- లోచన్

కోట్ల అస్థిపంజరాలమీద మస్తీగా కొందరు
రక్తపు గిలాస లెగరేస్తూ
ఆకలి సముద్రంలో మమ్మల్ని తన్నేస్తూ –
ఆకాశాని కెత్తిన పెట్టుబడి- వేయిపగడలు
మా బతుకుల్లో విషం కక్కుతుంటే
మూడు కోతులూ బోడినవ్వులూ జాతిని నిర్వీర్యం చేసేస్తే
ఇంకా వ్యక్తి స్వేచ్ఛ అనే వెర్రి భ్రమలో
వర్గసామరస్యం పన్నిన వలలో
గిలగిలా తన్నుకోలేను

భాక్రానంగల్లూ నాగార్జునసాగర్లూ
’గొప్పోళ్ళ’ షవర్ బాత్ రూముల్లో ఊడిగాలు చేస్తోంటే
ఈ జాతీయ వంచకుల బద్మాష్ డ్రామాలో
ఫూల్ గా నటించలేను

ఈ కొండమంగలి వెధవల చేతుల్లో నిస్సహాయంగా తల ఉంచలేను
ఇరవైమూడేళ్ళ భయానక చరిత్ర రాష్ డ్రైవింగ్ లో జాతి మెదడుకి
ఎన్నెన్ని లోతైన సెప్టిక్ గాయాలు
దారిపొడుగునా ఎన్నెన్ని దారుణ దృశ్యాలు

నా చెల్లెళ్ళ దేహాలనిండా పిచ్చికుక్కల కాట్లు
నా పిల్లల అమాయకపు చూపుల్లో కత్తిపోట్లు

ఉష్ ! భరించలేను
గుండెలో మంట
నరాల తెగింపు

ఇవాళ నాకసి వెలిగించిన నెత్తురుమంటల్లో నిలబడి చెపుతున్నా
మెలితిరిగే కడుపులో ఆకలి మాట అంటున్నా
రైట్ టు ఓట్ కాదు
ఈ దోపిడి రేచుకుక్కల్ని తరిమి తరిమి
ఫైట్ టు ది లాస్ట్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)