boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

జూన్, 2007 సంచిక

- డా॥ ఎస్.వి. రామరాజు

మాకు దసరా సెలవులిచ్చి పది రోజులయింది. ఇంటి ముందే సుధతో వేపచెట్టు కింద గోళీలాడుకుంటున్నాను. సాములు, బంగారయ్యా మటోడొచ్చి లింగయ్యగారి చెరువుకట్టమీద నేరేడుగాయలు కోసుకొద్దామన్నా వెళ్ళబుద్ధి కాలేదు. తర్వాతొస్తా మీరెళ్ళండని చెప్పి వసారా దగ్గరగా పొగ వస్తున్న వేపు ఒకసారెళ్ళాను. తీపి, నేతి వాసనతో చుట్టుపక్కలంతా ఘుమఘుమలాడిపోతోంది. నా నోరు నీటితో నిండిపోతోంది. గోళీలాట మీద మనసు నిలవడం లేదు. నాకు పనుందని సుధని పంపేశాను.
పూర్తిగా చదవండి »

- రహ్మతుల్లా

డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన జరగాలని ఎందుకుకోరారు? బౌద్దమతాన్ని ఎందుకు స్వీకరించారు? హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు. దళితులు, మైనారిటీలు తమకు జరిగే అవమానాలను దిగమింగుకోవాలి. తమ మానమర్యాదలు మంటగలిసినా ఊరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ వర్గీయులను ఎదుర్కోలేరు కాబట్టి. వాళ్ళు ఏది చెబితే అది వినాలి.విధేయతతో మసలుకోవాలి. యుద్దం చేయటం కన్నా ఓర్పుతో ఉండడం చాలా తేలిక. సంకుచిత మనస్తత్వం గల పిడివాదులనీ వర్గ విభేదం సృష్ఠించే వాళ్ళనీ ఏమీ అనలేక తమ వాళ్ళని తామే తిట్టుకోవడం అన్నిటికంటే తేలికైన పనిగా వీళ్ళు భావిస్తారు.
పూర్తిగా చదవండి »

- కేతు విశ్వనాధరెడ్డి

కాళీపట్నం రామారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ కథా రచయిత. ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో చేరదగిన సాహిత్యకారుడు ఆయన. కారాగా, మాష్టారుగా, కథల మాష్టారుగా తెలుగు సాహిత్యలోకంలో ప్రసిద్ధులు. కథారచయితలకు “దీపధరుడు”- ఆయన.

http://www.prajakala.org/PDF/kara_interview.pdf

సౌజన్యం: ఈ-తెలుగు పత్రిక

దోపిడి వ్యవస్థ కాళ్ళకింద దశాబ్దాలేకాదు
శతబ్దాలు గడిపినా సుఖంరాదు.
ఆకలి శరీరాల్నే తిని
రోగం రక్తాన్నే తాగి
కోర్కెలు తెరమీది బొమ్మల్లా
కనిపిస్తూ మాయమౌతాయి తప్ప, తీరవు.
నీకు నీ తండ్రీ నీ తండ్రికి నీ తాతా అప్పగించిన
బానిసత్వ వారసత్వాన్ని
ముందు తరాలకి పంచకు.

పూర్తిగా చదవండి »

- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

హమ్మయ్య!
మోడీకొక సోదరుడు దొరికాడు
దాచిన అస్థిపంజరం ఇన్నాళ్టికి బయటపడింది
ఊహ నుంచి హంతకులే శవాలకు అంత్యక్రియలు చేస్తారు
కిరాయి హంతకులే సంతాపాన్ని వ్యక్తం చేస్తారు
ఎప్పటిలాగే నిరంకుశత్వం
పేదల మెస్సియ్యగా ప్రకటించుకుంటుంది.
పూర్తిగా చదవండి »

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
నేను మాత్రం
తలుపు తెరిచి ఇల్లు విడిచి
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోనదాటి
వెన్నెల మైదానంలోకి
వెళ్ళి నిలుచున్నాను.

devarakonda_tilak_2.jpg

ఆకాశం మీద అప్సరసలు
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి పాదాల తారామంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారు పృథు వక్షోజ నితంబ భారలై
యౌవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు.

పూర్తిగా చదవండి »

- జ్వలిత

మనిషి బుద్ధికి చిలుము పట్టినట్లు
మానవత్వపు మెట్లకు పాకురు పట్టినట్లు
చానాళ్ళ నుండి పేరుకు పోయిన నమ్మకాలు
మసీదుల్లో, మందిరాల్లో అసహాయపు పావురాళ్ళు
శాంతమో, మూఢమో, అసమర్ధమో
ప్రతిసారి ఎక్కడెక్కడో నమ్మకద్రోహంలా
బాంబు పేలుతూనేవుంది
పూర్తిగా చదవండి »

- శిఖామణి

ప్రిన్స్ డయానా చిన్నప్పటి ఫోటోలా
హొళీనాటి రంగుల హేలలా
ఈ హేలీ పుట్టాల్సింది ఏ హవేలీలోనో కదా!

తోకచుక్క పేరు పెట్టుకున్న
ఈ పగటిచుక్క
ఏపాలపుంతలోనో మెరవాల్సింది
చూసి చూసి మా మాలపుంతలో ఎందుకు పుట్టినట్టో
పేదవాని గుడిసెమీద విరబూసిన
ఏడురంగుల మింటిపువ్వులా
రాబోయే దళితుల రాజ్యాధికారానికి
ఇది విజయపతాక కాదు కదా!
పూర్తిగా చదవండి »

- జాన్ హైడ్ కనుమూరి

అదొక మహమ్మారి
అనేకనేక బాహువుల్తో
ప్రతి గుండెల్లో
ఊడల్ని దింపాలని చూస్తున్న మర్రి
విధ్వంశాన్ని కల కనే వెర్రి
విస్పోటనం కావాలి
భయానక క్షణాలు లెక్కించాలి
రక్తంతో పైశాచిక చిత్రాలు రచించాలి
భయపెట్టాలి
పది మందిచేరే
ద్వజ స్థంబం ప్రక్కకో
మోకరించే స్థలానికో
రెహాల్ వైపుచూసే జానిమాజ్ చోటుకో చేర్తుంది

పూర్తిగా చదవండి »

- డా. దామెర రాములు

ఇపుడు గాకున్నా
రేపెల్లుండిగాకున్నా
ఇంకోసాలుకైనా
ఏర్పడి తీరుతుంది తెలంగాణ

ఇది నేనే అన్నమాట విన్నమాట గాదు
ఆబాలగోపాలం మదిలో నిండివున్న మాట
ఎవరికైనా సందేహముంటే
అదుగో ఎదురంగా కనబడే
రైతన్న నడుగుండ్రి బడిపిల్లలడుగుండ్రి
అమ్మల్నీ అక్కల్నీ అందర్నీ అడుగుండ్రి
కావాల్సిందల్లా చెయ్యాల్సిందల్లా
మానసికంగా భౌతికంగా సంసిద్ధం కావాలె
సమాయాత్తం కావాలె సముద్యుక్తం కావాలె…

పూర్తిగా చదవండి »

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్

విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదు. సమష్టిగా రోజువారీ జీవితాల్లో ఎదురయే కష్టాలను ఎదుర్కుంటూ, ప్రకృతిని గురించి నలుగురికీ పనికొచ్చే సమాచారాన్ని పోగుచెయ్యడం, దాన్ని విశ్లేషించి సత్యాలను రూఢిగా తెలుసుకోవడం మొదలైన ప్రయత్నాలు తొలి మానవసమాజాలన్నీ చేస్తూనే వచ్చాయి. ఇలా పోగుపడిన సమాచారమే రాబోయే తరాలు కనిపెట్టిన విషయాలకు పునాది అయింది. ఈ విషయాలన్నిటికీ ఎడతెగని సంబంధం ఉండేది. విజ్ఞానమంటే సక్రమంగా వ్యవస్థీకరించబడిన సమాచారమే గనక మొదట్లో అస్పష్టంగా గోచరించిన విషయాలే ఎన్నో తరాలపాటు పరిశీలనలు జరిపిన మీదట జీవితసత్యాలుగా నిర్ధారణ అయాయి.
పూర్తిగా చదవండి »

- డా. దార్ల వెంకటేశ్వరరావు

1.0. ప్రస్తావన:
పవిత్రత - అపవిత్రతలనేవి ఒకదాన్ని ఒకటి వెన్నంటి ఉంటాయి. పవిత్రత అనేది ఒక భావన. మానవులు ఏర్పరుచుకున్న ఆచార సంప్రదాయాల నుండి రూపొందిన భావన. మానవుడు ఆదిమ కాలంలో ప్రకృతి శక్తులతో పోరాడి, తాత్కాలిక ఉపశమనం కోసం పంచభూతాలను దైవశక్తులుగా భావించుకున్నాడు. నిత్య జీవితంలో వాటి అవసరాన్ని గుర్తెరిగి వాటిని పరిరక్షించుకోవటానికి ఎంతగానో ప్రయత్నించాడు. వాటితో ప్రతి జీవికి గల సంబంధాన్ని విడదీయరానిదనీ త్వరలోనే గుర్తించగలిగాడు.

పూర్తిగా చదవండి »

- సాంబయ్య గుండిమెడ

కమ్యూనిస్ట్, నక్సలైట్, హేతువాద, దళిత, స్త్రీవాదులు నడిపిన సామాజిక, సాహిత్య ఉద్యమాలు తెలుగు జాతిని ముఖ్యంగా సామాజిక పీడనకు, రాజకీయ అణచివేతకు, ఆర్థిక దోపిడికి గురైన వర్గాలలో ఒక గొప్ప చైతన్య స్ఫూర్తిని ఆవిష్కరించాయి. ఈ ఉద్యమాల చైతన్య జవసత్వాల అధారంతో తరతరాలుగా సామాజిక అణచివేతకు, అవమానానికి గురై, అంధకారంలో అలమటించిన మాదిగలు ఏ కులం పేరుతో తాము అవమానించబడ్డారో అదే కులాన్ని భూమికగ ‘దండోరా’ పేరుతో ఒక మహోన్నతమైన సామాజిక ఉద్యమాన్ని నడుపుకున్నారు.
పూర్తిగా చదవండి »

- వట్టికోట ఆళ్వార్‌స్వామి

(గత సంచిక తరువాయి)

8

కంఠీరవానికి కొమరయ్య తన ధోతి, కండువ, ఒక రూపాయి ఇచ్చి తెల్లవారు జామున సాగనంపాడు. కంఠీరవం నిజామాబాదు దోవపట్టాడు. కొంతదూరం బండ్లబాట నడిచి వెళ్ళాడు. మధ్యన రైలు దారి అడ్డువచ్చింది. రైలు దారి వెంట నడవసాగాడు. పక్క చేలలో కనిపించిన కంకులు, కాయలు తినుకుంటూ బావుల్లో నీళ్ళు తాగుతూ పొద్దుతిరిగే వరకు డిచ్పెల్లికి చేరుకున్నాడు. గడిచినరోజు సరిగా తిండిలేదు; పైగా ఈ రోజు చాలా నడిచాడు కూడా. అలసిపోయి రైలుస్టేషన్‌లో కొంతసేపు పడుకున్నాడు. ఇంతలో హైద్రాబాద్‌కు వెళ్ళే రైలు వచ్చి ఆగింది.

పూర్తిగా చదవండి »