boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

ఆగస్టు, 2007 సంచిక

koku1.jpg

జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడి ఉన్నది. ఆ పోరాటంలో ప్రజల చేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం. అదే విప్లవసాహిత్యం. ఇందుకు అంగీకరించనివారు జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడలేదని రుజువు చెయ్యాలి; చెయ్యలేరు.

- కొడవటిగంటి కుటుంబరావు

తస్లీమా నస్రీన్, జర్నలిస్టులపైన భౌతిక దాడిని ఖండించండి!

హైదరాబాదు లో 9-8-2007 వ తేదీన ప్రెస్ క్లబ్బు లో పుస్తక ఆవిష్కరణ సభకు వెళ్ళిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పైన మజ్లిస్ కార్యకర్తలు, ఎమ్మెలేలు భౌతికంగా దాడి చేశారు. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన జర్నలిస్టులు, ఫోటోగ్రాపర్లను గాయపరిచారు. ముస్లిం మత ఛాందసత్వం తలకెక్కిన మజ్లిస్ కార్యకర్తలు ఇలాంటి హేయమైన దాడికి పాల్పడటం సభ్యసమాజం తలవంచుకోవలసిన విషయం.

పూర్తిగా చదవండి »

- ఎన్.వేణుగోపాల్

ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకుల ను వెళ్లగొట్టి మహోజ్వల పోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది? స్వాతంత్య్రమంటే తెల్లదొరలు దిగిపోయి నల్లదొరలు ఎక్కడం కాదని, ఒక మనిషిని వేరొక మనిషి పీడించే సాఘికధర్మం మారడమని భగత్ సింగ్ ఇచ్చిన నిర్వచనం గుర్తుతేలేనంత మొద్దునిద్దరలో సాగాయి ఈ ఆరుపదులు.

పూర్తిగా చదవండి »

- జాన్ హైడ్ కనుమూరి

వినగల్గితే
ఖాళీ సమాధి మాట్లాడుతుంది
ఉరితాడు మాట్లాడుతుంది
పిచ్చుకగూళ్ళ అల్లికల
విశాలరోడ్లపై విస్తరిస్తున్న
అహంకార పాదముద్రల్ని
ప్రశ్నిస్తే
దేహం కొరడాలతో చీల్చబడుతుంది

పూర్తిగా చదవండి »

తను చేస్తున్న పని యొక్క స్థూల ప్రయోజనాన్ని ఏ కళాకారుడూ సంపూర్ణంగా తోసివెయ్యరాదు… కవి తన రచన యొక్క ఆశయాన్ని తృణీకరించరాదు. భోజనం దగ్గర ఎంత నాజూకూ, అభిరుచీ ఉన్నా అభ్యంతరం లేదు- భోజనం చెయ్యటం యొక్క ఉద్దేశాన్ని ఏమరకుండా ఉంటే సరి.
-కొ.కు., 1940
పూర్తిగా చదవండి »

- ఓల్గా

ప్రెస్‌క్లబ్‌లో తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించారు. నిజంగా అది హైదరాబాద్ నగర సంస్కృతికి, సాహిత్య వాతావరణానికి మచ్చ తెచ్చే సంఘటన. ఆ సంఘటనను ఖండించి ప్రజాస్వామిక విలువలకోసం నిలబడిన వారందరినీ అభినందించాలి. గురువారం జరిగిన పుస్తకావిష్కరణ సభకు తస్లీమా నస్రీన్ వస్తున్నారన్న విషయం ఆవిడొచ్చేవరకూ అక్కడున్న ఎవరికీ తెలియదు.
పూర్తిగా చదవండి »

kadiyala.jpg

ఇటీవల సాహిత్యవిమర్శకులు కడియాల రామోహనరాయ్ గారిని ఇంటర్వూ చేయడం జరిగింది. దీనిలోనుండి కొన్ని ఎంపిక చేసిన భాగాలను ఆడియో రూపంలో అందిస్తున్నాం.

మొదటి భాగం:

పూర్తిగా చదవండి »

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా నాన్నగారిని, ఏ వ్యాపకము లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోగా చూసినట్లు గుర్తు లేదు. నిద్రపోయినప్పుడు తప్ప తక్కిన సమయంలో చదవడమో, రాయడమో, తోటపనో ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. మనస్సుకూ, దేహానికీ సోమరితనం అనేది లేకపోవడం ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణం అనుకుంటాను.

పూర్తిగా చదవండి »

- డా. దార్ల వెంకటేశ్వరరావు

ముస్లిం జీవితాల్లోనూ కనిపించని చీకటి కోణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే చాలామంది కవిత్వం రూపంలో బలంగానే అభివ్యక్తీకరించ గలుగుతున్నారు. కేవలం కవిత్వంలోనే కాకుండా మిగిలిన ప్రక్రియల్లో కూడా ముస్లిం సాహిత్యం విస్తరిల్లుతున్నది.
పూర్తిగా చదవండి »

విప్లవకవి వరవరరావు

vv.jpg
ప్రసంగం: 1
ప్రసంగం: 2

పూర్తిగా చదవండి »

నక్సలైట్ ఉద్యమాల మీద గత 35 ఏళ్ళుగా జరుగుతున్న చట్టాతీత బలప్రయోగాన్ని ఏ కారణంచేత సమర్థించినా, అంగీకరించినా ఆ విచ్చలవిడి బలప్రయోగాన్ని సమాజంలోని ఏ ఉద్యమంమీదైనా, ఏ రాజకీయ వర్గం మీదైనా ఉపయోగించే ప్రమాదం ఉన్నదని హక్కుల సంఘాలు పదేపదే చెబుతూ వస్తున్నాయి.

పూర్తిగా చదవండి »

- కొడవటిగంటి కుటుంబరావు

సార్వభౌమరావుగారి దగ్గర ఒక కుక్క ఉండేది. అది అన్నప్పుడల్లా మొరిగేదికాదు. నేరస్థులనూ, జైలుకు పోయివచ్చినవాళ్ళనూ చూస్తే మాత్రమే మొరిగేది. చివరకు, ఈ విషయం ఎన్ని డజన్ల సార్లు రుజువయిందంటే, అది ఎవర్ని చూసి మొరిగితే వాళ్ళు నేరస్థులయి ఉండాలని అందరూ నమ్మే స్థితికి వచ్చారు.

పూర్తిగా చదవండి »

- త్రిపురనేని మధుసూదనరావు

సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని గురించి బాధపడేవాళ్ళు చాలామంది వున్నారు. ప్రకృతి మీదా, సమాజం మీదా శాస్త్రీయమైన అవగాహన కలిగించవలసిన సాహిత్యం మూఢవిశ్వాసాల్ని ప్రచారం చేయటం అన్యాయమే. కులాల్నీ, మతాల్నీ సమర్థించడం, దేవుళ్ళనీ, దెయ్యాల్నీ ఆవాహన చేయటం, స్త్రీని కించపరచటం వంటి పనుల్ని సాహిత్యం ద్వారా చెయ్యటం సామాజిక ద్రోహమే. ప్రగతిశీలవాదుల్లో ఈ విషయంలో ఏకాభిప్రాయం వుండటం కూడా సంతోషించదగ్గ విషయమే.

పూర్తిగా చదవండి »

పూర్తిగా చదవండి »

- పసునూరి రవీందర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు

తరాల వంతెన మీద
నడుస్తూ వచ్చిన
ఒక నాగరిక ప్రపంచపు
చరిత్ర పుటల్ని నిశితంగా స్పృశిద్దాం!
ఒంటరి నుండి గుంపులు….
గుంపుల నుండి సమూహాలు….
అచ్చంగా గోడలోని ఇటుకల వలె.
కానీ…,
పూర్తిగా చదవండి »

- సుదయ్య

మాకొద్దీ మాల దొరతనమూ- బాబు
మాకొద్దీ దళితదొరల జులుమూ
దేవ! తెలిసిపోయె
మా సోదరుల గుణమూ

పూర్తిగా చదవండి »

- పొనుగోటి రవి కుమార్

అక్షరాన్ని దిద్దాను
చూపుడు వేలుతో
మూడు వేళ్ళు చూస్తున్నై
నా వైపు శూలంలా!
పూర్తిగా చదవండి »

- Next »