- కాసుల ప్రతాపరెడ్డి

లోపలివీ, వెలుపలివీ
మనసు పొరల్లోకి ఇంకుతయి
చెట్టుకు పూసిన పుష్పం ఈ దేహం
వాడకుండానే రాలిపడాలె

ఆత్మ ఒడ్డున పడ్డ చేప పిల్ల
ఈ శాపమెప్పటిదో, ఎవరిదో
ఊపిరాడక తన్నుకుంటూ ఉంటది
నిన్నటికీ నేటికి ఎంత తేడా
వాన చుక్కలు పెదవిని ముద్దాడుతుంటయి
ఆరాటం, పోరాటం
ఆశానిరాశాల ఊగిసలాట
పొత్తు కుదరని తండ్లాట, తల్లడమల్లడం
మనసు వేగాన్ని దేహం అందుకోదు
ఈ నేలకు ఎందుకింత ప్రేమ
ఆత్మనూ దేహాన్నీ మోస్తది
కన్ను మూసుకున్నా పట్టని నిద్ర
తొవ్వల మీద నెత్తురోడుతున్న పావురాలు
మోదుగుచెట్టు ఒళ్లంతా పూలే
ఎందుకొస్తామో, ఎందుకు పోతామో
నేలతల్లి పచ్చి పుండు అయితనే వుంటది
నీటి మీద రాతలో, నుదుటి రాతలో
చెప్ప వొశం గాని వెతల కతలు
రోదించే తోటలోకి పాట ఒక్కటీ రాదు

4 అభిప్రాయాలు

  1. venkatesh 07 సెప్టెంబర్ 2007 , 12:53 pm

    బాగుంది.

  2. Mallikarjuna Rao D 23 సెప్టెంబర్ 2007 , 4:51 am

    బావుంది.

  3. Alok 24 సెప్టెంబర్ 2007 , 12:31 am

    వ్యర్ధమైన పదం వొక్కటీ లేదు.కవిత బాగుంది.

  4. K Viswa 29 సెప్టెంబర్ 2007 , 1:27 am

    మంచి కవిత.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)