పరిచయం:
విప్లవకవి వరవరరావు, అల్లం నారాయణ
…………………………………………………………….
రేలా రేలా రేలా రే
రచయిత: వరవరరావు
గానం: సంధ్యక్క
రేలా రే…రేలా రే… రేలా రేలా రేలా రే
రేలా రే…రేలా రే… తెలంగాణ తేవాలే
రేలా రే…రేలా రే… తెలంగాణ కావాలే
బీడుపడ భూముల్లో జీవనదులు మళ్ళించి
ఆకలిదప్పులు దీర్చే …. ఆకలిదప్పులు దీర్చే తెలంగాణ తేవాలే
రేలా రే…రేలా రే… తెలంగాణ తేవాలే …
……………………………………
రామోజీ ఫిల్మ్ సిటీ
రచయిత: వరవరరావు
గానం: వెంకట్
రండి రండి చూడండి రామ్మోజీ ఫిలిమ్ సిటీ
రంగారెడ్డి జిల్లా ప్రజల కడుపుకొట్టి నిర్మించిన
రమ్యమైన ఫిలిమ్ సిటీ, రంజైన ఫిలిమ్ సిటీ
దివినుండి భువి మీదకి దిగివచ్చిన ఫిలిమ్ సిటీ
శిఖంభూమి రఖంభూమి సంఘీ మింగినవి పోను
చెరువు కుంటలే కావు సర్కారు భూములేకావు
కాలిబాట రాచబాట కబ్జాపెట్టిన ఘనుడు
రండి రండి చూడండి రామ్మోజీ ఫిలిమ్ సిటీ
తొండలు కూడ గుడ్లుపెట్టన పోరంబోకు భూముల్లో
వండర్ లాండ్ సృష్టించిన రామ్మోజీ ఫిలిమ్ సిటీ
బాలీవుడ్ , హాలీవుడ్ డిస్నీలాండ్ బలాదూర్
చంద్రబాబు చలువతోను, ఇంద్రజిత్తు చెలిమితోను
అమితాబ్ మొదలుకొని అందరూ పొగిడిన గ్రాండ్
అసలు రైతు బ్రతుకులకు ఎసరు పెట్టిన బ్రాండ్
………………………………………………
తెలంగాణ వీరగాధ- బతుకమ్మ పాట
రచన: వరవరరావు
ముందుమాట : ఎన్. వేణుగోపాల్
గానం: సంధ్యక్క
…………………………………………………….
తెలంగాణ అమరులు
రచన: వరవరరావు
ముందుమాట : ఎన్. వేణుగోపాల్
గానం: విమల, సంధ్య, రణం శ్రీను, వెంకట్
సౌజన్యం: దిశ పబ్లికేషన్స్