తరాల వంతెన మీద
నడుస్తూ వచ్చిన
ఒక నాగరిక ప్రపంచపు
చరిత్ర పుటల్ని నిశితంగా స్పృశిద్దాం!
ఒంటరి నుండి గుంపులు….
గుంపుల నుండి సమూహాలు….
అచ్చంగా గోడలోని ఇటుకల వలె.
కానీ…,
కొంత ప్రవాహగతి అనంతరం
కళ్ళు చెమర్చే ఆశ్చర్యం!
సమూహంలో జీవిస్తూనే
ఒంటరిగా మిగిలిన దృశ్యం ….
* * * * *
ప్రపంచం మన గుప్పిట్లోనె ఉంది .
పారే సెలయేటి లాగా
అవిరామంగా మ్రోగుతూనే ఉంటుంది.
అయినా…,
ఎవరికి ఎవరూ కానీ
శ్మశాన నిశబ్దపు ఒంటరితనం
నెమ్మదిగా ఆవహిస్తున్నది.
విభిన్న సంస్కృతుల నడుమ
సందడిగానే బతికేయొచ్చు .
కానీ,
సముద్రాల ఇవుతలున్న
కన్నపేగు గుండె కోత తీరేదెలా ?
సమూహమంటూనే
కొనితెచ్చుకునే నిరీక్షణల ఒంటరితనం దేనికి?
* * * * *
సమూహమంటే
నిన్నటి రాత్రిని
ఈనాటి ఉదయంతో
ఒక అవిభాగపు అనుసంధానం చేయడం.
ఒంటరితనమంటే
మండే ఎండాకాలం
మధ్యాహ్నపు వేళ చుక్కనీరులేక
అరిచే….
ఒంటరి కాకి అరుపు !
* * * * *
సమూహమొక సంయుక్త రూపం
ఒంటరితనమొక ముక్కలైన అణువుల ప్రతిరూపం.
(కవిత్వంగా జీవించే సమూహ ఒంటరి కవులకు)
అన్నయ్య ,
నీ కవిత కత్తిలా వుంది ఇంతటి పదునైన భావజాలాన్ని ఎందుకు బంధిస్తావు.
ఇకనుండి అక్షరాలు మరింత సున్నితంగా కురవాలని ముగిస్తున్నాను.
మీ తమ్ముడు
వెంకటేశ్
జీవితాన్ని ఒక సున్నా చుట్టిన రవీందరా! నీ కత్తిలో పదును ఇలాగా కొనసాగాలనీ ఆశిస్తూ…..
[…] కవితలు: ఒంటరి సమూహలు - పసునూరి రవీందర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు […]
సమూహానికి, ఒంటరితనానికి అర్ధాన్ని విడమర్చే ప్రయత్నమే కనిపిస్తున్నది. కవిత్వం కాగల మొదటి రెండు ఖండికలు, అనవసరమైన వ్యక్తీకరణలవలన బాగా పలచబడ్డాయి.
ఉదాహరణకు “…. చరిత్ర పుటల్ని నిశితంగా స్పృశిద్దాం!” అంటూ విడిగా చెప్పాల్సిన అవసరం ఏముంది, కవి చేస్తున్నదే అదయినప్పుడు.
అలానే, కానీలు… అర్ధణాలు… కవిత్వాన్ని వివరణగా మార్చేసి వ్యాసం రూపు ఇచ్చే అవకాశాలుంటాయి.