- డా. దార్ల వెంకటేశ్వరరావు
ముస్లిం జీవితాల్లోనూ కనిపించని చీకటి కోణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే చాలామంది కవిత్వం రూపంలో బలంగానే అభివ్యక్తీకరించ గలుగుతున్నారు. కేవలం కవిత్వంలోనే కాకుండా మిగిలిన ప్రక్రియల్లో కూడా ముస్లిం సాహిత్యం విస్తరిల్లుతున్నది.

సలీం ‘వెండి మేఘం’ పేరుతో ఒక గొప్ప నవల రాశారు. ముస్లిం జీవితాలతో మమేకం కాలేకపోతున్న దూదేకుల జీవితాల్ని, ముస్లిం స్త్రీ స్థితిగతుల్ని చూపుతూ ఈ నవలను వర్ణించగలిగారు. ‘అన్వర్’ అనే స్త్రీ పాత్ర చుట్టూనే కథ నడిపించినా, బలమైన తాత్విక పునాదితో ముస్లిం స్త్రీవాదాన్ని అందించగలిగారు. ముస్లింలలో భాష, ఆచార సంప్రదాయాలు వంటి వాటిలో, వాటిని వినియోగించుకోవడంలో గల వ్యత్యాసాల వల్ల కింది కులాల నుండి ముస్లింలుగా మారిన వారు ప్రధాన ముస్లిం జీవన స్రవంతిలో కలవలేకపోవడమో, దూరం కావడమో జరుగుతుంది. దీన్ని రచయిత బలంగా పట్టుకోగలిగారు.
పెళ్ళి అంటే ఏమిటో తెలియని చిన్న వయసులోనే తనకంటే పాతికేళ్ళ పెద్దవాడి రెండవ భార్యగా మారిపోయిన అన్వర్, కనకుండానే ఓ బిడ్డకు తల్లి అవుతుంది. తనని చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగిన బావే తనకు భర్తగా మారి హింసలకు గురి చేస్తాడు. తన అక్క చనిపోవడంతో, అక్క కన్నబిడ్డ కోసం తప్పనిసరి పరిస్థితిలో అన్వర్ని రెండవ భార్యగా పెళ్ళి చేసి ఆమె గొంతుకోశామని అటు తల్లితండ్రులు, ఇటు అత్తగారు అనేక సందర్భాల్లో బాధపడినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోతారు.
సంక్షిప్తంగా కథ ఇదే అయినా, చల్లగాలి తాకితే వర్షమై కరిగిపోయే మేఘంలా కాకుండా జీవితంలో కొత్త మెరుపుల్ని వెదజల్లే, వర్షపు చినుకుల్ని కురిపించి జీవన ఫలాల్ని అందించగలిగే ‘వెండి మేఘం’లా స్త్రీ జీవితం మారాలనే ఆశయం నవల నిండా కనిపిస్తుంది. ధృఢమైన సంకల్పం ఉంటే గానీ, కొన్నితరాలయినా, నష్టపోయినా పోరాడితే గానీ స్త్రీ జీవితంలో వెలుగులు ప్రసరించవు.
మత గ్రంథాల పేరుతో, వాటిలోని విషయాల్ని దుర్వ్యాఖ్యానాలు చేస్తూ, వాస్తవాల్ని బయటకు రాకుండా చేస్తూ, స్త్రీని తమ బానిసగా మార్చుకుంటున్నారనీ, ఒకరికంటే ఎక్కువమంది స్త్రీలని పురుషుడు వివాహం చేసుకోవచ్చుననే సందర్భాన్ని చెప్పకుండా, అటు మతానికీ, ఇటు స్త్రీకి అన్యాయం చేస్తున్నారని గుర్తించమనీ, వాస్తవాల్నిఅందరూ తెలుసుకోవాలనే ఆరాటం కూడా నవలలో కనిపిస్తుంది. ‘అన్వర్’ పాత్ర ద్వారా ముస్లిం స్త్రీలలో రావాల్సిన చైతన్యాన్నీ, గుర్తించాల్సిన వాస్తవాన్నీ ఆశిస్తే, అన్వర్ అక్క ‘సలీమున్’ సంప్రదాయ ముస్లిం స్త్రీ జీవితానికి ప్రతినిధిగా, అన్వర్ని రెండొ పెళ్ళి చేసుకున్న ‘బాషా’ ముస్లిం మతాన్నితమకి అనుకూలంగా మార్చుకుంటూ జీవితాల్ని ఎంజాయ్ చేస్తున్నవాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటట్లు చిత్రించగలిగారా అని అనిపిస్తుంది. దూదేకుల జీవితాల్లో ఆశిస్తున్న మార్పుల్ని ‘ఆదాం’ పాత్రలో చూడగలిగే అవకాశం ఉంది.
ప్రస్తుత భారతదేశంలో ‘ఇండియా పాకిస్తాన్’ సంబంధాల్ని, మత విద్వేషాల్నీ, చరిత్ర గ్రంథాల్లోని విషయాల్నీ వివరిస్తూ ముకర్రం, జిలానీ, వాసు పాత్రల్నీ వర్ణించారు. నగరాల్లో జరుగుతున్న మత విద్వేషాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణమవుతుందనే కోణాన్ని చూడాలనే కొత్త ఆలోచననీ ఈ నవల అందించగలిగింది.
రచయిత నవల రాయటంలో చాలా సంయమనాన్ని పాటించగలిగారు. ముస్లిం అంతర్గత జీవితాన్ని విశదీకరిస్తూనే అవమనాల్నీ, పరాయీకరణలనూ, దయనీయ స్థితినీ, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎంపికలో జరుగుతున్న పెద్ద పెద్ద పదవుల, బాధ్యతల, ఉద్యోగాల విషయంలో ముస్లింల మనోగతాల్ని స్పర్శిస్తూనే, సంకుచితత్వం నుండి బయటపడి స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి నిరంతరం శ్రమించవలసిన అవసరాన్ని కూడా ఈ నవలలో వివవరించగలిగారు. ఈ నవల చదివిన వాళ్ళు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో గల సామంజస్యాన్ని అంగీకరిస్తూనే, అవి దూదేకుల, పింజారీలు, నూర్బాషీయులనే వాళ్ళకి ఇస్తే మంచిదని అభిప్రాయానికి రాగలుగుతారు.
ఈ దేశ ముస్లింలలో, హిందూ ముస్లిం జీవన విధానం కలిసిమెలిసి పోవటానికి గల కారణాల్ని అన్వేషించకుండా, అరబ్బీ, ఉర్దూ మాట్లాడలేకపోతున్నారనో, నమాజ్ సరిగా చేయలేకపోతున్నారనో, ఇంకా హిందూ సంప్రదాయాల్ని పాటిస్తున్నారనో, దూదేకుల, పింజారీ, లద్దాఫ్, నూర్ బాషీయులను తక్కువగా చూడటం తగదనీ, తరతరాల వారసత్వ జీవన విధానం ఒక్కసారిగా మారిపోదనీ గుర్తించగలగాలనే ప్రబోధాన్ని నవల అందించగలుగుతుంది.
మరో కోణంలో మంస్లింలలో నెలకొన్న మైనారిటీ భావన దానివల్ల పొందే ఆత్మన్యూనత, ఈ దేశంలో పుట్టి పెరిగి, దేశం కోసం ప్రాణాలర్పించి, ఈ నేలలోనే కలిసిపోతున్నా, నిత్యం దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవమానాల పరంపరలు… పాకిస్తాన్ భారత్ల మధ్య క్రికెట్ జరిగినా, చరిత్ర క్లాసులో గజనీ మహమ్మద్ హిందూ దేవాలయాల ధ్వంసాన్ని వివరించినా, స్వదేశీ ముస్లింలను కొంతమంది విదేశీయులుగానే అనుమానపు చూపుల్తో బాధించటం, ఈ దేశం వదిలి పొమ్మనటం, నాటి చరిత్రలో ముస్లిం మత ఛాందసుల దుర్మార్గ దోపిడీలకు నేటి స్వదేశీ ముస్లింలు పరిహారం చెల్లించుకోవాలనటం, ఈ నెపంతో స్థానిక ముస్లింలను మతం పేరుతో హింసించటం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని ‘వెండి మేఘం’ నవల చెప్తుంది.
‘అన్వర్’ లోని పవిత్రత, తద్వారా నిర్భయత్వం, స్వతంత్రతలను ముస్లిం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమస్యల్ని ప్రతిభావంగా అందించిన నవల ‘వెండి మేఘం’ తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి కాగలదు.
……… మొన్న హైదరాబాదులో జరిగిన దారుణమారణ కాండకు ….. తీవ్రవాదులే కారణం.అమాయకుల్నెందుకు పొట్టనపెట్టుకుంటారు?
గమనిక:
ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ సంపాదకవర్గం
…………
నీ లాంటి దేశభక్తులే కావాలిప్పుడు…
మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళని,
బాంబులు పేల్చే వాళ్ళని,
దేశమంతా మతచిచిచ్చును రగిల్చే వాళ్ళని,
మసీదుల్ని కూల్చే వాళ్ళని,
ఫాదర్లని నిలువునా తగలబెట్టే వాళ్ళని,
……….. పేల్చిపారేసే వాళ్ళని,
ఆయ్ధాలతో, దాడులతో, అల్లర్లతో,
మందిని ఉసిగొలపటంతో అధికారం దక్కిందుకోవాలని చూసే ప్రతివొక్కరిని నిర్మూలించు.
గుజరాత్ జనోసైడ్లను
బొంబాయి మారణకాండను జరిపిన వారు ఏమతం వాళ్ళో తెల్సుసుకొని
వాళ్ళని కూడా నిర్మూలించు.
గమనిక:
ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ సంపాదకవర్గం
ఈ వ్యాసంలో విషయస్ఫష్టతవుంది.నిజంగా నే ముస్లింల జీవితం సంఘర్ష ణ తో కూడినది.అన్ని పార్స్వాల లోని సంక్లిష్టతలను చూపిన వెండిగిన్నే రచయిత అబినందనియులు,రచనలోని వస్థువును టెక్నిక్ ను రచన చుట్టూ వున్న వాతావర్ణాన్ని విమర్శ నాత్మ కంగా తడిమిన దార్ల కూడా అబినందనియులు,…..ఐనాల
ఎడిటర్ గార్కి నమస్కారం!
…..
ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులున్నంత మాత్రం చేత ఆ జాతినే తిట్టడం సరికాదు. నిజానికి ఇతరులకంటే ముస్లిం సమస్యల ప్రస్తుతం తీవ్రత ఎక్కువగా ఉంది. పైగా ఆ వ్యాఖ్యలు నావ్యాసం గురించి రాస్తే బాగుండేది. దీన్ని ఆసరా చేసుకొని ఒక జాతిని తిట్టే వాళ్ళ సంస్కృతిని ఏమనాలి? ఆ మాటకొస్తే, ప్రతి జాతిలోనూ ఉగ్ర వాదులు ఉండవచ్చుకదా!
సరే… ఏదిఏమైనా ముస్లింల పై తీవ్ర నిరసన ఉందని మాత్రమ అర్థమయ్యింది.
ఉంటాను
మీ
దార్ల
భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు
మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక
న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్ పీటీఐకి చెప్పారు.
‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్ చెప్పారు.
పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).
రహంతుల్లా గారూ!
ధన్యవాదాలండీ…! మీరు అందించిన వివరాలు నావ్యాసానికి మరింత బలాన్ని చేకూర్చాయి. వ్యాసం గురించి కూడా స్పందిస్తే సంతోషిస్తాను. లోపాలు ఉంటేకూడానిర్మొహమాటంగా రాయండి. ముస్లింల గురించి నాకు తెలిసిన అవగాహనతో దీన్ని రాశాను.ముస్లిం లగురించి రాయవలసింది చాలా ఉంది.”మరో కోణంలో మంస్లింలలో నెలకొన్న మైనారిటీ భావన దానివల్ల పొందే ఆత్మన్యూనత, ఈ దేశంలో పుట్టి పెరిగి, దేశం కోసం ప్రాణాలర్పించి, ఈ నేలలోనే కలిసిపోతున్నా, నిత్యం దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవమానాల పరంపరలు… పాకిస్తాన్ భారత్ల మధ్య క్రికెట్ జరిగినా, చరిత్ర క్లాసులో గజనీ మహమ్మద్ హిందూ దేవాలయాల ధ్వంసాన్ని వివరించినా, స్వదేశీ ముస్లింలను కొంతమంది విదేశీయులుగానే అనుమానపు చూపుల్తో బాధించటం, ఈ దేశం వదిలి పొమ్మనటం, నాటి చరిత్రలో ముస్లిం మత ఛాందసుల దుర్మార్గ దోపిడీలకు నేటి స్వదేశీ ముస్లింలు పరిహారం చెల్లించుకోవాలనటం, ఈ నెపంతో స్థానిక ముస్లింలను మతం పేరుతో హింసించటం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని ‘వెండి మేఘం’ నవల చెప్తుంది.” నేను వ్యాసంలో హిందూ ప్రస్థావన చేసింది ఇది. దీనికి మీ నివేదిక మరింత బలాన్నిచ్చిందని భావిస్తున్నాను.
మీ
దార్ల
vrdarla@gmail.com