- రామా చంద్రమౌళి

ఒక పేరు కోసం, ఒక ఉనికి కోసమేకదా
ఎవరైనా, ఏదైనా చేస్తున్నది
అతనికసలు పేరేలేదు
అన్నీ ‘అలియాస్’ లే -
ఆ రోజు అన్నింటినీ పరిత్యజించి, అందరినీ త్యాగించి
గమ్యం తెలియని గౌతమునివలె కాక
స్పష్టమైన ‘లక్ష్యం’ తోనే అడవిలోకి అంతర్ధానమైనవాడు –

గాజుపెంకుల దారిలోనే బోసిపాదాలతో నడవాలని నిర్దారించుకుని
రాతిపాదాలను సమకూర్చుకున్నవాడు
ఏ పశువులకొట్టంలో పడుకున్నాడో
ఏ పొదలమాటున పిడికెడు తిన్నాడో
పుస్తకాలను నమ్మి, పాటలను నమ్మి
బిగించిన పిడికిళ్ళను నమ్మి
గర్జనలను నమ్మి … ఒక అదృశ్య సైనికుడై
తనకంటూ ఓ జీవితం లేకుండా
బతుకంతా ఒక రహస్యమే ఐనవాడు
భూమికి చెవి ఆనించి మనిషి గుండెచప్పుడు వినేవాడు
రేపు జన్నించబోయే శిశువుకోసం
ఒక్కసారి సెంట్రీయై, ఒక్కసారి కొరియరై
ఒకసారి నిప్పులురిమే తుపాకీ తుటాయూ
ఒకసారి నేలకొరిగే అగ్నికెరటమై
తప్పకుండా తనకు చావు తప్పదని తెలిసీ
జ్వలించే ఒక చేతనగా
చేతిలో తుపాకితో ఆ అడవి గుండెలపై అజేయుడై నిలబడ్డ
ఏదీ అవసరంలేని అతనికి
ఏంకావాలని నువ్వనుకుంటున్నావు?

6 అభిప్రాయాలు

  1. శ్రవణ్ 02 జులై 2007 , 2:18 am

    SEZ ల పేర దేశాన్నమ్మేవాళ్ళు చేసేకార్యక్రమాలేమో “పునరంకిత సభలు”. జీవితాన్ని సమాజం కోసం అర్పించేవాళ్ళేమో “సంఘవిద్రోహక శక్తులు”.

  2. B.Ajay Prasad 02 జులై 2007 , 6:01 am

    ఈ కవిత అద్భుతంగా ఉంది.

  3. Raghothama Rao C 04 జులై 2007 , 8:15 am

    బావుంది

  4. Subba Rao 04 జులై 2007 , 7:39 pm

    ఈ కవిత్వంలో సారం గొప్పది. పద్య రూపం మీద కూడా పట్టు కనబడుతోంది. భవిష్యత్తులో కూడా వ్రాస్తారని ఆశిస్తూ…

  5. aandhrudu 25 జులై 2007 , 1:32 pm

    బాగొచ్చింది ..

  6. venkatesh 01 ఆగస్టు 2007 , 8:10 am

    కొంచం జాగ్ర్త్తత్త నిన్ను కుడా అందులొనె జమకడతారు.కవిత చాలా బాగుంది
    ఫీల్ అయి రాశిన కవిత.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)