విచిత్రం ఏమిటంటే భూతలం మీదనున్న అన్ని విషయాల గురించీ ఆందోళన చేస్తున్న సిపిఎం వారు వాకపల్లి ఆందోళననుండి నెమ్మదిగా నిష్క్రమించారు. తెలుగుదేశంవారు కనిపించీ కనిపించకుండా పాల్గొంటున్నారు. దళిత సంఘాలన్నీ మిన్నకున్నాయి. ఆదివాసీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని పేరుబడ్డ స్వచ్ఛంద సంస్థలేవీ ఆ దాపులకు రావడం లేదు.
వాకపల్లి అత్యాచారం ఉదంతం అనేక రకాలుగా బాధాకరం. ఘటన సరే, దాని తరువాత జరిగిన ఒక్కొక్క విషయమూ ఆందోళన కలిగించింది. ఒకటి అప్పుడే పలువురి నిరసన ప్రకటనలకు దారితీసింది. అది డిజిపి, హోంమంత్రి ఏవిచారణా జరపకుండా ‘ఇది మావోయిస్టులను కాపాడడానికి కల్పించిన కథ’ అని ప్రకటించడం. బాధితురాళ్ళు ఆదివాసీలు కాక వేరే ఎవరై ఉన్నా అంత లేమిగా మాట్లాడి ఉందురా అని చాలామంది ఆరోజు ప్రశ్నించారు. ఈ ప్రశ్న మొత్తం ఉదంతానికి వర్తిస్తుంది.
వాళ్ళు ఆదివాసీ మహిళలు కాకపోతే వారిచ్చిన ఎఫ్ఐఆర్ నమో దు చేసికూడా ఇన్నాళ్ళు కనీస విచారణ జరపకుండా ఉందురా? కనీసం బాధితురాళ్ళ వాంగ్మూలాల నమోదు చేసుకోకుండా ఉం దురా? హైకోర్టు వేరే ఏ ఆదేశం కాకున్నా ఈ మేరకు నేరపరిశోధన తనడ్యూటీ నిర్వహించాలని వెనువెంటనే ఆదేశించకుండా ఉండు నా? రాష్ట్ర మానవహక్కుల కమిషన్ అంతే నిశ్చేష్టంగా ఉండునా? పోలీసులు చేసే నేరాలు వేరు, పౌరులు చేసే నేరాలు వేరు అనే వైఖరికి భారత రాజ్యాంగంలో ఎక్కడా చొటు లేదు. అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలలోనూ లేదు. కానీ పోలీసు యంత్రాంగం లోనూ, న్యాయవ్యవస్థలోనూ ఈ వైఖరి క్రమంగా స్థిరపడి పోతున్నది.
పాలనా యంత్రాంగం విషయంలో ఆశ్చర్య పోయేదేమీ లేదుగానీ న్యాయవ్యవస్థ ఈ వైఖరి అవలంబించడం ఆశ్చర్యం కలిగించే విషయం కాకున్నా ఆందోళన కలిగించే విషయం. వేరే వాళ్ళ మీద నేర అభియోగాలు వస్తే కేసు నమోదు చేసి నేరపరిశోధన జరుపుతారు. కానీ పోలీసుల మీద వచ్చిన అభియోగాలు తిరుగులేనంత బలంగా ఉండాలి. స్వతంత్రమైన సాక్ష్యాలూ మెడికల్ రిపోర్టులూ వగైరా ఉండాలి. ఆపైన హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో బాధితులు కేసు వేసి ఇవన్నీ చూపించాలి. వారు అన్నీ పరిశీలించి వెనకా ముందూ ఆలోచించి ‘కేసు నమోదు చేయండి’ అని ఆదేశించాలి. కేసు అప్పుడు నమోదవుతుంది.
బాధితులు అంత శ్రమ తీసుకోకపోతే కేసు ఉండదు. ఆదివాసులు అంత శ్రమ తీసుకోలేరు. అయినా నేరానికి ఆధారాలు నేరపరిశోధనలో తేలాలి. దానికి కావలసిన నైపుణ ్యం నేరపరిశోధకులకు తర్ఫీదులో ఇస్తారు. బాధితులు తాము చూసిందీ, అనుభవించిందీ చెప్పగలరు. దాని ఆధారంగా కేసు కట్టి నిపుణులయిన వారు నిజాయితీగా నేరపరిశోధన చేసి ఆధారాలు సేకరిస్తారని నేరస్మృతి భావిస్తుంది.
అంతే తప్ప బాధితులే నేరపరిశోధన జరిపి నేరం నిజంగానే జరిగిందనీ పలానా వాళ్ళు చేశారనీ సగం రుజువు చేసినట్టయితేనే తర్ఫీదు పొందిన పరిశోధకులు రంగంలోకి దిగుతారనేది చట్టమూ కాదు, న్యాయమూకాదు. పైగా, నైపుణ్యం సంగతీ, తర్ఫీదు సంగతీ అట్లా ఉంచి వాకపల్లి నేరానికి బాధ్యులయిన వారెవరో గ్రేహౌండ్స్ అధికారులకు తెలు సు. వారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే గ్రేహౌండ్స్ సిబ్బంది పేర్లూ, వారికి డ్యూటీ వేసిన ఊర్లూ వేరెవరికీ తెలీవు. ఏదైనా ఒక సమాచారం ఒకరికి మాత్రమే అందుబాట్లో ఉంటే దానిని ఉపయోగించుకొనే బాధ్యత ఎవరికైనా ఉంటుందనేది కామన్‌సెన్స్ దృక్ఫథమేకాక భారత సాక్ష్యాలచట్టంలోని నియమంకూడా.
కాబ ట్టి ఆ ఉదయం వాకపల్లి వైపు పోయిందెవరు అన్నది విశాఖ ఏజెన్సీలోని గ్రేహౌండ్స్ బలగాల అధినేత ప్రకటించాలి. అది వారి బాధ్యత. ప్రకటించిన తరువాత వారినందరినీ వాకపల్లి బాధితురాళ్ళ ముందు ప్రవేశపెట్టాలి. వారు ఎవరెవరిని గుర్తుపడతారో ఆ సిబ్బందిని పోలీసులు దోషులుగా ప్రాథమికంగా గుర్తిం చి నేరపరిశోధన కొనసాగాలి. తమ వారి తోలు కాపాడే కర్తవ్యం మీద వేసుకున్న పోలీసు పెద్దలకివన్నీ తోచకపోవచ్చునుగానీ హై కోర్టు కూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కూ తోచకపోవడాన్ని ఏమ నాలి? ఆ సంస్థలకు చట్టం తెలియకపోలేదు.
మరి ఎందుకు ఆలో చన చేయలేదనుకోవాలి? ఎందుకు తదనుగుణమైన ఆదేశం ఇవ్వ లేదనుకోవాలి? కోండు గిరిజనులేకదా, వెంటనే కేసుల కట్టెయ్యక పోతే, ఏం మునిగిపోయిందిలే అన్న వైఖరే కారణమా? తెలుగుదేశంపార్టీకి చెందిన మాజీమంత్రులు రాష్ట్రమంతటా చేస్తున్న వీరంగం చూస్తున్నాం. పోలీసులు వాళ్ళనప్పుడప్పుడు అటకాయించినా అరెస్టు చేసినా మర్యాద తప్పడం లేదు. ఎప్పుడ యినా కొంచెం తప్పినా చంద్రబాబునాయుడు, వారి అభిమా నులయినవారు నానాయాగీ చేస్తుండటం చూస్తున్నాం. మరి పాడే రు ఏజెన్సీలో తెలుగుదేశంకు చెందిన మాజీమంత్రి మణికుమారి వాకపల్లి బాధితులకు మద్దతుగా ఉన్నందుకు కాల్చేస్తామని బెది రించిన సంగతి మీరెవ్వరయినా ఎక్కడైనా చదివారా? టీవీల్లో చూశారా? చదివి ఉండరు, చూసి ఉండరు.
నాయకురాలయినా, మాజీమంత్రి అయినా, ఆదివాసీయే కదా ఆమె కూడా? మావోయిస్టులకు మేలు చేయడానికి ఆ స్త్రీలు అబద్ధపు ఆరో పణ చేసారని నమ్మేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లు సమాజంలో లేక పోలేదు. అయితే వేరే ఎవరి మేలు కోసమో తాము లైంగిక అత్యా చారానికి గురయ్యామన్న నిందవేస్తే వారికొచ్చే కష్టాలు పత్రికల లో అందరూ చదివారు. వారి భర్తలు వారిని కొంతకాలం వెలి వేసి సంప్రదాయం ప్రకారం జరగవలసిన తంతు జరిగిత తరు వాతే ఇంట్లోకి రానిచ్చారు. ఒకవేళ రేప్ ఆరోపణ నాటకమైతే వారి భర్తల చర్యకూడ నాటకమే అయి ఉండాలి. ఆదివాసీ తెగలవారి లో అతి వెనుకబడిన వారైన కోండులు మావోయిస్టుల మేలు కోసం ఇంత పెద్ద నాటకం ఆడుతున్నారని నమ్మగలమా?
ఈ స్క్రి ప్టు ఎవరు రాసారనీ దర్శకత్వం ఎవరు నెరపారనీ అనుకోవాలి?
ప్రభుత్వం వైఖరిలో ఏ కదలికా రాకపోయేసరికి చివరికి ఆ పద కొండుమందిస్త్రీలు పాడేరులో ఆమరణ నిరాహారదీక్షకు కూర్చు న్నారు. నాటకం చాలాదూరం పోయినట్టే మరి. వారిపైన అత్యా చారం చేసినవారు సురక్షితంగా, కనీసం పేరు కూడా బయటకు పొక్కకుండా ఉండిపోగా, బాధితురాళ్లు తిండిమానుకుని నిరసన దీక్షకు కూర్చున్నారు. అయినప్పటికీ జిల్లా కలెక్టరుతో సహా ఏ అధికారీ వారి దగ్గరకు పోలేదు, వారిని పలకరించలేదు.
విచిత్రం ఏమిటంటే భూతలం మీదనున్న అన్ని విషయాల గురించీ ఆం దోళన చేస్తున్న సిపిఐ(ఎం) వారు వాకపల్లి ఆందోళననుండి నెమ్మ దిగా నిష్క్రమించారు. తెలుగుదేశంవారు కనిపించీ కనిపించకుం డా పాల్గొంటున్నారు. దళితసంఘాలన్నీ మిన్నకున్నాయి. ఆదివా సీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని పేరుబడ్డ స్వచ్ఛంద సంస్థలేవీ ఆ దాపులకు రావడం లేదు. ఒక సామాజిక వర్గానికి జరిగితే అన్యాయం, వేరొకరికి జరిగితే వార్త మాత్రమేననేది సంకుచిత వైఖరి. సామాజికవర్గాలుగా చీలి పోయి ఎవరి న్యాయం కోసం వారు పోరాడుకుంటున్న రాజకీయ వాతావరణం దీనికి దారితీసింది. ఆ ‘పోరాటాలు’ విజయవంతం కావడానికి వైయస్ ప్రాపకం అవసరంఅనుకుంటున్నవారు, కొన్నా ళ్లు పోయాక వాకపల్లి బాధితులనే తప్పుపట్టినా ఆశ్చర్య పోలేము.
ముదిగొండ కాల్పుల తరువాత బియస్పీ, మాలమహానాడు, మా దిగ దండోరాలు సిపిఐ(ఎం)నే ఎక్కువ తప్పుపట్టడం చూడలేదా! వాకపల్లి ఆందోళన ఉధృతమయ్యే కొద్దీ పాడేరు ఎమ్మెల్యే రాజా రావుకే ప్రయోజనం ఎక్కువ అనే కుళ్లుబోతుతనం కొన్ని పార్టీలు మౌనంగా ఉండడానికి కారణమా? ఈ సందేహం నిజమైతే అది చాలా బాధాకరం. అయితే ఈ రకమైన కుళ్ళుబోతుతనానికి లోబ డ్డవారు గుర్తించవలసిన సత్యం ఒకటుంది. లకే రాజారావు ఆందో ళనకారుడిగానే ఎమ్మెల్యే అయ్యాడు. అతని దగ్గర పైసలు లేవు. బలమైన పార్టీలేదు, కండ బలంలేదు. ఆదివాసీగా పుట్టి ఆదివా సీ ల మేలుకోసం శ్రమించి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ మార్గంలో అత నిని ఓడించడం నిజమైన రాజకీయ స్పర్ధ అవుతుందిగానీ, కుళ్లు పోతుతనంతో ఉద్యమాలను దెబ్బతీసేది విధ్వంసక రాజకీయం అవుతుంది.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
సెప్టెంబరు 28, 2007