- చిత్తలూరి సత్యనారాయణ

ధుఃఖం పయలు పాయలుగా విస్తరిస్తోంది
ప్రవాహ ఉదృతి పెరుగుతుందో, తరుగుతుందో
బాధనుబట్టే దాని బతుకుంటుంది
ఇంటికి అరుగే అందం
లోపలికి వెళ్ళాలన్నా
బయటకు రావాలన్నా


ఊపిరి చందం
గడపదాటి పొలంచేరే
మా అమ్మలాంటి స్త్రీలకు
తలవొంచి నమస్కరిస్తాను.
సౌందర్య క్రీముల్లో ముంచిన
నాజూకు వేళ్ళకంటే
చెమటా చుక్కల్లో తడిసి అరిగిన
మొరటు వేళ్ళంటేనే ఇష్టం
మొక్కలు నటే పల్లెచేతులకు నమస్కరిస్తాను
విత్తనాలు చల్లే చేతివేళ్ళకు దండం పెడతాను
మట్టిని ముద్దాడే పాదాలకు ప్రణమిల్లుతాను
బతుకును ఒక్కచేత్తో ఎత్తుకుని
ఒంటారి దుఃఖ సముద్రాన్ని దాటడమే
యోధుడి లక్షణం
కన్నీటి పాయలు కొండచిలువై
వెంటాడుతున్నా
కాళ్ళకింద ఇసుకదుప్పటి
కసిదీరా ఎవరో లాగేస్తున్నా
అడుగుల్ని నేలలోకి గుచ్చిమరీ
ప్రవాహానికి ఎదురీదడమే
శ్రమజీవి పాఠం
వడ్లరాశిని ఎగదోసుకున్నట్టు
ఎవడి ప్రాణాల్ని వాడే ఎగదోసుకోవాలి
చిక్కని చీకటి బురదలో
విత్తనాల చిరుదీపాల
మొలక వత్తుల్ని సరిచేస్తున్న
మొరటు మనుషులకు
మోకరిల్లుతాను
దుఃఖం ఇంకా పాయలు పాయలుగా
విస్తరిస్తూనే వుంది…

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)