- సురేష్ కుమార్ దిగుమర్తి
నేను నిశ్శబ్దాన్ని
మౌనంగా రగులుతున్న అగ్ని పర్వతాన్ని
నీ చూపులు శూలాలై గుచ్చుతునన్నా
నీ మాటలు గుండెను కాల్చేస్తున్నా
నా సహనాన్ని నేనే పరీక్షిమంచు కుంటున్న…..లావాని నేను
నువు నమ్మిన తప్పే, తప్పు కానప్పుడు
నా నిజం, నిజం కాకుండా పోతుందా
నీకున్న బలంతో ప్రపంచాన్ని మొత్తాన్ని నమ్మించినా
నా నిజం ….నిప్పు…..ఆగుతుందా….ఆపగలవా?
అబద్దాల ఆట నుండి తప్పుకో
సామాజిక న్యాయం వైపు సాగిపో
కార్చిచ్చు మొదలవ్వక ముందే
లావా మరిగిపోక ముందే
నేను నిశ్శబ్దాన్ని ఛేధించక ముందే
నిజాన్ని ఒప్పుకో
నా వాటా నుండి తప్పుకో
[ ఎస్సీల వర్గీకరణలో వెనుకబడ్డ 57 కులాల తరపున]
ఆర్ద్రత ఉన్న కవిత.
ఆకలిగొన్న కవిత.
కడుపుమండిన కవిత.
కన్నీళ్ళు కాలువైన కవిత.
నిజాన్ని నిర్బయంగా వెల్లగక్కిన కవిత.
నిండు మనసుతొ వాస్తవాన్ని
కళ్ళ ముందుంచిన కవిత రాసిన
కవి సురేష్ కుమార్ కు శుభాకాంక్షలు.
ముందు ముందు మరిన్ని మంచి కవితలు
రాస్తారని, రాయాలని ఆశిస్తున్నాను.