భర్తలు లేని కాలాన్ని
స్వేఛా స్వాతంత్ర్యాలకు
హద్దుల్లేని ఆకాశంగా ప్రకటించండి
తిని తాగి పైనబడి కొట్టి రక్కి
హింసలోనే సుఖాలు వెతుకునే పురుష పుంగవులకి
ఏ రోజూ మీ చూపులు సోకకుండా తెల్లవారదు
నిద్రలోకూడా కలవరింతలతో
తెల్లవారే మీకు
మెలుకువలోనూ ఎన్నో దుష్టడ్వృప్నాలు
బెదిరింపులూ బుజ్జగింపులూ
లాలింపులూ అదిలింపుల్లోనూ
అహంకారపు దాష్టీకాలెన్నో వాళ్ళకు
భర్తలు వదిలేసిన కాలాన్ని
చల్లని వాయుసమీరాన్ని తాకుతూ
కురులు విప్పార్చుకుని
ఆనందాశ్రువులు రాల్చండి
భర్తలు వదిలేసిన కాలానికి నిప్పు ముట్టింఛి
వీధి వీధీ దివిటీలు తిప్పుతూ తిరగండి
కొంతకాలమైనా స్వేచ్ఛను ప్రసాదింఛినందుకు
కోటి కాంతుల కొబ్బరికాయల్ని
నీరాజనాలుగా అర్పించండి
వదిలేసిన కాలాన్నీ తరిమేసిన లోకాన్నీ
బెదిరింఛిన పురుషుల్నీ
కాసింత కసితీరా తిట్టఓకుంటూ
ఆనందోత్సవాలు జరుపుకోండి
ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీవఛ్చి
కాళ్ళ మీదబడి క్షమాపణలు కోరేటప్పుడు మాత్రం
మనసువెన్నలా కరగదీసుకోక
కాడ్తృంత బెట్టఓ చూయించండి
మీకు తెలియాదు కానీ
పురుషులు వట్టి పరాన్న జీవులు