Comments on: ఆదివాసీ మహిళలపైన గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచారాలను ఖండించండి!

by: మహేష్
గ్రేహౌండ్స్‌ను రద్దు చేయాలి :  కె.బాలగోపాల్

పాడేరు, సెప్టెంబర్ 8 (ఆన్‌లైన్): రాష్ట్రంలో గ్రేహౌండ్స్ పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని, చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఈ విభాగాన్ని రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె.బాలగోపాల్ డిమాండ్ చేశారు. వాకపల్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అఖిలపక్ష ఐక్య వేదిక నిర్వహిస్తున్న నిరాహారదీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రేహౌండ్స్ పోలీసులు మావోయిస్టుల వేట పేరుతో సామాన్యులపై కూడా దాడులు చేస్తూ కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సాగించిన అత్యాచారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకూ వారిని ఎందుకు అరెస్టు చేయలేదని బాలగోపాల్ ప్రశ్నించారు.

కనీసం ఆ రోజు వాకపల్లి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులు ఎవరనేది కూడా అధికారులు వెల్లడించకపోవడం చూస్తే ప్రభుత్వానికి ఆదివాసీలంటే ఎంత చులకన భావం వున్నదో అర్థ్ధం అవుతున్నదని విమర్శించారు. వాకపల్లి ఘటనలో దోషులు అరెస్టు అయ్యేంత వరకూ ఆందోళన కొనసాగించాలని, అందుకు తమ పూర్తి మద్దతు వుంటుందని బాలగోపాల్ ప్రకటించారు. జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రతినిధి వి.కృష్ణ, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు తదితరులు శిబిరంలో పాల్గొన్నారు.