మాకొద్దీ మాల దొరతనమూ- బాబు
మాకొద్దీ దళితదొరల జులుమూ
దేవ! తెలిసిపోయె
మా సోదరుల గుణమూ
1. అంబేద్కరు పేరు జెప్పి
హక్కులెన్నో అడుగుతారు
జైభీముల గొట్టుకొంటు
పోరు జెయ్యమంటారు
మాది గోల్లమాటంటే
మండిపడి చస్తారు ॥మా కొద్దీ॥
2. డక్కలోల్లు, బుడిగె, బైండ్లోల్లు
గొడారులూ చమారులూ
రెల్లివాల్లు పాకివాల్లు
ఉపకులాల ఊసెత్తితె
ఉరిమురిమి జూస్తారు
ఉమ్ము వేయ వస్తారు ॥మా కొద్దీ॥
3. కలిసి పోదమంటారు
కలిసి నడవమంటారు
కలిసి పంచుకుందమంటే
కయ్యానికి లేస్తారు
మా కడుపుల మన్నుబోసి
మా ఎముకలు నములుతారు ॥మా కొద్దీ॥
4. మా తిండిని తిననియ్యరు
మా గోసను ఇననియ్యరు
మా కుత్కెలు పిస్కబట్టి
మా పేగులు కోస్తారు
ఆకలితో అరుస్తుంటే
అనుభవించమంటారు ॥మా కొద్దీ॥
5. కుల నిర్మూలన అంటారు
కులం కూడు తింటారు
పక్కోడికి బెట్టకుండ
పబ్బాలను గడుపుతారు
ఇదేందిర న్యాయమంటే
ఇంతెత్తున ఎగురుతారు ॥మా కొద్దీ॥
6. ఢిల్లీ దాక బోతారు
పీటాలను ఎక్కుతారు
అమ్మోరిని బొగుడుతారు
మాదిగోల్ల సంగతంటే
మాదిగాదు అంటారు
మా చెట్టు పండ్లు తింటారు ॥మా కొద్దీ॥
7. పత్రికల్లో రాస్తారు
మైకుల్లో అరుస్తారు
దళితపులుల మేమంటూ
దద్దరిల్ల జేస్తారు
మాదిగోల్ల మాటొస్తే
మవునంగా ఉంటారు ॥మా కొద్దీ॥
8. పాలేర్లయి బతికినోల్లు
లాయర్లయి వచ్చారు
ఇంగిలీసు జదివారు
ఇదేశాల కెళ్ళారు
ఎబిసిడి లడుగుతుంటే
అడ్డుపుల్ల లేస్తారు ॥మా కొద్దీ॥
9. అంబేద్కరు బోధనల
అర్థాలను మార్చారు
సత్యాలను దాటవేసి
పైత్యాలను చేర్చారు
పక్కకులం బాగుపడితే
పచ్చి కారెమవుతారు ॥మా కొద్దీ॥
10. డప్పుల దరువంటేనే
కప్పల వలె బెదురుతారు
చెప్పులనే చూడగానే
నిప్పులనేకక్కుతారు
దండోరా మాటంటే
లండోరా తిప్పుతారు ॥మా కొద్దీ॥
11. అధికారము బొందారు
అయ్యేయస్సులయ్యారు
అయిపీయస్సులయ్యారు
ఇన్ని ఇద్యలున్నోల్లు
మాదిగోల్లు జదువుతుంటె
పాదమడ్డు పెడతారు ॥మా కొద్దీ॥
12. ఐకమత్యమంటారు
ఏందేందో జెబుతారు
బొచ్చెమాట ఎత్తగానె
ఎచ్చరికలు జేస్తారు
కండ్లు ఎర్రజేస్తారు
పండ్లు నూరి లేస్తారు ॥మా కొద్దీ॥
13. పలకరిస్తే తిడతారు
కొన్నిచోట్ల కొడతారు
దయదలచిన వాల్ల మీద
దబాయింపు కొస్తారు
పేద మాదిగోల్లని
చీదరించుకుంటారు ॥మా కొద్దీ॥
14. మాలపేట మేధావులు
ఎర్రకోట ఎక్కారు
వాటాలను వద్దంటూ
పచ్చి విషం కక్కారు
ఉషామెహరా కమిటీని
రద్దు చేయమంటారు ॥మా కొద్దీ॥
15. ఎస్సీలుగ బతుకుతారు
ఎంతెంతో ఎదుగుతారు
ఎమ్మెల్యేలవుతారు
ఎంపీ గద్దెలెక్కుతారు
మంతిరయ్యలైనాక
కంతిరయ్యలవుతారు ॥మా కొద్దీ॥
16. సంఘాలను కట్టమనె
ఒక్కచోట కూడమనె
పోరాటము జెయ్యమనె
అంబేద్కరు మాట మీద
దండోరా కడుతుంటే
మండిపడీ చస్తారు ॥మా కొద్దీ॥
ఈ కవిత పూర్తిగా అభ్యంతరకరం. నేను ఆమూలాగ్రం వ్యతిరేకిస్తున్నాను. జగమెఱిగిన కీ.శే.గరిమెళ్ళవారి పాటకు పసలేని అనుకరణ కావడం వల్ల సాహితీ విలువలు లేవు సరికదా-ఒక దళిత కులాన్ని అన్యాయంగా శీల హననం (character assassination) చెయ్యడానికి పూనుకుంటోంది. ఆడలేక మద్దెల వోడన్నట్లు విద్యాపరంగా మాలల్ని ఎదుర్కోలేక కాదూ వర్గీకరణ పల్లవి ఎత్తుకున్నారు ? రిజర్వేషన్ అంటే బుద్ధిలేకుండా ఎవడు పడితే వాడొచ్చి ప్రభుత్వ కుర్చీల్లో కూర్చోవడం అనుకుంటున్నారా ?
కులమే మన దేవుడుగా, కులమే మన జాతీయతగా, కులమే మన రాజ్యాంగంగా మారిపోయిన పరిస్థితుల్లో మంచి చెబితే ఎవడికీ ఎక్కదు. ఉన్న విభేదాలతో ఇప్పటికే సగమైపోయాం. తెలుగు జాతిని ముక్కలు చెక్కలుగా విడదీసే అన్ని ప్రయత్నాల్ని ఖండించాలి.
రిజర్వేషన్/వర్గీకరణ విషయంలో మేధావులు తమ అభిప్రాయాలు వివరించగలరు.
ఈ కవితలో వర్గీకరణ ఆవశ్యకతను, మనలో మనకున్న ఆధిపత్యాల తీవ్రతను తెలియజేస్తుంది. ఈ వాస్తవాలను మనము గమనించలేనంతవరకూ మనలో ఐక్యతను సాధించలేము.
సుదయ్య పాటలో సాహితీ విలువలు లేవనటం సరికాదు.సాహితీ విలువలంటే సంస్కృత పదాలుండటమేనా?తెలంగాణా వాళ్ళు విడిపోతామంటే “తెలుగు జాతిని ముక్కలు చెక్కలుగా విడదీయొద్దు” అంటున్న సమైక్యవాదుల్ని మాలలు తలపిస్తున్నారు.”నీపప్పులూ నా పొట్టూ ఊదుకు తిందాం రా” అన్నట్లుంది వీళ్ళిద్దరి వ్యవహారం.కలిసిఉన్నట్లుగా నటిస్తూ కొట్టుకునే బదులు ఎవరి వాటాతో వాళ్ళు బతకొచ్చుగదా?
[…] కవితలు: ఒంటరి సమూహలు - పసునూరి రవీందర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు మాకొద్దీ మాల దొరతనమూ… - సుదయ్య అక్షరమంటే అంబేద్కర్ - పొనుగోటి రవి కుమార్ దళిత గోవిందం - ఎండ్లూరి సుధాకర్ […]
ఈ కవి చెబుతున్న విశ యాల పై చర్చ అసక్తి కరముగా వున్నది.నాకు కావలసినదేదొ నాకు కావాలని అడిగితే పాపం కొందరికి అగ్రవర్ణ ఆలోచనైన , ప్రతిభ , గుర్తుకు రావడం విచిత్రం గా లేదూ…..
ఐనాల
ఈ కవిత మాదిగల బాధను తెలియచేస్తుంది. అయితే ఈ కవితలో రాసినవాటిలలో చాల, సత్య విరుద్దంగ వున్నాయి.రచయిత సమాజాన్ని మరింత నిశితంగా పరిశిలించాలి.భావోద్రేకంలో సత్యాన్ని విస్మరించకూడదని మనవి..
గొర్రె తన మెడ నరకొద్దంటే కసాయికి ఆదాయం ఎక్కడనుండి రావాలె.అట్లాఉన్నాయ్ మన రాస్ట్రంలో కొందరు /కొన్ని వర్గాల ఆలోచనలు.అంబానాధ్ గారి అభ్యంతరాలు సిస్పక్షంగా లేవు.
ఇదేభాణీలో మరో పాటరాసుకుంటే (సుదయ్య వంటి వారు రాస్తే) తెలంగాణకు బాగుంటుంది / మేలుజరుగుతుంది.ఆయనంత బాగా రాయలేక పోయినా ప్రయత్నిస్తున్నాను.
మాకొద్దీ ఆంధ్ర దొరా తనమూ!బాబు
మాకొద్దీ తెలుగుదేశ జులుమూ!
దేవ!మాకొద్దీ కమ్మదొరా తనమూ,
తెలంగాణ వారి కొద్దు మల్ల వారి తద్దినమూ
ఆరువందలాపదినీ అనగదొక్కిపెట్టికూడ,
పులిచింతల తోటి అంధ్రోల్లకు మూడు పంటలిచ్చారు,
తెలంగాణకేమొ మరి చింతలు కొని తెచ్చారు,
చెడులెన్నో చేసి కూడ మంచి చేస్తి మంటారు
తెలంగాణ వాళ్ళుతమకుతామె మరి ఎందుకు చచ్చారు!
మాకొద్దీ రెడ్ల దొరాతనమూ!వయ్యెస్
మరోసారి తెలిసిపోయె కాంగ్రేస్ గుణమూ!
మాకొద్దీ పోలవరము,పోతిరెడ్డి పాడులూ,
మాభూములు మానౌకరి మాకు వదిలితే చాలు!
మాకొద్దీ కాంగేయుల పాలనమూ!
మాటి,మాటికీ రెండవ ఎస్సార్సీ అంటారు,
ఎన్నేండ్లైనా దాన్ని నాన బెడుతు ఉంటారు
ఇంకా పూర్తిగ అది నాన లేదనంటారు,
తెలంగాణ కొరకు దాన్ని తెస్తలేము అంటారు,
మరియెందుకు తెస్తున్రో దాచివేస్త ఉంటారు.
ఈ కవిత పూర్తిగా అభ్యంతరకరం. నేను ఆమూలాగ్రం వ్యతిరేకిస్తున్నాను. జగమెఱిగిన కీ.శే.గరిమెళ్ళవారి పాటకు పసలేని అనుకరణ కావడం వల్ల సాహితీ విలువలు లేవు సరికదా-ఒక దళిత కులాన్ని అన్యాయంగా దూషించడం సరికాదు. పోరాటం చేయలే క వెనక్కు పోతున్నాము.కుండ కుంభమండ్రు,కొండ పర్వత్ మండ్రు,ఉప్పు లవణ మండ్రు భాష లింతె వేరు భావ మొకటి కాదె. అనుకరణ వద్దు విష యం ముఖ్యం.స్పోర్ట్ కస్ నుంచి నేర్చుకుందాము.సమస్య పరిష్కరం అయ్యేవరకు పోరాడదాం.