kadiyala.jpg

ఇటీవల సాహిత్యవిమర్శకులు కడియాల రామోహనరాయ్ గారిని ఇంటర్వూ చేయడం జరిగింది. దీనిలోనుండి కొన్ని ఎంపిక చేసిన భాగాలను ఆడియో రూపంలో అందిస్తున్నాం.

మొదటి భాగం:

“ భావకవిత్వం తన చారిత్రక కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించింది. కాలంలో వచ్చిన మార్పును చెప్పలేముకదా. ఒక యుద్ధ సమయంలో మరికొన్ని తక్షణావసరాలుంటాయి. ఆకలి, దారిద్ర్యం వున్నప్పుడు వాటి గురించి కళ్ళు మూసుకోవడానికి వీలులేదు కదా కవి, రచయిత. అందుకే భావకవిత్వం కాస్త తగ్గుమొఖం పట్టింది….”

రెండవ భాగం:

మూడవ భాగం:

నాలుగవ భాగం:

ఐదవ భాగం:

ఆరవ భాగం:

ఏడవ భాగం:

10 అభిప్రాయాలు

  1. jayadev 19 ఆగస్టు 2007 , 10:43 pm

    ఇంట ర్యూ లో తెలిపిన విషయాల లోపలికి వెళ్ళే ముందు, ఇంటర్యు చేసిన విదానం, అసలు ఇంటర్యు ను ఎడిట చేయకుండా ప్ర సారం చేస్తా రనే సంగతి శ్రీ మోహన్రాయ గారికి తెలుసునా?
    ఒక ఎడిటరు గా మీ కు ఈ ఇంటర్యు ను ఎడిటు చేయకుండా యదాతధంగా ప్రసారం చేయడం మీకు సబబు అని ఎలా అనిపించింది? ఇంటర్యు పూర్తిగా ఇంటర్యు మద్దిరిసాగ లేదు. మద్యలో పోన్లు రావడము నవీను గారు మాట్లాడం చూస్తే ఎదో కాజువలు టాక
    లాగా వుంది కాని ఇంటర్యు గా లేదు. మరి ఇది రామ్మోహన రాయి గారికి తెలసే వున్నింటుందా?

    రామ్మోహన రాయి గారు చాలా ఖచ్చితంగా తమ అభిప్రాయలూ వెల్లుబుచ్హారు. అందుకు అభినందనలు. విరసం గురించి వారి విశ్లేషణ చాలా బాగుంది. ఆంద్రప్రదేశం
    లో అన్నిజిల్లాలలో దానికి శాఖలు ఎందుకు లేవో కామ్రేడు లు ఆలోచించాలి.
    జయదేవ, చికాగో

  2. Satyanarayana 20 ఆగస్టు 2007 , 10:34 pm

    మొట్ట మొదటగా అసలు ఈ ఇంటర్వ్యూ చేసిన విధానమే చాలా ఘోరంగా ఉంది. అసలు ఇంటర్వ్యూ చేసిన మహానుభావుడెవరో గానీ ఆయన గారికి తెలుగు సాహిత్యము గురించిన అవగాహన గానీ ,గ్నానం గానీ శూన్యము లాగున్నవి. కడియాల రామ్మోహనరాయి లాంటి సాహిత్యవేత్తను అడగాల్సిన ప్రశ్నలేనా ఇవి? సాల్వా జుడుము గురించి అడగడం ఎందుకు? దానికీ సాహిత్యానికీ సంబంధమేమిటో సెలవిస్తారా ప్రజాకళ సంపాదకులు గారూ? రాయి గారు చాలా స్పష్టంగా వ్యతిరేకత ప్రకటిస్తున్నా మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు వేయడం ఎందుకో సెలవిస్తారా? ఇది ఏ ప్రజాస్వామిక చర్చకు దారి తీయగలదో చెప్పగలరా దయచేసి? అసలు రాయి గారిని సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు ఒక్కటి కూడా అడక్కుండా అన్నీ విప్లవానికి సంబంధించిన ప్రశ్నలడిగి ఆయనతో బండ బూతులు తిట్టించు కోవడంలో పరమార్థం ఏమిటో? అసలు ఇంటర్వ్యూ చేసిన పద్ధతే ఒక గొప్ప భావ దారిద్ర్యాన్ని సూచిస్తోంది. ఏ మాత్రం ఎడిటింగు లేకుండా, ఆ రికార్డు చేసిన అవకతవకల సంభాషణను కనీసం రాసి అయినా వేయకుండా ఆడియో గా పెట్టడం లోనే ఇంటర్వ్యూ చేసిన వారి, ప్రచురించిన వారి భావ దారిద్ర్యం, సాహిత్య స్థాయి తెలుస్తోంది.
    ఇంక రాయి గారి ఇంటర్వ్యూ నిండా విరసం మీద విశ్లేషణ కాకుండా విషం కక్కడం మాత్రమే ఉంది. రాయి గారి విచక్షణ, సాహిత్య వివేచన ఏమయిందో తెలియదు. విరసం మీద ఆయన చేసిన ఒక్క విమర్శా సాహిత్య పరమయినది కాదు. తెలంగాణ ఆకాంక్ష మీద, దళితుల ఆకాంక్షల మీద , అంబేద్కర్ మీద, బౌద్ధం మీద ఆయనకు ఎంత అక్కసు ఉందో, మొత్తంగా తమ తమ ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్న ప్రజా సమూహాల పట్ల ఆయనకు ఇంత అక్కసు, క్రోధం , వ్యతిరేకత ఎందుకు పెంచుకున్నారో , ఎందుకింత విషం కక్కారో కనీసం ఇంటర్వ్యూ చేసిన వారికైనా తెలుసా అని నా అనుమానం? ఆయన చేసిన విమర్శ లో కనీస సాహిత్య ప్రస్తావన లేక పోవడం గమనించవచ్చు. ఇంతకు ముందే ఏర్పర్చుకున్న జడాభిప్రాయాలతో (ప్రిజడిస్) ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు అత్యంత దారుణంగా ఉన్నయి. ఆయనకు కౌముది, మోహన్ ల కవిత్వం, పాణి నవల మీద సదభిప్రాయం లేక పోవడం , కల్యాణ రావు నవల , వరవర రావు రాసిన కవిత్వం ఆయన దృష్టి కి రాలేక పోవడం ఆయన హ్రస్వదృష్టిని సూచిస్తుంటే , ఆయనను అడగడానికి ఏమీ ప్రశ్నలని తయారు చేసుకోక , తనకు తెలిసిన రాజకీయ రొడ్డకొట్టుడే సాహిత్యంగా భావిస్తూ మాట్లాడి ఆయనను రెచ్చగొడుతూ మాట్లాడిన ఇంటర్వ్యూ చేసిన మహానుభావుడి అల్పత్వాన్ని సూచిస్తోంది.
    ఈ ఇంటర్వ్యూ ని ఆడియో రూపంగా ప్రచురించిన ప్రజాకళ తన ఆశయాలనీ , లక్ష్యాలనీ గాలికొదిలేసినట్లే అని స్పష్టంగా అర్థం అవుతోంది. పాలెమిక్స్ ప్రచురించను అని చెప్పుకున్న ప్రజాకళ దీనిని ప్రచురించి ఎంత దిగజారిందో వేరే చెప్పాలా?

  3. pochiah 21 ఆగస్టు 2007 , 12:46 am

    రాయ్ గారి లోతైన ఆలోచనల్ని వెలికి తీసిన ప్రశ్నలు అడిగినందుకు ధన్యవాదాలు. ఆచరణ క్రమంలో వర్గ స్వభావం బయట పడటం సహజం. ఈయనని ఇంటర్వ్యూ చేయడానికి కారణం వివరించగలరు.

  4. pochiah 21 ఆగస్టు 2007 , 12:57 am

    అడిగిన ప్రశ్నలన్నీ ఒక మేధావి నిజ స్వరూపాన్ని బయట పెట్టేవి గా ఉన్నాయి. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని అభినందించాలి.

  5. satyanarayana tirunagiri 21 ఆగస్టు 2007 , 12:00 pm

    పోచయ్య గారూ - బహు బాగ సెలవిచ్చారు. ఇంటర్వ్యూ చేసినాయన మేధావి, ఇచ్చినాయన మేధావే, పాఠకులం వెర్రి వెధవలం. బహు పరాక్!

    ఇంటర్వ్యూ మొత్తం మీద రామ్మోహన రాయి రచనల మీద గానీ, ఆయన సాహిత్య అభిప్రాయాల మీద గానీ, తెలుగు సాహిత్య విమర్శ మీద గానీ, తెలుగు సాహిత్యం లో సమాజం మీద గానీ, తెలుగు సాహిత్యం లో అస్తిత్వ వాద ధోరణులమీద గానీ, లేదా తెలుగు కవిత్వం లో ఇతర ధోరణుల మీద గానీ ఏమయినా ఉపయోగపడే ప్రశ్నలు గానీ, రామ్మోహనరాయి సాహిత్య కృషిని, అనుభవాన్ని, ప్రతిపాదనలని గానీ ఏమయినా వెలికి తీసి పాఠకులకు కొత్త విషయాలను పరిచయం చేసే ప్రయత్నం గానీ ఇసుమంతయినా జరిగాయా? జరిగితే ఎక్కడ ఎట్లా జరిగినయి? ఊరికే ఇంటర్వ్యూ చేసినాయన మేధావి అని ఆయన తరఫున వత్తాసు పలికితే అది పెద్ద ప్రయోజనకరమేమీ కాదు. ప్రజాకళ లాంటి సాహిత్య పత్రిక తరఫున ఇట్లా ఇంటర్వ్యూ చేయడం , చేసినా దాన్ని ప్రచురించడం చాలా బాధాకరం.ఇంటర్వ్యూ ఇచ్చ్చేటాయన చెబుతున్న విషయాలు చేయి దాటి పోతున్నపుడు, సాహిత్యేతర విషయాలవైపు మళ్ళుతున్నపుడు, అనవసర విషయాలు ప్రస్తావనకు వస్తున్నప్పుడు, ఇంటర్వ్యూ చేసేటాయన చాల చాకచక్యంగా వాటిని ఉపయోగపడే విషయాల వైపు , పాఠకుల ప్రయోజనాలకు, సాహిత్య ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా మళ్ళించగలగలగాలి. ఈ ఇంటర్వ్యూ లో రామ్మోహన రాయి చెప్పిన విషయాలేవయినా సాహిత్యానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయా? ఆయనే చెప్పినట్టు ఇది ఉత్తి నోటి దురద తప్ప మరేమీ కాదే? విరసాన్ని, విరసం లోని వ్యక్తులనూ తిట్టి పోయడం, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష మీద , దళితుల మీద, అంబేడ్కర మీద , బౌద్ధం మీద విషం గక్కడం ఏ సాహిత్య ప్రయోజనం నెరవెరుస్తున్నయి? ఒక రచన విరసం నుండి వచ్చింది కాబట్టి అది నేలబారు రచన అని ప్రకటించడం ఎంతవరకు సమంజసం? “అంటరాని వసంతం” చదివారా రామ్మోహన రాయి? పోనీ ఇంటర్వ్యూ చేసే ఆయన ప్రస్తావించారారా ?జిల్లాకొక యూనిట్ లేదు కాబట్టి విరసం ఉనికి లేదనడం సమంజసమా? ఒక సాహిత్య సంస్థ ఉనికి దాని సాహిత్య కృషిలో చూద్దామా లేక యూనిట్ల లెక్క లో చూద్దామా? సాహిత్య కృషి ఏమీ లేదు , ఉన్నా బాగా లేదు అంటే ఎందుకు లేదో, ఎట్లా లేదో - దాని మీద సాహిత్య చర్చ జరగాలి. అసాహిత్య అవాకులూ చవాకులూ పేలడం కాదు! దాని మీద చర్చ జరిగేటట్టు ఇంటర్వ్యూ చేసే ఆయన సంభాషణ దారి మళ్ళించాలి. రామ్మోహన రాయి చదువుకున్న వారే! కానీ దురదృష్టవశాత్తూ అయన ఏర్పర్చుకున్న కొన్ని జడాభిప్రాయల వల్ల , ప్రిజుడిస్ ల వల్ల కొన్ని రచనలని చదవడం మానేసారు. వాటి మీద ఆయన అభిప్రాయాలు ఆయన ప్రిజడిస్ లతో ప్రభావితం చేయబడతాయి. కాబట్టి రెండు రకాలుగా ఇంటర్వ్యూ జరిగి ఉండవచ్చు - ఒకటి - వాటి గురించి ప్రస్తావించడం మాని వేరే సాహిత్య విషయాలు అడగడం చేయవచ్చు తెలుగు సాహిత్యం లో రైతు గురించి ఆయన చక్కగా చెప్పగలరు - అట్లా అడగవచ్చు . రెండు - విప్లవ సాహిత్యం ఎందుకు బాగాలేదని ఆయన అంటున్నారో సాహిత్య ప్రమాణాలను బట్టి బేరీజు వేయమని అడగవచ్చు. రెండూ జరగలేదు. విరసం ఏ రాజకీయ ఉద్యమాన్ని సమర్థిస్తుందో దాని మీద దూషణలు, నిందలు జరగడం వల్ల ఇంటర్వ్యూ ఎటువంటి సాహిత్య ప్రయోజనాలనూ నెరవేర్చగ పోగా ఒక చేదు విషం లా మిగిలింది. కనీసం ఇంటర్వ్యూ అనే మర్యాద అనే లేకుండా వ్యక్తులను వాడు వీడు అని రామ్మోహన రాయి సంబోధించడం దానీ యధాతధంగా ప్రజాకళ లో వేసుకోడం వల్ల ప్రజాకళలో ప్రజలూ కళా రెండూ తప్పిపోయినయి. ఏమయినా ఈ ఇంటర్వ్యూ వల్ల జరిగిన మంచి శూన్యం - దీని ప్రచురించినందుకు ప్రజాకళను అభిశంసించకుండా ఉండలేక పోతున్నాను.

    - తిరునగరి సత్యనారాయణ

  6. పిచ్చయ్య 21 ఆగస్టు 2007 , 4:03 pm

    ప్రజాకల ఎడిటర్ గారికి మక్కోటి సూర్య నమస్కారలు…

    కాస్త దయచేసి పోచయ్యగారి email-ID / ఫోటో ఇక్కడ పెడితే మేము దండేసి దండం పెట్టకుంటాం !

    భవదీయుడు,
    పిచ్చయ్య

  7. siva 21 ఆగస్టు 2007 , 7:44 pm

    విరసాన్ని తృణీకరించటం , అసాధారణ ఉదాహరణల్ని తరచుగా జరిగే విషయాలుగా పేర్కొనటం రాయ్ గారి వర్గ స్వభావాన్నే సూచిస్తుంది. ‘కవితా శిల్పం’, ‘కధాశిల్పం’ లాంటి గాలి కబుర్ల కంటే, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలే మేధావి నిజ స్వరూపాన్ని బయట పెడతాయి.

  8. satyanarayana tirunagiri 22 ఆగస్టు 2007 , 10:31 am

    చాలా బాగుందండీ శివ గారూ! ప్రజాకళ సాహిత్య పత్రిక అని పొరపాటు పడ్డాను. ప్రజాకళ ముఖ్యోద్దేశం సాహిత్య పరమైంది కాకుండా మేధావుల వర్గ స్వభావాలని వెలికి తీయడం అన్న మాట! మరి ఈ ఇంటర్వ్యూ చదివాక రామ్మోహన రాయి ని వర్గ శత్రువు కింద జమకట్ట గలమా ? ఆయన దాదాపు ఇవే అభిప్రాయాలు గతంలో అనేక సార్లు వెలిబుచ్చారు కదా? మరి అప్పుడు ఆయన వర్గ స్వభావం బయట పడలేదా? ఆ విషయం ఇంటార్వ్యూ చేసేటాయన కు తెలియలేదా? ఆయన వర్గ శత్రువు అని నిర్ధారణ కాలేదా? అంటే రామ్మోహన రాయి ఎవరో ఆయన ఏమి మాట్లాడుతున్నారో , ఆయన ఏమి రాస్తున్నారో , ఆయన రచనలేవిటో ఏ మాత్రం తెలియకుండానే ఆయన ను ఇంటర్వ్యూ చేసారా? ఆయన తానా సభలకు వచ్చారు కాబట్టి, సాహితీ వేత్త అని ఎవరో చెపితే విన్నారు కాబట్టి, ఆయనను ఇంటర్వ్యూ చేసేసారా? ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నామో, ఆయన దేనిలో ప్రసిద్ధుడో, ఆయన ఇప్పటిదాక చేసిన రచనలేమిటో, పోనీ ఇప్పటిదాకా వెలిబుచ్చిన అభిప్రాయాలేమిటో కనీసం తెలియకుండా , ఆయనను ఏమి అడగాలో తెలియకుండా, రొడకొట్టుడు ప్రశ్నలడిగి, ఆయన నోటి దురద తీర్చుకునే బ్రహ్మాండమైన సదవకాశం కల్పించడమేనా వర్గ స్వభావం బయట పెట్టడమంటే? అయినా ఇప్పుడు ప్రజాకళ తరఫున ఆయనని కొత్తగా అడిగిందేమిటి? ఆయన కొత్తగా చెప్పిందేమిటి? ఆయన వర్గ స్వభావం కొత్తగా బయట పడిందేమిటి? పాఠకులకు ఒరిగిందేమిటి? అయినా ప్రజాస్వామిక సాహిత్య పత్రిక అని మకుటం తగిలించుకున్న ప్రజాకళ మేధావుల వర్గ స్వభావాలు వెలికితీసేలా ఇంటర్వ్యూ చేయడం ఎందుకో?

    - తిరునగరి సత్యనారాయణ

  9. siva 24 ఆగస్టు 2007 , 4:59 pm

    మేధావుల వర్గ స్వభావాన్ని మరుగుపరిచే ఉద్యోగం ‘పజాస్వామ్య సాహితీ పత్రిక’ఏనాడూ చేయ కూడదు. మార్క్స్, ఎంగెల్స్ ల పేరును ఉటంకిస్తూనే నిజమైన ప్రజాప్రతినిధుల పై విషం గుమ్మరించే వాళ్ళు, ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ, తమ వర్గ స్వభావాన్ని అంతిమంగా చాటుకుంటారు. ఈ ఇంటర్వ్యూ ఒక మంచి ప్రక్రియ అని నా అభిప్రాయం.

  10. K.B. Srisailam 25 ఆగస్టు 2007 , 6:15 pm

    మావోయిస్టు పార్టీ ఏక పక్షంగా, కార్మిక వర్గ అంతర్జాతీయతకి విరుద్దంగా, మేధావుల అభిప్రాయాలను పరిగణన లో కి తీసుకోకుండా, తెలంగాణా వాదాన్ని సమర్ధించటం సబబు కాదు. ఈ విషయం రామమోహన్ గారు చెప్పినందుకు ధన్య వాదాలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)