- జాన్ హైడ్ కనుమూరి
వినగల్గితే
ఖాళీ సమాధి మాట్లాడుతుంది
ఉరితాడు మాట్లాడుతుంది
పిచ్చుకగూళ్ళ అల్లికల
విశాలరోడ్లపై విస్తరిస్తున్న
అహంకార పాదముద్రల్ని
ప్రశ్నిస్తే
దేహం కొరడాలతో చీల్చబడుతుంది
గుండెలొ పొదిగిన ప్రేమను
బహిర్గతంచేస్తే
వీధిల్లో అవమానపు వూరేగింపౌతుంది
ప్రశ్నించిన గొంతు
మరణపు అంచులపై వేళ్ళాడుతుంది
అవమానాల జలపాతాల్లోంచి జారి
చెదిరిపడ్డ దేహం
ముక్కలై
ఎగసిన ధూళిలో కలసి
ఒకొక్కటిగా జతచేరి
ప్రవాహమై ఎగసిపడుతుంది
రక్తమరకల్ని చెరపలేని చరిత్ర
నిస్తేజంగా నిలబడి చూస్తుంది
వరిసిన దేహం
ఖాళీ సమాధి
ఖాళీ వురితాడు
నిశ్శబ్దమైన వీధులు
కొత్తపొరను తొడుక్కుని
ప్రవహిస్తూ ప్రవహిస్తూ
మాత్లాడుతూనే వుంటుంది
మాటలెప్పుడూ వృధాకావు కదా!
మెల్లగా గమనిస్తే
మనసు పొరల్నేవో తడ్తుంది
వినూత్నాక్షరాల్ని దిద్దిస్తుంది
కవాతు శబ్దం హృదయాన్ని తట్టిలేపుతుంది
బాగుంది.మీనుంచి మరిన్ని మంచి కవితలు రవాలని కోరుకుంటు
-పావని.