- డా. దామెర రాములు
ఇపుడు గాకున్నా
రేపెల్లుండిగాకున్నా
ఇంకోసాలుకైనా
ఏర్పడి తీరుతుంది తెలంగాణ
ఇది నేనే అన్నమాట విన్నమాట గాదు
ఆబాలగోపాలం మదిలో నిండివున్న మాట
ఎవరికైనా సందేహముంటే
అదుగో ఎదురంగా కనబడే
రైతన్న నడుగుండ్రి బడిపిల్లలడుగుండ్రి
అమ్మల్నీ అక్కల్నీ అందర్నీ అడుగుండ్రి
కావాల్సిందల్లా చెయ్యాల్సిందల్లా
మానసికంగా భౌతికంగా సంసిద్ధం కావాలె
సమాయాత్తం కావాలె సముద్యుక్తం కావాలె…
ఇది వరకే ఎందరో అమరవీరుల సాక్ష్యంగా
దగాపడ్డ తెలంగాణ మరోసారి మోసపోవద్దు
కుటిల రాజకీయ విషకోరల్లోకి యిరికిపోవద్దు
రాజధాని పాలకుల కపటనాటకాలు నమ్మవద్దు
అవకాశవాద రాజకీయ గద్దల్ని ఈటెల్తోకుమ్మండి
గట్టి పునాదిలో పల్లెసీమల సాక్ష్యంగా
ఒక నిర్దిష్ట లక్ష్యంతో
నిన్నూ నన్నూ రమ్మని పిలుస్తుంది తల్లి తెలంగాణ
ఒక లాఠీ తూటా అవసరంలేకుండా
ఓటుబాటలో తెచ్చుకుందాం తెలంగాణ
చక్కగా ఏలుకుందాం తెలంగాణ
ఎలుగెత్తి పాడుదాం తెలంగాణ పాట
వస్తదా తెలంగాణ
ఇస్తరా తెలంగాణ
కానిస్తరా తెలంగాణ
ఇవి విసిగి వేసారిన మాటలు
అరిగి విరిగిపోతున్న పాటలు
బంద్ చెయ్
ముల్కీగైర్ ముల్కీ
పెద్దమనుషుల ఒప్పందం
ఆరుసూత్రాల పథకం
అన్నింటినీ మంటల్లో కాల్చిండ్రూ
తెలంగాణ మాలంటేనే
కండ్లురిమి చూస్తుండ్రు
ఒక పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేస్తేనే
ఏర్పడింది ఆనాడు ఆంధ్ర రాష్ట్రం
మున్నూట అరవైతొమ్మిది నా సోదరులు అమరులైతే
ఏదీ తెలంగాణ ఎవడు ముంచిండనీ అడుగుతున్నా?
కాదెట్లా తెలంగాణా ఓటుబాటలో
కాదెట్లా తెలంగాణా పోరుబాటలో
( జయహే తెలంగాణ!
కవితా సంపుటి నుంచి )
డా!! దామెర రాములు
నిర్మల్ నర్సింగ్ హొమ్
నిర్మల్ , ఆదిలాబాద్
తెలుగు మాట్లాడే కార్మిక వర్గం ప్రస్తుత అవసరాలేంటి? మిగతా ప్రపంచ కార్మికుల లాగే తక్షణ అవసరం సోషలిస్టు విప్లవమే. ఈ దిశలో తెలంగాణా కార్మికులు ఆంధ్ర ప్రాంతాల్లో నాయకత్వం ఇవ్వటం గురించి చాలా మందిమి చదివి ఉన్నాం. ప్రత్యేక తెలంగాణా అనబడే ఫాషిస్టు ఆలోచనది ఈ రోజున తెలంగాణా ప్రాంతంలో పైచేయి గా ఉంది. చరిత్రలో ప్రత్యేక దేశం, లేక రాష్ట్రం కావాలన్న వాడు సోషలిజం కోసం, కనీసం బహుళ ప్రజానీకం బాగు కోసం పని చేసిన ఉదాహరణలు ఎక్కడ ఐనా ఉన్నాయా? యుగొస్లావియా, వివిధ సోవియట్ జాతుల్నే తీసుకోండి, ఆ జాతుల బూర్జువాజీ ఆ దేశాల్లో ప్రత్యేక దేశం సాధించిన తరువాత, సామాన్య ప్రజల్ని కాల్చుకు తింటున్నారు. ప్రత్యేకోద్యమాలంటే ఒక ప్రాంతంలో బూర్జువాలకి నాయకత్వాన్నందించే ఫాషిస్టు ఉద్యమం అన్న సాధారణ సత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. వీటికి మద్దతు ఇస్తున్న విప్లవ పార్టీలు వారు చేస్తున్న పనులకి ఏమైనా రహస్య కారణాలుంటే వివరించాల్సిన అవసరం ఉంది.
సామాన్య ప్రజానీకానికి ప్రత్యేక రాష్ట్రం యొక్క అవసరం ఎటువంటిదైనా ఇప్పటి పరిస్థితులలో అది వచ్చినంత మాత్రాన వారికి ఒరగబోయేదేమీ ఉండదు. తమిళుల నుంచి వేరు పడ్డాక తెలుగువారిలో నిరుపేదలకు జరిగిన న్యాయం ఏముంది? ఇవన్నీ “డబ్బుసంచులు” పరస్పరం కలహించుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే క్రమంలోని భాగమే. నిజమైన విప్లవం కాదు.
ఇలా అనడం తెలంగాణావారి మనోభావనలను కించపరచడానికి మాత్రం కాదు. వారి సమస్యలన్నీ నిజమైనవే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి న్యాయం జరగలేదు. తెలంగాణా విషయంలోనూ ప్రస్తుతం అంతే. అయితే ఈ విభజనల వల్ల అంతిమ విజయం మాత్రం బడుగువర్గాలది కానేరదు.
జై ఆంధ్ర కోసం చిన్నప్పుడు పోరాడాను.అది రాక పోవటం నన్ను నిరాశ పరచింది. రోహిణి ప్రసాదు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి న్యాయం జరగలేదు అన్నారు.అలాగే వుమ్మడి ఆంద్రలో తెలంగాణావారికి న్యాయం జరుగదు.తెలంగాణా వస్తే ఆంద్రులకూ మేలే.ఆంద్ర లోని బడుగు వర్గాలకు జరిగే మేలు ఒకటుంది.అది హైదరాబాదుకు అనునిత్యం చేసే ప్రయాణ భారం.1956 నుండి కోస్తా ప్రజలు హైదరాబాదుకు రైళ్ళలో బస్సుల్లో చేసిన ప్రయాణఖర్చుతో 4 రాజదాని నగరాలను కట్టొచ్చు.ప్రయాణఖర్చు అనుత్పాదక ఖర్చే.అదే విజయవాడకు అంత ఖర్చు కాదు.కర్ఫ్యూ భయం లేదు.తెలుగు పరిపాలన వస్తుంది.పొద్దున బయలు దేరిన తెలుగు జనం రాత్రికి ఇంటికి వెళ్ళొచ్చు.మన ప్రజలకు సమయం ఎంతో కలసి వస్తుంది.హైదరబాదులో ఆస్తులున్న కోస్తా వాళ్ళు అక్కడే వుండిపోవచ్చు. మద్రాసులో ఈనాటికీ 40% తెలుగు ప్రజలున్నారు.ఇప్పుడు ఏర్పడేది మరో తెలుగు రాష్ట్రమే కాబట్టి భాష సమస్య కూడా ఏర్పడదు.
ప్రత్యేక తెలంగాణా వల్ల లేక ప్రత్యేక ఆంధ్ర వల్ల ఇరుప్రాంతాలలోనూ పేదవారికి ఒరిగేదేమీ లేదు. నాయకులకూ, రియల ఎస్టేటు వ్యాపారులకు తప్ప.
మీ ప్రజకళను కొద్దిరోజులకిందినుండి మాత్రమే చూస్తున్నాను.ఇక్కడ కొందరు రసే అభిప్రాయాలను చదివితే స్పందించడం నావిధిగా భావిస్తున్నాను.
ఈనాడు తెలంగాణలొ లక్షల్ కొద్దీ వలసలు పోతున్నరు?, వేలకొద్దీ ఆత్మహత్యలు చేసుకుంటున్నరు? అకలి చవులతో , బాగావని రోగాలతొ ఎంతమంది చస్తున్నారొ లెక్క్లలు,డోక్కలు ఏమైనా ఉన్నాయా? వేరైన తెలంగాణలో ఇంతకంటె ఎక్కువ కష్టాలు, నష్టాలు జరగవనే మావాళ్ళు భావిస్తున్నరు. ఇప్పుడు ఆ.ప్ర. లో పేదలకు ఒరుగుతున్నదేమీలెదు,
అప్పుడు మద్రాసు నుండి వేరవడానికి జరిగిన ఆంధ్ర రాష్ట్రోద్యమానికి , ఇప్పుడు ,ఇంతకుముందు జరుగుతున్న తెలంగాణ ఉద్యమాలకు పోలికేలేదు.
అప్పుడు ఆంధ్రులు వేరౌతమని చేసిన ఏ ఉద్యమాలకు తమిళులు అడ్డంకులు ఎప్పుడూ స్రుష్నించలేదు . అంతెందుకు స్వతంత్రం వచ్చినంక ఎన్నో రాష్త్రాలు (ప్రాంతాలు) పెద్దరాష్ట్రాల్లొ నుండి విడిపోయాయి .ఆరాష్ట్రాల్లొ విడిపోతమని అంధోళనలు/ఉద్యమాలు చేస్తే మన రాష్ట్రంలో మాదిరే అడ్డుకున్నారేమో ఇక్కడ రాస్తున్నవాళ్ళు ఎంక్వైరీ చేసి/ పరిశోధనలు చేసి ఇక్కడ రాయండి ,నాలాంటి వాళ్ళు అభిప్రాయాలను మార్చుకుంటాము. ఇతర పార్టీల వాళ్ళే కాకుండా సీపీఎం వంటి లెఫ్ట్ పార్టీలు / వ్యక్తులు పలుపనికిరాని, అనుమానాలు రేకెత్తించే భావాలను ప్రచారం చేస్తూ అడ్డం రావడం మాతెలంగాణవాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు. వేరు కాకుంటే తెలంగాణను ఇంకా దోచుకు తినొచ్చు ననే దురాశతోఉన్న ఇతర పార్టీల వారి మాదిరే సీపీఎం వంటి లెఫ్ట్ పార్టీల వారు భావించడం శోచనీయం. నీళ్ళను (సాగునీళ్ళు,తాగునీళ్ళు),నిధులను ,నియామకాలను(లక్షల ఉద్యోగాలను) , నిప్పులను (విద్యుత్తు,బొగ్గు) ఇంతకు ముందు (ఏబై ఏండ్లుగా)తిన్నవి, అనుభవించినవి చాలవు, ఇంకా తిందామనుకుంటున్న/ అనుభవిస్తున్న వాళ్ళలో లెఫ్టిస్టులు కూడా ఉండడం తెలంగాణ వాళ్ళ దురద్రుష్టం/దౌర్భాగ్యం.మన పాలకులు ఆంగ్లేయులకంటే దుష్టులని స్వతంత్ర పోరాటాలు మానుకున్నామా?
ఐతే తెలంగాణ పాలక వర్గాలు ప్రాంతేతర పాలక వర్గాలకంటె దుష్టమైనవని కూడా మావాళ్ళనుకోవడం లేదు. కాకుంటే ప్రాంతేతర పాలకుల మోచేతి గుండ జారిపోయే నీళ్ళెందుకు తాగడానికి ఆశ పడాలి వేరైపోయి స్వతంత్రంగనే తాగొచ్చుకదా ,అని తెలంగాణ బూర్జువాలలో,పాలకవర్గాలలో కొద్ది మందే అనుకుంటున్నారు. అందుకే తెలంగాణ పాలకవర్గాల వాళ్ళు ఇంకా బయటికి రాకుండా కాంగ్రేసు తె.దే. చంకలకిందనే ఉన్నారు.
ఇక్కడ రాసిన వాళ్ళలో ఒక్క రహమతుల్లా గారు రాసిన అభిప్రాయాలు మాత్రమే స్వార్ధం లేకుండా , నిస్పక్షంగ రాసినట్లు గా కనిపిస్తున్నాయి. అందుకు అభినందనలు మరియు క్రుతజ్నతలు.
ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, మద్రాసు కోల్పోవటానికి సిద్ధ పడిన తరువాత, ప్రత్యేక రాష్ట్రాన్ని స్థాపించగలిగింది. తెలుగు పాలక వర్గాలు ఎన్నో అడ్డంకులను అధిగమించిన తరువాత ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించగలిగారు. వర్గ విశ్లేషణ రహితమైన ఆలోచనలకు వస్తుపరత(objectivity)ఉండదు. ఉధృతంగా సాగుతున్న కార్మిక ఉద్యమాల్ని పక్క దారి పట్టించే ఫాషిస్టు ఉద్యమాల్నిగుర్తించాల్సిన అవసరం ఉంది. గతితార్కిక భౌతిక వాద దృష్టితో చూడటం ద్వారా రామ్ గారు నిజాల్ని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
రాంగారూ, ప్రాంతేతరులు క్రింది నీళ్ళు అంటున్నారు. తెలంగాణా ఏర్పడితే (నా మద్దతు ప్రత్యేక తెలంగాణకే) పాలమూరు వాసులకు, అదిలాబాదు వాసులు ఏమవుతారు? పాలమూరుకు కర్నూలు జిల్లాతో లేని సంబంధ బాంధవ్యాలు అదిలాబాదుతోనో, ఖమ్మంతోనో ఏమున్నాయి? (ఒక్క నిజాం పాలన తప్ప!) అది కూడా దత్తమండలాలు ఏర్పడిన తర్వాతనే కదా విడిపోయింది (వ్యాఖ్య అప్రస్తుతమనుకుంటే నెజ్జనులు క్షమించగలరు)
ఒకరిస్తే వచ్చేది కాదు. పోరాడితేనే తెలంగాణా సిద్ధిస్తుంది. కానీ ఇలా పరస్పరనిందలతో వచ్చేదేమీ లేదు.
ఒక రాష్ట్రం విడిపోవటమంటే మాటలు కాదు. నావంటి “వాలుకుర్చీ వ్యాఖ్యాత” గాళ్ళకి వివరాలు తెలియవుగాని సాగునీరు తదితర విషయాల్లో “గడుసుదనం” పనిచేస్తోందనీ, తెలంగాణాకు అన్యాయం జరుగుతోందనీ పత్రికల్లో చదువుతాం. ఇలాంటి పరిస్థితిని సవరిస్తే ట్రిక్ ల్ డౌన్ పద్ధతిలో పేదలకు కూడా కొంత లాభం సమకూరుతుందేమో. దీన్ని గురించి ఎవరైనా వ్యాఖ్యానించగలిగితే సంతోషం.
ఇక్కడ రాసిన విషయాలు నాకు కొన్ని అర్ధం కాలేదు.అవి రాసిన వారు వాతిని వివరిస్తే సంతోషం.
1.ఆంధ్రులు 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు చేసిన ఉద్యమం ఫాసిస్ట్ ఉద్యమం ఎందుకు కాదు,ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మాత్రమే యెట్లా పాసిస్ట్ ఉద్యమం ఔతుంది?
2.నైజాం రాజ్యం అప్పట్లో ధనవంతమైన దైనా విధ్యలో చాల వెనక బడింది,అదే ఇప్పటికీ తెలంగాణను పట్టి పీడిస్తున్నది.అదే లోపం తెలంగాణా వాళ్ళకు చెందాల్సిన/రావల్సిన(పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రావాల్సిన వాటా) లక్షలాది ఉద్యోగాలు రాకుండా చేసింది.ప్రాంతేతరుల ఆధ్వర్యంలో నడిచిన ప్రతి ప్రభుత్వం (ఏపార్టీ ఐనా)తెలంగాణకు ఇవ్వబడిన అన్ని రక్షణలను కార్యనిర్వహణాధికారులు / వలు వలిచినట్లు వలిచి పారేస్తుంటే /వక్ర భాష్యాలు చెప్తుంటే అడ్డు తగిలి సరి చేసే బదులు ప్రోత్సహిస్తూ పోయారు.1969 లో వచ్చి అణగి పోయిన తెలంగాణ ఉద్యమం తరువాత రెట్టింపు ఉత్సాహంతో దోపిడీ & వక్రభాష్యాలు అన్ని రంగాలకూ విస్తరించి చెప్పలేనంతగా పెరిగిపొయాయి .చాలా మంది తెలంగాణ వాళ్ళకు బతుకు లేకుండాచేశాయి.నిజమే నైజాం పాలనా కాలంలో తెలంగాణ జిల్లాల ప్రజలమధ్య సంబంధాలు లేకుండేవి.ఈస్తాయిలో ప్రాంతేతరుల9పాలకుల) దోపిడీ జరగక పోతే బహుశ: ఇప్పటికి కూడా మహబూబ్నగర్ వాళ్ళకు కర్నూలు వాళ్ళతో ఉన్నన్ని సంబంధాలు ఆదిలాబాదు వాళ్ళతో ఉండేవి కావు.నల్లగొండ వాళ్ళకు గుంటూరు జిల్లవాళ్ళతో ఉన్న సంబంధాలు ,ఆదిలాబాదు,మెదక్ వాళ్ళతో ఉండేవి కావు.అలాగే ఖమ్మం వాళ్ళకు క్రిష్ణ,గుంటూరు వాళ్ళతో ఉన్న సంబంధాలు మెదక్ అదిలాబాదులతో ఉండేవి కావు.బహుశ:ప్రత్యేక తెలంగాణ ఎంత ఆలస్యం జరిగితే అంతెక్కువ తెలంగాణా జిల్లాల మధ్య సంబంధాలు ఎక్కు వైతాయి.నైజాం కాలంలో తెలుగే అడుగంటుతూ వాచ్చింది,ఇక ఇతర భాషల అభివ్రుద్ధికి చోటేక్కడుంది? విధ్యలో,భాషలో వెనకబాటుతనమే తెలంగాణ జిల్లాల మధ్య సంబంధాలు లేకపోవడానికి కారణం కావచ్చు.-నా అభిప్రాయలను వ్యతిరేకించేవారు అర్ధవంతగా వ్యతిరేకిస్తే నాకభ్యంతరంలేదు.
(మరికొన్ని అంశాలు తదుపరి రాస్తాను)
తెలంగాణ ఎవరికి కావాలి? రాజకీయ నాయకుల స్వార్దం కోసం అమాయక తెలంగాణ ప్రజలను బలిచేస్తున్నారు. ఇది అన్యాయం కాదా? ఆత్మగౌరవం పేరిట నాయకులు గొడవచేస్తున్నారు. వీరి ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలిగింది? తెలంగాణ రైతులు , చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని వీరు ఇప్పుడు రాజకీయం ఆడుతున్నారు. ప్రజలేమడిగినా తెలంగాణొచ్చింతర్వాత అని బొంకుతున్నారు. తెలంగాణ అభివౄద్దికి ప్లాను తయారు చెయ్యలేదు. జిల్లాలకి అధికారాల బదలాయింపు, స్తానిక పాలన, ప్రజలు తమ పాలన అమెరికా, జర్మనీలోలాగా చేసుకుంటమే ఉత్తమం. దొంగ రాజకీయనాయకులు కులం, ప్రాంతం , మతం పేరిట కల్లోలాలు సౄష్హ్టింస్తే తీవ్ర చర్యలు తీసుకోవాలి. ప్రజలే వారిని అసహ్యించుకునే రోజు వస్తుంది.