ఒక కుక్కను చంపాలనుకుంటె ముందు దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న ఒక రాజకీయ సామెత ఉంది. సరిగ్గా ఈ నియమాన్ని లేదా సూత్రాన్ని ఎన్ని దేశాల రాజకీయ నాయకులు అమలు చేశారో లేదో తేలియదుగాని, తెలుగు సమాజంలో మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు.

ఒక ప్రాంతాన్ని ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేయడమే కాకుండా గత కొన్ని దశాబ్దాలుగా సాంస్కృతికంగా కూడ తొక్కేసే ఒక అప్రజాస్వామిక చర్య గురించి బహాటంగా చర్చించడమే ఈ వ్యాసోద్దేశం.

తెలంగాణ ప్రజల భాషను , అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఎంతవీలైతే అంత ఎక్కువగా అపహాస్యం పాలు చేసే కార్యచరణను ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న దుశ్చర్య ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో కనిపిస్తునే ఉంది. అందులో ముఖ్యంగా ‘వెండితెర’ గా పిలువబడే సాంస్కృతిక రాజకీయాల ప్రతిబింబం కీలకపాత్ర నిర్వహిస్తున్నది.

తెలుగు సినిమా వజ్రోత్సవాలు జరుపుకునేనాటికి ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాతినిథ్యమేమిటో లోకవిదితమే. ఆంధ్రాలోని కేవలం రెండు జిల్లాలకు సంబంధించిన నటీనటులు, అందులో రెండు కులాలకు మాత్రమే చెందినవారు పడిన జాగ్రత్తలేమిటో కూడ సుపరిచితమే. వాళ్ళు మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీని చిరకాలం ఏలాలని భావిస్తే ఇన్నాళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కానీ నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే కుట్రలు చేయడం ఏ మేరకు మంచిదో అర్థం కావడంలేదు. అయినా ఈ ఆగడాలు ఇప్పుడు ప్రారంభమైనవేం కాదు. 1970లకు ముందు నుండే ఈ ప్రాంతాన్ని అణిచివేయడానికి తెలుగు సినిమా ఒక ఆయుధంగా ఉపయోగపడింది. 1980 ల తరువాత తెలుగులో వచ్చిన అనేక భూస్వామ్య, జమిందారీ విధాన సినిమా కథలన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించినయే. కానీ, చిత్ర నిర్మాత, పాత్రధారులు, నర్తకులు, గాయకులు మాత్రం తెలంగాణ వారు కాకుండా, ఏ ఒక్కరికి అందులో అవకాశం రాకుండా తగిన జాగ్రత్తలన్ని జాగ్రత్తగా తీసుకున్నారు. అయినా తెలంగాణ ప్రజలు వాటిని నిండు మనసుతో ఆహ్వానించి వంద రోజుల సినిమాల్ని చేశారు.

1990 ల తర్వాత పెరుగుతున్న తెలంగాణ చైతన్యాన్ని పక్కదారి పట్టించి, ప్రశ్నించే గొంతుల్ని మూయించడానికి ప్రయత్నాలు జరిగాయి. విలన్‌ పాత్రల్ని వాళ్ళ భాషని లేదా కమేడియన్ల భాషని తెలంగాణ యాసలో రాయించే కుట్ర ఆ క్రమంలోదే. ఆ రకంగా తెలంగాణ భాష ప్రత్యేకంగా వెండి తెరమీద కామెడి భాషగా తయారైంది, ఆ విధంగా తయారు చేశారు. తెలంగాణ ఆడోళ్ళంటే మంచీ మర్యాద లేకుండా మాట్లాడుతారని, ప్రతీరోజు మొగుళ్ళతో గొడవ పడతారన్నాంత స్థాయిలో సినిమా పాత్రల్ని డిజైన్‌ చేశారు. మరీ నవ్వొచ్చే విషయ మేమంటే తెలంగాణ కాదు అసలు ఆంధ్ర ప్రదేశ్‌కే చెందని నటీనటుల చేత కౄరమైన పాత్ర లేయించి ఈ యాసని పలికించారు. ఫలితంగా ‘’తెలంగాణ శకుంతల'’ లాంటి క్యారెక్టర్లు పుట్టుకొచ్చాయి. నిజానికి శకుంతల తెలంగాణ వాసే కాదు. మహారాష్ట్రకు చెందిన ఈవిడను ‘’తెలంగాణ శకుంతల'’ అంటే తప్ప గుర్తుకు రాని విధంగా మార్చేశారు.

తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్‌కు మారిన తర్వాత విలన్‌ కాటగిరిలో ఎన్నో మార్పు లొచ్చాయి. గెటప్‌ల దగ్గరి నుండి మొదలు పెట్టి విలన్‌ పాత్రల పేర్ల వరకు విdలైనంతగా హైదరాబాద్‌ నేటివిటీని ప్రదర్శించారు. పాతబస్తీ, గండిపేట , దూల్‌పేటలాంటి ఏరియాల్లో అంతా రౌడీలే ఉంటారన్న భ్రాంతిని తెలుగు సినిమా ప్రేక్షకుల మెదళ్ళలోకి నెమ్మదిగా ఇంజెక్ట్‌ చేశారు. చార్‌మినార్‌, గోల్కోండ ఫోర్ట్‌ లాంటి చారిత్రక సందర్శక స్థలాలన్ని క్లైమాక్స్‌ల నిలయాలుగా మార్చారు. భావాల్ని ప్రచారం చేయడంలో సినీ మీడియాను మించింది మరొకటి లేదు. అటువంటి ఆయుధాన్ని కుల అణిచివేత సాధనంగా కూడ వినియోగించిన ఘనత ఆంధ్ర డైరెక్టర్లదీ, ప్రొడ్యూసర్లది. హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక కులాల ప్రజానీకంలో యాదవ కులాల జీవనవిధానం కొంత భిన్నమైంది. గ్రామీణ ప్రాంత అవశేష లక్షణాలు ఈ కులంలో కాస్త ఎక్కువగానే కనిపిస్తాయి. ఊళ్ళో గొర్లు, బర్లు పెంచి పాల మ్ముకొని బతికిన కుల వృత్తిని నగరంలో కూడ విడిచిపెట్ట లేదు. అలా కుల వృత్తిని నమ్ముకొని అనేక దశాబ్దాల అనంతరం కొంత పురోగతిని సాధించడం కనిపిస్తుంది. నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి వాటిలో కూడ ఈ కులం ముందే ఉంది, అది వేరే విషయం. ఈ నేపథ్యంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న ఈ కమ్యూనిటీనీ తెలుగు సినిమా పరిశ్రమ చెప్పుకోలే నంతగా దెబ్బతీసింది.

విలన్‌ పాత్రలన్నింటికి పేరు చివర ఒక ‘యాదవ్‌’ తగిలించే ప్రక్రియ మొదలైంది. ముంబాయి, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు చెంది, రూపంలో భయంకరంగా ఉన్న నటులకు బిక్షుయాదవ్‌, ముత్తు యాదవ్‌ వంటి పేర్లను ఖాయం చేశారు. నర్సింగ్‌ యాదవ్‌ అనే నటున్ని జీవితకాలపు కామెడీ విలన్‌గా సిద్దంచేసింది. తద్వార ఈ కమ్యూనిటి మీద ఒక చెడు ప్రభావం ఏర్పడడానికి కావల్సిన పునాదిని బలంగా సిద్దం చేసింది. ఈ ఉద్దేశ్యపూరిత చర్య వల్ల సాంస్కృతిక ఎదుగుదలకు నోచుకోకుండా తెలంగాణ కుదేలైంది. తెలంగాణవాసుల్ని విలన్‌లుగా మార్చిన దాష్టికం అంతటితో ఆగక హాస్యాన్ని పండించడానికి తెలంగాణ భాషను నవ్వుల పాల్జేసింది.

సినిమాలో హాస్యరసాన్ని సరిగా పండించడం రాని అసమర్ద సినీ దిగ్గజాలు, ఒక ప్రాంత ఔన్నత్యాన్ని దిగజార్చడం ఆధిపత్య ప్రాంత నిర్మాణకర్తల నైచ్యానికి సంకేతం. జంధ్యాల తర్వాత ఆ స్థాయి హాస్యం ఇటీవలి కాలంలో ఎక్కడా కనిపించదు. నవ్వురాకున్న ప్రేక్షకులు ఒకరికొకరు గిలిగింతలు పెట్టుకోవల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని సినీ విమర్శకులు చేస్తున్న వ్యాఖ్య. హాస్యం పరమోత్కృష్ట రసమని ఆలంకారికుల అభిమతం. ఆ రసాన్ని పలికించడానికి ఆలంకారికులు చూపిన నియమాలు కూడా అనంగీకారమే. కురూపి, సరిగా మాట్లాడడం రాని, వేషధారణ విచిత్రంగా వున్న, ఒఠ్ఠి అమాయకుడు, అజ్ఞాన చక్రవర్తి, తిండిపోతు, నిద్రపోతు, తెలివి తక్కువ దద్దమ్మలాంటి ఎన్నో అవలక్షణాలు అసహజరీతిలో ఉండాలని ఆలంకారికులు చేసిన సూచన నాటకాల్లో కచ్చితంగా పాటించేవారు. అదే తరహా పాత్రల్ని పద్మనాభం నుంచి నేటి హాస్యనటుడు సునీల్‌ వరకు పోషిస్తున్నారు. సునీల్‌ దేహ వర్ణం నల్లగా ఉండడం పట్ల అనేక చిల్లర డైలాగులు పలికించారు. ఇది నల్లరంగు కలిగి ఉండే కింది కులాలవారిని మాత్రమే కాదు అత్యంత స్వచ్ఛమైన నల్లని మేని ఛాయ కలిగివండే కోమట్లను మరింత అధికంగా అవమానించడం. తెల్లరంగు అన్ని కులాల్లో ఉండవచ్చు. కాని, చారిత్రకంగా చూస్తే ఆర్యులు తెల్లని, గోదుమ వర్ణం, లేదా బంగారు ఛాయ కలిగి ఉంటారు. దక్షిణ ప్రాంత బ్రాహ్మణులు చాలా వరకు నల్లగా ఉంటారు. తమిళ బ్రాహ్మలు అందుకు మంచి ఉదాహరణ. ఆ రకంగా నల్లని బ్రాహ్మణులు కూడా అవమానానికి గురవుతున్నారు. బ్రహ్మానందం రాకతో బ్రాహ్మల పాత్రలు హాస్యానికి తప్ప మరోదానికి పనికి రావన్నంతగా చిత్రిస్తున్నారు. కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. నేనేమీ బ్రాహ్మణ పక్షపాతిని కాను. కాని, ఈ పరిస్థితికి బ్రాహ్మణ ఆలంకారికులే కారణమైనప్పటికీ వారు కూడా దాని బాధితులే. అయితే ఈ పరిణామం వెనక కేవలం కొన్ని బ్రాహ్మణేతర అగ్రకులాలు చలన చిత్ర పరిశ్రమను ఆజ్ఞాపించడం, నడిపంచడమూను ఉంది. హాస్యం పలికించడానికి ఆహార్యాదులు ఎంత ముఖ్యమో శరీర ప్రవర్తన, చేష్టలు కూడా అంతే ముఖ్యం. నటన చేతకాని మరింత స్పష్టంగా చెబితే నటనా ప్రతిభ లేని వారిని నటులుగా నిలబెట్టాలన్న రాజకీయ పథకం వల్ల హావభావాలు, దేహాభాష (బాడీ లాంగ్వేజ్‌) వంటివి పరిత్యజించి సంభాషణల మీద మిక్కిలి ఆధారపడుతున్నారు. అందుకు తెలంగాణ భాషను ఒక హాస్య సాధనంగా వాడుకుంటున్నారు. ఇది అణిచివేత ఎజెండాను ముందుకు తీసుకు పోవడంలో ఒక దశ.

ఇటీవల విడుదలైన ‘తులసి’ చిత్రంలో కూడ ఈ విచక్షణా రాహిత్యం మోతాదుకు మించి శృతిమించింది. కోకాపేట ఆంటి పాత్ర ద్వారా రింగు రోడ్డు కారణంగా పుణ్యానికే అభివృద్ది అయినట్టు, తద్వారా రింగు రోడ్డు పరిసర తెలంగాణ ప్రాంత ప్రజలు నేల నొదిలి నడుస్తున్నట్టు చూపించారు. దానికి తోడు భాష పరంగా విdలైనంత ఎక్కువ వెటకారాన్ని సంభాషణలుగా రాయించి ‘’కామెడీ సీన్‌లు'’గా చిత్రించాడు దర్శకుడు. వాస్తవానికి అందులో హాస్యం శూన్యం. ఆ సినిమా ఆడుతున్న తెలంగాణ థియేటర్లలో ఏ ఒక్కదాంట్లో కూడ ఈ అపహాస్య సీన్లకు తెలంగాణ ప్రజలు ఆనందించ లేదు. నవ్వుకోవడం వేరు. ఆనందించడం వేరని విజ్ఞులైన ప్రేక్షకులకు తెలుసు. తెలియనిది దర్శకులకే. కోకాపేట ఆంటీ బ్లాకు సినిమా సౌష్టవానికి ఒక ఆటంకమే తప్ప ఉపయోగపడే ఆనుషంగిక కథ కాదు. ‘’నేను ఇబ్రహీంపట్నం కోకాపేట ఆంటిని'’ అని యాంకర్‌ ఝాన్సీ చేత ఆంధ్ర యాసలో కాసేపు మాట్లాడించడం, ఆ తరువాత తెలంగాణ యాసలోకి మారడం డబ్బింగ్‌ తప్పిదమే కాదు. ఆంధ్ర వాసులకు తెలంగాణ అంత పరిపూర్ణంగా అలవడదని సూచిస్తుంది. అది ఝాన్సీ నడిగినా తెలుస్తుంది. ఝాన్సీకి తెలంగాణ భాషరాదు. ఆమెది కోస్తాంధ్ర భాషకు తెలంగాణ పలుకుబడిని అంట గట్టే వ్యవహారం. అది కాక, కోకాపేట ఆంటీతో హీరో సంభాషణ, హీరో బాడీలాంగ్వేజ్‌ మరోసారి వెంకటేశుకు నటన చేతకాదని నిరూపిస్తున్నాయి. అంతకన్న తెలంగాణ స్త్రీల ఆత్మగౌరవం మీద దాడి. కోకాపేట వరుస కరువులతో తల్లడిల్లినపుడు ఇదే ఆంధ్ర సినీ పరిశ్రమ పట్టించుకున్నది లేదు. పెండ్లి కెదిగిన బిడ్డల పెళ్ళిళ్ళకు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న దృశ్యాల్ని తెరకెక్కించ లేదు. గుక్కెడు మంచినీళ్ళ కోసం మైళ్ళకొద్ది నడిచిన అడుగుల కష్టాన్ని ఏ సినిమా చిత్రంచ లేదు. రింగురోడ్డు కింద ఉన్న కుటుంబాలెన్ని అందులో బాగుపడ్డవెన్నో, బలై పోయినవెన్నో తెలుగు సినిమాకు కనిపించవు.

తెలంగాణ భాషను, తెలంగాణను కించపరిచే అనేక ఉదాహరణలు తెలుగు సినిమాలో అనేకం కనిపిస్తాయి. తేజ దర్శకత్వంలో సూపర్‌హిట్టయిన ‘నువ్వు నేను’ సినిమాలో హీరోయిన్‌ తండ్రి భరణి, మేనత్త శకుంతల అచ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడుతుంటే, హీరోయిన్‌ అనిత కోస్తాంధ్ర మాట్లాడుతుంది. భరణి, శకుంతల ఇద్దరూ విలన్‌లు. యమదొంగ సినిమాలో నూ, యమగోలలోనూ యమకింకరులు మాత్రమే తెలంగాణలో మాట్లాడుతారు. రాంరెడ్డి విలన్‌ పాత్రలోనూ, మామూలు పాత్రల్లోనూ తెలంగాణ మాట్లాడితే, కృష్ణాజిల్లా వాసి కోటశ్రీనివాసు వేసే విలన్‌ పాత్రలన్నీ తెలంగాణ మాట్లాడుతాయి. కృష్ణవంశీ రూపవాది. అంటే సినిమా ఎలా తీయాలి అన్నదాని మీద తప్ప ఏ అంశాన్ని తీస్తున్నామన్న దాని పట్ల కనీస స్పృహ లేని తిరోగమన వాద దర్శకుడు. ఈయనకు ముస్లింల దేశ భక్తి మీద ఎంత అనుమానం ఉంటుందో తెలంగాణ భాష పట్ల అంత చిన్న చూపు. ఆయన ఈ మధ్య తీసిన ‘చందమామ’లో హీరో మందుగొట్ట ముందు ఆంధ్రలో మాట్లాడి, తప్పతాగిన తరువాత తెలంగాణలో మాట్లాడుతాడు. అందువల్ల విలన్‌లు, దుర్మార్గులు మాత్రమే తెలంగాణ మాట్లాడుతారనే తప్పుడు సంకేతం ప్రచారం అధికారిక ముద్రతో చలామణి అవుతుంది. పాత్రోచిత భాష అన్న ప్రాచీన భారతీయ అలంకారశాస్త్ర సూత్రానికి ఆధునిక రూపం. అక్కడ కూడా రాక్షస పాత్రలకు పైశాచీ భాషను, దేవతలకు సంస్కృతం ఉపయోగించి ఒక దైవిక అణచివేతను అమలుపరిస్తే, ఇక్కడ సాంస్కృతిక అణచివేతను అమలు పరుస్తున్నారు.

సినిమా విశాల ప్రజారాశులను ప్రభావితం చేస్తుంది. అది అన్ని ప్రాంతాల ఆకాంక్షలను ప్రతిఫలించకున్నా ఫర్వాలేదు. బలహీన పాలిత ప్రాంతాలను అవమానించడానికి మాత్రం ఉద్దేశపూర్వకంగా పనిచేయ కూడదు. సాంస్కృతిక సామ్రాజ్యవాదం కేవలం ఇంగ్లీషు సమాజాల నుంచే కాదు ఆంధ్ర విస్తరణ వాదుల నుంచి కూడా పొంచి ఉందని చేసే విమర్శల్ని తోసిపుచ్చలేం. దీనికి విముక్తి ఏమిటి? ఒకటి, తెలంగాణ ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రతిఘటన వ్యక్తం కావాలి. అంతటి సంస్కృతీపరమైన చేతన తెలంగాణ ప్రజలు కనబరచాలి. దాని వల్ల దర్శక, నిర్మాతలు అణచివేత పంథా నుంచి కాస్తోకూస్తో వెనక్కి తగ్గే అవకాశం ఉంది. రెండు, తెలంగాణ ప్రజలు ప్రత్యేక లేదా ప్రత్యామ్నాయ చలన చిత్ర పరిశ్రమ నిర్మించుకుంటే తప్ప సాధ్యం కాదు. తెలంగాణ అవతరించిన తరువాతే ఆ సత్కార్యం జరగాల్సిన అవసరం లేదు. తక్షణమే ఆ ప్రయత్నం జరగడం చారిత్రక అవపరం అని చెప్తే ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు.

18 అభిప్రాయాలు

  1. venkatesh 05 నవంబర్ 2007 , 1:13 am

    రచయిత గారికి,
    మంచి పరిశిలనతొ చక్కని వ్యాసం రాసారు.అబినందనలు.

  2. Vipul 05 నవంబర్ 2007 , 7:55 am

    ఈ వ్యాసం చాలా బాగుంది. మంచి పరిశీలన. భాషాపరమైన వివక్షతోపాటు అసలు మన సినిమాల వ్యవహారశైలి కూడా పూర్తిగా మారాలి. ఈ పరిణామం వెనక కేవలం కొన్ని బ్రాహ్మణేతర అగ్రకులాలు చలన చిత్ర పరిశ్రమను ఆజ్ఞాపించడం, నడిపంచడమూను ఉందన్న రచయిత పరిశీఅన బాగుంది. రచయితకు అభినందనలు.

  3. Prakash Telangaan 05 నవంబర్ 2007 , 8:36 am

    తెలంగాణలో talent కు కరువా?

    1. కె.కె. రెడ్డి from (తుర్కల కొత్తపల్లి) ఒకప్పటి ప్రముఖ నిర్మాత
    2. కాంతారావు, రామారావు కలిసి నటించిన “చిక్కడు-దొరకడు” లో ఒకరికొకరు తీసిపోకుండా నటించినా దశాబ్దాలనటన తర్వాత ఎవరెలా మిగిలిందీ తెలిసిందే.

    3. సినారె, దాశరథి, సారంగపాణి, బల్లాదీర్ గద్దర్, సుద్దాల హన్మంతు / తనయుడు అశోక్ తేజ, “బండెనుక బండి” రాసిన యాదగిరి, ఈ మధ్య పాటలు రాసిన గోరటి వగైరాలకు కరువు లేదు, కానీ సినీరంగపు తళుకౌ-బెళుకు ఫంక్షన్లల్ల ఎవల్లనన్న, ఎప్పుడైన చూసినమా?
    4. నేరెళ్ళ వేణుమాధవ్, శివారెడ్డి ల లెక్క ఎవ్వరైన మిమిక్రీ చేసిండ్రా?
    5. ఈ మధ్యనే విడుదలై box-office రికార్డులు పలగ్గొడ్తున్న “హ్యాపీ డేస్” ల most popular character, orkut గ్రూపులల్ల sensation గా తయారైన tyson పాత్రధారి మన నిజాంబాదు పిల్లగాడేనాయె! ఒక చిఋతనూ, తులసిని, అతిథినీ clean bowled చేసిండుగద!

    ఇంకా ఎంతో మంది రచయితలూ, అనువాదకులూ, భాషావేత్తలూ, డబ్బింగు నిపుణులూ, సంగీతకారులూ, గాయకులూ ఎన్నిసార్లు ఈ “మద-ఆంధ్ర” సినీ ప్రముఖుల ఇండ్లపొడాంటి తిప్పించుకోబడి / వాడుకొనబడి , తొక్కివెయ్యబడ్డరో..

    అన్ని రోజులొక్కతీరుండయిగద, అందుకె ఇప్పటిసందే కొందరు, ఆంధ్రల జాగాలు కొనుక్కుంటున్నరు, ఆణ్ణే క్రికెట్ మ్యాచులు ఆడుకుంట పరిస్థితులజూసి
    స్టూడియోలు పెట్టుకునేటట్టున్నరు..

  4. జాన్ హైడ్ కనుమూరి 06 నవంబర్ 2007 , 7:20 am

    వ్యాసం బాగుంది. అభినందనలు
    హ్యాపీ డేస్ టైసన్ మా బాస్ కొడుకే. నిజమాబాద్

  5. nagesh 06 నవంబర్ 2007 , 7:40 am

    హయి రవిందర్ ,
    బగుంది.కని నెను కొన్ని విషయలు నిథొ ఎకిభవించలెకున్న…..
    ని విష్లెషన థిరు బగుంధి…..
    కని ప్రథి విషయన్ని బుథద్దంలొ చుదతమ థగధు…..
    మనల్ని మనమ అవమనించుకొవతమ థప్ప మరొతి కధనిపిస్థుంధి…..
    యె వర్గమైన ఆ వర్గ ప్రయొజనలకె ప్రధన్య్థ ఎవ్వతము అనెధి సాధరనమె అనె ధన్ని కధనగలవా?
    ఎక్కద జరుగుథున్నధధె… అన్నధి నా అభిప్రయము….
    తెలంగన లొ ఎంథ మంధి నిర్మథలు ఉన్నరు? ధర్షకులు ఎంథ మంధి ఉన్నారు?
    మన ప్రంథంలొ యె అమ్మాయి నైన సినిమలొ చెస్థనతె పమ్పుథరా….
    వారు మనల్ని కించపరచతము విషయంలొ నిథొ ఎకిబవిస్థను….
    థెలంగన భాష గొప్ప థనము థెలియలంతె ని లంతి కవులు , రచయిథలు…. ఎప్పుదు విమర్షించము థగ్గించి ప్రపంచమె మెచెలా చెయాల్సిన బధ్య్తహ మిమిధ ఉంధనె విషయము ఇన్క ఎక్కువ గుథిస్థె మంచిధి.
    యెది ఎమైన ని ప్రయ్థ్నన్ని అభినంధిస్థూ………..
    నీ మిథుదు…
    నగెష్

  6. kartheek 06 నవంబర్ 2007 , 8:20 pm

    అంతా బావుంది… కాని, ఇక్కడ తెలంగాణ ఎందుకొస్తోందో అర్ఠం కావటం లేదు, అలాగైతే రాయలసీమ ఏం కావాలి? ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి తెలంగాణ, ఆంధ్ర అని విడ దీసి చూడటం ఎందుకో?

  7. Rakesh 07 నవంబర్ 2007 , 1:42 am

    భయ్ నాగేశ్..

    1. కని ప్రథి విషయన్ని బుథద్దంలొ చుదతమ థగధు…..
    “తెలుగుసినీరంగంలో అందరికీ సమానావాకాశాలున్నయా అన్నది ఒక 50 ఏండ్లు చూసినంకనేగదా భూతద్దాలు చేతబట్టింది”

    2. యె వర్గమైన ఆ వర్గ ప్రయొజనలకె ప్రధన్య్థ ఎవ్వతము అనెధి సాధరనమె అనె ధన్ని కధనగలవా?
    “కరెక్టే! అలాంటి ప్రాధాన్యతాక్రమంలోనెగదా, 1956లో చిన్నగావేలుబెట్టిదూరిన ప్రతి రంగంలోనూ “ఆ వర్గాల” వాండ్లేనాయె భర్పూరుగ ఉన్నది”. మేమెవరమూ కాదనలేని వాస్తవాని గుర్తుచేసారు.

    3. తెలంగన లొ ఎంథ మంధి నిర్మథలు ఉన్నరు? ధర్షకులు ఎంథ మంధి ఉన్నారు?
    “దర్శకులల్ల ఒక నర్సింగరావు, ఒక బెనగళ్ళ శ్యాంసుందర్ లాంటి క్లాస్ డైరెక్టర్లు తెలంగాణ వాళ్ళైనా, ప్రస్థుతం convocate అవుతున్న వారిలో ఎందరున్నారో చూడాల్సిందే. ఇగ నిర్మాతలవిషయానికొస్తె, ఇప్పుడు ఫుల్లు-ఫాంలో ఉన్న దిల్ రాజుది నిజాంబాదే (బెల్లంకొండ సురేషుది తెలంగాణనె అనుకుంటకాని బుల్లెట్ లు బుక్కినంకగూడ కాల్చిందెవరో చెప్పలేని మనిషాయె)”

    4. మన ప్రంథంలొ యె అమ్మాయి నైన సినిమలొ చెస్థనతె పమ్పుథరా….
    వారు మనల్ని కించపరచతము విషయంలొ నిథొ ఎకిబవిస్థను….
    “ఇక్కడ మీరే ప్రశ్నవెన్కనే జవాబుకూడ ఇచ్చిండ్రు, పైగా ఒక సినిమాలోనైతె - ఖడ్గం అనుకుంట; నిజాంబాదునుంచి హీరొయినవుదామని వచ్చిన పిల్లను నిర్మాతలు ఎట్ల వాడుకున్నది చూపించిండ్రు. సినిమాఫీల్డు చేదునిజాలను గిట్ల సినిమాలల్లనేజూపి భయపెడ్తె, ఏ తెలంగాణ పిల్ల రావాలె తమ్మీ..”

    5. థెలంగన భాష గొప్ప థనము థెలియలంతె ని లంతి కవులు , రచయిథలు…ఎప్పుదు విమర్షించము థగ్గించి ప్రపంచమె మెచెలా చెయాల్సిన బధ్య్తహ మిమిధ ఉంధనె విషయము ఇన్క ఎక్కువ గుథిస్థె మంచిధి.
    “ఇప్పుడు మనంమందరం మునుంబట్టి చేస్తున్నది అదేగదా తమ్మీ.. anyways, thanks for pointing out some more realities / facts”

  8. umamaheswara rao c 07 నవంబర్ 2007 , 3:00 am

    The film you have referred is ‘Khadgam’ a disgusting and deplorable movie by Mr. Krishna vamsi. He should not try to address the social problems as he is not informed like many other telugu film directors.Though not well informed, if a sort of honesty and sincerity is maintained in dealing the social problems, it is enough. Mr. Ravinder, it is futile to expect balanced films from a degenerative cluster of film makers who are swimming in the stinking pool of sham commerce.
    Dr.Prabhakar Reddy film maker and artiste, who is no more , used to express his displeasure and dissent when the spoken language of Telangana is degraded in films.
    Leave the intention; ignorance and run for fake drama are the hitches of telugu movie makers. When a new set of plays like ‘pavala’ ‘laabham’ and ‘tommy tommy’ in Visakha and Srikakulam spoken language are enriching the stage, the language is used for fun characters in films. Not only language or ethnicity, the physically challenged, the idealists and the advocates of humanity are made fun of.
    At this juncture we neeed a Iqbal Masud, a Mythili Rao, a Bikram Singh, a Chidanand. After Kodavatiganti and Arudra, we are not having good film critics with a good understanding of society and film technique; at least to show the mirrors.

  9. Rohiniprasad 07 నవంబర్ 2007 , 6:57 pm

    దర్శకులూ, నిర్మాతలూ, పెద్ద నటులే కాక డిస్ట్రిబ్యూటర్లూ, డబ్బు మదుపుపెట్టేవాళ్ళూ అధికారం చలాయించే సినీరంగంలో సంస్కారం కోసం వెతకడం గొంగట్లో తింటున్నట్టే అనిపిస్తుంది. ఎటొచ్చీ స్టీరియోటైపింగ్ అనేది ప్రమాదకరమే. ఇది హాలీవుడ్లోనూ, హిందీ సినిమాల్లోనూ కూడా ఉన్నదే. హిందీ సినిమాల్లో ముస్లిములను రెచ్చగొట్టని విధంగా వారిని సహృదయులైన వెనకబడ్డ వర్గంగా చూపుతారు. విలన్ పాత్రలకు మాత్రం గోవన్ క్రైస్తవ పేర్లు పెట్టడంతో ఆ సముదాయాలు అభ్యంతరం తెలపడం కూడా జరిగింది.

    ఉమామహేశ్వరరావు గారన్నట్టు తెలంగాణా రచయితలు నాటకాలూ వగైరాలను రాసి వాటికి ప్రజాదరణ కలిగించాలి. నిజమైన సంస్కారం ఎదగడానికి సినిమారంగం లాభంలేదు. ఇతర ప్రయత్నాలు జరపడమే మంచిది.

  10. Lakshmikant 21 నవంబర్ 2007 , 6:15 am

    http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=97&pageNo=0

    రవీంద్ర గారు పై లింకులోని ఆర్టికిల చదివి మీరు రాసిన సంపుటి అనుకున్నాను.

  11. pasunoori ravinder 21 నవంబర్ 2007 , 11:08 am

    లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు.
    ఆ ఆర్టికిల్ చూసాను,
    నా పేరు పసునూరి రవీదంర్ మాత్రమేనని గమనించగలరని
    కోరుతున్నాను.

  12. narenderreddy 17 ఏప్రిల్ 2008 , 8:16 am

    రవీందరు గారు మీ వ్యాసం బాగుంది అయితె కలియుగధర్మం ప్రకారం బాదించే
    వాడికంటె బాదింపబడె వాడిదె ఎక్కువ తప్పు ఎందుకంటె అవకాశాలు ఆదృష్టం
    ఏవడో ఇస్తె తీసుకునేది కాదు మనంతటమనం శొదించి సాదించాల్సింది
    ఇక సినిమారంగంలొ మనం వెనుకబడిపొవాటానికి కారణం మనలొ వలసవాదం
    తక్కువ అంటె ఉన్నఊరుమీద కన్నతల్లి మమకారం ఎక్కువ అందుకే మనం
    వెనుకబడ్డాం సరె అప్పుడంటె పరిశ్రమ మద్రాసు లొ ఉండేది ఇప్పుడు తెలంగాణ
    కే వచ్చింది కాబట్టి ఇప్పటికి అయిన మనం కృషి చే స్తే బాగుంటుంది
    నేను అదే ప్రయత్నంలొ ఉన్నాను

  13. బెల్లంకొండ రవికాంత్ 19 ఏప్రిల్ 2008 , 5:00 am

    తమ్ముడూ రవీందర్…..మంచి వ్యాసం రాసావు…ఉన్న ఊరుకి, కన్న తల్లికి జరిగిన అవమానం మరిచిపోవడం ఎంత అసాధ్యమో మన భాష మీద జరుగుతున్న దాడిని తట్టుకోవడమూ అసాధ్యమే… ఒక్కోసారి అనిపిస్తుంటుంది….ఈ కవిత్వం….వ్యాసాల ద్వారా మన నిరసననని మనం ఎంత మందికి తెలియజేయగలుగుతాం….అని….. అదే పాటైతే చాలా మందికి చేరుతుంది కదా…. నువ్వు పాట బాగా రాయగలవు.. పాడగలవు….. ఒక్కసారి ఆ ప్రయత్నం చేసి చూడు…… మంచి వ్యాసం చదివించావు

  14. Sridhar 26 మే 2008 , 10:54 am

    వర్గ భేదాలను రెచ్చ గొట్టడం లో మన నేత ల నే మాత్రం తీసిపోరీ రాతగాల్లు.
    ప్రతి విషయం లోనూ విభేదాలు వెతకట మే. ఈ జనాల్ని ఎవడు రక్షిస్తాడో ఈ వెధవలనుంచి.

  15. vikas east godavari 07 జూన్ 2008 , 4:50 am

    ఈ వ్యాసం చదివాక, అభిప్రాయాల్లో చివరిది శ్రీ శ్రీధర్ గారి ఆవేశమే తప్ప అర్థం లేని అభిప్రాయం చూశాక ఈ వివరణ ఇవ్వలేక ఉండలేక పోతున్నాను.
    1.శ్రీధర్ కి సమకాలీన రాజకీయ పరిస్థితుల పట్ల కనీస అవగాహన లేదని అతడి అభిప్రాయం ద్వారే అర్థమవుతున్నది.
    2.”వర్గ విభేధాలు రెచ్చగొట్టడం” అనే మాటను దిక్కుమాలిన ఆవేశంతో శ్రీధర్ తన అభిప్రాయంలో వాడారు. ముందుగా వర్గం అనే మాటకు అర్థం శ్రీధర్ కు సరిగా తెలిసినట్టు లేదు. అసలు రవీందర్ గారి ఈ వ్యాసంలో వర్గవిభేధాలు ఎక్కడున్నాయో మచ్చుకైన నాకైతె కనపడలేదు, మరి శ్రీధర్ గారు ఏ సులోచనాలు ధరించి ఈ వ్యాసాన్ని చదివారో మరి.
    3.రెండు ప్రాంతాల్లో ఒక ప్రాంతం మరో ప్రాంతం పై తన ఆధిపత్యాన్ని అమానుషుంగా ప్రదర్శిస్తున్న విషయాన్ని ఈ వ్యాసంలో రచయిత తేటపరిచారు. దాన్ని అర్థం చేసుకోలేకపోవడం శ్రీధర్ ధౌర్భాగ్యం. అన్యాయానికి గురైనవాడు తన గోడును వెళ్ళబోసుకునే స్వేచ్చ హరించడమే శ్రీధర్ చేసిన పని.
    4.”నూరు పువ్వులు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ” అన్న సూక్తి ఈ సంకుచితవాదికి తెల్సినట్టు లేదు.
    5.తెలంగాణ గురించే కాదు, రాయలసీమ లోని ఫ్యాక్షన్ గొడవల్ని తెరకెక్కించి, సొమ్ము చేసుకునే ఆంధ్ర డైరెక్టర్ల కుసంస్కా రాన్ని కుల్లపొడిచినందుకా శ్రీధర్ కు ఈ కుల్లుబోతుతనం.
    6.శ్రీధర్ కు ఒక్కడికే ప్రజలపట్ల బాధ్యత ఉన్నట్లు, పాపం రచయితల్ని అనరాని మాటలన్నాడు. కానీ చీకటి ప్రపంచానికి అక్షరాలే వెలుగురేఖల్ని పంచుతాయన్న కామన్ సెన్స్ కూడ లేదు ఇతనికి.
    7.నచ్చని రచనైతే మల్చుకొని కూర్చోవాలి గాని, రాయడానికి స్పేస్ దొరికిందని ఏదిపడితే అది రాయడానికి ఇదేం శ్రీధర్ పర్సనల్ నోటుబుక్కు కాదని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.
    చివరగా…..సంస్కారం లేని చదువు వ్యర్థమని, విశాలత్వం లేని వాడి ఆగ్రహం అనర్థమని ఈ శ్రీధర్ మహానుభావుడు ఎప్పుడు గుర్తిస్తాడో….

  16. ఈ వ్యాసంలో అక్కసెక్కువా అనాలిసిస తక్కువా కనిపించింది. క్షమించగలరు.

    ఆంధ్ర సినీనిర్మాతలు ఒక పద్దతిప్రకారం ఈ ప్రాపగాండా నడుపుతున్నారని నిర్ధారించడం, వారి తెలివికి గౌరవం ఇవ్వడం వంటిదే!

    కాసులు,క్యాస్టులూ తప్ప ప్రాంతీయ సిద్ధాంతాలు వీరికి చుక్కెదురు. తెలంగాణా,రాయలసీమ నిర్మాతలు మాత్రం వచ్చి ఉద్ధరించిందేమిటి? ఈ మూసనే అవలంభించడం తప్ప!

    కాబట్టి మనం ఈ పంధాకు అనవసరమైన ప్రాధాన్యతనిచ్చి చిన్నబుద్దున్న సినిమావాళ్ళని పెద్దవాళ్ళని చేసేస్తున్నాం.

  17. ramesh 15 జులై 2008 , 11:31 am

    అనయ్య.. చాల బాగుంది.

  18. ramesh 15 జులై 2008 , 11:35 am

    అన్నయ్య ఇన్క వీలైనన్ని యె క్కువ వ్యసలు రయలని ఆషిస్తు నీ తమ్ముదు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)