అన్నల దళిత దండోరా!

మావోయిస్టు పంథా మారుతోంది. జనంతో పూర్తిగా మమేకమయ్యే దిశగా అడుగులేస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులను పూర్తిస్థాయిలో పార్టీకి పట్టుకొమ్మలుగా చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అన్నిటినీ మించి దళిత బాట పట్టడం ద్వారా పునరుత్థానం కోసం ప్రయత్నిస్తోంది.

‘ఆన్‌లైన్’ సంపాదించిన మావోయిస్టుల తాజా డాక్యుమెంట్ చెబుతున్న వాస్తవాలివి!

(ఆన్‌లైన్-హైదరాబాద్, పిడుగురాళ్ల) మూడున్నర దశాబ్దాల నక్సలైట్ల ఉద్యమంలో కీలక మార్పులు చోటుచేసుకుం టున్నాయి. ఇంతదాకా జనానికి దూరంగా అడ వులకు మాత్రమే పరిమితమైన మావోయిస్టుల ఉద్యమం.. ఇప్పుడు లోటుపాట్లను సవరించుకొని ప్రజలతో మమేక మయ్యేందుకు సమాయత్తమవుతోంది. వర్గ దృక్పథంతో పోరాటం సాగించడమనే పంథా నుంచి దళిత బాట పట్టేందుకు తీర్మానించింది. భారత సమాజంలో వేళ్లూను కుని ఉన్న బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని ప్రతిన బూనింది. ఉద్యమ విస్తరణపై చర్చించడమే లక్ష్యంగా.. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో దండకారణ్యంలో జరిగిన మావోయిస్టు పార్టీ తొమ్మిదవ జాతీయ కాంగ్రె స్ సమావేశాలలో ఈ మేరకు తీర్మానించి, ఓ డాక్యుమెంట్‌ను రూపొందించారు.

విప్లవం విజయవంతం కావడానికి అవసరమైన దశదిశలను అందులో నిర్దేశించారు. దాని ప్రకారం సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక, పోరాటాల్లో వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేసేందుకు మావోయిస్టు క్యాడర్ ఇకపై ప్రజల్లో ఒకరిగా మెలగాలని స్పష్టంగా నిర్దేశించుకున్నారు. అవసరమైతే క్యాడర్‌ను రాజకీయ అధికార అంగాలలో, వివిధ శాఖలలో చేర్చడమూ తప్పనిసరన్న నిర్ణయానికొచ్చారు. కళాశాల లకు ఉద్యమ పాఠాలు దూరమైన కారణంగా బహుకాలం తర్వాత నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నా మని గుర్తించిన పార్టీ.. విద్యార్థులపై దృష్టి సారించాలనీ నిర్ణయించింది.

ముందుగా గ్రామీణ, పట్టణ ప్రాంతా లలో ఉండే విద్యార్థులను చైతన్యపరచడానికి, సంఘటిత పరచడానికి మనం కృషి చేయాలని దిశానిర్దేశం చేసుకు న్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతను పార్టీ నిర్మాణంలో ఇముడ్చుకోవడమేకాక, ఉపాధ్యాయ, మేధావి వర్గానికి చోటు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

దళిత నాయకత్వం
తీవ్ర నిర్బంధం, ఎన్‌కౌంటర్ల తర్వాత పార్టీకి దూర మైన దళితవాడలను అక్కున చేర్చుకునేందుకు మావోయి స్టులు కొత్త వ్యూహాన్ని రచించారు. అదే దళిత బాట..! భారత్‌లో బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా అంటరానితనాన్ని నిర్మూలించే విధంగా నిరంతర పోరాటం చేయకుండా ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడం అసాధ్యమనే కఠిన వాస్తవాన్ని గుర్తించాలని ఆ పత్రంలో పార్టీ కింది శ్రేణులకు పిలుపునిచ్చారు. అం టరానితనానికి వ్యతిరేకంగా, దళితుల పక్షాన నిర్ణయాత్మక పోరాటం చేయాలని నిర్ణయించారు. దీని కోసం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక దళిత సంస్థను ఏర్పాటు చేయా లనీ తీర్మానించారు. తమ పార్టీలోను, ప్రజాసంఘాల్లో నూ కుల గుర్తింపులకు వ్యతిరేకంగా అంతర్గత పోరాటం జరగాలని, దీన్ని దిద్దుబాటు ఉద్యమంలో భాగం చేయాలని నిర్ణయించారు.

దళిత సమస్య ప్రాతిపదికన ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకతపై అన్ని రాష్ట్ర కమిటీల నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు రాజకీయ అవగాహన కల్పించేందుకు ఆ డాక్యుమెంట్ ద్వారా ప్రయత్నించారు. ‘దళిత బాట’ నిర్ణయానికిగల కారణాలను అందులో వివరిస్తూ.. భారతదేశంలో ఆదిమ సమాజం నుంచి సామాజిక వర్గీకరణలు ఎలా జరిగాయి? బ్రాహ్మణత్వ భావజాలంతో వర్గ సమాజం పుట్టుక ఎలా ముడిపడి ఉంది? అనే విషయాలపై కిందిస్థాయి పార్టీ క్యాడర్‌కు కూడా అవగాహన కల్పించే విధంగా సంక్షిప్త సమాచారాన్ని పొందు పరిచారు.

కుల పీడన వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కుల నిర్మూలనకు పునాదులు వేయాలని సూచించారు. దీం తోపాటు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడకుంటే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందనీ హెచ్చరిం చారు. కుల నిచ్చెనలో దళితులు కింది భాగంలో ఉండ టంతో వారు తీవ్ర వివక్షకు గురవుతున్నారని, దీన్ని రూ పుమాపాల్సిన అవసరం పార్టీపై ఉందని అభిప్రాయపడ్డారు. వర్గ దోపిడీ కంటే అంటరానితనం, ఆత్మగౌరవ సమస్యల పట్ల దళితుల్లో ఎక్కువ స్పందన ఉంటుందని పేర్కొన్నారు. వివిధ కారణాల రీత్యా దళిత సమస్యల పరిష్కారంలో విఫలమయ్యామని పార్టీ అంగీకరించింది.

దళితులు విప్లవోద్యమ పరిధికి బయట నిర్మాణం అయి ఉన్నారని, పార్టీ వారి సమస్యలను పట్టించుకుంటోందని వారు భావించడం లేదని అభిప్రాయపడింది. దీంతో అవకాశవాద దళిత నాయకుల చుట్టూ ప్రజలు సమీకృతులవుతున్నారని, బీఎస్పీ మాదిరిగా దళితులలో ఒక వర్గంవారు పాలకవర్గాలకు అమ్ముడుపోయే విధంగా తయారవుతున్నారని పేర్కొంది. దళిత సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. సమాజం కుల ప్రాతిపదికన శతాబ్దాల క్రితమే చీలిపోయి ఉన్నందున మౌలిక వ ర్గాలను కులపరంగా విభజిస్తున్నామనే అపవాదు గురిం చి ఆలోచించాల్సిన అవసరం లేదని క్యాడర్‌కు సూచిం చింది. పార్టీ నిర్మాణంలోని సకల స్థాయిల్లోనూ దళితులు నాయకత్వంలోకి చేరగలిగేలా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడానికి తప్పక పూనుకోవాలని నిర్దేశించింది.

సౌజన్యం: ఆంధ్రజ్యోతి

ఒక్క అభిప్రాయం

  1. ramamohan ch 23 సెప్టెంబర్ 2008 , 10:32 pm

    తాత్వికచింతన తాత్వికధోరణి తాత్వికపునాది సమస్యలపరిష్కరానికి అవసరం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)