boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

నవంబర్, 2007 సంచిక

ప్రస్తుతయుగంలో బుద్ధిజీవులుగా జీవిస్తున్న మనకు రకరకాల జీవరాశితో నిండిన ప్రకృతి అద్భుతంగా అనిపిస్తుంది. అయితే మనుషులే లేనటువంటి యుగం ఒకటి ఉండేదనీ, ఇంకా వెనక్కెళితే ఎటువంటి ప్రాణీ లేని పరిస్థితికూడా ఉండేదనీ గుర్తుంచుకోవాలి. భూగ్రహం “మనకోసం” ఏర్పడిందనేది అర్థంలేని భావన.

పూర్తిగా చదవండి »

కొన్ని పరిమితులు

1. సమాచారం తగినంతగా అందక, నా గ్రంథాన్వేషణ అసంపూర్తిగా మిగిలిపోవడంతో నేను ఎక్కువగా యూరప్‌, అమెరికాల్లో లభించినదానితో సరిపెట్టుకున్నాను; అందువల్ల ఇతర ప్రాంతాల సంస్కారానికి కొంత అన్యాయం జరిగినట్టే. ఈ విషయంలో ముఖ్యంగా ఆఫ్రికా పట్ల భయంకరమైన వర్ణవివక్షలాంటిది తీవ్రంగా పొడచూపుతుంది.
పూర్తిగా చదవండి »

వాకపల్లి అప్‌డేట్: సభ్యసమాజం తీర్పు

- వరవరరావు

వాకపల్లిలో లైంగిక అత్యాచారానికి గురయిన ఆదివాసీ మహిళలకు ఆశించిన న్యాయం లభించలేదు. సభ్యసమాజం నుంచి ఊహించిన న్యాయం మాత్రం లభించింది. ఈ సభ్యసమాజానికి శాసనసభ, రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ప్రాతినిధ్యం వహించే వ్యవస్థలనుకుంటే నిన్నటితో వాటి తీర్పు కూడా వచ్చేసింది.

పూర్తిగా చదవండి »

అణగారిన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ సామాజిక, సాహిత్య రంగాలలో కృషి చేసే వారికి జాతీయస్థాయిలో భారతీయ దళితసాహిత్య అకాడమీ(ఢిల్లీ) వారిచ్చే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫెలోషిప్ (2007)ను ప్రముఖకవి, విమర్శకుడు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడు డా.దార్ల వెంకటేశ్వరరావుకి ప్రకటించారు.

పూర్తిగా చదవండి »

అక్కా! నా కంఠంలో కన్నీళ్ళున్నాయి
నా కళ్ళలో నిప్పులున్నాయి
స్వేచ్ఛ గానే వున్నాను, నేను
సుల్తాను గేటు దగ్గర ఇంకెప్పుడూ నిరసన తెలపను, నేను
ఈ నేలపైన మరణించిన , మరణించే వారందరూ
ఆప్యాయంగా కౌగిలించుకొని నన్నొక ఆయుధంగా మలిచారు.
పూర్తిగా చదవండి »

- చిత్తలూరి సత్యనారాయణ

ధుఃఖం పయలు పాయలుగా విస్తరిస్తోంది
ప్రవాహ ఉదృతి పెరుగుతుందో, తరుగుతుందో
బాధనుబట్టే దాని బతుకుంటుంది
ఇంటికి అరుగే అందం
లోపలికి వెళ్ళాలన్నా
బయటకు రావాలన్నా

పూర్తిగా చదవండి »

- రామానుజ రావు

ఉరుకుల పరుగుల సైబరాబాదు నుండి
ప్రకృతి వరాల జల్లు ఓరుగల్లుకు
ఓ చిరుజల్లుల సూర్యోదయాన
అలా ఇండికా కాబులో…

పూర్తిగా చదవండి »

- సాంబయ్య గుండిమెడ

ఎంతో చెప్పాలని ఉండే
కాని కొంచం కూడా చెప్పలేక పోయాను !
చాలా రాయాలని ఉండే
కాని ఏమీ రాయలేక పోయాను !
పూర్తిగా చదవండి »

- కన్నెగంటి చంద్ర

అడ్డంగా విరిచినా
నిలువుగా కోసినా తడన్నదే కనపడదు
ఏ మాట ఏరుకున్నా!
అట్లాగని అంటించినా
రాజుకోవు ఎంతకూ!
ఏం చేద్దామీవేళ?
పూర్తిగా చదవండి »

-డా.దార్ల వెంకటేశ్వరరావు

1.0 ప్రస్తావన:
తెలుగులో స్త్రీవాదం వచ్చిన తరువాత, దళిత , ముస్లిం మైనారిటీ వాదంలోనూ స్త్రీ లు తమ సమస్యలను కవిత్వీకరిస్తున్నారు. అంతకు ముందు పురుషులే స్త్రీ సమస్యలను కొంతవరకూ స్పర్శిస్తూ కవిత్వం రాశారు. అయితే స్త్రీలు రాసిన కవిత్వంలో మరింత బలంగా ముస్లిం స్త్రీ సమస్యలు అభివ్యక్తయ్యాయి.
పూర్తిగా చదవండి »

ira_gollobin.jpg1911లో జన్మించిన ఐరా గొలోబిన్‌ న్యుయార్క్ లో పౌరహక్కులు, ఇమిగ్రేషన్ రంగాల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 96వ ఏట కూడా చురుకుగా ఆలోచించగలిగే స్థితిలో ఉన్న ఈ మేధావి యువతకు ఆదర్శం. 1950ల నుంచి 1980ల దాకా రాజకీయంగా తమకు నచ్చనివారిపై ప్రభుత్వం బనాయించిన ఎన్నో కేసులు చేపట్టి, అటువంటి పెద్దపెద్ద కేసుల్లో అన్యాయాలకు గురైనవారి పక్షాన నిలిచి వాదించిన ధీశాలి.
పూర్తిగా చదవండి »

కృతజ్ఞత:
ఎన్నో ఏళ్ళబట్టీ సాగిన ఈ గ్రంథరచన ఇప్పటికి పూర్తయింది. అప్పట్లో ఇదొక పరిమిత లక్ష్యంతో మొదలయింది. 1930ల ప్రారంభంలో లెనిన్‌గ్రాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిలాసఫీ సంస్థ వెలువరించిన మార్క్సిస్ట్‌ తత్వశాస్త్రం అనే గ్రంథం ఆధారంగా ప్రాథమిక రచన చెయ్యడానికి ఒక ప్రచురణకర్తతో 1950లో నాకు అంగీకారం కుదిరింది.
పూర్తిగా చదవండి »

ఒక కుక్కను చంపాలనుకుంటె ముందు దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న ఒక రాజకీయ సామెత ఉంది. సరిగ్గా ఈ నియమాన్ని లేదా సూత్రాన్ని ఎన్ని దేశాల రాజకీయ నాయకులు అమలు చేశారో లేదో తేలియదుగాని, తెలుగు సమాజంలో మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి »

- జాన్ హైడ్ కనుమూరి

“అన్నపూర్ణ” యిప్పుడు
మధుశాలల నెలవయ్యింది
బార్లాతెరచుకున్న
బార్ రెస్టారెంట్లు
వీధివీధినా బారులు తీరుతున్నాయి

పూర్తిగా చదవండి »

- అనువాదం: అసూర్యంపస్య

మొంటూ కొన్నాళ్ళుగా తన తల్లిదండ్రులు ఒక తాతగారి రాక గురించి చర్చించుకుంటూ ఉండటం వింటూ ఉన్నాడు. చిన్న తాత అట. ఆయన అమ్మ వాళ్ళ చిన్న మామయ్య అట. అతని వద్ద నుండి ఉత్తరం వచ్చినప్పుడు మొంటూ ఇంట్లోనే ఉన్నాడు. అతని అమ్మ ఆ ఉత్తరాన్ని ఓ సారి చదివి కాస్త సున్నితంగా ఆశ్చర్యపడ్డది - “ఊహించనేలేదు!” అంటూ.

పూర్తిగా చదవండి »

వాసిరెడ్డి నవీన్ ప్రసంగం:ఆడియో
కథాసాహితి, సంపాదకులు