దేశచరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం అనేక ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమై రక్తాక్షరాలతో లిఖించబడిందని విప్లవకవి నిఖిలేశ్వర్ కొనియాడారు. ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో జనసాహితి జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో 60 ఏళ్ళ స్ఫూర్తి వీర తెలంగాణ విప్లవపోరాట జీవితం సంఘర్షణ నవలా సాహిత్యంపై సభ జరిగింది.

ఈ సందర్భంగా నిఖి లేశ్వర్ తెలంగాణ పోరాట నలలు- పోరాటక్రమంలో ప్రజా జీవితం అనే అంశంపై ప్రసంగించారు. 1947వరకు తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి సంబంధించిన పూర్తి సమాచారం సాహిత్య రూపంలో ప్రజల మధ్య నిలిచినా 1948 తరువాత యూనియన్ సైన్యాలతో జరిగిన పోరాటాన్ని సరిగ్గా చిత్రీకరించలేదని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన జీవితం అందించడానికి దోహదపడిందన్నారు. తెలంగాణ పోరాట విరమణ తరువాత ఉద్యమానికి ద్రోహం జరిగిందన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో నవలల పాత్ర చాలా ఉందని, ప్రజల మనిషి నవల తెలంగాణ వాస్తవ పరిస్థితిని చిత్రీకరించిందన్నారు. నిజాం విద్యారంగ అభివృద్ధ్దికి తన బడ్జెట్‌లో 11శాతం నిధులు కేటాయించారని తెలిపారు. నిజాం చేసిన కొన్ని అభివృద్ధి పనులు ఆమోదయోగ్యమైన వని అయితే చాలా మంది కమ్యూనిస్టులకు నిజాం స్వా భావం తెలియదన్నారు. నవలల్లో భూమి సమస్య వర్గ ఐక్యత అనే అం శంపై ఎకె.ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడితే తీవ్రవాదిగా చిత్రీకరించడం నిజాం నుంచి నేటి పాలకుల వరకు కొనసాగుతుందని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటం భూ సమస్యతో ముడి పడి ఉందన్నారు. నవలల్లో గ్రంథాలయ ఉద్య మం-సాంస్కృతిక పోరాటం అనే అంశంపై డాక్టర్ లక్ష్మి నారాయణ భట్టు, మృత్యుంజయులు, మంటలు, మా నవత్వం నవలలపై కెవి. అశోక్‌కుమార్, నవలల్లో మ తం రాజకీయ దృక్పథాలు అనే అంశంపై దివికుమార్ ప్రసంగించారు.

సౌజన్యం: ఆంధ్రజ్యోతి
సైఫాబాద్, సెప్టెంబరు 16

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)