఫ్..
అన్నా.. నీవు రాసింది చదివిన. నిజాం ని ద్రోహిగా చూపించడానికి ముస్లిము వ్యతిరేకత పెంచడానికి పొంతనేమిటో నాకు సమజుగాలేదు. అది నీ భ్రమ. నిజాముని ఒక్కడినే ద్రోహగా చూపినంత మాత్రాన అందరికీ ముస్లిములంటే వ్యతిరేకత ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడంలేదు. అలా వ్యతిరేకత పెంచుకునే వారిపై నాకు గౌరవం లేదు. అగ్రకుల భూస్వాములను, వారి వారసుల తప్పుడు చరిత్రను చెప్పే సందర్భం వేరు. అగ్రకుల భూస్వాముల పనిపట్టిన చరిత్ర మనకులేదా. ముస్లిము చక్రవర్తులను, హైందవ అగ్రకుల భూస్వాములను అలా పక్కన ఉంచి సామాన్య ముస్లిములకి , దళితులకి దన్నుగా నిలిచిన కమ్యూనిస్టులు (కమ్యూనిస్టులంటే నీ దౄష్టిలో బెంగాల మరియు ముదిగొండ ఖూనిఖోరు కమ్యూనిస్టులు కాబోలు) లెవరూ మన చరిత్రలో లేరా.
నిజాము గురించి చెప్పబోయినప్పుడల్లా అగ్రకుల భూస్వాములు, అగ్రకుల చరిత్రకారులు అని చెప్పబోవడంలోని అంతరార్థమేమిటి? వాళ్ళు ముస్లిము వ్యతిరేక దౄష్టితో చరిత్ర రాస్తే నువ్వు హిందూ వ్యతిరేకతతో చరిత్ర రాయబోతున్నావా. అలా అయితే అదికూడా శిరోధార్యం ఎందుకు కావాలి?
నీ ద్రుష్తిలో అగ్రకులస్థులందరూ ఒకటేనా. నువ్వు కూడా వాళ్ళలా చాదస్తపు బ్రాహ్మడిలా మాట్లాడితే ఎలా. చర్చను దారిమళ్ళించే ఉద్దేశం నాకైతే లేదు. అర్థం పర్థం లేని అసందర్భపు మొండివాదనతో చేంతాడు చర్చను తయారుచేసింది నువ్వే. ఇది దౄక్పథానికి చెందిన సమస్య. చర్చ ఇద్దరి దౄక్పథాలకు అనుగుణంగా జరగడం సాధారణమే. వాటికతీతంగా అవతలివారు చెప్పింది విని అందులోని నిజానిజాలను బేరీజువేసుకుని అంగీకరించే ప్రజాస్వామ్యిక దౄక్పథం ఇవాళ ఎందరికుంది అన్నది సందేహమే.
నీ దగ్గర విశయం శూన్యం తమ్మీ.సమాధానంలేక ఎందేందో మాట్లాడుతున్నవ్. అవ్ కమ్యూనిస్టులంటే ముదిగొండ కమ్యూనిస్టులనే అనుకుంటున్న. మరి నెవ్వెవరని అనుకుంటున్నవో చెప్పు. బ్రమలు నీలాంటి కమ్యూనిస్టులకే వుంటయ్..నాలాంటి సామాన్యులకు వుండవ్. నామీద జరిగిన , నాచుట్టూ జరుగుతున్న తప్పుడు ప్రచరాల్లను నేను ప్రష్నిస్తే, చరిత్రను నదృస్టిలోనించి కూడా చూడమని అడగటం తప్పంటవ్. నేనూ బ్రామ్మల్లా ఆలోచిస్తున్న నంటవ్. నువ్వు నమ్మిన కమీనుస్టు ఎవడో చెప్పుముందు.. చరిత్రలో ముస్లిములకోసం వాడు కల్పించిన పాజిటివ్ పాత్ర ఏంటొ చెప్పు. లేదా నువ్వేమైనా రాసావా చెప్పు. నేను ప్రష్నలు లేవదీసిన సిధారెడ్డి వ్యాసం మీద. నువ్వు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నవ్. నీకు నా మీద సాయిబునని , బ్రామ్మడిలాగా ఆలోచిసున్నని ముద్రలు వేయటం తప్ప, సుత్తి కబుర్లు తప్ప./ ఇదిగో ఈ చరిత్ర కారుడు నిజాలు రాసాడు, ఈ చరిత్ర కారుడు మరుగున పడిన చరిత్రను రికార్డు చేసే పరిషోధనచేషాడు, ఈ కమ్యూనిస్టు (నీ కమ్యూనిస్టే సిపియం వాడు కాదు) వీళ్లగురించి జరుగుతున్న /జరిగిన చారిత్రక విద్రోహాల్ను తిప్పికొట్టాడు. అన్న సమాధానం లేదు. బుక్కయించడం/ మేధావి పోజు కొట్టాడాం, ఎర్ర జెండా కింద కొత్త్త రంగుల్నిచూడలేదని ఎదుటి వారిని విమర్షించడాం ….ఇవన్నీ చాతకాన్ని వాడు చేసేపని. అవి నేను వినదలచలేదు. నీదగ్గర గానీ నీలాంటి కుహనా ఎర్ర జెండావాదుల (ఏ ఎర్ర జెండా అయినా)దగ్గరగానీ నప్రషనలకు సమాధానాలు లేవు.. వెతకడానికి మీకు ధైర్యంలేదు.. మీ సిధ్ధాంతం/ మీ గ్నానం అందుకు అంగీకరించవు.
నీ లాంటి వాడికి చర్చకు చాన్సుఇచ్చి సమయం వృధాచేసుకున్నా……
ముగించేసా…..కమ్యూనిస్టూ….నేనే ముగించేసా…………..
చూడండి.. రాజ్యంలో చెడుకి,మంచికి రాజే కారణం … ఒక వేళ ప్రత్యక్షంగా కాకపోతే ..అది అతని అసమర్దత.. ఏమైనా రాజు కాక మరెవరు అంటే ..
1.రాజు
2.అతని మంత్రాంగం
3.అతని గూఢచారి వ్యవస్థ
4.
5…
6….
..
ఇలా ఎంత దూరం పొయినా అది రాజు కి పెన వేసుకుని ఉంటది.
మొదలు రాజు దద్దమ్మ ఐతే మిగతా వాళ్ళు కూడా….. దానికి బలి కావలసిందె…
..
..ఇప్పుడు మన ముందున్న లక్ష్యం తెలంగాణ. అక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు… అందరిని కలిపి సాధించాలంటే ఇలాంటి మాటలు తప్పవు… కే సి ఆర్ మేధావి …కాని ఒంటరి… సో …. పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు తీస్కోండి…. నెగటివ్ అనిపిస్తే సర్దుకపోండి…….