Comments on: ముస్లింవాద సాహిత్యంలో ఆధునిక ముల్లాల అవతరణ

by: రహంతుల్లా
భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!

కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు

మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.

‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.

పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

by: Rohiniprasad
కుల మతాలకు అతీతమైన పద్ధతిలో ప్రపంచాన్నీ, సమాజాన్నీ, జీవితాన్నీ గురించిన సరైన అవగాహన ప్రజల్లో కల్పించడమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. అటువంటి అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నాలు చెయ్యకుండా ఇంకేది చెయ్యబోయినా అది వృథాయే అవుతుంది. ఈ అడ్డుగోడలన్నీ ఎప్పుడు, ఎందుకు, ఎలా సృష్టించబడ్డాయో సామాన్య ప్రజలందరూ గుర్తించాలి. ప్రకృతిని గురించీ, ప్రాణుల గురించీ, సమాజ పరిణామాల గురించీ సరిగ్గా అర్థం చేసుకోకుండా వారున్నంతకాలం సాహిత్యపరంగా గాని, సామాజిక పరివర్తనాపరంగా గాని ఎటువంటి ప్రయత్నమూ ఫలించదని నా ఉద్దేశం. జ్ఞానాన్ని సంపాదించుకున్న ప్రజలు ఎటువంటి విప్లవాత్మక మార్పులు అవసరమో గ్రహించగలుగుతారు. ఆ తరవాత అది కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఇందులో మొదటి మెట్టు అవగాహనే. ఇది అసమగ్రంగా ఉన్నంతకాలమూ అస్పష్టత తలెత్తుతూనే ఉంటుంది.